Friday, February 14, 2014

138 Exile of Seemandhra

138 Exile to Seemandhras. సీమాంధ్రులకు వనవాసం, ప్రవాసం
138 Administrators and rulers need foresight. పరిపాలకులకు దార్శనికత అవసరం
చర్చనీయాంశాలు: National Integration, జాతీయ సమైక్యత, bifurcation, విభజన, కాంగ్రెస్, బిజెపి

తాత్కాలికంగా తమ పబ్బం గడుపుకోటం కాదు. పరిపాలకులకు దార్శనికత అవసరం. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే విపత్తులను ముందుగా ఊహించుకోవాలి. వాటిని సగందూరం ముందుకు వెళ్ళి ఎదుర్కొని తుత్తునియలు చేయాలి. మిసైల్ టెక్నాలజీలో మిసైల్స్ డిజైన్ చేసేవారు, అవతల నుండి మిసైల్స్ ఎంత ఎత్తులో వస్తాయి. మన మిసైల్ ఎంత ఎత్తులో ఎంతవేగంతో వెళ్ళి దానిని ఢీకొనాలి అని అంచనాలు వేసుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టటానికి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, చిదంబరం, కమల్ నాథ్ వంటి వారు కుయుక్తులు పన్ని, ఐటం నం. 20A గా దానిని దొంగచాటుగా ముందుకు నెట్టి వారు గొప్ప విజయం సాధించినట్లుగా పొంగి పోతూ ఉండవచ్చు.

తెల్ల పంచదార తినే టపుడు మహారుచిగా ఉంటుంది. తరువాత శరీరంపై తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గ్లోకౌమా వంటి వ్యాధుల వల్ల కంటి చూపు కోల్పోవచ్చు. గాంగ్రీన్ వంటివి వచ్చి పాదాలనో కాళ్ళనో నరికి వేయాల్సిన పరిస్థితులు రావచ్చు. మనకి పంచదార ఫ్యాక్టరీయో , స్వీట్ షాపో ఉంది కదా అని పంచదార, స్వీట్లు విపరీతంగా తినుకుంటూ పోతే అది కిడ్నీలను నాశనం చేసే ప్రాణాంతక వ్యాథులను నిద్ర లేపవచ్చు.

నియంతృత్వం కూడ పంచదార వంటిదే


ఇపుడు వ్రాసేవిషయాలు కాంగ్రెస్ కు, బిజేపికి, టిడీపి, తెలంగాణకి, సీమాంధ్రకి, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు అందరికీ వర్తిస్తాయి. పులులతో, పాములతో ఆడుకునే వాళ్ళు ఏదో ఒకరోజు వాటి చేతుల్లోనే చస్తారు. విభజనలతో ఆడుకునే వాళ్ళు కూడ అంతే. తమకు నియంతృత్వాధికారులున్నాయనో, కుతంత్రాలు చేసే తెలివి ఉన్నదనో, వాటిని ఉపయోగిస్తే జాతి సమైక్యతకే భంగం వాటిల్లుతుంది.

ఇపుడు చూడండి. దొంగచాటుగా విభజన బిల్లును 14.2.2014 న లోక్ సభలో ప్రవేశపెట్టిన తీరును చూచి దుఃఖం పొందిన ముగ్గురు టీడీపీ ఎంపీలు దేశం నుండే విడిపోతామంటున్నారు. ఈనాడు దిన పత్రిక తేదీ 15.2.2014 లో మొదటి పేజీలో ప్రచురించబడిన ఈవార్తను చూడండి.

