Wednesday, February 19, 2014

145 Maverick politicians of India వికటకవుల్లాంటి భారతీయ రాజకీయ వేత్తలు

145 Maverick politicians of India వికటకవుల్లాంటి భారతీయ రాజకీయ వేత్తలు

చర్చనీయాంశాలు: భారతీయ ఆర్ధిక రంగం, Indian Economics, Narendra Modi, Subrahmanya Swami, Manmohan Singh

మనకి ఇద్దరు జోకర్లు ఉన్నారు.

కేంబ్రిడ్జి జోకర్లు


మణి శంకర్ అయ్యర్ Mani Shankar Aiyar
మొదటి వాడు శ్రీ మణిశంకర్ అయ్యర్. ఇండియన్ ఫారిన్ సర్వీసులో (IFS) పని చేశాడు. ఈయన యూపీఏ-1 లో కేంద్రమంత్రిగా పనిచేశారు. వీరు ప్రస్తుతం సోనియా, రాహుల్ అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈయన రాజీవ్ భక్తుడు. పీవీనరశింహారావు, మన్మోహన్ సింగ్ ఒక తరహాకు చెందిన మౌన ముచ్చులు అయితే మణిశంకర్ అయ్యర్, శ్రీసుబ్రహ్మణ్యస్వామి వాగుడుకాయలు. శ్రీఅయ్యర్ నోరుజారి తరువాత నాలుక కరుచుకోవాల్సిన సందర్భాలు వచ్చాయి.

4.5.2010 నాడు రాజ్యసభలో శ్రీ అరుణ్ జైట్లీపై వ్యాఖ్యలు చేసి వెనక్కి తీసుకోవలసి వచ్చింది.

నమోపై అయ్యర్ వ్యాఖ్య


౨౧వ శతాబ్దంలో నరేంద్రమోడీ ఈదేశానికి ఎన్నటికీ ప్రధానమంత్రి కాలేడు. ... కానీ ఆయన ఇక్కడ చాయ్ అమ్మాలనుకుంటే, మనము ఆయనకు స్థలాన్ని కేటాయిద్దాము.

I promise you in 21st Century Narendra Modi will never become the Prime Minister of the country. ...But if he wants to distribute tea here, we will find a place for him.

శ్రీఅయ్యర్ కి రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి సాలోక్య అంశాలు Commonalties between Mr Aiyar, Rajiv Gandhi and Rahul Gandhi


ఇద్దరూ స్టీఫెన్స్ కాలేజి ఢిల్లీలో చదివారు (ఒకే ఏడాది కాదు). రాహుల్ మొదటి సంవత్సరం హిందీలో తప్పి హార్వర్డ్ కి వెళ్ళాడు. శ్రీఅయ్యర్, శ్రీ రాహుల్ ఇద్దరూ ట్రినిటీ కేంబ్రిడ్జి పూర్వ విద్యార్దులే (ఆలమ్నీలే). అయ్యర్, రాజీవ్, రాహుల్ ముగ్గురూ డూన్, కేంబ్రిడ్జి జనాలే.

ఇంకో విధంగా చెప్పాలంటే, కేంబ్రిడ్జీని, హార్వర్డ్ ని పోషించేది భారతీయ ఘరానా తల్లితండ్రులే.

ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యస్వామి
రెండవవాడు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి. వీరు బిజెపి పాలనలో కేంద్రమంత్రి. ఆర్ధికవేత్త. హార్వర్డ్ పిహెచ్.డీ., విశ్రాంత ప్రొఫెసర్. శ్రీనరేంద్రమోడి అధికారంలోకి వస్తే, వీరికి ఏమి పాత్రను ఇస్తారో తెలియదు. వీరు ఐఐటీ ఢిల్లీ లో సుదీర్ఘకాలం మేథమెటికల్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్ గా పని చేశారు. ఈయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వాప్నికుడైన శాంతాక్లాజ్ గా వర్ణించిందట. క్లెయిమ్స్: చైనా, ఇజ్రాయిల్ లతో సంబంధాల పునరుధ్ధరణలో ప్రముఖపాత్ర. శ్రీలంకతో సంబంధాల విషయంలో మటుకు ఇతర తమిళ రాజకీయవేత్తలతో ఏకీభవిస్తున్నట్లు కనిపించడు. భారత్ లో ప్రధాని శ్రీపివి నరశింహారావు, శ్రీమన్మోహన్ సింగులు సోవియట్ మోడల్ ఆర్ధికాభివృధ్ధి మోడల్ ను వదిలేసి ఆర్ధిక సంస్కరణల మార్గం పట్టటానికి తన ప్రభావం ఉందని అంటారు. ఉంటే ఉండవచ్చు.

