Saturday, October 26, 2013

#026 జగన్ ప్రశ్నకు ఏమి బదులిస్తారో

కెసీఆర్ & కో దృష్టి హైదరాబాదుపై తాము కొనసాగించ దలుచుకున్న జులుము పై మాత్రమే ఉన్నది, తెలంగాణ ప్రజల సంక్షేమం పై ఏ మాత్రం లేదని , ఆయన తరచుగా కేంద్రంపై ప్రకటిస్తున్న యుధ్ధాలను బట్టి అర్ధం చేసుకోవచ్చు

ఆయనకు తెలంగాణా ప్రజల సంక్షేమంపై దృష్టి ఉంటే , హైదరాబాదును కనీసం తాత్కాలికంగానైనా Union Terriotory కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీరించి గ్రామీణ తెలంగాణా పై దృష్టి నిలిపే వాడు. కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం హైదరాబాదుకు అదనపు నిధులను ఇచ్చి ఉండేది. తెలంగాణా గ్రామీణులకు హైదరాబాదులో ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవి. హైదరాబాదును అభివృధ్ధి చేసే బాధ్యత తప్పటం వల్ల తెలంగాణా గ్రామాలకు అధిక నిధులను కేటాయించుకోవచ్చు.

సంగారెడ్డి, కామారెడ్డి, జహీరాబాదు వంటి పట్టణాలను __ ముంబాయి , సూరత్, అహమ్మదాబాదు నుండి హోల్ సేల్ వస్తువుల దిగుమతి, తెలంగాణ, సీమాంధ్ర నగరాలకు పునఃపంపిణీ కేంద్రాలుగా పెంపొందించుకుంటే, ఇప్పుడు హైదరాబాదు అందిస్తున్న పన్ను ఆదాయాలను ఆపట్టణాలు అందించేవి. ఈపని పాత కొబ్బరి తోట స్ధానంలొ క్రొత్త కొబ్బరి తోట వేయటం లాగా కొంత క ష్టమే అయినా కాపు పెరిగేది.

తరువాత స్నేహ పూర్వక పరిస్థితులను నిర్మించుకొని, హైదరాబాదును విలీనం చేసుకోటానికి వీలయ్యేది.

జగన్ తన 26-10-2013 ప్రసంగంలో అధికంగా రాజకీయ స్వార్ధాన్నీ, వ్యూహాలను చొప్పించినా , ఒక చక్కని ప్రశ్నను లేవనెత్తాడు.
అమ్మా... సోనియా మీరు రాజీవ్ గాందీని పెళ్లి చేసుకున్నారు, ఆతరవాత 15 ఏళ్ల వరకు భారత పౌరసత్వం రాలేదు, 1983లో భారతీయురాలిగా మారిపోయారు, మాలో ఒకరయ్యారు, అలా అయి 30 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు పార్లమెంటులో ఓ బిల్లు పెట్టి మీరు ఇటలీకి పోవాలి, ఇండియాలో ఉండొద్దంటూ బిల్లు పెట్టితే ఒప్పుకుంటారా ... 30 ఏళ్లుగా కలిసి ఉన్న మీకే వెళ్ళి పొమ్మంటే బాధగా ఉంటుంది కదా, 60 ఏళ్లుగా కలిసి ఉంటున్న తెలుగువారిని విడిపొమ్మంటే ఎంత బాధగా ఉంటుందమ్మా, అదేదో 80 రోజులుగా తెలుగువారు తమ కంఠ ఘోషతో చెపుతున్న వైనం చూడట్లేదా అమ్మా సోనియా..
... అంతే కాదు, సోనియా తన రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న ఏపి విభజనను అడ్డుకోకుండా ఉంటే, రేపు తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్రం, కర్ణాటక ఇలా ఒకటేమిటి, ఎక్కడ తనకు ప్రయోజనం ఉంటే అక్కడ సోనియా ఇదే పని చేస్తుంది సోనియా, అప్పుడు మీకు తెలిసి వస్తుంది . ...

Approximate English translation of the above, for the benefit of those who do not know telugu language

Oh mother! Sonia, you have married rAjIv GAndhi. Till 15 years thereafter, you did not have Indian citizenship. You have become an Indian in 1983. You have become one among us. Thereafter, 30 years have elapsed. If a bill is introduced in Parliament now, and you are asked to go back to Italy and that you cannot stay in India, will you accept? ... If you feel anguish and pain for being asked to leave India just for a 30 year stay, what should be the quantum of pain if telugu people who have been living together for 60 years, are made to split? Telugu people have been expressing this indignation exhausting all their voice for the last 80 days, you have not seen this?
...If the bifurcation of A.P. which Sonia is undertaking for her selfish purpose, is not stopped, tomorrow she will will split Tamil Nadu, Bengal, Maharashtra, Karnataka , why one only, Sonia will do the same thing wherever she gets some advantage from it. ...

