The above picture is the image of PanDavula Metta (or Mitta), in Peddapuram Town, Near Samarla Kota, East Godavari District, Andhra Pradesh, India. Photo is courtesy Shri Kumar 3031, Wikipedia.org. Many Towns and Villages in India have stories and legends associated with the Pandavas of Vyasa Mahabharata. The above image is believed to be a Cave, visted by Bhima, the Second brother, among the Pandavas. It is possible-probable that Pandavas might have visited South India, during their 12 year exile to Forests, after having lost their game of dice with the Kauravas. Anyway, that part is mythological, for which more historical evidences may be necessary. In the meantime, we can share the beliefs of locals.
Peddapuram is also reported to be the Native Place of the Memorable Telugu Poet Yenugu Lakshmana Kavi (also Enugu Lakshmana kavi) who is believed to have lived in the 17th and 18th Centuries. Inter Alia (among other things), Yenugu Lakshmana Kavi translated the 300 verses of the 7th Century Sanskrit Poet, whose work is known as 'subhAshita tri Sati' (Engl: 300 verses of good sayings). The first is nIti Satakam (100 verses of Ethics). The second is Sringara Satakam (100 verses of Love), and the third is vairAgya Satakam (100 verses of Renunciation). These three hundred verses, I have translated into English Prose a few years back, with original verses in Roman Script, with their English Gist. Links for those who are interested in the Sanskrit verses:
Click here to go to bhartruhariyb, to get full text of Sanskrit verses of Niti Satakam.
Click here to go to Sanskrit Sringara Satakam verses, at Sringarasatakamyb.blogspot.com.
Click here to go to Vairagya Satakam Sanskrit version of Bhartrihari, at vairagyasatakam.blogspot.com.
While building a database for storing and searching Telugu verses, I found that Telugu verses of Bhartrihari's Vairagya Satakam by Yenugu Lakshmana Kavi were not added by me. PDF books with verses in Telugu Script, and gist in Telugu language+script, are available both for purchase and free to download. But they are not in search-able digital form. Hence, I have tried to type the 100 verses of Yenugu Lakshmana Kavi's VAiragya Satakam in Telugu script, and post them here. 50 I could complete in this Part 1. Remaining 50, I shall post in a few days.
I shall also provide English Script for these verses, together with English gist. If there are any major variations between Bhartrihari's Sanskrit original source, and Lakshmana Kavi's Telugu verses, I shall try to write here my perceptions.
శ్రీరమణ ధృత మృదంగ గ ShrI ramaNa dhrita mridanga ga-
భీర ధిమింధిమి నాద భేద క్రమయో -bhIra dhimin dhimi nAda bhEda krama yO-
గ్యారంభ గుంభ నటన -gyArambha gumbha naTana
శ్రీరంజిత సుఖనివేశ శ్రీ సోమేశా. -ShrI ranjita sukha nivEsA, ShrI SOmESA !English Gist:
This verse is a prayer to Lord sOmESa (Shiva) of peddApuram, the locale of our poet Shri yEnugu lakshmaNa kavi. Lord Shiva is a Great Dancer, his dance called 'Shiva tAnDavam'. It is believed that Lord VishNu (=shri ramaNa, above) provides percussion drums to Lord Shiva. Mridanga is the drum which makes subtle gentle rhythmic sounds (=dhimin dhimi). nAda bhEda krama yOga = Variations in rhythmic cycles, and the percussion and Shiva's dance play in harmony , hence 'yOga'. Shri ranjita refers to the Glory of the Dwelling of Lord sOmESa, which is described as 'sukha nivESa (=comfortable home). See the depth of the first verse itself. (This verse is in an independent Telugu verse, not used by bhartruhari in his Sanskrit original.)
ybrao-a-donkey muses: This type of verses the Europeans, Ameicans and ANZ do not have because, most English Poets were alcoholics, drug-addicts, paedophiles, with the exception of Deviants like John Milton and Christopher Maslowe. They have no time to think of, or dream of divine Tunes or Dances.
కలిత వతంసితేందు కలికాశిఖిచే విలసిల్లి చిత్తభూ
శలభము నుగ్గు చేసి శుభ సార దశాగమునన్ వెలుంగుచున్
బలవదపార మోహ భర బాఢతమోహ భరంబు సేయుచుం
తెలివి వెలుంగు పొల్చు శివ దేవుడు యోగి మనోంబజంబులన్.
