311 బగ్గింగును పారదర్శకంగా చేస్తేనే బాగుంటుంది.
చర్చనీయాంశాలు: 311, బగ్గింగు, వ్యక్తిగత రహస్యాలు, అవినీతి, నేరప్రవృత్తులు, ఎన్.ఎస్.ఏ.,అమెరికా తత్వం, जसूसी, गुप्तचर्य, गड्कारी
మన కేంద్ర పరిశ్రమల మంత్రి, రాజ్ నాథ్ సింగు గారి ముందర బిజెపి మాజీ అధ్యక్షులవారైన శ్రీ గడ్కారీగారు తిరిగి వార్తలలోకి ఎక్కారు. వారి ఇంటిలో రహస్యంగా సంభాషణలను వినే ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అమర్చబడినట్లుగా గుర్తించ బడినట్లు ఒక టీవీ ఛానెల్ వారు ప్రకటించటం తో రచ్చ మొదలయింది.
అది ఊహాగానమే నని, శ్రీగడ్కారీ గారన్నారు.
అది అమెరికా జాతీయ భద్రతా ఏజెన్సీ ఎన్.ఎస్.ఏ పనే నని, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యస్వామి గారన్నారు. యుపిఎ ప్రభుత్వకాలంలోనే ఇది జరిగిందని వారి భావన.
ఇది ప్రభుత్వం పని ఐనా ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి పలు కారణాలున్నాయి.
1. కేంద్ర మంత్రిగారు ఉగ్రవాది కాకపోయినా, సర్వాంతర్యామి, ఆమ్నీ ప్రజెంట్ గా ఉగ్రవాదం నేడు తయారయిన నేపథ్యంలో, మంత్రుల ఇళ్ళల్లో కూడ భద్రత కొరకు నిఘా అవసరమే.
2. దేశమంతా అవినీతి ప్రబలి ఉన్న నేటి నేపథ్యంలో కేంద్రమంత్రులు వీటికి అతీతులు కారని ఇపుడు పెండింగులో ఉన్న పలు కేసులే ఋజువు చేస్తున్నాయి. శ్రీగడ్కారీ గారి ముంబాయి కంపెనీల పైన కూడ పలు ఆరోపణలు వచ్చాయి. వాటిపై అసలు విచారణలు జరుపుతారో, జరపరో, జరిపితే ఎపుడు జరుపుతారో తెలియదు. ఇపుడు పరిశ్రమలో శాఖలో భారీ కుంభకోణాలేమయినా జరిగితే, అలవాటు ప్రకారం మీడియా, ప్రతిపక్షాలు, శ్రీగడ్కారీని కూడ అనుమానించే అవకాశం ఉంది. అపుడు కేసులు పెట్టి, లై డిటెక్టర్లు, నార్కో ఎనాలిసిస్ వంటి దుష్టాతిదుష్ట పధ్ధతులతో హింసించే కన్నా, ముందస్తు నిఘా మేలే కదా. కాకపోతే ఈ నిఘా పారదర్శకంగా జరగాలి. నిఘాను, నిఘా ద్వారా సేకరించే సమాచారాన్ని దుర్వినియోగం చేయనీయకుండా పలు ఏర్పాట్లు ఉండాలి.
