Wednesday, February 26, 2014

158 Nagarjuna Sagar as Capital of AP आंध्र प्रदेश के राजधानी के लिये नागार्जुन सागर ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా నాగార్జున సాగర్

158 Divakar Reddy is correct. శ్రీ జె.సీ. దివాకర్ రెడ్డి ఒక విధంగా కరెక్టే చెప్పారు.
చర్చనీయాంశాలు: సీమాంధ్ర, విభజన, bifurcation, నాగార్జునసాగర్, మాచర్ల, ఆంధ్రప్రదేశ్ రాజధాని


కొత్తాంధ్ర ప్రదేశ్ కి రాజధానిగా మాచర్ల మ్యాచ్ అవుతుంది అని శ్రీ జె.సీ. దివాకర్ రెడ్డి చెప్పిన మాటలు అర్ధవంతమే.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాదు నుండి నాగార్జునసాగర్ కు తరలించాలని ఈవైబీరావు గాడిద 1982 ప్రాంతంలో ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో ఒక వ్యాసం వ్రాశాడు. ఎవరైనా స్పందిస్తారని ఆశ పడ్డాడు. ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పడు మారిన పరిస్థితులలో స్పష్టీకరణ:


మూడు రాష్ట్రాలే మెరుగు. కర్నూలు, వి-గుం-తె, విశాఖ మూడు రాష్ట్రాలకు మూడు రాజధానులుగా సరిపోతాయి. అందరి కోరికలు తీరుతాయి. తాత్కాలిక రాజధానిగా దొనకొండతో పాటు నాగార్జునసాగర్ ను కూడ పరిశీలించ వచ్చు.

మాచర్ల-నాగార్జునసాగర్ ప్రతిపాదనలలో లాభాలు

మాచర్లకు 17 కిలోమీటర్లదూరంలో నాగార్జున సాగర్ దక్షిణ తీరాన విజయపురి సౌత్ నుండి పశ్చిమంగా లాంచీలరేవు వరకు ఉన్న ప్రదేశమంతా రాజధానికి అనువైనదే. అక్కడ చాల వ్యవసాయం జరగని చిట్టడవులు (తుప్పలు, పాము పుట్టలతో నిండిన వేస్ట్ లాండ్) ఉన్న భూమి ఉన్నది. ఇది ప్రభుత్వభూమేనని నానమ్మకం.

భూమి దాదాపు ఉచితం. భూసేకరణ తప్పనిసరియైనా మార్కెట్ విలువ తక్కువ కాబట్టి పదిరెట్లు పరిహారం ఇచ్చినా ప్రజలు ఆనందించి ఆడి కార్లు కాకపోయినా నానో కార్లు కొనుక్కుంటారు.

తాగునీటి కొరత ఉండదు.

పర్యాటక స్థలంగా నాగార్జునసాగర్ అభివృధ్ధి చెందుతుంది.

నాగార్జునసాగర్, నంది కొండ బౌధ్ధ విహారం, కి పర్యాటక స్థలంగా అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. పనిలో పనిగా సీమాంధ్ర రాజధానికి కూడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడుతుంది. ఒకవేళ మూడు రాష్ట్రాలను సాధించు కోగలిగితే రాష్ట్రాల రాజధానులు విశాఖ, వి-గుం-తె, కర్నూల్ లకు తరలి వెళ్ళినా, నాగార్జున కొండకు కూడ విమానాశ్రయం అవసరం కాబట్టి వృధా ఉండదు.

మాచర్లనుండి 17 కిలో మీటర్లు డబల్ లైన్ రైలు మార్గం వేసుకోవాలి. నిజానికి ఈరైలు మార్గాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్టుని నిర్మించినపుడే వేసి ఉండవసినది. ఈరైలు మార్గం పర్యాటక స్థలం అయిన ఎత్తిపోతల జలపాతాన్ని కూడ కవర్ చేస్తుంది.

మిరియాలగూడ నుండి హిల్ కాలనీకి కూడ షుమారు ౩౦ కిలోమీటర్ల రైలు మార్గం వేసుకోవాలి.

ఆతరువాత హిల్ కాలనీ నుండి కృష్ణా నదిపై ప్రాజెక్టు దిగువలో రైలు వంతెనను నిర్మించుకోవాలి.

వినుకొండ నుండి మాచర్లకి డబల్ లైన్ రైలు మార్గాన్ని యుధ్ధ ప్రాతిపదికపై నిర్మించుకొని విద్యుదీకరణ చేసుకోవాలి.