చం. విసిగితి దుర్గ దుర్విషయ విభ్రమయుక్తిఁ గులాభిమానమున్
బసచెడ సేవ చిసితి విపన్నుడనై పరగేహ సీమ వా
యసము వలెన్ భుజించిఁ ప్రయత్నము నిష్ఫలమై నశించె సం
తసపడ వుగ్ర కర్మ పిశునత్వము చూపెదవాశ యేటికిన్.
చం. నిథి యను శంక భూతలము నిచ్చలు త్రవ్వితి నావచే మహో
దధిన్ తరియించితిన్ శిఖరి ధాతువు లూదితి రాజు గొల్చితిన్
వ్యథగొని ఘోరమంత్ర జప మర్ధి నొనర్చితి గవ్వయైన ఏ
విధమునన్ పొందనైతిన్ కద వే ముద మందగదే దురాశతో.
చం. పలువలు పల్కు మాటలొక భంగి సహించితి బాష్పవారి లో
పలనె హరించి శూన్యమగు భావమునన్ వెడ నవ్వు నవ్వితిన్
పొలుపరి విత్త జాడ్యహత బుధ్ధుల కంజలి చేసితిం కటా
తలకొక ఇంకన్ ఏపనికి తార్చెదు నన్ను దురాశ నీ విటన్.
మ. నళినీ పత్రగతాంబు చంచలము లెన్నం ప్రాణముల్ వీనికై
కళిత ప్రజ్ఞత మేము చేయని యసత్కార్యంబు లేదేమియున్
బలవద్ విత్త మదాతిరేక జనితాపస్మారులైనట్టి లు
బ్ధుల మ్రోలన్ నిజ సద్గుణ స్తుతి మహాదోషంబు కావించుటన్.
మ. క్షమచే కాదవమానమోర్చుట, మహా సంతుష్టిచే కాదు గే
హమునం దైన సుఖంబు మానుట తపో వ్యాసక్తిచే కాదు దు
ర్దమ శీతోష్ణజయంబు కాదు హరుపై ధ్యానంబు విత్తంబు పై
అమరెన్ మాకు మునీంద్ర కృత్యములు లేవాసత్ఫలాభ్యున్నతుల్.
కం. భోగానుభవంబు తపో bhOgAnubhavambu tapO
యోగము కాలంబు చనుటయును ఘనతృష్ణో yOgamu kAlambu canuTayunu ghana trithNO
ద్యోగవిరామము లేదహ -dyOga virAmam lEdaha-
హా గురుత వహించి తృష్ణ అలజడి తెచ్చెడిన్. -hA ! guruta vahinci trishNa alajaDi teccheDin !
English Gist: Days of Enjoyments have elapsed. Days of Penance and YOgA have left. The Workshop of Great Lust-Thirst has no recess/remission. The Lust is bringing Great Tumult.
కం. కరచరణాద్యవయవముల kara caraNadya vayamula
భరముడిగేన్ వళులు మొగముపై నిండారెన్ bharamuDigen vaLulu mogamu pai ninDAren
శిరస్సెల్లఁ తెల్లవారెను Sirassella tella vArenu
దరిమాలిన తృష్ణ యొకడె తరుణత పూనెన్. dari mAlina trishNa yokaTe taruNata pUnen.
English gist: Limbs etc. organs have lost their stamina and strength. Folds and wrinkles arose on face. Hair grayed. Endless lust-thirst alone holds its youthfulness.
శా. భోగాపేక్ష తొలంగెఁ పూజ్యత చెడెన్, పోరాని మిత్రుల్ మహా
భాగుల్ సెల్లిరి, దండ మూత కొనుటల్ ప్రాప్తించెన్ కన్నుల్ తమో
రోగఛ్ఛన్నములయ్యె దేహము జరారూఢంబు ప్రాణానిల
త్యాగాపాయ భయంబునన్ వడకెడున్ తానెంత సమ్మూఢమో.
చం. కలిత మనోరథంబులుదకంబులు తృష్ణలు భూరివీచికా
వళులనురాగముల్ మకర వర్గము మోహ వితర్కముల్, సుడుల్
పులుగులు కాగ ధైర్య ఫల భూజముఁ కూల్చు దురాశపేరి పు
ష్కల నది దాటి నిత్యసుఖసంపదఁ కాంతురు యోగిపుంగవుల్.