ఈనాడు దినపత్రికలో ఈవార్తకు వెళ్ళటానికి లింకు: http://eenadu.net/news/newsitem.aspx?item=panel&no=3
దెబ్బలు తిన్నవాళ్ళనే పార్లమెంటునుండి సస్పెండ్ చేయటం ఏమిటని సీమాంధ్ర తెదేపా ఎంపీలు తప్పు పట్తున్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేయలేనపుడు సీమాంధ్రలోని 25 మందికి ప్రత్యేక పార్లమెంటు ఇవ్వాలని, తామొక దేశంగా విడిపోతామని అన్నారు. నర్సరావుపేట తెలుగుదేశం ఎంపీ శ్రీ మోదుగుల వేణుగోపాలరెడ్డి , పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇక్కడ విలేఖర్లతో మాట్లాడారు.

... తన్నులు తిన్నవాళ్ళనే పార్లమెంటు నుండి ఎలా సస్పెండ్ చేస్తారు? వెల్ లో 57 మంది ఉంటే 41 మందిని వదిలేసి మిగతా 16 మందిపైనే ఎందుకు వేటేశారు? అప్రజాస్వామిక చర్యద్వారా 5 కోట్లమంది గొంతు కోశారు. ఈపార్లమెంటు మాకు న్యాయం చేయలేనపుడు సీమాంధ్రలోని 25 మందికి ప్రత్యేక పార్లమెంటు ఇవ్వండి. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాగా మేం కూడ బయటకి వెళ్ళిపోతాం. స్పీకర్ మా సస్పెన్షన్ ఎత్తివేసి విభజన బిల్లును పెట్టలేదని చెప్పి సీమాంధ్ర ప్రజలను శాంత పర్చాలి. మేం సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్నే ప్రశ్నిస్తున్నాం. న్యాయం చేస్తే పూలల్లో పెట్టి తెలంగాణ ఇస్తాం. లేదంటే మాకు ప్రత్యేక పార్లమెంటుని ఇస్తే ఈదేశంనుండి బయటకు పోతాం. ...

వైబీరావు గాడిద వ్యాఖ్య


ఈ లోక్ సభ సభ్యుడు తాత్కాలిక దుఃఖంతో ఇలా మాట్లాడి ఉండ వచ్చు. తరువాత మనసు కుదుట పడ్డాక ఈయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకో వచ్చు.

కానీ ఈలోక్ సభ సభ్యుడికి కలిగిన భావోద్వేగమే, కేంద్ర పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బిజేపీ పార్టీల నియంతృత్వాన్ని చూచిన 5 కోట్లమంది సీమాంధ్ర తెలుగు వారిలో కొన్ని వందల మందికో కొన్ని వేలమందికో కలిగి ఉండవచ్చు. ఇలాంటి ఉద్వేగాలు కొద్ది వందల మందికో అయినా, కొద్ది వేలమందికో కలగటం చాల ప్రమాదం. అలాటి ఉద్వేగాలు కలిగే వారు అందరూ తమ దుఃఖాలను ఆవేశాలను దిగమింగి ఊరుకోరు. వారిలో వేర్పాటు వాదం బీజాలు ఏర్పడి, మొలకెత్తి కాలక్రమంలో వారిని విఛ్ఛిన్న వాదులుగా, ఉగ్రవాదులుగా తయారు చేస్తుంది.

అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. తెలంగాణ ఇవ్వకపోతే ఇలాంటి ఉద్వేగాలను తెలంగాణ ప్రజలలో లేవనెత్తటానికి కెసీఆర్, కోదండరాం వంటి వారు ప్రయత్నించారు. మేం ఐరాసకు వెళ్తాం అన్నారు. ఈరోజు తమకు బంగారు పళ్ళెం లో తెలంగాణ ఇస్తామన్నారు కాబట్టి వారు పిత్తిన ముత్తైదువుల్లాగా శాంతి వచనాలు పలుకుతున్నారు.

