Sunday, November 10, 2013

051 Part 1 of Casteism కులాల కుమ్ములాటలు, భూపంచాయతీలు, స్పెక్యులేషన్లు

#051 కులాల కుమ్ములాటలు, భూపంచాయతీలు, స్పెక్యులేషన్లు.
విభజన, హైదరాబాదు, రాజధాని, విశాఖ, అనంతపురం, విజయవాడ, కర్నూలు, bifurcation

ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ కమిటీ చేసిన సిఫార్సులు ప్రాధమికంగా కొంతమేరకు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. అయితే ఆయన రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని ప్రస్తావించకుండా, విశాఖకు ఐటిఐఆర్, విశాఖకు మెట్రో వంటివి ప్రతిపాదించటం ద్వారా పరోక్షంగా , విశాఖను క్రొత్త సీమాంధ్ర రాజధానిగా ప్రతిపాదిస్తున్నట్లు కనిపిస్తుంది.

మంత్రి కిశోర్ చంద్రదేవ్ గారి కోరిక కూడ విశాఖ రాజధానియే. శ్రీచిరంజీవికి కూడ విశాఖపై అభిలాష ఉండటం సహజమే. కేంద్రమంత్రిణి పురందరేశ్వరి గారు ప్రస్తుతం విశాఖ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహించుతున్నారు. కానీ విశాఖను మరొక రాజ్యసభ సభ్యుడు శ్రీ టీఎస్ఆర్ కూడ ఆశిస్తున్నందువల్ల ఆమె విజయవాడను రాజధానిగా ముందుకు తేవాలని, తాను విజయవాడకు మారాలని, చూస్తున్నట్లు కనిపిస్తుంది. కోస్తాంధ్ర నేతలు పలువురికి, హైదరాబాదు, విజయవాడ, విశాఖల్లో విలువలు పెరిగే భూములు ఉండటం వల్ల వారికి అన్ని నగరాలూ ఆమోదయోగ్యమే. అదనంగా వచ్చే ప్యాకేజీలు, భోజనాలకు పనికి వస్తాయి. అందుకే వారు విశాఖ నుండి అనంతపురం వరకు ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే పాట అందుకున్నారు.

రాయలసీమ నేతలు పలువురికి హైదరాబాదు, తిరుపతుల్లో భూములు ఉన్నాయి తప్ప విశాఖలో లేవు. అనంతపురం వారికి బెంగుళూరు, చిత్తూరు , కడప, నెల్లూరు,వారికి చెన్నై, కర్నూలు వారికి హైదరాబాదు ల్లో భూములు ఉంటాయి. వారందరికీ విశాఖ పెడ. విశాఖ నుండి అనంతపురానికి ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే వేసినా, టోల్ గేట్ బిల్లులు ఎవరిస్తారు ? మోత మోగించే బస్ ఛార్జీలు ఎవరు కట్తారు?

స్వర్గీయ వైయస్ గారు విజయవాడ లో కొన్ని భారీ ఆస్థులు కలిగియున్నారంటారు.

ఇప్పుడిప్పుడే గూళ్ళలోంచి పక్షులు పాటలు అందుకుంటున్నాయి. ఎండోమెంట్స్ మంత్రి శ్రీరామచంద్రయ్యగారు రాజధాని రాయలసీమలోనే ఉండాలని పాడారు.

తూర్పుగోదావరిదాటి ఈశాన్యానికి వెళ్తే , 11 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పని చేసిన కులం నంబర్ 1 కి అంత ప్రాధాన్యత లేదు. హైదరాబాదులో , తెలంగాణలో కులం నంబర్ 1కి మంచి బలం ఉంది. అందువల్ల హైదరాబాదు రాజధానిగా ఉన్నంతకాలం, కులం నంబర్ 1కి పెద్ద సమస్యలు లేవు.

కులం నంబర్ 2 ముఖ్యమంత్రులుగా వచ్చి నపుడు, హైదరాబాదు భూములపై వత్తిడి పెరిగింది. భారీగా కులం నంబర్ 2 వారు నగరంలో భూములు కొనటం ఎక్కువయ్యాక, ఈ రెండు కులాలే కాకుండా, ఇతల కులాలు కూడా రంగప్రవేశం చేయటంతో, కుమ్ములాటలు అధికమయ్యాయి.

ఆంటోనీ కమిటీ సిఫార్సులలో మొదటిది అంటే, 'హైదరాబాదులో సంస్థలకు కేటాయించిన భూముల హక్కులకు భంగం కలిగించే పాతతేదీనుండి వర్తించే చట్టాలను కొత్త తెలంగాణ ప్రభుత్వం చేయకూడదు' అనేది అక్రమంగానో, సక్రమంగానో, భారీగా భూములను కూడగట్టుకున్న వర్గాలు కోరే రక్షణ ఏర్పాట్లకు సంబంధించినదే. కెసిఆర్&కో మొదటి కోరిక కూడా ఇదే, ఈవర్గాలను బెదిరించి వసూళ్ళకు దిగటం. అంటే, తెరాస ఉద్యమాలకు మూలం, సమైక్యాంధ్ర ఉద్యమాలకు మూలం, హైదరాబాదు లోని,ఈ వందల వేలాది ఎకరాల భూములే.

