Wednesday, November 6, 2013

043 Have lions on tombs సమాధులపై సింహాలు

#043 Have lions on tombs సమాధులపై సింహాలు

భారతీయులకు తమ వారసత్వ బానిసత్వంలో భాగంగా (లేక బానిసత్వ వారసత్వం) బ్రిటీష్ వాళ్ళను అనుకరించే అలవాటు ఉంది.

భారతీయ చట్టసభల స్పీకర్లకు , న్యాయమూర్తులకు, అనుమానాలు వచ్చి నపుడు, ఇంగ్లండు చట్టసభలు ఏమి చేశాయి, ఇంగ్లండు కోర్టులు ఏమి చేశాయి, అని వెతికే అలవాటు ఉంది.

దక్కన్ క్రానికల్ పత్రిక 5-11-2013 సంచికలో, Deborah Ross వ్రాసిన The joy of cemeteries అనే వ్యాసాన్ని ప్రచురించింది. ఈ వ్యాసం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. చదవదలచిన వారికి లింకు: క్లిక్ చేస్తే దక్కన్ క్రానికల్ పత్రిక 5-11-2013 వ్యాసం .

ఈవ్యాసంలో ఒక ముఖ్య అంశం: Ann Treneman అనే రచయిత్రి Finding the Plot: 100 Graves to Visit Before You Die first అనే పుస్తకాన్ని వ్రాసింది. ఈ పుస్తకరచనా పరిశోథన లో భాగంగా ఆమె ఒక వంద సమాధులను దర్శించి వాటిని లోతుగా పరిశీలించి, తాను గమనించిన విషయాలను, తన గ్రంథంలో పొందు పరచింది.

గమనించిన ఒక ముఖ్యమైన అంశం: సమాధులపై తమ పెంపుడు కుక్కల శిల్పాలకు అత్యంత ప్రాధాన్యత నివ్వటం. వాటిని సింహాలుగా వర్ణించటం.

అయితే బ్రిటీష్ వాళ్ళు తమ పెంపుడు కుక్కలకు ఇచ్చినంత ప్రాధాన్యం తమకు అత్యంత విశ్వశ్వనీయులుగా వ్యవహరించిన సేవకులకు,అనుచరులకు,ఇవ్వలేదు. వారి శిల్పాలు సమాధులపై కన్పించవు. బ్రిటీష్ ప్రధానమంత్రులకు, వారి అనుచర ఎంపీలకు , ఈపెంపుడు కుక్కల సంబంధం ఉన్నట్లు కనపడదు. కానీ భారత్ లో ప్రధానమంత్రులకు, పార్టీల అధ్యక్షులకు, అధ్యక్షురాండ్రకు, ఈ ఋణానుబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి ఎంపీలు, ఎంఎల్ఏలు, తమ ప్రధాన మంత్రులకు, ముఖ్య మంత్రులకు, పార్టీ అధినేతలకు, కుక్కల వలె భౌభౌ రక్షణ సేవల నందించటమే కాక గుళ్లు గోపురాలూ కట్టిస్తూ ఉంటారు. కానీ అనుచరులకు తమ నేతలపై ఉండే అభిమానం, నేతలకు తమ అనుయాయులపై ఉండాల్సిన కృతజ్ఞతలో ప్రతిఫలించదు. అంతా వన్ వే ట్రాఫిక్. క్రికెటర్లు, సినీతారలు, వంటి సెలబ్రిటీల విషయంలోనూ ఇదే తంతు.

అయితే రాజకీయనేతలలో బహుకొద్ది మందికి మాత్రమే ఢిల్లీలో ఎకరాలకొద్దీ ప్రభుత్వ స్థలాల్లో సమాధులను నిర్మించుకునే భాగ్యం కలుగుతుంది. ఉదా: మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు గారికీ భాగ్యం కలుగలేదు.

ఎకరాలెకరాలలో తమ సమాధులను నిర్మించుకునే భాగ్యం కల్గు నేతలు, నిర్మించే వారసులు, అనుయాయులను మరువరాదు. తమకు కుక్కల్లాగా వ్యవహరించిన వారిని , గుళ్లు గోపురాలూ నిర్మించిన వాళ్ళను చరిత్రలో శాశ్వత స్థానం కల్పించక పోతే ఎలా? తమ సమాధులపై, లేక ప్రక్కన, వారి కనీసం బస్ట్ స్థాయి విగ్రహాలను ప్రతిష్ఠించి, వారిని సింహాలుగా వర్ణిస్తూ ఫలకాలను, కవితలను వ్రాయించాలి.

కృతజ్ఞత అనేది కుక్కలకే కాకుండా యజమానులకు కూడా ఉండ వలసిన గుణం.

ముగింపు: ఉర్దూలో ఒక సామెత ఉంది. جان حای تو جحان حے۔ . జాన్ హయ్ తో జహాన్ హయ్. దీని అర్ధం, ప్రాణం ఉంటే కదా, విశ్వం ఉండేది. గీత: జాతస్య మరణం ధృవం. పుట్టిన వాడు గిట్టక తప్పదు అని గీత చెప్పినా, ప్రాణం విలువ ప్రాణానిదే. సమాధుల పాత్ర ఊహాజనితమైనది. మన నాయకులు ఉర్దూ సామెతకే ఎక్కువ విలువ ఇచ్చి వేలకోట్లు పోగు చేసుకుంటున్నారు. వైయస్ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకా జీవించి ఉండి కత్తెరల నాడిస్తున్న నేతలు సుజ్ఞానవంతులే కదా.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.