ఒంగోలు వినుకొండ రైలు మార్గాన్ని చేపట్టాలి.

శ్రీ దివాకర్ జీ అన్నట్లుగా సోనియా గాంధీ పిచ్చియమ్మేనా?


పిచ్చియమ్మ యందుకవుతుంది. తెలివిగలదే. తన కుమారుడి భవిష్యత్ కొరకై రాచబాటలు వేసుకుంటున్నది. కెసిఆర్ కుటుంబంతో ఫొటోలు దిగింది ఎందుకు? అవసరమైతే తనకు గానీ, రాహుల్ కి గానీ తెలంగాణలో పోటీచేయవలసి వస్తే కెసీఆర్ కుటుంబ సభ్యులు గెలిపిస్తాడని. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలని కార్ల్ మార్క్స్ అన్నారు కానీ, పనిలో పనిగా రాజకీయ సంబంధాలన్నీ అవసరార్ధ సంబంధాలని ఉండాల్సింది.

భింద్రన్ వాలే వంటి ఉగ్రవాదిని పెంచి పోషించిన శ్రీమతి ఇందిరాగాంధీ. చివరికి ఆఉగ్రవాదికే బలయై పోయింది. కెసీఆర్ కుటుంబాన్ని పెంచి పోషించిన శ్రీమతి సోనియాగాంధీకి ఏమి జరుగుతుందనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది.

దివాకర్ జీ ని అభినందించాలి


శ్రీదివాకర్ జీ వ్యాపారాలు, ఇతర గుణగణాలు ఎలా ఉన్నా, ఆయనను మనం ఒకవిధంగా అభినందించక తప్పదు. ఆయన సోనియా ఇంటి ముందు పడిగాపులు కాయటం లేదు. దిగ్ విజయ సింగ్ కాళ్ళు పట్టుకోటం లేదు.

శ్రీ టిజి వేంకటేశ్ భయంకోస్తాలో రాజధానిని అభివృధ్ధిని ఏర్పాటు చేస్తే, అభివృధ్ధి చెందాక మళ్ళీ తమను అక్కడనుండి తరిమి కొడతారు.

వైబీరావు గాడిద వ్యాఖ్యలు


ఈభయంలో న్యాయం లేదని అనలేము. కర్నూలునుండి 1957లో రాజధానిని మార్చకుండా ఉంటే, ఇప్పటికల్లా కర్నూలు మరో హైదరాబాదుగా తయారు అయి ఉండేది. తెలంగాణ వారు ఉద్యమం చేసినట్లుగానే రాయలసీమ వారు కూడ ఉద్యమం చేసి కోస్తావారిని వెళ్ళగొట్టటానికి ప్రయత్నించేవారు.

We can't say that there is no justice in this apprehension. Had Kurnool continued as Capital without shifting to Hyderabad, by this time Kurnool would have developed to the size of Hyderabad. RayalaSeema people too would have started a movement to drive away Coastal Andhra People, just as their Telangana brotheren are doing now.

ఎక్కడ ఉపాధి దొరుకుతుందో అక్కడికి శ్రామికులు వలస వెళ్ళటం మానవహక్కుల్లో ఒకటి. ఈమానవహక్కును ఏప్రభుత్వమూ హరించలేనిది. అయితే ఈ వలసలు వెళ్ళినపుడు చాల సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి మనం పరిష్కారాలను వెతుక్కోవాలి. ఈచర్చకు ఇంకో పోస్ట్ అవసరం అవుతుంది.

Labor migrating to areas wherever livelihood is available is a human right. This right cannot be taken away by any Government. But when people migrate, many problems arise. We have to find out solutions for tackling them. We need a separate blog post for discussing the solutions.

కార్మికుల వలసకు, నాయకులు, సినీనటులు, పారిశ్రామికవేత్తలు, జూదగాళ్ళు, వేలకొలది ఎకరాల భూములను కొనేయటానికి తేడా ఉంది. విజయవాడ పరిసరాలలో కొన్నిచోట్ల వ్యవసాయభూమే ఎకరం రూ. 10 కోట్లు చేస్తున్నది.

There is great difference between the migration of labor for livelihood and purchase of thousands of acres of land by leaders, film stars, industrialists and speculators.

