Thursday, November 28, 2013

077 Is Union Cabinet a crowd of petty clerks? కేంద్ర మంత్రివర్గం ఒక గుమాస్తాల గుంపా?
చర్చాంశాలు: bifurcation, విభజన, కేంద్రమంత్రివర్గం

కేంద్ర హోం మంత్రి శ్రీ సుశీల్ కుమార్ షిండేగారు షిండే గారు మీడియాకు ఇచ్చిన సమాచారాన్ని బట్టి, మంత్రివర్గ బృందం నివేదిక 4-12-2013 ఉదయానికి కేంద్ర మంత్రివర్గానికి చేరుకుంటుందట. అదేరోజు కేంద్ర మంత్రి వర్గం నివేదికను, తెలంగాణ బిల్లును, ఆమోదిస్తుందట.

Question ప్రశ్న:అదేరోజు కేంద్రమంత్రులు ఆనివేదికను, బిల్లును, ఎలా చదువుతారు? అభ్యంతరాలు ఏమీ లేవదీయరా! తూతూ మంత్రం చర్చ తప్ప, లోతైన చర్చ జరుగదా?జవాబు: మనం పగటికలలు కనకూడదు. ప్రస్తుతం, రాష్ట్రవిభజన విషయంలో జరుగుతున్న తంతును చూస్తుంటే, కేంద్రమంత్రివర్గం ఒక గుమాస్తాలగుంపుగా వ్యవహరించబోతుంది అనిపిస్తుంది. అంతే తప్ప ఒక బాధ్యతకల విధాన నిర్ణేతల బృందంగాకానీ, కార్యనిర్వాహక బృందంగా గానీ వ్యవహరించబోటం లేదు, అని అనుమానం కలుగుతున్నది.

Question ప్రశ్న: మీరు మరీ అతిగా స్పందిస్తున్నారేమో.జవాబు: కేంద్ర మంత్రివర్గం ఒక గుమాస్తాల గుంపు కాదు, కాకూడదు అన్నది నిజమే. అయితే అది నెహ్రూగారి రాజ్యంలో 1957 తరువాత గుమాస్తాల గుంపుగా మారిపోయింది.

Question ప్రశ్న: ఎందుకు మారింది?జవాబు: తన మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, అని నిర్ణయించే సర్వాధికారాలూ, ప్రధాని చేతుల్లోనే ఉన్నాయి. కేంద్రమంత్రివర్గ సమావేశాల్లో ఏమంత్రియైనా ప్రధానమంత్రికి అసౌకర్యం కలిగించే ప్రశ్న వేశాడూ అంటే, అతడిని ప్రధాని తొలగించే అవకాశం ఉంది. అందుచేత, మంత్రులు డూడూ బసవన్నలలాగా తయారు అయ్యారు.

Question ప్రశ్న: ప్రధానమంత్రి సములలో ప్రధముడు,అని కాదా, అర్ధం?

Answer జవాబు:


ఆ అర్ధం నెహ్రూ గారి కాలం లోనే కొడి గట్టింది. నెహ్రూగారు తనతో సములైన వారిని క్రమ క్రమంగా తొలగించుకున్నాడు. లేదా, వారంతవారు రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితులను కల్పించాడు. ప్రధాని ముందు మంత్రులు కుబ్జులు (పొట్టి వాళ్ళు dwarfs) గామారటం నెహ్రూగారి రెండవ రౌండు కాలంలోనే జరిగిపోయింది. నేడు వచ్చిన అదనపు మార్పు ఏమిటంటే,

ప్రధాని కూడ, పార్టీ అధ్యక్షురాలి దయా దాక్షిణ్యాలపై కాలం గడపవలసి రావటం.

Question ప్రశ్న: పరిష్కారాలు లేవా?

Answer జవాబు:


కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి: ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను, అన్ని పార్టీల లోక్ సభ సభ్యులు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోటం. పోటీచేసే సమయంలోనే, మంత్రులు నిర్వహించబోయే శాఖల వారీగా నామినేషన్లను స్వీకరించటం, వోట్లు వేయటం జరగాలి.

Question ప్రశ్న: పైన వ్రాసిన విషయాలు రాష్ట్ర ముఖ్యమంత్రులకూ, రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులకూ వర్తిస్తాయా?

Answer జవాబు:


అనుమానమేల? స్వర్గీయ రాజశేఖర రాజ్యంలో మన డూడూ బసవన్నలు ప్రతిదాన్నీ ఏకగ్రీవంగా ఆమోదించి, మంత్రివర్గాలకు తప్పుడు సమాచారాలు పంపి, మంత్రివర్గ నిర్ణయాలను సరిగా పరిశీలంచకుండా తప్పుడు జీవోలను జారీచేసి, లేక జారీ చేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చి, కోట్లు సంపాదించుకున్నారు. విధి వక్రించి కొందరు జైలు పాలయ్యారు. అధికారులు జైలు పాలుకావటానికి కారకులయ్యారు.

ఈ సందర్భంగా, జగన్ సంబంధిత కేసుల్లో ఇరుక్కున్న అధికారిణి రాణీ రత్నప్రభ జగన్ ని కోర్టు ఆవరణలోనే తిట్టినట్లుగా వార్తలు వచ్చాయి. మరొక అధికారిణి శ్రీలక్ష్మి గతికూడ దయనీయంగా మారింది.

నేర్చుకోటానికి పాఠాలు అందరికీ ఉన్నాయి. స్వార్ధంతో కళ్ళు మూసుకు పోటం వల్ల నేర్చుకోవాలనే కోరికే లేదు.

Added on 30.6.2014ప్రశ్న: కేంద్రంలో కాంగ్రెస్ మంత్రివర్గాలకు, బిజెపి మంత్రి వర్గాలకు ఏమైనా తేడా ఉందా?

జవాబు: అందరూ డూడూ బసవన్నలే. బిజేపీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రుల నోరు నొక్కబడి ఉన్నట్లుగా తోస్తుంది. అయితే తొందరపడి మనం ప్రిజుడైస్ లు ఏర్పరుచుకోకూడదు. శ్రీనరేంద్రమోడీకి తగినంత దిద్దుబాటు సమయాన్ని ఇవ్వాలి.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.