వీటిని బట్టి జాతీయ స్థాయి పాలకులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? గోటితో పోయే వాటికి గొడ్డలి వాడాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. ముందుగానే సంబంధించిన వారిని సమావేశపరిచి ఉభయులకి ఆమోదయోగ్యమైన పరిష్కారాలు వెతకాలి. అవి దొరకటం ఆలస్యం అయితే తాత్కాలిక ఉపశమనాలను ఇవ్వ వచ్చు. పాలితులు తాత్కాలిక ఉపశమనంతో శాంతంగా ఉన్న సమయంలో, పాలకులు నిద్ర పోకూడదు. శాశ్వత పరిష్కారాన్ని సాధించి ఉభయులు అంగీకరించేలాగా చేయాలి. ఏకపక్షంగా ముందుకు వెళ్ళకూడదు. ఒకపక్షాన్ని నెత్తిన పెట్టుకొని రెండో పక్షాన్ని అడవుల పాలు చేయకూడదు. కెసిఆర్ తరిమేయమన్నాడు ఆంధ్రవాలే భాగో భాగో అన్నాడు కాబట్టి మన్మోహన్ సింగ్, సోనియాలు ఉస్కో ఉస్కో అనకూడదు. (ఇక్కడ కేంద్ర పాలకులు చేసిందిదే. అడవులు శుభ్రం చేసుకొని రాజధాని పెట్టుకోండి. చెట్లు నరుక్కోటానికి మేం అనుమతి ఇచ్చేవిషయం మేం పరిశీలిస్తాం. అని బిల్లులో ఉంది) . అడవులకి వెళ్ళేవాడు ఎలాగైనా చెట్లను నరుక్కుంటాడు. అనుమతి పత్రం కోసం ఆగడు.

ఇపుడు పరిష్కారం


ఇదివరకు చాల సార్లు వ్రాసిందే. సీమాంధ్రుల అంగీకారంతో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ వారి అనుమతితో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఐదు రాష్ట్రాలను ఏర్పరచటమే. ఈ ప్రతిపాదనలు త్వరలో వెండితెరమీదకి వస్తాయి. విజ్ఞులైన పాఠకులు దీనిని చూడబోతున్నారు. 45 రోజులలో రాజధానిని నిర్ణయించటానికి కమిటీని నియమిస్తామన్నారుగా.

ఈనాటి సంస్కృత శ్లోకం


వాల్మీకి రామాయణం, అరణ్యకాండ, 15వ సర్గ (ఛాప్టర్), 5వ శ్లోకం.

परवान् अस्मि काकुत्स्थ त्वयि वर्ष शतम् स्थिते |
स्वयम् तु रुचिरे देशे क्रियताम् इति माम् वद ||
పర వాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే
స్వయం తు రుచిరే దేశే క్రియతామ్ ఇతి మాం వద.
సారం: పంచవటిలో లక్ష్మణుడు రాముడితో అన్నాడు. అన్నా నేను నీ సేవకుడిని. పర్ణశాల ఎక్కడ నిర్మించాలో చెప్పు. నీ ఆజ్ఞను నేను పాటిస్తాను.

सुप्रीतः तेन वाक्येन लक्ष्मणस्य महाद्युतिः |
विमृशन् रोचयामास देशम् सर्व गुण अन्वितम् ||
సుప్రీతః తేన వాక్యేన లక్ష్మణస్య మహాద్యుతిః
విమృశన్ రోచయామాస దేశం సర్వ గుణ అన్వితమ్.
సారం: తమ్ముడి మాటలకు సుప్రీతుడైన శ్రీరాముడు మంచి స్థలాన్ని ఎంపిక చేశాడు.

स तम् रुचिरम् आक्रम्य देशम् आश्रम कर्मणि |
हस्ते गृहीत्वा हस्तेन रामः सौमित्रिम् अब्रवीत्
స తం రుచిరం ఆక్రమ్య దేశమ్ ఆశ్రమ కర్మణి
హస్తే గృహీత్వా హస్తేన రామః సౌమిత్రిం అబ్రవీత్.
సారం: మంచి స్థలాన్ని రాముడు గుర్తించి, అందలో అడుగులేస్తూ, తమ్ముడి చేతిని తన చేతిలోకి తీసుకొని ఇలా అన్నాడు.