మన్మోహన్ సింగ్ జీ కన్నా ఒక్కవిషయంలో శ్రీసుబ్రహ్మణ్యస్వామి మిన్న. మన్మోహన్ సింగ్ జీకి లోక్ సభకి ఎన్నికైన చరిత్ర లేదు. అస్సాంనుండి రాజ్యసభ రూటే. శ్రీసుబ్రహ్మణ్యస్వామి పలుసార్లు లోక్ సభకి తమిళనాడు నుండే కాక ముంబాయి, ఉత్తరప్రదేశ్ నుండి కూడ ఎన్నికైనట్లు కనిపిస్తుంది.

Shri Subrahmanya Swami scores over Prime Minister Manmohan Singh, at least in one respect. Manmohan has no history of getting elected to Lok Sabha. He got five times elected through the Assam route. Shri Swami got elected to Lok Sabha a number of times from Tamil Nadu, Maharashtra, Uttar Pradesh, probably Kerala.

భారతీయ న్యాయవ్యవస్థయందు గొప్ప విశ్వాసం Immense faith in Indian legal system
కోర్టు పక్షి అనలేం కానీ, కోర్టులను ఆశ్రయించి న్యాయాన్ని పత్తిలోనుండి దారం తీసి నట్లుగా తీయటంలో మొనగాడు. 2జీ స్కాంను బయటికి తేవటంలో శ్రీ స్వామిది ప్రముఖ పాత్ర. సోనియా, రాహుల్ ల అవినీతి విషయంలో ఈయన వద్ద సాక్ష్యాలేమైనా ఉన్నాయేమో తెలియదు.

It is difficult to say that Mr. Swami is a habitual frivolous litigant. His frequent recourse to petitions to Supreme Court reflects his immense faith in the legal system of India. Shri Swami played a key role in bringing out the 2g Scam which took place in India. It is not clear whether he is in possession of any clear evidence about the accumulation of personal assets of Ms. Sonia Gandhi and Mr. Rajiv Gandhi.

నమో, స్వామి అభిప్రాయాల మధ్య సారూప్యం
బిజెపి నరేంద్రమోడీ అభిప్రాయాలు, ఈయన అభిప్రాయాలూ కలుస్తాయి కాబట్టి, ఈయన తన జనతా పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయటం సమంజసమే. శ్రీనరేంద్రమోడీ అధికారంలోకి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని కేంద్ర ఆర్ధికమంత్రిని చేసినా ఆశ్చర్య పోనవసరంలేదు.

Some of the ideas of Mr. Narendra Modi and Mr. Subrahmanya Swami seem to coincide. It is natural and justified that he merged his Janata Party with BJP in 2013. We need not be surprised, if Mr. Narendra Modi elevates Mr. SubrahmaNya Swami to the Union Finance Minister.

వాజ్ పేయీ రాజ్యంలో మనకి ఆర్ధికమంత్రులు శ్రీజస్వంతసింగ్, శ్రీయశ్వంత సిన్హా. వీరి ఆర్ధిక సిధ్ధాంతాలకి, మన్మోహన్ సింగ్ ఆర్ధిక సిధ్ధాంతాలకూ భేదమేమీలేదు.

భారత్ లో హార్వర్డ్ డిగ్రీలవారు ఒక రెండు మూడువేల మంది దాకా ఉండవచ్చని నా అభిప్రాయం.

భారత్ లో హెచ్ బి ఎస్ క్లబ్ ఇండియా.కాం అనే వెబ్ సైట్ ఉన్నది. ఈవెబ్ సైట్ కి వెళ్లటానికి లింక్. http://www.hbsclubindia.com/memsub.html కి వెళ్లటానికి క్లిక్.
ఏడాదికి ఒక రూ.10000 వేలు పారేస్తే సభ్యత్వం. కార్పోరేట్ దిగ్గజాలు కొందరు దీనిలో సభ్యులుగా ఉన్నారు. వీరంతా ఎంబిఎలు వలె కనిపిస్తుంది. ఎంబిఎలు కాక లాస్కూల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ మొ|| రంగాల వారు కూడ ఉంటారు. భారత్ లో ఫారిన్ క్రేజ్ ఎన్ని శతాబ్దాలైనా కొనసాగక తప్పదు.

