Thursday, November 28, 2013

078 హోమియో మందులు వాడటం, తాయత్తులు కట్టుకోటం,ఒకటేనా? Are using homoeo medicines and wearing talismans equal?

There will be no difference between using Homoeo medicines and having wearing a talisman (amulet, charm, fetish, talisman, juju, periapt ) around neck. Reason: Homeo medicines contain nothing but alcohol and sugar globules. Not correct to say that alcohol and sugar pills will activate body's inherent powers of immunity. Not to correct to say diluting something excessively will create/increase potencies. There is no such thing as a potency being created. Often, when the body's immunity mechanism works on its own, we get cured whether we use medicines or not. These cures should not be confused, as cures resulting from consuming Homoeo medicines.

హోమియో మందులు వాడటం, తాయత్తులు కట్టుకోటం,ఒకటేనా? దీనికి జవాబు, ప్రస్తుతం లభిస్తున్న సాక్ష్యాలను బట్టి 99 కరక్టే అనుకోవాలి. Can we consider that use of Homeo medicines and wearing of Amulets is same or similar? Answer for this, as per the available evidneces is 99% yes.
How far Homeo medicines are scientific? హోమియో మందులు ఎందుకు అశాస్త్రీయం?


The Theoretical and Practical Weakness of Homoeopathic Medical System is, homoeopathic medicines do not contain any medical substances except alcohol, milk sugar or sugar.

హోమియో మందుల్లో ప్రధానంగా ఉన్న సైధ్ధాంతిక లోపం ఏమిటంటే, వాటిల్లో ఔషధం ఉండదు. హోమియో సిధ్ధాంతం, ఔషధాలను అతిపల్చన చేయటం పై ఆధారపడింది. ముడి ఔషధంలో, విపరీతంగా ఆల్కాహాల్ (సారాయి)ని కలిపి టించర్లను తయారు చేస్తారు. పౌడర్ల విషయంలో నయితే, ముడి ఔషధంలో, పాలపంచదారను కలిపి తయారు చేస్తారు.
Question: Give an example for excess dilution of tinctures? ప్రశ్న: టింక్చర్లను అతిగా పల్చన చేయటానికి ఒక ఉదాహరణ ఇవ్వండి.
Answer జవాబు:

హోమియో సమర్ధకులు పొటెన్సీలు =శక్తి పెంచబడినవి, పొటెన్సైజ్ చేయటం= శక్తిపెంచటంగా అనే పదాలను వాడతారు.

ఎక్స్ అనే పొటెన్సికి అర్ధం, 10 రెట్లుకు లేక పదవ వంతుకు పల్చన చేయబడింది అని అర్ధం. మనకి హోమియోలో 3X, 6X, 12X వంటి పదాలను వాడతారు.

C సీ అనే పొటెన్సికి అర్ధం, 100రెట్లుకు లేక వందవ వంతుకు పల్చన చేయబడింది అని అర్ధం.

ప్రయోగం:
ఒక బీకర్ లో , 1 గ్రాం ఉప్పు (నేట్రంమూర్) తీసుకోవాలి. 9 గ్రాములు ఆల్కాహాల్ ను కలపాలి. హానిమాన్ గారు చెప్పినన్ని సార్లు మాత్రమే ఆ మిశ్రమాన్ని కుదపాలి. ఎక్కువ కుదపకూడదు, తక్కువ కుదప కూడదు. కుదపటానికి ఆంగ్లం: succussion = shake.

పొడులకు: 1 గ్రాం ఉప్పు (నేట్రంమూర్) తీసుకోవాలి. 9గ్రాములు పాలపంచదారను కలపాలి. హానిమాన్ గారు చెప్పినన్ని సార్లు మాత్రమే ఆ మిశ్రమాన్ని నూరాలి. ఎక్కువ నూరకూడదు. తక్కువ నూరకూడదు. నూరటానికి ఆంగ్లం: trituration = grind, pound.

ఇలా నూరగా వచ్చిన మిశ్రమంలో పదో వంతు తీస్తే అది 1X పొటెన్సీ అవుతుంది.

ఇప్పుడు ఈపదోవంతుకు అంటే .10 gram ఉప్పు ఉండే అవకాశం ఉన్న ఈ ఒక గ్రాము మిశ్రమానికి 9గ్రాములు పాలపంచదారను లేక సారాయిని కలపాలి. మళ్ళీ నూరుడు లేక కుదుపుడు. ఇపుడు వచ్చే 10 గ్రాములు మిశ్రమంలో నుండి ఒక గ్రామును బయటికి తీయాలి.
ఈ ఒక్క గ్రాములో .01 గ్రాము నేట్రంమూర్ ఉంటుంది. ఇది 2X పొటెన్సీ.
ఇంకోసారి చేయండి. .001 గ్రాము నేట్రంమూర్ ఉంటుంది. అంటే ఒక మిల్లిగ్రాము. ఇది ౩ X పొటెన్సీ.
ఇలా 12X పొటెన్సీ రావాలంటే 12సార్లు చేయాలి.
బెల్డోనా 200 వివరించండి


జవాబు:

100వ వంతుకు పల్చన చేయటం 1C అవుతుంది. 10000వ వంతుకు పల్చన చేయటం 2C అవుతుంది. పది లక్షలోవంతుకు లేక మిలియనోవంతుకు పల్చన చేయటం 3C అవుతుంది. 200C పొటెన్సీ రావాలంటే 200 సార్లు చేయాలి. కాలగమనంలో C పొటేన్సీలకు చివర్లో C తగిలించటం మానేసి వట్టి నంబర్లతో వ్యవహరించటం వచ్చింది. బెల్డోనా 200 అంటే, బెల్డోనా 200C, అంటే ప్రతిసారీ 100వ వంతు చొప్పున పల్చన చేయబడింది అని అర్థం చేసుకోవాలి.
దానిలో మందు ఉంటుందా?
జవాబు:

మీరే ఊహించండి. ఒక జీడి పప్పు పలుకును మెత్తగా నూరి దానిని ఒక గంగాళం పాయసంలో కలపామనుకోండి. దానికి జీడిపప్పు పాయసం అని పేరు పెట్టాం అనుకోండి. సాంకేతికంగా అది జీడిపప్పు పాయసమే కావచ్చు. ఆగంగాళం జీడిపప్పు పాయసాన్ని ఒక వెయ్యి మంది అతిథులకు వడ్డించామనుకోండి. ఆజీడిపప్పు నలకలు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. అదే పధ్ధతిలో బెల్లెడోనా నలక వచ్చిన హోమియో పేషెంట్లను ఊహించండి.
ఆ నలుసు వచ్చిన పేషెంటుకు వ్యాధి తగ్గుతుందా?
జవాబు:

ఏమందు శరీరంపై తన ప్రభావం చూపాలంటే, కనీస పరిమాణం మందు అవసరం లేదా? మందు కనీస కనిష్ఠ పరిమాణంలో లేకపోతే (ఉదా: 50 మిల్లీగ్రాములు) లేకపోతే అది ఎలా పని చేస్తుంది. గరిష్ఠ మోతాదులో (బాగా ఎక్కువగా) ఉంటే, సైడ్ ఇఫెక్ట్స్ ఉంటాయి అనేది నిజమైతే, కనీస మందులేకపోతే అది దేహంపై ప్రభావంచూప లేదు అనేది కూడ నిజం కావాలి.
హోమియో అణుశక్తిలాగా పనిచేస్తుంది. అణువు ఎంతసూక్ష్మ పరిమాణంలో ఉండి అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేసినట్లుగానే, పొటెన్సీలు సూక్ష్మ పరిమాణంలో ఉండి అపరిమితమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి అనచ్చు కదా?
జవాబు:

చూడండి సార్: పరమాణు విఛ్ఛేదానికి (fission) వేలకోట్లరూపాయలు ఖరీదు చేసే అణు రియాక్టర్లు కావాలి. మనం అణు పరిజ్ఞానాన్ని అమెరికానుండి, రష్యానుండి కొంటున్నాం. fusion పరామాణు సంయోగం ఇంకా కష్టం. అంత సంక్లిష్టమైనదాన్ని కేవలం హానీమాన్ గారు చెప్పినన్ని సార్లు కుదిపి లేక నూరి ఎలా సాధించటం.

ఎన్నిసార్లు కుదపాలి లేక నూరాలి అన్నదాని విషయంలో హానీమాన్ గారి వ్రాతను ఒకసారి చూద్దామా?
Materia Medica Pura (1827) p46 ....... we must act with moderation in order to avoid increasing the powers of the medicines to an undue extent by such trituration. A drop of Drosera in the 30th dilution succussed with 20 stokes of the arm at each dilution, given as a dose to a child suffering from whooping-cough, endangers life, whereas, if the dilution phials are succussed only twice, a globule the size of a poppy seed moistened with the last dilution cures it readily.

హానీమాన్ గారి మెటీరియా మెడికా ప్యూరా (1827 సంవత్సరం) p46వ పేజీ. సుమారు తెలుగు అనువాదం: ...నూరటం అతిగా చేసి మందుల యొక్క శక్తిని మనం అపరిమితంగా పెంచటంనుండి తప్పించుకోవాలి. అంటే మనం మితంగానే వ్యవహరించాలి (వివరణ: మితంగా నూరాలి లేక కుదపాలి). 30సార్లు చేసిన పల్చనల్లో, ప్రతిసారీ 20సార్లు కుదిపి తయారు చేసిన మందును కోరింత దగ్గుతో బాధ పడుతున్న ఒక శిశువుకి ఇస్తే ఆశిశువుకి ప్రాణాపాయం కలిగిస్తుంది. అదే 2 సార్లు మాత్రమే కుదిపితే, ఆ ద్రావణంతో చల్లిన గసగసం గింజ సైజు కలిగిన ఒక పంచదార గుండు ఆ జబ్బును వెంటనే నయం చేస్తుంది.

వైబీరావు గాడిద వ్యాఖ్య:
రెండు సార్లు కుదిపితే వ్యాధి నయం కావటమేమిటి, ఇరవయి సార్లు కుదిపితే శిశువు మరణించటం ఏమిటి? హోమియో మందులు తయారు చేసే ఫార్మసిస్టులు లేక కుదుపుడు యంత్రాలు ఎన్నిసార్లు కుదుపుతున్నారు లేక కుదుపుతున్నాయి ఎవరు పర్యవేక్షిస్తారు? బోడిగుండుకు బట్టతలకు ముడి పెట్టినట్లుగా, కుదుపుడు సంఖ్యకు పిల్లవాడి మరణానికి సంబంధం అంటగట్టటం సాధ్యమా?
ఎన్నిసార్లు కుదిపారో కుదుపలేదో మనకెందుకు? మందు ఉంటే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? వ్యాధులు నయమౌతున్నాయా లేదా?
జవాబు:

అందుకే తాయిత్తుతో పోల్చింది. తాయిత్తులో ఏముందో మనకెందుకు? ఒక వందరూపాయలు పారేస్తే మాంత్రికులు తాయిత్తు ఇస్తారు. అది కట్టుకున్న వాళ్ళకీ ఎంతో కొంత శాతం మందికి వ్యాధులు తగ్గుతున్నాయి. ఎవరికి తగ్గకపోతే ఫకీర్ల దగ్గరకు ఎవరు వెళ్తారు?

దీనికి జవాబు: శరీరంలో సహజరోగనిరోధక శక్తి, తెల్ల రక్త కణాలు ఉంటాయి. మనం మందు వాడినా, వాడకున్నా, హోమియోలో మందు ఉన్నా లేకున్నా, తాయిత్తుల్లో మందు ఉన్నా లేకున్నా , రోగాలు ఎంతో కొంత తగ్గుతాయి. ఆసహజ శరీర రోగ నిరోధక శక్తితో వచ్చే సత్ఫలితాలను మనం ఇంగ్లీషు మందులకు, ఆయుర్వేదం మందులకు, హోమియో మందులకు, తాయిత్తులకు, సువార్తాకూటాల ప్రార్ధనలకూ ఎలా ఆపాదించగలం? కార్య, కారణ, ఫలిత సంబంధాలను ఆపాదించాలంటే, బలమైన సంబంధం ఉండాలి. ఇంగ్లీషు మందులు, ఆయుర్వేదం మందులు విషయంలో, ఎంతో కొంత ఔషధ పదార్ధం ఉంటుంది కాబట్టి ప్రాథమిక దశలోనే వాటిని త్రోసి పారెయ్యలేము. హోమియోలో అతిపల్చన వల్ల మందు ఉండదు కాబట్టి , ఆ benefit of doubtని ఇవ్వలేం. అసలు ఏ మందు తీసుకోకపోతే, ఎంత రోగనిరోధకశక్తి ఉంటుందో, హోమియో మందులు తీసుకున్నా అంతే ఉంటుంది, తప్ప ఎక్కువ ఉండదు.
ప్రశ్న: హోమియో మందులు రోగనిరోథక శక్తిని ప్రేరేపిస్తాయంటారు

ఋజువులేవి? కేవలం సారాయి (అది కూడ కొద్ది బొట్లే), పంచదార గుళ్లకి ఆశక్తి అసాధ్యం.
ప్రశ్న: హోమియో మందులు కొత్త రోగాలను పుట్టించవు కదా?

పంచదార, స్వల్ప సారాయి తప్ప అందులో ఇంకేమన్నా ఉంటే కదా సైడ్ ఇఫెక్ట్స్ రావటానికి. ఇంగ్లీషు మందులు, ఆయుర్వేదం మందులల్లో ఎంతో కొంత మందు ఉంటుంది కాబట్టి సైడ్ ఇఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: హోమియో మందులు నెమ్మదిగా పనిచేస్తాయంటారు

పనిచేసేది హోమియో కాదు. పనిచేసేది శరీర రోగ నిరోధక శక్తి. ఇది కొందరిలో వేగంగ మరి కొందరిలో నెమ్మదిగా నిద్రలేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి మేలుకొని పనిచేయటానికి జూలు విదిలించు కుంటున్న సమయంలో, మనం హోమియో మందు వేసుకోటానే రోగం తగ్గింది అనుకుంటాం. దీన్నే కాకతాళీయం అంటారు. ఒకకాకి ఒకతాటి చెట్టు మీదవాలింది. అదే సమయానికి ఆచెట్టుపై బాగా పండి రాలటానికి సిధ్ధంగా ఉన్న ఒకతాటిపండు, రాలి కింద పడింది. కాకి అనుకుంది కదా, తన శక్తికే బలానికే, తాటిపండు రాలింది అనుకుని మీసం మలేస్తుంది. ఈవిమర్శ ఇతరవైద్యవిధానాలకు, రెకీ వంటి ప్రార్ధనా పద్ధతులకీ వర్తిస్తుంది.

Film stars, taking the incarnation of brand ambassadors, and recommending Corporate Hospitals, how far is it justifiable? You can read this in my blog post No. 249.

फिल्म स्टार्स, ब्रांड रायबारी बन कर, कार्पॊरेट दवाखानाओं को सिफारस करना कहा तक समर्धनीय होता? इस को आप ब्लाग पोस्टं नं. २४९ में पढ सकते।

సినీనటులు బ్రాండ్ ఎంబాసెడర్ అవతారం ఎత్తి, కొన్నికోట్లు ప్రతిఫలం తీసుకొని, కార్పొరేట్ హాస్పిటళ్ళను సిఫార్సు చేయటం ఎంతవరకు సమంజసం? దీనిని మీరు బ్లాగ్ పోస్ట్ నం. ౨౪౯ లో చదవగలరు.

http://problemsoftelugus.blogspot.com/search/label/249

 (ఈవ్యాసం అసంపూర్ణం. త్వరలో పూర్తి చేస్తాను. ఈలోగా పాఠకులనుండి ప్రశ్నలను ఆహ్వానిస్తున్నాను. తిట్టినా ఫరవాలేదు. అందుకే కదా, గాడిద అని చివరలో తగిలించుకున్నది.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.