अयम् देशः समः श्रीमान् पुष्पितैर् तरुभिर् वृतः |
इह आश्रम पदम् सौम्य यथावत् कर्तुम् अर्हसि ||
అయం దేశః సమః శ్రీమాన్ పుష్పితైర్ తరుభిర్ వృతః
ఇహ ఆశ్రమ పదం సౌమ్య యథావత్ కర్తుమ్ అర్హసి.
సారం: ఓ సాత్వికుడా!! ఈస్థలం సమతలంగా ఉంది. పుష్పాలు. చెట్లతో నిండి ఉన్నది. ఇది ఆశ్రమం నిర్మించుకోటానికి అనువైన ప్రదేశం.

इयम् आदित्य संकाशैः पद्मैः सुरभि गंधिभिः |
अदूरे दृश्यते रम्या पद्मिनी पद्म शोभिता ||
ఇయం ఆదిత్య సంకాశౌః పద్మౌః సురభి గంధిభిః
అదూరే దృశ్యతే రమ్యా పద్మినీ పద్మ శోభితా.
సారం: ఈ ప్రదేశం సుగంధ భరితమైన పద్మాలతో నిండి ఉన్నది. సమీపంలోనే ఆదిత్య సమ్మోదితమైన పద్మ పూరితమైన సరస్సు ఉన్నది.

यथा आख्यातम् अगस्त्येन मुनिना भावितात्मना |
इयम् गोदावरी रम्या पुष्पितैः तरुभिर् वृता ||
हंस कारण्डव आकीर्णा चक्रवाक उपशोभिता |
యథా ఆఖ్యాతం అగస్త్యేన మునినా భవితాత్మనా
ఇయం గోదావరీ రమ్యా పుష్పితైః తరుభిర్ వృతా
హంసం కారండవ ఆకీర్ణా చక్రవాక ఉపశోభితా.
సారం: భవిష్యత్ ద్రష్ట అగస్త్య మహాముని సూచించినట్లుగానే ఈప్రదేశం చెట్లు, పూవులతో శోభిల్లుతున్నది. ఇదిగో పుష్పలావితమైన గోదావరి. హంసలు, కారండవ పక్షులు, జక్కువ పక్షులతో నిండి శోభిస్తున్నది.

न अतिदूरे न च आसन्ने मृग यूथ निपीडिता ||
मयूर नादिता रम्याः प्रांशवो बहु कंदराः |
दृश्यन्ते गिरयः सौम्य फुल्लैः तरुभिर् आवृताः
న అతిదూరే న చ ఆసన్నే మృగ యూథ నిపీడితా
మయూర నాదితా రమ్యాః ప్రాంశవో పహు కందరాః
దృశ్యంతే గిర్యః సౌమ్య ఫుల్లేః తరుభిర్ ఆవృత్తాః.
సారం: ఓ సౌమ్యుడా!! (రాముడు లక్ష్మణుడిని సంబోధిస్తున్నాడు), ఆకొండలు చూడు. మరీదూరంగా లేవు. మరీ దగ్గరగా లేవు. చక్కగా పుష్పించిన తరువులతో నిండి ఉన్నాయి. జంతువుల గుంపులతో నిండి ఉన్నాయి. నెమళ్ళ క్రేంకారాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. సుందరమైన గుహలతో రమ్యంగా ఉన్నాయి.

सौवर्णै राजतैः ताम्रैः देशे देशे च धातुभिः |
गवाक्षिता इव आभान्ति गजाः परम भक्तिभिः
సౌవర్ణౌ రజతైః తామ్రైః దేశే దేశే చ ధాతుభిః
గవాక్షితా ఇవ ఆభాంతి గజాః పరమ భక్తిభిః.
సారం: ఆకొండలు చక్కగా రంగులద్దబడిన ఏనుగుల్లాగ ప్రకాశిస్తున్నాయి. బంగారం, వెండి, రాగి ఖనిజాల ధాతువులు ఆకొండలపై ఆవు కళ్ళలాగా (లేక గోడలలో గవాక్షాలలాగా) ప్రకాశిస్తున్నాయి.