తెలుగు వాళ్లకి సంబంధించి నంత వరకు ఈ హార్వర్డ్, కేంబ్రిడ్జి పిచ్చి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. తెలుగువాళ్ళు ఎక్కువగా అమెరికా వెళ్ళేది అక్కడ నానా బాధలు పడి సెటిల్ కావటానికి. ఆఅవసరానికి వైద్య విద్య, సాంకేతిక విద్య బాగా అక్కరకు వస్తుంది తప్ప అంతర్జాతీయ సంబంధాలు, సుత్తి ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులు కావు.

మనం అఖిల భారత స్థాయిలో గుజరాతీ ఎకనామిక్స్ ను రుచిచూడలేదు. అహమ్మదాబాద్ లో పలువురు నిద్ర లేవగానే స్టాక్ ఎక్స్ఛేంజిలో షేర్లధరలను చూచుకొని దినచర్యను ప్రారంభిస్తారని ప్రతీతి. సుబ్రహ్మణ్యస్వామి గారిది హార్వర్డ్ ఎకనామిక్స్ కాగా, మన్మోహనాచార్యుల వారిది లండన్ స్కూలు. వారూ వీరు అంతా కలిసి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూగారి ఎకనామిక్స్ ని, సోనియా సహకారంతో చావుదెబ్బ కొట్టారు. స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ ఎకనామిక్ స్కూల్ ని అనుకరించినా, భారతీయ క్షేత్ర వాస్తవాలను మరువలేదు.

వ్యక్తి గతంగా ఈ వైబీరావు గాడిద కూడ పాత సోవియట్ తరహా ఎకనామిక్ స్కూల్ ని సమర్ధిస్తాడు. ప్రస్తుతం పాత సోవియట్ తరహా ఆర్ధిక వ్యవస్థ నేటి రష్యాలోనే లేదు కదా అనే అభిప్రాయం ఉన్నది. సోవియట్ తరహా ఆర్ధిక విధానం అధిక వైశాల్యం, తక్కువ జనాభా గల సోవియట్ యూనియన్ కన్నా పరిమిత భూమి, అపరిమిత జనాభా కలిగిన భారత్ కు బాగా పనికి వస్తుంది.
నెహ్రూని వెర్రి వెధవగా పీవీ నరశింహారావు, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వాజ్ పేయీ, జస్వంత్ సింగ్, సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు పరిగణించి ఉంటే, వారి లోపభూయిష్ఠమైన ఆలోచనలకి కారణం హార్వర్డ్, కేంబ్రిడ్జీల్లో జరిగే బ్రెయిన్ వాషింగే కారణం కావచ్చు.

Added on 27.9.2014 నాడు జోడించబడినది.  २७.९.२०१४ दिनांक जोडित

The credit for fighting against the corruption of Ms. Jayalalitaa should go to Subramanian Swamy.  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అవినీతి గురించి పోరాడిన శ్రీసుబ్రహ్మణ్యస్వామికి చెందాలి.  तमिळ नाडु मुख्यमंत्री जयललिता की भ्रष्ठाचार के खिलाफ युध्ध करने का साख और प्रसिध्धी भी श्री सुब्रहमणियन् स्वामी को मिलना चाहिये.

PM of India Narendra Modi should have inducted Subrahmanian Swamy into Cabinet and made him HRD Minister or Law Minister.  But Mr. Modi may not like a person, brighter than himself, in his team.  భారత ప్రధాని శ్రీనరేంద్ర మోడీ గారు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారిని కేంద్ర మంత్రివర్గం లోకి తీసుకుని హెచ్. ఆర్. డి. మంత్రి గానో న్యాయ శాఖా మంత్రి గానో చేసి ఉండాల్సింది.  కానీ శ్రీ మోడీ గారు, తన కంటె బ్రైట్ పర్సన్ ను తన టీమ్ లో ఉంచుకోక పోవచ్చు.  भारत प्रधान मंत्री श्री नरेंद्र मोदी , प्रॊफॆसर सुब्रहम्ण्य स्वामी को मंत्रिवर्ग मे ले कर, उन को हॆच् आर डी मंत्री या न्याय शाखा मंत्री बनाना था।  परन्तु, मेरे ख्याल में , मान्य मोदी महोदय को, अपने टीम मे अपने से  ब्रैट व्यक्ती को शामिल करना स्वाद नहीं हो सकता।

ఈ వ్యాసాన్ని ఇంకా కొనసాగించవలసి యున్నది. To continue

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.