ముఖ్యమంత్రులు -- కులం నంబర్ 1.
నీలం సంజీవరెడ్డి.
కాసు బ్రహ్మానందరెడ్డి, సుదీర్ఘకాలం.
మఱ్ఱి చెన్నా రెడ్డి.
నెదురుమిల్లి జనార్దన రెడ్డి.
భవనం వెంకట్రామ రెడ్డి.
కోట్ల విజయ భాస్కర రెడ్డి.
మఱ్ఱి చెన్నా రెడ్డి, రెండవసారి.
కోట్ల విజయభాస్కర రెడ్డి, రెండవసారి.
శ్రీవైయస్ రాజశేఖరరెడ్డి.
శ్రీవైయస్ రాజశేఖరరెడ్డి, రెండవసారి.
శ్రీకిరణ్ కుమార్ రెడ్డి.

ముఖ్యమంత్రులు -- కులం నంబర్ 2.
శ్రీనందమూరి తారక రామారావు.
శ్రీనాదెండ్ల భాస్కర రావు, స్వల్పకాలం.
శ్రీనందమూరి తారక రామారావు రెండవసారి.
శ్రీనందమూరి తారక రామారావు మూడవసారి.
శ్రీనారా చంద్రబాబు నాయుడు, సుదీర్ఘకాలం.
శ్రీనారా చంద్రబాబు నాయుడు, రెండవసారి, సుదీర్ఘకాలం.

ముఖ్యమంత్రులు -- కులం నంబర్ ౩ (కలగూరగంప).
దామోదరం సంజీవయ్య.
పీవీ నరసింహారావు.
జలగం వెంగళరావు.
టీ. అంజయ్య.
కొణిజేటి రోశయ్య , స్వల్పకాలం.

సారం: కులం 1, మనకు 11 మంది ముఖ్య మంత్రులను ప్రసాదించగా, కులం 2 మనకు ఐదుగురిని ఇచ్చింది. కులం ౩ లో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళందరూ పూర్తి టరమ్ చేసిన వాళ్ళు కాదు.

తెలంగాణా 2వ డామినేటింగ్ భూకులానికి ఇంత వరకు ముఖ్యమంత్రి పదవి ఒక్క సారి మాత్రమే దక్కింది. వారిలో కరీంనగర్, వరంగల్ ప్రాంతీయులు, ముఖ్యమంత్రి పదవి కొరకు ఆవుర్ ఆవుర్ అంటున్నారు. నోటిదాకా వచ్చిన కొత్త తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని మరల కులం నంబర్ 1 వారు ఎగరేసుకు వెళ్తారా, అనే ప్రశ్న తప్పదు. తెరాస కాంగ్రెస్ లో విలీనం కాకుండా, స్వతంత్రంగా పోటీ చేస్తే, ఎన్నికల తరువాత వారు కాంగ్రెసుకు కేంద్రంలో మద్దతునిచ్చే ఏర్పాటు ఉన్నా, లేకున్నా, తెలంగాణలో భూకులాలన్నీ తమతమ ఐదు పార్టీల ద్వారా (కాంగ్రెస్, తెరాస, టిడిపి, బిజెపి, వైయస్ఆర్ కాంగ్రెస్) సంకుల సమరం చేయబోతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎవరు గెలుస్తారా అనే విషయంలో పెద్ద పట్టింపులు లేవు . 2014 లో కొత్త లోక్ సభలో తమకు మద్ధతు నిస్తారా లేదా అనేదే కీలకం. ఇవ్వకపోతే సిబిఐ సహకారం ఎలాగో ఉంటుంది.

సీమాంధ్రకు సంబంధించి నంత వరకు రాయల సీమ కులం కులం 1కి సోనియా ఏదో ఒక దారి చూపించ వలసి ఉంటుంది. అధిష్ఠానం దానిని గ్రహించే, శ్రీకోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపింది. ఆయన ఒప్పుకోలేదు, అనేది వేరే సంగతి.

ఇప్పుడు రాయలసీమకు రాజధానిని ఇస్తే విశాఖ, విజయవాడల్లో భూపెట్టుబడులు పెట్టిన నేతల గుండెలు ఆగిపోతాయి. If Capital of Andhra Pradesh is established in Rayala Sima, the leaders who invested in Visakhapatnam and Vijayavada will get heart attacks.

ఈసమస్యలన్నిటి నుండి, తెలుగు ప్రజలందరు బయట పడాలంటే అయిదు రాష్ట్రాలే మార్గం.

1. ఉత్తర తెలంగాణ, కరీం నగర్ , వరంగల్ మిలిటెంట్లను తృప్తి పరచటానికి.
2. దక్షిణ తెలంగాణ, కరీం నగర్ , వరంగల్ మిలిటెంట్లనుండి, నల్గొండ, ఖమ్మం, మహబూబునగర్ జిల్లాల సౌమ్యులను రక్షించటానికి.
౩. ఉత్తరాంధ్ర, విశాఖ అర్హతను గౌరవించటానికి.
4. దక్షిణాంధ్ర, ఆప్రాంతీయులు, విశాఖకో, కర్నూలుకో వలసపోయి, అక్కడ తాము బాధలు పడుతూ,ఇతరులను బాధ పెట్టకుండా ఉండటానికి.
5. రాయలసీమ. కోస్తాకు, సీమకు మధ్యలో నల్లమల కొండలు అడ్డు గా ఉండటం వల్ల. వారు విశాఖ వెళ్ళో, విజయవాడ వెళ్ళో, అక్కడ పెత్తనం చేయాలని ప్రయత్నిస్తూ, కొన్నిసార్లు సోనియా మాత అనుగ్రహం పొందుతూ, కొన్ని సార్లు పొందకుండా, ఉన్న మతి కోల్పోకుండా.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి.