Wednesday, November 27, 2013

075 అథర్వణ వేదం ప్రకారం మూత్రం పోసేటపుడు చదువ వలసిన మంత్రాలు Words to be said while passing urine, according to atharvaNa vEdaచర్చాంశాలు: వేదాలు, అథర్వణవేదం, ఆరోగ్యం, health, vEdas, atharvaNa Veda

అథర్వణ వేదం, 1వ కాండ, ౩వ సూక్తం , 9నుండి 17 వరకు మంత్రాలు.
9. విద్యా శరస్య పితరం పర్జన్యం శతవృష్ణయం
తేనా తే తత్వేశ్ శంకరం పృథివ్యానే నివేచనం బహిష్టే అస్తు బాలితి.

ఈశరీరం యొక్క పితరుడు శతవృష్ణుడు అయిన పర్జన్యుడు అని తెలుసుకో. అతడికి నీపై (శరీరంపై)శుభకామనలు ఉన్నవి. కనుక ఆయన నుండి నీపై అనుగ్రహ జల్లు కురియును గాక. శత్రువులైన సకల వికారాలు శరీరం నుండి బయటకు వెడలును గాక.

10. విద్యా శరస్య పితరం మిత్రం శతవృష్ణయం
తేనా తే తత్వేశ్ శంకరం పృథివ్యానే నివేచనం బహిష్టే అస్తు బాలితి.

ఈశరీరం యొక్క పితరుడు శతవృష్ణుడు అయిన మిత్రదేవుడు (హిందీ అనువాద కర్త ప్రాణ వాయువు అని అనువదించాడు) అని తెలుసుకో. అతడికి నీపై (శరీరంపై)శుభకామనలు ఉన్నవి. కనుక ఆయన నుండి నీపై అనుగ్రహ జల్లు కురియును గాక. శత్రువులైన సకల వికారాలు శరీరం నుండి బయటకు వెడలును గాక.

11. విద్యా శరస్య పితరం వరుణం శతవృష్ణయం
తేనా తే తత్వేశ్ శంకరం పృథివ్యానే నివేచనం బహిష్టే అస్తు బాలితి.

ఈశరీరం యొక్క పితరుడు శతవృష్ణుడు అయిన వరుణదేవుడు అని తెలుసుకో. అతడికి నీపై (శరీరంపై)శుభకామనలు ఉన్నవి. కనుక ఆయన నుండి నీపై అనుగ్రహ జల్లు కురియును గాక. శత్రువులైన సకల వికారాలు శరీరం నుండి బయటకు వెడలును గాక.

12. విద్యా శరస్య పితరం చంద్రం శతవృష్ణయం
తేనా తే తత్వేశ్ శంకరం పృథివ్యానే నివేచనం బహిష్టే అస్తు బాలితి.

ఈశరీరం యొక్క పితరుడు శతవృష్ణుడు ఆహ్లాదకుడు, అయిన చంద్రుడు అని తెలుసుకో. అతడికి నీపై (శరీరంపై)శుభకామనలు ఉన్నవి. కనుక ఆయన నుండి నీపై అనుగ్రహ జల్లు కురియును గాక. శత్రువులైన సకల వికారాలు శరీరం నుండి బయటకు వెడలును గాక.

13. విద్యా శరస్య పితరం సూర్యం శతవృష్ణయం
తేనా తే తత్వేశ్ శంకరం పృథివ్యానే నివేచనం బహిష్టే అస్తు బాలితి.

ఈశరీరం యొక్క పితరుడు శతవృష్ణుడు అయిన సూర్యుడు అని తెలుసుకో. అతడికి నీపై (శరీరంపై)శుభకామనలు ఉన్నవి. కనుక ఆయన నుండి నీపై అనుగ్రహ జల్లు కురియును గాక. శత్రువులైన సకల వికారాలు శరీరం నుండి బయటకు వెడలును గాక.

గమనిక: పైశ్లోకాల్లో శరీరం శరం (బాణంతో) పోల్చబడింది.

