Monday, October 28, 2013

#029 వీరేశలింగం గారి కవితా శైలి

వీరేశలింగం గారి కవితా శైలి. ఈక్రింది పద్యాలు, అభాగ్యోపాఖ్యానము అని 1898 లో ప్రచురించ బడిన 18 పేజీల గ్రంధం లోనివి.

సందర్భము


పాండవులు వనవాసం చేస్తున్నారు. ధర్మరాజు విచారంతో ఉన్నాడు. ఆయనను ఊరడించటానికి, ఒక పరిహాసకుడు, ఈకథను ఆయనకు చెప్పాడు. ఇందులో కులాల ప్రస్థావన, పాండవుర కాలం నాటిది లేక, భారతం తన లిఖిత స్వరూపాన్ని సంతరించుకున్న గుప్తుల కాలం నాటిది కావచ్చు. వీరేశలింగం గారి 1898 నాటికి చాతుర్వర్ణ్యాల ప్రస్తావన కొంత ఉన్న ప్పటికీ ఈవ్యంగ్యం భారత ధర్మరాజును సంతోష పెట్టటానికి ఉద్దేశించినదే అవుతుంది. అభాగ్యోపాఖ్యాన కాలం నాడి సమాజంలో వివిధ వర్గాల లక్షణాలు వర్ణించారు.

బ్రాహ్మణులు

వెలయాలి నింటనే విడియించి దానిచే తిట్టులు తన్నులు తినెడి వారు,
తల్లి పోయిననాడు దాని ఇంటనే యుండి పని యున్నదిదె వత్తుననెడి వారు,
కన్నెరికము చేయు కార్యంబునకు పూర్వులార్జించు మాన్యమ్ము లమ్ము వారు,
భోగకాంతలు గాక పొరుగు వారల భార్యలను జేరి సౌఖ్యంబు గనెడు వారు,

విలువ సారాయి సీసాల కొలది త్రావి
ఒడలు తెలియక వీధుల బడెడి వారు
నగుచు మర్యాదలను గాంచు రనవరతము
బ్రాహ్మణోత్తములా దివ్య పట్టణమున.

క్ష త్రియులు

కురుబలముం గనుంగొనుచు కోటి తురంగ జనంబుతోడ ను
త్తరుడరదంబు డిగ్గి పురి తట్టునఁ బారియుఁ గ్రీడి ప్రేరణన్
మరలగఁ బోరికేగుటకు నవ్వుచు నుందురు పోటుబంటులై
పిరికి తనంబునం బురిని బేరు వహించిన రాజ పుంగవుల్.

వైశ్యులు


బియ్యమున వడ్లు బెడ్డలు పెక్కు కలిపి
నేతి లో నంటి పండ్లను నెరయ పిసికి
తప్పు తూనిక తూచుచు తక్కువగను
కొలుచు చునుకోమటులు సొమ్ము కూర్చు కొండ్రు.

శూద్రులు


కూట సాక్ష్యంబు బ్రాహ్మణ గురులవలన
బాగు గానేర్చు కొని పాటు పడుట మరచి,
జూదములు దొంగతనముల శూరలగుచు,
శోభ కాంతురు పురలోన శూద్ర జనులు.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.