విషయత్యాగ విడంబనము
చం. భవమున పుట్టు సత్క్రియ శుభంబని చూడుము, పుణ్య కర్మ గౌ
రవ ఫలమైన సంపద కరంబు భయావహ మెన్ని చూచినం
ప్రవిమల పూర్వ పుణ్య సముపార్జిత చందన ముఖ్యభోగ వై
భవమును భోగశీలుర కపాయము చేయను వృధ్ధి పొందెడున్.
చం. ఉరుగతి తోడ ఏగు తడవుండియు భోగము లట్టివానిఁ తా
నరుడు పరిత్యజింపడు, కనంగన తద్విరహంబు భిన్నమే
పురుషు విభోగమున్ విడిచి భూరి మనోవ్యధలాచరించు నా
పురుషుడే భోగమున్ విడిచి పొందు నిరామయ శాంతి సౌఖ్యముల్.
ఉ. అనఘులు బోధపూర్ణులు మహాత్ములు భోగ నిధానమౌ మహా
ధనముఁ పరిత్యజింతురు గత స్పృహులై పరమాద్భుతంబుగా
మునుపును పొందకిపుడును ముట్టక యింకను చెందలేక నె
మ్మనంబున తోచు భోగముల మానగజాలము మేమొకింతయున్.
చం. గిరిగుహలన్ వసించి వృష కేతన చింతన మాచరించు స
త్పురుషుల సమ్మదాశ్రుకణ పుంజముఁ క్రోలుచుఁ అంకశయ్యలం
దిరవుగ నుండు పక్షులు సమిధ్ధ మనః కృత సౌధ వాపికా
వర వన కేళి శీలురగు వారల కాయువె విక్షతంబగున్.
చం. నిరతము తిండి బిచ్చమగు, నీరస మద్దియు నొక్కపూటయే
ధరణితలంబు సెజ్జ, నతతంబున తోడు శరీర మాత్రమే
చిరుగుల చీర తున్క కమి చేత నమర్చిన బొంత పుట్టమీ
కరణి మెలంగినన్ విషయ కాంక్ష లొకింతయుఁ పాయవక్కటా.
చం. స్తనములు మాంస పిండములు, చక్కని బంగరు కుండలంచు నా
సనము కఫాలయంబు తుహిన ద్యుతిల్యమటంచు మూత్రభా
జన జఘన స్థలంబు కరి చారు శిరస్సమ మంచు కామినీ
జన మలినాంగముల్ సుకవి చాతురి వర్ణన కెక్కెన్ ఇమ్మహిన్.
ఉ. కాముకులందు మేన్ సగము కాంతకు నిచ్చెను శంకరుండె ని
ష్కాములలోనఁ పంచశరశాసనుకన్న పరుండు కల్గడు
ద్దాము మనోజ బాణ విష దగ్ధులు తక్కిన మూఢు లోపరే
సీమల భామినీసుఖముఁ చేరి భుజింపఁ పరిత్యజింపగన్.
చం. తెలియక నాశ హేతువగు తీవ్ర తరానలకీల లోపలన్
శలభము చొచ్చుకాక, మతి చాలక మీనము గాలపుం గొనం
గల పిశితంబు తామెసగుఁ కాక, యెరింగియు మేము దుఃఖదో
హల వనితా సుఖంబు విడనాడము, మోహ మహత్త్వ మెట్టిదో.
ఉ. శీతర వారి త్రావు వడఁ చెందినవాడు క్షుధార్తుడిష్ట మృ
ష్టాతత భక్ష్య మాంస కలితాన్నము సాపడు, మన్మథాగ్ని తా
పాతురుడైన వాడు జవరాలికవుంగిటిలోన చేర్చుఁ ఈ
రీతిని రోగ శాంతి కర కృత్యము భోగ మనంగ చెల్లునే.
చం. పొడువులు మాడువుల్, ఘనులు పుత్రులు, పెక్కులు రమ్య సంపదల్
పడతుక చారుశీల, యెలప్రాయమటంచు నరుండు మూఢుడై
కడు జగమెల్ల శాశ్వతముగా కొని సంసృతి బంది లోపలం
బడుఁ ఇది మాయయంచు మతి మంతుడు తావిడుచున్ సమస్తమున్.
యాచనా దైన్య దూషణము.