सालैः तालैः तमालैः च खर्जूरैः पनसैः द्रुमैः |
नीवारैः तिनिशैः चैव पुन्नागैः च उपशोभिताः ||
సాలైః తాలైః తమాలైః చ ఖర్జూరైః పనసైః ద్రుమైః
నీవారైః తినిశైః చైవ పున్నాగైః చ ఉపశోభితాః.
चूतैर् अशोकैः तिलकैः केतकैर् अपि चंपकैः |
पुष्प गुल्म लता उपेतैः तैः तैः तरुभिर् आवृताः ||
చూతైర్ అశోకైః తిలకైః కేతకైర్ అపి చంపకైః
పుష్ప గుల్మ లతా ఉపేతేః తైః తైః తరుభిర్ ఆవృతాః
स्यन्दनैः चंदनैः नीपैः पर्णासैः लकुचैः अपि |
धव अश्वकर्ण खदिरैः शमी किंशुक पाटलैः
స్యందనైః చందనైః నీపైః పర్ణాసైః లకుచైః అపి
ధవ అశ్వకర్ణ ఖదిరైః శమీ కింశక పాటలైః.
సారం: దేవదారు వృక్షాలు, తాడిచెట్లు, తమాల వృక్షాలు (తెలుగు నాకు తెలియదు), ఖర్జూర చెట్లు, పనస చెట్లు, నీవార ధాన్యాలు (మన రాగులు, వరిగెల వంటి ధాన్యం చాల చిన్నగింజలు), తినిశె చెట్లు (ఇవేమిటో నాకు తెలియదు), పున్నాగ, మామిడి, అశోకం, తిలకం చెట్టు, మొగిలి (కేతకం), సంపంగి (చంపకం) చెట్లు, స్యందనం చెట్లు, గంధం చెట్లు, నీప చెట్లు, పర్ణాశ చెట్లు, లకుచ చెట్లు, ధవ చెట్లు, అశ్వకర్ణ చెట్లు, ఖదీర వృక్షాలు (కాచు), జమ్మి చెట్లు, కింశుక పాటలీ వృక్షాలతో శోభిల్లుతున్నాయి.

इदम् पुण्यम् इदम् रम्यम् इदम् बहु मृग द्विजम् |
इह वत्स्याम सौमित्रे सार्धम् एतेन पक्षिणा.
ఇదం పుణ్యం ఇదం రమ్యం ఇదం బహు మృగ ద్విజమ్
ఇహ వత్స్యామ సౌమిత్రే సార్ధం ఏతోన పక్షిణా.
సారం: ఈప్రదేశం పుణ్యభరితమైనది. ఇది రమ్యమైనది. ఇది బహు మృగాలు, పక్షులు (ద్విజులు - పక్షులు. రెండు జన్మలు అనగా గుడ్డు జన్మ, పక్షి జన్మ) ఉన్న ఇక్కడ మనం ఈ పక్షి (జటాయువు) తో నివసిద్ధాము.

एवम् उक्तः तु रामेण लक्ष्मणः परवीरहा |
अचिरेण आश्रमम् भ्रातुः चकार सुमहाबलः
ఏవం ఉక్తః తు రామేణ లక్ష్మణః పరవీరహా
అచిరేణ ఆశ్రమం భ్రాతుః చకార సుమహాబలః.
సారం: రాముడు ఇలా అనగానే, మహాబలశాలియైన లక్ష్మణుడు స్వల్ప సమయంలోనే అన్న కోసం ఒక పర్ణశాలను నిర్మించాడు.

పర్ణశాల వర్ణన ఇంకోరోజు.


దీనిని తిరగ వ్రాయవలసి ఉన్నది. ఇంకా చాలా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.