Saturday, December 21, 2013

102 What is the link between wall paints & Katrina Kaif? గోడకు వేసే రంగులకు, కత్రినా కైఫ్ కు సంబంధం ఏమిటి?



ముందుగా సాక్షి దినపత్రికకు అభివందనలు. సందర్భం: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం, దొంతి గ్రామంలో, పందులు కాచుకునే యల్లయ్య బాబా గా మారి , స్త్రీల ను చేతబడి చేస్తానని బెదిరించి, తన కామవాంఛను తీర్చుకుంటున్న వార్తను బహిర్గతం చేసినందుకు. ఈ దొంగబాబా గారి కార్యస్థానం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి సొంత గ్రామానికి కూతవేటు దూరంలోనే ఉన్నదిట. ఏది ఏమైనా, సాక్షి పత్రికవారి వ్యాపారాల ఇతర (సు_దుర్) గుణాలు ఎ లా ఉన్నా, వారు చేసిన ఈసేవకు సహస్రాంజలులు.

చదువ దలుచుకున్నవారికి లింకు: http://www.sakshi.com/news/andhra-pradesh/once-a-pig-farmer-now-became-a-seer-90438?pfrom=home-most-viewed కు వెళ్ళటానికి క్లిక్ చేయండి.

ఇప్పుడు గోడకు వేసే రంగులకు, కత్రినా కైఫ్ కు సంబంధం ఏమిటి? సాక్షి వారి దయతో వాడుతున్న 22-12-2013 ఆదివారం, వారి పత్రికలోని ఈ చిత్రాన్ని చూడండి:


ఈ విషయంలో సాక్షి పత్రిక వారిని కాని, ఇతర పత్రికల వారిని కానీ నేను తప్పు పట్టదలుచుకో లేదు. ఎందుకంటే పత్రికలను నడపటంలో ఎన్నో బాధలు ఉంటాయి. బెర్జర్ కంపెనీ వారిని కూడ నేను తప్పు పట్ట దలుచు కోలేదు. ఎందుకంటే, నేడు వస్తువుల తయారీరంగం భారత్ లో వెనుకంజ వేస్తున్నది. ప్రతి వస్తువూ చైనానుండి డంపింగ్ అవుతున్నది. పెయింట్ల రంగంలో ఇంకా చైనా దూకుడు మొదలు కాలేదు. అయితే ఆ వైభవం ఇంకా ఎంత దూరంలో ఉంటుందో చెప్పలేము.

కత్రినా కైఫ్ తన ఫొటోని ప్రకటించనిచ్చి ఒకభంగిమలో, ఒక డ్రెస్ లో నిలబడితే కానీ మనం బెర్జర్ రంగులను కొనమా? కత్రినా బొమ్మ లేకపోతే, బెర్జర్ ప్రకటనను చూడనే చూడమా? ఆ బెర్జర్ సిల్క్ పెయింట్లలో ఉన్నట్లుగా చెప్ప బడుతున్న 100% యాక్రిలిక్ బైండర్లను, వర్ణకాలను, మనం పట్టించు కోమా? కత్రినా కైఫ్ తన ఫొటోని ప్రకటించనిచ్చినందుకు, పట్టులాంటి అనుభూతి (మీలోపలి గోడలకు) స్లోగన్ ఇచ్చినందుకు ఎంత ఛార్జ్ చేసి ఉంటుంది? ఈఛార్జీలను బెర్జర్ వారు తమ అమ్మకం ధరకు లోడింగ్ చేయక తప్పదు. బెర్జర్ పెయింట్ల అధికధరలకు ఇదికూడ కారణభూతం కావచ్చు. అప్పుడు స్వదేశీ పెయింట్లకన్నా చైనా పెయింట్లే చవకగా మారి అక్కడ నుండి డంపింగ్ ప్రారంభం కావచ్చు.

వినియోగదారులు తయారీదారీ కంపెనీకి వ్రాసినా వారు పట్టించు కుంటారని నేననుకోను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోలలో తామున్నాయి.

దురదృష్ట వశాత్తు చిన్న పరిశ్రమలు తయారు చేస్తున్న పెయింట్లు వివిధ కారణాల వల్ల నాణ్యతా ప్రమాణాలను పాటించలేక పోతున్నాయి. ఈవిషయంలో వారిని కూడ మనం తప్పు పట్టలేము.

ప్రస్తుతానికి పరిష్కారం దొరకని తెలుగువారి, భారతీయుల సమస్యలలో ఈ ప్రకటనల సమస్య ఒకటి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.