ఉ. ఆకొని యేడ్చు లేఁ చిరుత లన్నముకై తనకొంగు లాగ పె
ల్లాకట సోలచుండెడు నిజంగన దుర్దశ చూడడేని యా
చ్ఞాకలనా విభంగ భయ సంభృత గద్గద శూన్య కంఠుడై
చేకొని దేహి యంచడుగ చేరునె కాలిన పొట్ట కెవ్వడున్.
శా. మాన గ్రంధి విభేదన క్షమము శుంభధ్ ధైర్య గాంభీర్యము
ఖ్యానేక ప్రియ సద్గుణాంబుజ సముహ జ్యోత్స్న లజ్జా లతా
హాని స్ఫార కుఠార ధార జఢరం బన్నట్టి పెన్ బాన యౌ
రా (ఔరా) నిండారదు దైన్య వృత్త్య భినయ ప్రాగల్భ్యముం చూపుచున్.
చం. అవని సురావళీ హుత హతాశన కోమల ధూమ ధూమలా
ప్రవిశద వాటి యందు వన భాగము నందు, కపాల పాణియై
భవనములందు భిక్ష కొని ప్రాణము తాల్చుట కొంత మేలు బాం
ధవులను చేరి వేడి కడు దైన్యము చెందు కంటె మానికిన్.
తే.గీ. పూత గంగోర్మి శీకర శీతలములు
లలిత విద్యాధరాఢ్య శిలా తలములు
హిమగిరి స్థానములు నశియించె నొక్కొ
నరులు నిందిత పరపిండ నిరతులగుట.
మ. ఇలఁ కందంబులు మూలముల్ మడిసెనో, యేళ్ళింకినో, కొండలన్
ఫలముల్ నారలు వృక్ష శాఖల యెడన్ పాడయ్యెనో చూడ, కే
వల దుఃఖాప్త మితార్ధ గర్వ పవన వ్యానర్తిత భ్రూల స
త్ఖల భూపాస్యము లర్ధి చూచెదరె, భ్రాంత స్వాంతులై యాచకుల్.
చం. ప్రవిమల కందమూల ఫల పంక్తుల జీవికఁ చేయుముర్విపై
నవసవపల్లవంబుల నొనర్పుము పానుపు లెమ్ము పాపనా
టవికిని పోవుము అయ్యెడ దృఢ ద్రవిణామయ దర్వికార గౌ
రవవికలోక్తులై మెలగు రాజుల పేరును చెప్ప డెవ్వడున్.
చం. కలవు ప్రచేళిమంబులయి, కావల లోపల పండ్లు మ్రాకులం
కలవు పవిత్ర వాహినుల కమ్మని శీతల వారి పూరమున్
కలను చివుళ్ల పాాన్పు లవి, కైకొన నేరక దీనులై ధనా
ఢ్యులగవనిన్ వసించి నరులోలి సహింతురు తీవ్ర తాపమున్.
చం. ధనపతి మ్రోల నిల్చి కడు దైన్యము చూపెడు వార లెవ్వరో
ఘన విషయాభిలాష మతి కల్పన మీరిన నీచలెవ్వరో
మొనయుచు వారి దుష్ట దినముల్ మది నవ్వి తలంతుఁ ఆత్మచిం
తనము తుదిన్ గుహాంతరమునన్ రుచిరోపలతల్పశాయినై.
మ. వరసంతోష నిరంతర ప్రముదితుల్ వర్ణింప నెవ్వారు ని
ర్భరముల్ వారికి మోదముల్ కలకలుబ్ధస్వాంతులౌ వారికిన్
విరతిన్ పొందదు తృష్ణ, యెవ్వనికి కావింపబడెన్ బ్రహ్మచే
స్థిర సంపన్నిధి మేరు వాత్మ ధృత లక్ష్మీకంబు నా కిష్టమే.
మ. అభివర్ణింతురు యోగిపుంగవులు, భిక్షాహారమున్ వీతదై
న్యభరా క్రోథ మదాభిమాన జడిమాహంకారమున్ సత్సుఖ
ప్రభవంబ శ్రమలభ్య మూర్జిత మవార్యంబ(బు) అక్షయంబుగ్రదుః
ఖభిదాదక్షము శంభుసత్రము మహా కైవల్య సత్పాత్రమున్. 30.
