Tuesday, December 17, 2013

101 Why mere book learning will not do! ఎందుకు కేవలం పుస్తక జ్ఞానము మాత్రమే సరిపోదు?


చర్చనీయాంశాలు: స్వామి వివేకానంద, సమాజం, మీడియా

హాన్స్ ఇండియా, హైదరాబాదు నుండి వెలువడే ఆంగ్ల దిన పత్రిక. హెచ్.ఎమ్. టీవీ వారిది. దీని ఎడిటర్ ఇన్ ఛీఫ్ శ్రీ కె. రామచంద్రమూర్తిగారు.

హాన్స్ ఇండియా, 17-12-2013 తేదీ సంచికలో Why mere book learning will not do! అనే స్వామీ వివేకానంద గారి వ్యాసాన్ని ప్రచురించింది. దిన పత్రిక 16 పేజీల్లో ఒక పూర్తి పేజీ స్వామీజీకే కేటాయించారు. పేజీ కింది భాగంలో Courtesy: Goteti Ramachandra Rao, OSD to Late NT Rama Rao, Former CM, Ph 040-2373908; 9908157154 అని కూడ ప్రచురించారు.

బాగానే ఉంది. జనవరి 12 దాకా (వివేకానంద జన్మదినం, ఇపుడు 150వ జయంతి సంవత్సరం నడుస్తుంది) వివేకానందా సీజన్ కదా.

ఏమీ ప్రచురించక పోతే పాఠకులు ఏమీ ప్రచురించలేదని , ఈ పత్రిక ఎందుకు ఇంత లిథార్జీగా (బధ్ధకంగా) ఉంది, అనుకునే ప్రమాదం కూడ ఉంది. అందుకని నేను పత్రిక వారిని కూడ తప్పు పట్టను. మన పని సత్యాలను వెతుక్కుని జాగ్రత్తగా ఉండటమే.

హాన్స్ ఇండియా ప్రచురించిన, శ్రీ గోటేటి రామచంద్రరావు గారిచే బహూకరించబడిన ఈ వ్యాసం ఏక మొత్తంగా ఎక్కడైనా దొరుకుతుందేమోనని స్వామీ వివేకానంద సంపూర్ణ రచనలను గాలించాను. దురదృష్టవశాత్తు దొరకలేదు. బహుశా ఇది కొన్ని వివేకానంద సూక్తుల సమాహారం (compilation of quotes of Swami Vivekananda). వ్యాసం ఏక మొత్తం దొరికాక ఇక్కడ లింకును ఏర్పాటు చేస్తాను. పాఠకులెవరికైనా అలాంటి ఏకమొత్తం వ్యాసం లింకు దొరికితే కామెంట్లలో వ్రాయ ప్రార్ధిస్తున్నాను.

మొత్తం వ్యాసం లోని అంశాలపై సత్యాసత్యాలను వివరించాలంటే, 100 పేజీల పైనే పట్టుతుంది. రెండు మూడు ముఖ్యాంశాలను మాత్రమే ప్రస్తావిస్తాను.

Why mere book learning will not do! --అనేది కూడ స్వామీజీ యొక్క ఒక సూక్తే, కాని వ్యాసం యొక్క పేరు కాకపోవచ్చు.

