Thursday, January 30, 2014

123 Selfish servants

123 Selfish servants slaving for sly masters
చర్చనీయాంశాలు: తెలుగు జాతి, ప్రజాస్వామ్యం, తెలంగాణ

సుమతీ శతకకారుడు బద్దెన, ఓరుగల్లు సామ్రాజ్ఞి కాకతీయ రుద్రమదేవి ఆస్థానంలో సామంతుడు అంటారు. 13వ శతాబ్దం, అంటే షుమారు 700-800 ఏళ్ళక్రితం వ్రాసిన ఈ పద్యం చూడండి.
అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్‌
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొంటి నరుగకు సుమతీ
అడియాస కొలువు కొలువకు అంటే వృధాప్రయాస లేక మోటుగా చెప్పాలంటే వృషణాల ప్రయాస వంటి కొలువులు కొలువకు అని అర్ధం చెప్పుకోవాలి. తెలుగుదేశం శాసనసభ్యుడు శ్రీ మోత్కుపల్లి నరసింహులు గారికి
ఇప్పుడు ఆచరణలో అనుభవం వచ్చి ఉండాలి.

చంద్రబాబు కొలువు మాత్రమే అడియాస కొలువా?


కరివేపాకులాగ వాడుకొని వదిలి వేయటంలో శ్రీచంద్రబాబు నాయుడు గారిది అందెవేసిన చేయి, అన్నది నిజమే అయినా, మిగిలిన వారు తక్కువ తిన్నారా? అంటే దీనికి పెద్ద పోటీ పెట్టి నంది అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ సందర్భంగా మనం భర్తృహరిని ఒకసారి స్మరించుకోటం న్యాయం.
భ్రాంతం దేశం అనేక-దుర్గ-విషమం ప్రాప్తం న కించిత్ ఫలం
త్యక్త్వా జాతి-కులాభిమానం ఉచితం సేవా కృతా నిష్ఫలా |
భుక్తం మాన-వివర్జితం పర-గృహేష్వ్ ఆశంకయా కాకవత్
త్రిషీ జ్రింభసి పాప-కర్మ-నిరతే(పిశునే) నాద్యాపి సంతుష్యసి


షుమారు తెలుగు సారం: కోటలు, అడవులు పట్టుకొని తిరిగాను. జాతి కులాభిమానం అన్నీ వదిలేసుకొని సేవలు చేశాను. ఆత్మాభిమానం వదిలేసి కాకి లాగా ఇతరుల గృహాలలో తిన్నాను. తృష్ణ విజృంభిస్తున్నది. లోభత్వం తృప్తి పడటం లేదు.
ఖలా ఆలాపా సోఢౌ కథం అపి తద్-ఆరాధన-పరైర్-
నిగృహ్యా అంతర్-బాష్పా హసితం అపి శూన్యేన మనసా |
కృతొ విత్త-స్తంభ-ప్రతిహత-ధియాం అంజలిర్ అపి
త్వం ఆశే మొఘాశే కిమ్ అపరం అతో నర్తయసి మాం|


షుమారు తెలుగు సారం: డబ్బుకోసం నీచులైన యజమానులు ఆడిన అవమానకరమైన మాటలను ఏదోలాగా, చేతులు జోడించి భరించాను. ఎందుకు? నా బుధ్ధి (ధియా) సంపదయందు ఆశచేత స్తంభించి పోయింది. మనస్సు శూన్యమై పోయింది. లోలోపల వస్తున్న కన్నీటిని నిగ్రహించుకున్నాను. లోలోపల నాలో నేనే నవ్వుకున్నాను. ఓ ఆశా, ఇతరులు పాడే పాటలకు నా చేత ఎందుకు నాట్యం చేయిస్తున్నావు?

త్యాగరాజస్వామి


దుర్మార్గ చరాధములను దొర నీవన జాలరా
ధర్మాత్మక ధన ధాన్యము దైవము నీవై యుండ దుర్మార్గ||
పలుకు బోటి నీ సభ లోన పతిత మానవుల కొసగే
ఖలులను ఎచ్చట పొగడ శ్రీకర త్యాగరాజ వినుత .


దుర్మార్గ చరాధములను దొర నీవని అనలేను అని త్యాగరాజు మొత్తుకుంటున్నాడు.

శ్రీ మోత్కుపల్లి ఇపుడు ఏమి చేయాలి? తాను విపరీతంగా తిట్టిన కె.సీ.ఆర్. పంచన చేరలేడు. బహుశా టీ కాంగ్రెస్ నేతలు లేక వైయస్ ఆర్ పీ నేతలు, లేక బీజేపీ నేతలు రానిస్తారేమో కానీ, అక్కడ కూడ దుర్మార్గ చరాధములను దొరనీవనక తప్పదు కదా.


బహుశా ముద్దు క్రిష్ణుడు, మైసూరా రెడ్డి, కోడెల, మొ|| వారి బాట పట్టక తప్పదేమో.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.