చం. బలగుణ రూప భోగ కుల భర్మ కళేబర శాస్త్ర మానముల్
బలి ఖల రుగ్జరాచ్యుతి నృపాలయ ప్రతివాది దైన్య సం
కుల భయయుక్తముల్ నరులకున్ భువి నిర్భయంబులే
నెలకొని యెన్ని భంగులను నిర్భయమొక్క విరాగమే సుమీ.
చం. జననము చావుచేత, శమ సౌఖ్యము కాంతలలీలల చేత, జ
వ్వనము జరార్తి చేత, గుణ వర్గము కూళల చేత, రాజు దు
ర్జనముల చే, ముదంబు ధనరాగముచే, సిరులెల్ల లేమి చే,
వినిహతి చెందు, దోష పరి విధ్ధము కాదె తలంప నెద్దియున్.
శా. ఆది వ్యాధి శతంబుచే, జనుల ధైర్యంబెల్ల నిశ్శోభమై,
బాధింపబడు సంపదల్ కలుగుచో, ప్రత్యక్షమై ద్వార సం
రోధంబేమియు లేక దుర్దశలు చేరున్, మృత్యువున్ మర్త్యులన్
వేధించున్ విధి యేది సుస్థిరముగా నిర్మించె, తర్కించినన్.
ఉ. తుంగ తరంగ భంగములతో తులతూగు విలోల భోగముల్,
భంగపడున్ నిమేషమునఁ ప్రాణము కొన్ని దినంబులే సుఖం
బంగనలందు నిట్లు మది నారసి బ్రహ్మ విచార యత్నము
ప్పొంగుచు చేయగా వలయు, భూరి జగత్ ధ్ధిత బుధ్ధమ పండితుల్.
చం. జలదము లోని క్రొమ్మెరుగు చాయలు భోగపరంపరల్, మహా
నిల పరి ఘట్టితాబ్జదళ నీర తుషారము జీవితంబు, చం
చల తరముల్ పయోభిమత సౌఖ్యము లీగతి నాలకించి స
భ్యులు పరమాత్మ యోగమున బుధ్ధి ఘటింపుడు, సత్వరంబుగన్.
ఉ. ఆయువు వీచి చంచలము, యౌవనమ ల్పదినోచితంబు, పు
పుష్పాయుధ కేళి జన్య సుఖమ స్థిరము, అర్ధము వాంఛ వోలె సా
పాయము, భోగముల్ మెరపు లట్లు భ్రమించు , భవాబ్ధి లంఘనో
పాయము బ్రహ్మ చింతనము పాయక సేయుడు సజ్జనోత్తముల్.
ఉ. కాయము గుంచి గర్భనరకంబున నుండుట దుఃఖ, మాది యం
దాయత లోచనా విరహ మబ్బుట దుఃఖము జవ్వనంబునం
పాాయక భామినీ హసన పాత్రము దుఃఖము వృధ్ధ భావమిం
కేయెడ కల్గు సౌఖ్య లవమించుకయే, జనులార చెప్పుడీ.
చం. కడు వెరపించుచున్ ముదిమి కద్దరి బెబ్బులి మాడ్కి నున్నదె
క్కుడు పగ దాయలంబలె తెగుళ్ళు శరీరము నొంచుచున్న వె
ప్పుడు చను భిన్న కుంభ జలంముం బలె వాయువు లిట్టులయ్యుఁ తా
రుడుగక మానవుల్ దురిత మోలి నొనర్చుచు నున్న వారహో.
చం. తరళ తరంబులున్ బహు విధంబులు భోగము లీదురంత సం
సరణము వానిచేఁ పొడమె, చాలు పరిభ్రమణంబు వానికై
నకులు మదీయ భాషణము నమ్మెదరేని శమ ప్రసన్నమై
పరగు మనంబు, శంభు పద పద్మ యుగ ప్రవణంబ సేయుడీ.
ఎందు వసించి ధన్యుడు విధీంద్ర ముఖామర కోటి నెల్ల నెం
చుం తృణ మట్ల దేని, చవి చూచుటచే రసహీన భావముం
చెందు జగత్ ప్రభుత్వమును చెప్పగ రాని యనంత కేవలా
నందము దానియందు మది నాటుము మానుము నీచ భోగముల్.