పరిశీలన
_____


ప్రాధమికంగా సీమాంధ్ర ప్రజలకు తాము భౌతిక చిన్న రాష్ట్రాలుగా విడిపోవటానికి వ్యతిరేకత ఉన్నట్లు కనపడదు. ఇతరులు తమను బలవంతంగా , రాజ్యాంగ మరియు సహజ న్యాయ సూత్రాలను పాటించ కుండా , తెలుగుప్రజల , రాష్ట్ర శాసన సభ ఏకాభి ప్రాయంతో సంబంధం లేకుండా, లేడికి లేచిందే పరుగులాగ, వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తూ రుద్దుడు నిర్ణయాలు తీసుకోటమే తెలుగు వారి ప్రధాన సమస్య.

2004 కి ముందు కాంగ్రెస్ కు ఢిల్లీ పీఠం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఠికానా లేదు. వైయస్ పాదయాత్రలు చేసి, ఉచిత విద్యుత్ వాగ్దానాలు చేసి , సోనియాకు ఢిల్లీ పీఠం, తనకు హైదరాబాదు పీఠం సంపాదించుకున్నాడు. సోనియా అనుకుంటు ఉండవచ్చు.__ తాను గులాబీ కండువా వేసుకోవటానే, తనకు కొండంత బలం వచ్చిందని, కెసిఆర్ తనకు కుడిభుజం అని. అదే నిజమైతే 2009లో , తెలుగుదేశం తెరాస ఏకమైనా తెలంగాణాలో కాంగ్రెస్ ను ఎదిరించలేక పోయారు. తెలంగాణా ఇస్తామనే వాగ్దానం వల్ల కొంత అదనపు బలం సమకూరినా, రాజశేఖర్ సంక్షేమ కార్యక్రమాలే నిజమైన బలంగా పని చేసింది. తెరాస పై పక్షపాత బుధ్ధి వల్ల వారు హైదరాబాదులో టాంక్ బండ్ ను విధ్వంసం చేసినా, వందలాది బస్సులను బూడిద చేసినా, బలవంతపు వసూళ్ళకు దిగినా, భూ సెటిల్ మెంట్లకు దిగినా , కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోక పోగా తెరాసను విలీనం చేసుకోటానికే బేరాలు చేసింది.

బీజేపీ కి కూడా ఇదే జబ్బు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుసుకునే కోరిక లేదు. బీజేపీ నేత శ్రీమతి సుష్మా స్వరాజ్ కు కూడా ఇదే దుర్ గుణం అంటుకున్నట్లు కనిపిస్తుంది. ఆమె సీమాంధ్ర లో పర్యటించలేదు. ఆమ్ ఆద్ మీని కలవలేదు. కానీ ప్రత్యేక తెలంగాణా ఇస్తామని లోక్ సభలో చెప్తుంది. ట్వీట్లు చేస్తుంది. దీనికి సీమాంధ్ర బిజేపీ నేతలు ఆమెను కలిసి నిరసన తెలుపరు. వారిని ఏదో నీరసం ఆవరించివట్లుంది.

కేంద్రంలో యుపియే అవినీతి గొప్పదా ? చంద్రబాబు అవినీతి గొప్పదా ? జగన్ అవినీతి గొప్పదా ? తెలుగు ప్రజలు తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సోనియా & her slaves, తమ నియంతృత్వ పకడల ద్వారా , తెలుగు ప్రజలు జగనే మేలు అనుకొని, YSRC ని గెలిపించే స్థితిని తెచ్చుకుంటున్నారు. తాము గెలిచినా జగన్ గెలిచినా కేంద్రంలో తమకు లాభమే నని అధిష్ఠానం అనుకుంటూ ఉండవచ్చు.

జగన్ కు బెయిల్ ఎందుకు లభించిందా అని Ms. సోనియా బాధ పడే రోజులు వస్తాయేమో.

ఈ సారి జగన్ కు సభను నిర్వహించుకునే అవకాశాన్ని కెసిఆర్ & కో ఇవ్వకపోవచ్చు.

జగన్ ను ఎలా అధిగమించాలా అని శ్రీ చంద్రబాబు జుట్టు పీక్కోవాల్సి రావచ్చు.

సారాంశం
_____


ఎల్లకాలం, తెలంగాణ ప్రజలను సమైక్యంతో బంధించ వలసిన అవసరం లేదు. వారి నేతలు న్యాయమైన తమ ప్రతిపాదనలను సీమాంధ్ర ప్రజల ముందుంచి ఉభయ తారకమైన పరిష్కారాలను వెతకవచ్చు. కేవలం సోనియా అండతోనో, సుష్మా అండతోనో, యుధ్ధాలు చేసో, అగ్ని గుండాలను సృష్టించో , బస్సులను కాల్చో, ప్రజలను రెచ్చకొట్టో, తాము ఒక నియంతృత్వ సామ్రాజ్యాన్ని సాధించుకోవచ్చని ఎవరైనా అనుకుంటే అది ఆత్మ వంచన అవుతుంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.