14. యదాంత్రేషు గవిన్ యోర్ యద్దాస్తావవధి సంశ్రుతం
ఏవా తే మూత్రం ముచ్యతాం బహిర్ బాలితి సర్వకం.

ముత్రాశయం, నాడులు, ఆంత్రం లలో ఉన్న దూషిత జలం (మూత్రం) ఈ చికిత్సతో మొత్తానికి మొత్తంగా వేగంగా ,శబ్దం చేస్తూ, శరీరం నుండి బయటకు వెడలును గాక.

प्र ते भिनद्मि मेहनं वर्त्रं वेशन्त्या इव । एवा ते मूत्रं मुच्यतां बहिर्बालिति सर्वकं । ।
ప్ర తే భినాద్మి మేహనం వత్రం వేశన్త్యా ఇవ | ఏవా తే మూత్రం ముచ్యతాం బహిర్ బాలితి సర్వకం |

శరములచేత (శలాకలచేత) -ఇవి హిందీ అనువాదకుడు వాడిన పదాలు, శరీరం లోని మూత్ర మార్గాన్ని తెరుస్తారు. గట్లు తెగినపుడు (లేక గేట్లను ఎత్తి వేసినపుడు ) జలాశయంలోని నీళ్ళు ఏవిధంగా అయితే బయటికి ఉరుకుతాయో,అలాగే శరీరంలోని సర్వ వికారములు వేగంగా బయలు వెడలును గాక.

विषितं ते वस्तिबिलं समुद्रस्योदधेरिव । एवा ते मूत्रं मुच्यतां बहिर्बालिति सर्वकं । ।
విషితం తే వస్తిబిలం సముద్రస్యోదధోరివ | ఏవా తే మూత్రం ముచ్యతాం బహిర్ బాలితి సర్వకం |

నీ వస్తిబిలమును (మూత్రమార్గాన్ని) తెరచి నపుడు , ఏవిధంగా నయితే నదులు సముద్రంలో కలవటానికి ఉరుకుతాయో అలాగా, నీ శరీరంలోని మూత్రం మొ| సర్వవికారములు వేగంగా బయలు వెడలును గాక.

यथेषुका परापतदवसृष्टाधि धन्वनः । एवा ते मूत्रं मुच्यतां बहिर्बालिति सर्वकं । ।
యథేషుకా పరాపతదవసృష్టాధి ధన్వనః | ఏవా తే మూత్రం ముచ్యతాం బహిర్ బాలితి సర్వకం |

ఏవిధంగా నయితే ధనుస్సు నుండి విడువ బడిన బాణాలు ముందుకు తీసుకు వెళ్తాయో అలాగా, నీ శరీరంలోని మూత్రం మొ| సర్వవికారములు వేగంగా బయలు వెడలును గాక.గమనిక: - వేదాలకు నేను అనుకూలుడిని గానీ, విరోధిని కానీ కాదు. మన పవిత్ర గ్రంధాల్లో ఏముందో పూర్తిగా కాకపోయినా, అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకుని ఒత్తి పరీక్షించినట్లుగా కొద్దిగా నయినా తెలుసుకోటం, భారతీయులుగా మన విధి. మంత్రాలు పని చేస్తాయా లేదా, ప్రతి సారీ ఇన్ని మంత్రాలు ఎక్కడ చదువుతాం, మొ| వ్యక్తిగత విశ్వాసాల విభాగంలోకి వస్తాయి.

ఎవరు ఏపని చేస్తారులేక చేయరు అనేవి దేశ , కాల,మాన పరిస్థితులు, సంఘం యొక్క వత్తిడులు మొ| వాటిపై ఆధారపడి ఉంటుంది.

నేను హైదరాబాదులో తిరిగిన రోజుల్లో , పెషాప్ ఖానాల్లో (మూత్రశాలల్లో) ఇటుకరాయిని పెట్టి మూత్రం పోసే మిత్రులను చూశాను.

లోకంలో ఎవరి రుచులు వారివి. మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. (మార్పులు చేసే అవకాశం ఉంది. విమర్శలకు స్వాగతం.)

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.