వైబిరావు గాడిద వ్యాఖ్యలు

స్వామీజీది పుస్తక జ్ఞానం కానేకాదు. శ్రీవారు ఆనీబీసెంట్ ని ఆమె జ్ఞానం పరిమితమని విమర్శించినట్లుగా, శ్రీవారి పుస్తక జ్ఞానం కూడ పరిమితమైనదే. అయితే లోక జ్ఞానం అపరిమితమైనది. ఈ ఉత్తరం లో ఏం వ్రాశారో చూడండి. తేదీ 31.8.1894. వ్రాసింది, అమెరికా నుండి. ఈ సలహా ఇచ్చింది, అలసింగ కు (చెన్నై లో స్వామీజీ ముఖ్య పోషకుడు, శిష్యుడు, బ్రహ్మంగారికి సిధ్ధయ్య లాంటి వాడు). ఈ లేఖలో, తమ సంఘానికి పెద్ద పెద్ద వాళ్ళని ఆఫీస్ బేరర్లుగా తెమ్మని చెప్పాడు. 21వ శతాబ్దంలో కూడ ఇదే పధ్ధతి కదా. ప్రధాని మన్మోహన్, రాష్ట్రపతి ప్రణబ్ , మోడీ, మమతా, స్వామీజీ 150వ జయంతి ఉత్సవ సంఘాలకు big folks కదా.
" ... Or if you think proper, you get some of the big folks to be named as office-bearers of the Society, while you work in the real sense. Their name will be a great thing."
ఇప్పుడు, ఈలేఖాంశాన్ని చూడండి. తారీఖు 10.8.1899. వ్రాసింది సహశిష్యుడు రాఖాల్ కి, ఇంకొక పేరు బ్రహ్మానంద. నిచ్చెనలో నంబర్ 2. వివేకానందా గారి పత్రిక సరిగా నడవటంలేదు. చందా దారుల కొరత వచ్చినట్లుంది. పత్రిక నిర్వాహకుడు, మరొక శిష్యుడు శారదా. స్వామీజీ సలహా ఏమిటంటే, పత్రికలో ముప్పాతిక భాగం (3/4) భాగం పయస్ స్టఫ్ తో పవిత్రమైన వేదాంత విషయాలతో నిండి ఉంటే, ఎవరు ఇష్ట పడతారు? అతడిని నా పర్యటనల కథనాలను ప్రచురించ నివ్వండి. మరియు ముందుగా బాగా ప్రచారం ఇవ్వండి. అతడికి చందాదారులు నెట్టుకుంటూ వస్తారు.
"...Sarada writes that the magazine is not going well. . . . Let him publish the account of my travels, and thoroughly advertise it beforehand — he will have subscribers rushing in. Do people like a magazine if three-fourths of it are filled with pious stuff?..."
దీనిలో స్వామీజీ ప్రచార దురద అర్ధం అవుతుంది.

నేటీ స్వామీజీ ల వలెనే, నాటి వివేకానందాగారు కూడ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తప్ప ఛోటాలకు అతిథిగా ఉండేవాడు కాదు. ఈలేఖాంశం చూడండి. వ్రాసింది అమెరికానుండి. తేదీ 1894లో. పొందిన వారు, అలంబజారు మఠం లోని సహశిష్యులు.
"..I seldom live in hotels, but am mostly the guest of big people here. To them I am a widely known man. The whole country knows me now; so wherever I go they receive me with open arms into their homes ..."
ఈసారి అలసింగకి డబ్బులు పంపమని బాదుడు. 20.8.1893. బోస్టన్ వెళ్తున్నాను. అక్కడ పెద్ద లేడీస్ క్లబ్ లో మాట్లాడాలి. పొడవైన నల్ల కోట్ కొనాలి. స్త్రీల సపోర్ట్ అవసరం. చేతిలో డబ్బులు 70 పౌండ్లనుండి 60 పౌండ్లకి పడి పోతుంది. డబ్బులు పంపటానికి ప్రయత్నించు.
From this village I am going to Boston tomorrow. I am going to speak at a big Ladies' Club here, which is helping Ramâbâi. I must first go and buy some clothing in Boston. If I am to live longer here, my quaint dress will not do. People gather by hundreds in the streets to see me. So what I want is to dress myself in a long black coat, and keep a red robe and turban to wear when I lecture. This is what the ladies advise me to do, and they are the rulers here, and I must have their sympathy. Before you get this letter my money would come down to somewhat about £70 of £60. So try your best to send some money. It is necessary to remain here for some time to have any influence here.


అయ్యగారు పోనీ చిన్న హోటల్స్ లో బస చేస్తారా? ఆయన తన హోస్టులను పెద్ద హోటల్స్ లో బస ఏర్పాటు చేయమని ఒత్తిడి తెచ్చే వాడు. హూఁ ఆ వ్రూమాన్ సోదరులు నన్ను ఛోటా హోటల్ కి ఎందుకు తీసుకు వెళ్ళాలి? వ్రాసింది, శ్రీమతి ఓల్ బుల్ గారికి. తేదీ 27.10.1894. వ్రాసిన స్థలం వాషింగ్టన్ డీసీ.
"... You need not be sorry on account of the ill-treatment I received at the hands of a low class hotel-keeper at Baltimore. It was the fault of the Vrooman brothers. Why should they take me to a low hotel? ..."
ఇలా ఎన్ని వ్రాసినా స్వామీజీ లోక జ్డానం తరగదు. పుస్తక జ్ఞానం పెరగదు. ఇంకొకసారి మరి కొన్ని వ్రస్తావిస్తాను. సో, వివేకానందాకి జై!!

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.