కాల మహిమా వర్ణనము Delienation of the Greatness of Time and Fate
మ. అది మేలైన పురంబు, పూజ్య చరితుండారాజు, రాణ్మండలం
బది పార్శ్వంబున, ఆవిదగ్ధసభ వారబ్యాస్య లత్యుధ్ధతం
బది రాజన్యక మద్ది వంది నికరంబా గాధలున్ సర్వమున్
కదలం చేసిన కాలమూర్తికి నమస్కారంబు సత్కీర్తికిన్.
శా. ఏ యింటన్ వసియించు పెక్కు లొకడా యింటన్ ప్రవర్తించు నే
చాయన్ నిల్చు నొకండు పెక్కు రచటన్ సంధిల్లు ఒండైన లే
దా యింటన్ మది నిట్లె రాత్రి దిన రూపాక్ష ద్వయిం చిమ్ముచున్
చేయుంకాలుడు క్రీడ లోక ఫలక శ్రేణికిన్ నృశారంబులన్.
చం. అనుదినమున్ నశించు పరమాయువు సూర్యుని రాకపోకలన్
ఘన బహు కార్య భారముల కాలము పోవుట కానరాదు సం
జనన జరా మయంబులును, చావును చూచి, భయంబు లేదు, దు
ర్జన భువనంబు మోహమదిరా రస విహ్వల మయ్యె అయ్యయ్యో.
ఉ. వచ్చిన రాత్రులే తిరిగి వచ్చుట, వోయిన వాసరంబులే
వచ్చుటెరింగి గూఢ తర వర్తనులై పునరుక్త కార్యముల్
నిచ్చలు సేయుచున్ జనులు, నిశ్చల వృత్తి చరింతు రీభవా
భ్యుచ్చయ రీతిచే చెడి, కుబుధ్ధులు సిగ్గు వహింప రెంతయున్.
ఉ. శ్రీ రమణీయ శంభు పద చింత యొనర్చుట లేదు, గోపుర
ద్వార కవాట పాటన సుధర్ము చేయుట లేదు, సుందరీ
హారికుచోరులబ్ధి కల నైన నెరుంగము, మాతృ యౌవనో
దారవనీ కుఠారములమై జనియించిన వారమిమ్మహిన్.
చం. వలనుగ విద్య నేర్చి, ప్రతి వాదుల గెల్చుట లేదు, కుంభి ని
ర్దళన నిశాత ఖడ్గముల దైవత లోకమునందు కీర్తులన్
నిలుపుట లేదు, చారు రమణీ మధు రోష్ఠము క్రోల లేదు, ని
ష్ఫలమయి జవ్వనం బరిగె, పాడు గృహంబున దీపముం బలెన్.
చం. వినయ విశేష హృద్య లగు విద్యలు నేర్చుట లేదు, నీతిచే
ధనమును కూర్చ లేదు, తలి తండ్రుల సేవయు చేయలేదు చ
క్కని చిగురాకు బోండ్ల బిగి కౌగిలియున్ కలనైన లేదు, గొ
బ్బున సమయంబు కాకులకు పోలె గతించె పరాన్న భుక్తులన్.
ఉ. తాలిమి మాలి కన్న తలి తండ్రులతోడ మెలంగు వారలం
కాలము కోలు పుచ్చెనని కానరు ఘోర జరాభరార్తులై,
తూలుచు నిత్య సన్నిహిత దుర్దశులై సిక తాలగన్నదీ
కూల మహా మహీజములకున్ సరి వత్తురు మూఢమానసుల్.
ఉ. ఆయువు నూరు వత్సరములందు సగంబు నశించె నిద్రచే
నా అరలో సగంబు గతమయ్యెను, బాల్య జరా ప్రసక్తిచే
పాయక తక్కినట్టి సగ పాలు గతించు, ప్రయాస వృత్తిచే
ఆయువు చంచలంబగుడు, ప్రాణుల కెట్లు సుఖంబు చేకురున్.
ఉ. బాలకుడై క్షణంబు, యువ భావయుతుండయి కొంతకాలము
ద్వేల దరిద్రుడై క్షణము, విత్త సమన్వితుడై క్షణంబు, జీ
ర్ణాలస గాత్రుడై నటుని యట్లు నటించి తుదిన్ నరుండు యా
మ్యాలయ నామమైన తెర యందు జొరంపడు సత్వరంబుగన్. 50
To come back and continue adding / deleting / modifying.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.