Thursday, February 20, 2014

146 greeb turtles

What a people of Vidamaluru can know and Great Swami could not know? విడమలూరు ప్రజలు తెలుసుకో గలిగినది, గొప్ప స్వామి తెలుసుకోలేనిది
చర్చనీయాంశాలు: నెల్లూరు, విడమలూరు, స్వామి వివేకానంద, తాబేళ్లు, పర్యావరణం, Environment

స్పష్టీకరణ


ఇక్కడ వ్రాస్తున్న విషయాలు ఏమతానికి, కులానికి, ప్రాంతానికి ఉద్దేశ్యపూర్వకంగా బాధించాలని వ్రాస్తున్నవి కావు. సత్యాన్వేషణలో భాగంగా వ్రాస్తున్నవి మాత్రమే. నేను ఏమతానికీ ప్రచారకుడను కాదు. కొంత నాస్తికత్వం, మార్క్సిజంపై సానుభూతి ఉంది. అది కూడ గుడ్డి ప్రేమ కాదు. విజ్ఞులైన పాఠకులు నన్ను దిద్దవచ్చు. మీవ్యాఖ్యలకు స్వాగతం.

సాక్షి దినపత్రిక ప్రింట్ ఎడిషన్ 20.2.2014, ప్రచురించింది. ఇది ఎంత వెతికినా వారి ఈపేపర్లో దొరకలేదు. బహుశా నా వెతకటంలో లోపం కావచ్చు.


నెల్లూరు జిల్లా విడమలూరు బంగాళాఖాత సముద్రతీరంలో ఒక అరుదైన ఆకుపచ్చ టర్టిల్ (తాబేలు) కొట్టుకొచ్చింది. దానిని స్థానిక మత్స్యకారులు అమ్ముకోటమో, తినేయటమో చేయక, చికిత్స చేయించి సంరక్షణకు అప్పగించారు. బహుశా తరువాత దానిని తిరిగి సముద్రంలో వదులుతారు. ఈ తాబేలు అత్యంత అరుదైనదని, ఆఫ్రికన్, ఆస్ట్రేలియన్ సముద్రతీరాల్లో సంచరిస్తుంటుందని సాక్షి పత్రిక వారు వ్రాశారు.

వైబీరావు గాడిద వ్యక్తిగత అభిప్రాయంస్వామీ వివేకానంద


స్వామీ వివేకానంద గారు మన జాతిని ఎంతో ఉన్నత స్థాయికి ఎత్తేసిన గొప్ప వెయిట్ లిఫ్టర్ అని పలువురి అభిప్రాయం. స్వామీజీ వారు, క్రిస్టీనా గ్రీన్ స్టైడల్ అనే అమెరికన్ (మొదట జర్మన్, అమెరికాలొ సెటిల్ అయింది) యువతికి 12.12.1901 నాడు తన బేలూరు మఠం, కోల్ కత్తా, నుండి ఏమి లేఖ వ్రాశారో చూడండి. ఈలేఖ వైబీరావు గాడిద స్వంతంగా కల్పిస్తున్నది కాదు. ఇది స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలలో భాగం. స్వామీజీ వ్రాసిన లేఖలను epistles అంటారు. ఎపిజిల్స్ లో వెతుక్కోండి.
''... This is our best season for eating turtles, but they are all black. The green [ones] can only be found in America. Alas! I am prevented from the taste of meat. ... ".

తెలుగు సారం


''తాబేళ్ళను తింటానికి ఇది మా అత్యుత్తమ సీజన్, కానీ అవన్నీ నల్లటివి. ఆకుపచ్చవి అమెరికాలో మాత్రమే చూడగలం. అయ్యో! నేను మాంసం తినకుండా నిరోధించబడ్డాను .. ''

ఇక్కడ 'నిరోధించబడ్డాను' అంటంలో సందర్భం ఏమిటంటే, డయాబెటిస్, మొ|| పలురకాల వ్యాధులతో మూలబడ్డ స్వామీజీని డాక్టర్లు మాంసం తినద్దని చెప్పారు. ఆయన బేలూర్ మఠం ప్రాంతంలో కాకుండా, నెల్లూరు తీరంలో వెతుక్కుంటే ఈ ఆకుపచ్చ తాబేళ్ళు ఆరగించటానికి దొరికేవేమో.

బెంగాల్లో స్వామీజీలకి మాంసం, చేపలు తినటంపై నిషేధం లేదు. సాధారణ భిక్షుక సన్యాసులకు (MENDICANTS) కు చద్ది చపాతీలో , పాసిపోయిన అన్నమో వేయవచ్చుకాని, ఘరానా మఠాల్లో నివసించే స్వామీజీలకు మాంసం, చేపలకు కరువేమీ ఉండదు. రామకృష్ణ పరమహంస గారికి కూడ శుక్ల అష్టమి నాడు మేకను కోస్తే అభ్యంతరం లేదు. దానిని ఆయన కనులకు, నుదుటికి అద్ధుకొని తింటారు.

విడమలూరు ప్రజలారా, మీరు వివేకవంతులా, స్వామీజీలు, పాస్టర్లు, ముల్లాలు (ఏమతాలవారైనా సరే) వివేకవంతులా?

(దీనిని సరిదిద్ద వలసి ఉన్నది).

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.