ఈగాడిదకు గుర్తున్నంత వరకు విజయవాడలో శ్రీరాజశేఖర్ రెడ్డికి రాజ్ యువరాజ్ అని రెండు సినిమా హాళ్ళు ఉండేవి. ఇపుడు అవి జగన్ చేతిలో ఉన్నాయో లేవో నాకు తెలియదు. మనం నిరసించాల్సింది ఈవేలాది ఎకరాలను కొని పారేయటాన్నే. ఇలా కొని పారేసిన వాళ్ళు రాజధాని విజయవాడలో ఉండాలి, లేక విశాఖలో ఉండాలి, లేక తిరుపతిలో ఉండాలి వంటి ఉద్యమాలను పెంచి పోషిస్తు ఉంటారు.

As far as this donkey can remember, Mr. Rajasekhar Reddy used to own two theaters known as Raj and Yuvraj in Vijayavada. I do not know whether they are now in the hands of Mr. Jaganmohan Reddy or not. What we should resent is purchase of thousands of acres. Those who purchase thousands of acres start movements like Capital should be in Vijayavada, Capital should be in Vizag, or Capital should be in Tirupati.

తమకు అందనిది, తమకు చెందినది కానీ ఇతరులచేతుల్లో పడ్డది అనే భావనకూడ తెలంగాణ ఉద్యమానికి మూలం. భవిష్యత్ లో ఇటువంటి ఉద్యమాలు కొత్తరాజధానిలో కూడ వచ్చి తీరుతాయి. The root cause for Telangana movement is the idea that a thing which belonged to the people of Telangana fell into the hands of others. We are going to get this type of movements even in future Capital Cities.

అందుకే మూడు రాష్ట్రాలు మూడు రాజధానులు అని నేను వాదిస్తున్నది. మన నేతలకి తాము ముఖ్యమంత్రి అయి కోట్లు కొల్లగొట్టాలనే యావ తప్ప చిన్నరాష్ట్రాలలోని లాభాలను గుర్తించటం, స్నేహపూర్వకంగా సమష్ఠిగా అందరు కలసి తమ కోరికలను తీర్చుకోటం తెలియదు.

For this reason only, I am arguing that we need three States and three Capitals. Our leaders are more eager to become Chief Ministers and loot crores of people's money, rather than to understand the benefits of small States and working unitedly to achieve them.

ఇప్పుడు చూడండి. సిగ్గులేకుండా సీమాంధ్ర నేతలు సోనియా బంట్రోతుల చుట్టూ ముఖ్యమంత్రి పదవి కొరకు ఎలా తిరుగుతున్నారో. See now, how these shameless Seemandhra leaders are revolving around the chaprasis of Sonia Gandhi!!

ఆంగ్లంలో ఒక సామెత ఉంది. We have a proverb in English. People get the Government they deserve. ప్రజలు తమ అర్హతకు తగిన ప్రభుత్వాన్ని పొందుతారు.

సీమాంధ్ర ప్రజలు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు ఎటువంటి ప్రభుత్వానికి అర్హులు? ఎటువంటి నేతలను పొందటానికి అర్హులు? What type of people are Seemandhra? What type of Government they deserve? What type of leaders they deserve to get?

A caution to Seemandhra slaves of Ms. Sonia Gandhi. శ్రీమతి సోనియా గాంధీ కట్టుబానిసలుగా మారిన సీమాంధ్ర నేతలకు భవిష్యత్ దర్శన సూచిక सोनियाजी की सीमांध्र दास केलिये एक चेतावनी | सावधानी
అడియాస కొలువు గొలువకు निरर्थक सेवा में प्रवेश न करें
గుడిమణియము సేయబోకు, కుజనుల తోడన్ मंदिर् के ट्रस्टी न बनें
విడువక కూరిమి సేయకు लगातार दुष्ट व्यक्तियों से दोस्ती न करें
మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతీ. अकेले जंगल में उद्यम मत करो, ओ सुमती!

Do not enter into a service, which will be futile. Do not undertake trusteeships of temples. Do not continuously befriend wicked persons. Do not venture alone into a forest.

అధరము కదలియు గదలక चुप्पी साधे रहने वाले
మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌ अधिकार मद/व्याधी से मधुरभाषण नहीँ कर्ने वाले
నధికార రోగపూరిత
బధిరాంధకశవము జూడ బాపము సుమతీ. वय्क्ती का लास् भी देखना पाप है. ओ सुमती (Oh wise person!).

It will be a great sin to see the corpse of a person who remains tight-lipped without sweet words, owing to arrogance of power. The adjective badhirAndhaka used to the arrogant person, describes him as a deaf and blind person whose eyes and ears are closed owing to excess pride.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.