3. నరేంద్ర మోడీ గారు నిఘాల విషయంలో, చాల ఖచ్చితంగా ఉంటారని ప్రతీతి. దృష్టాంతం కావాలంటే, గుజరాత్ లో ఒక ఆర్కిటెక్ట్ అయిన యువతిపై, ఆమె బెంగుళూరులో ఉన్న సమయంలో గుజరాత్ ప్రభుత్వం ఆమె మొబైల్ సంభాషణలపై నిఘా పెట్టిన విషయం జాతీయ మహిళా కమీషన్ దాకా వెళ్ళింది. ఆ అమ్మాయి తండ్రి నా కోరికపైనే గుజరాత్ ప్రభుత్వం నిఘా పెట్టిందని చెప్పి గుజరాత్ ప్రభుత్వాన్ని గట్టెక్కించాడు. ఈ స్నూపింగ్ పై, ఇతర రాష్ట్రాలలో జరిగిన స్నూపింగులపై, యుపిఎ ప్రభుత్వం ఒక జడ్జీగారి చేత దర్యాప్తు చేయించుకుందామనుకుందిగానీ, ఏజడ్జీ కూడ ముందుకు రాలేదుట. ఈలోగా యుపీఎ ప్రభుత్వం పడిపోయింది. శ్రీనరేంద్రమోడీ గారి భార్య జశోదా బెన్ గారి పైన కూడ నిఘా ఉందనే అనుమానాన్ని ఒక మీడియా సంస్థ వ్యక్తం చేసింది. ఇది అన్ స్క్రూప్యులస్ మీడియానుండి ఆమెను రక్షించటానికి కావచ్చు. ఈనిఘా విషయంలో, శ్రీ నరేంద్రమోడీ గారికి, రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి గారు ఆదర్శం కావచ్చు. నా పాలన గురించి (సీత గురించి కూడానా, కైకేయి గురించి కూడానా , భరతుడి గురించి కూడానా) ప్రజలేమనుకుంటున్నారో కనుక్కోమని గూఢచారికి ఫర్మాయిస్తేనే, వాడు ఒక మద్యోన్మత్త రజకుడు , ఏడాది పాటు లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకోటానికి నేను వెర్రి రాముడంటోడి వాడిని కాదులే అని కూసిన వార్తను తెచ్చి రాముడి చెవిలో వేశాడు.
4. మీడియా ప్రకారం, కేంద్రమంత్రుల కోరికపై, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వారు ఇప్పటికే కేంద్రమంత్రుల కార్యాలయాలలో, చిమ్ముతున్నారుట. ఈనిఘాను, కేంద్రమంత్రుల ఇళ్ళవరకు పొడిగించటం అవసరమే. కానీ పారదర్శకంగా జరగాలి.
కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే వార్తట. భూతపూర్వ ప్రధాని, మన్మోహన్ సింగు గారు మునిముచ్చులాగా మౌనంగా ఉంటే వార్త కాదు. శ్రీవారు నేటికి నోరు తెరిచారు.
"It's time that both Gadkari and also the BJP and government come clean on the issue." ... "if indeed the minister was spied on, at whose instance was it done?"
తెలుగు సారం: గడ్కారీ, మరియు బిజెపి మరియు ప్రభుత్వం, ఈవిషయం పై శుభ్రంగా బయట పడాల్సిన సమయం ఆసన్నమయింది. ...నిజంగా మంత్రి గారు గూఢచర్యానికి గురి అయిఉంటే, ఎవరి ఆనతి పై అది జరిగింది.
हिन्दी संग्रह: गड्कारीजी , बिजॆपी, और सर्कार, इस विषय पर, साफ बाहर आने का समय हॊ गया है। ... अगर मंत्रीजी जासुसी की गया था, तो उस गुप्तचर्य किस् के अनुरोध या प्रेरण से वह किया गया?
వైబీరావు గాడిద అభిప్రాయం
మన్మోహన్ గారి దృష్టిలో బిజెపీ నేతలే ఒకరిపై ఒకరు నిఘా ఏర్పాట్లు చేసుకుంటున్నారా? చేసుకుంటే అది మంచిదే. ఒకే వస్తువును పలువురు ఆశించినపుడు (ప్రధాని పదవి), అది ఒకరికే దక్కినపుడు, అందులో కూడ జూలియస్ సీజర్ కి రోమన్ సామ్రాజ్యం చిక్కినట్లుగా , శ్రీ నరేంద్రమోడీగారికి భరతఖండ సామ్రాజ్యం చిక్కినపుడు, సహజంగా ఈర్ష్యాసూయలు జన్మించ వచ్చు. ఇలాంటివి రామాయణం , భారతం వంటి పురాణాల్లోనే కాకుండా, అశోకుడి కాలంలో, ఢిల్లీ సుల్తానుల కాలంలో, మొఘలుల కాలంలో, విజయనగర రాజుల కాలంలో కోకొల్లలు గా జరిగాయి. అగ్రాసనాధిపతి కూడ అభద్రతా భావానికి గురి కావచ్చు. సమీపస్థులు కూడ అభద్రతాభావానికి గురి కావచ్చు.
ఏది ఏమైనా, పారదర్శకంగా జరిగినంతకాలం ముందస్తు నిఘాలు, దేశానికి మేలే చేస్తాయేమో. ఇంకా చాలా పరిశోధనలు జరిగితే కాని సత్య దర్శనం అవదు.
ఇందులో కొన్ని విషయాలను రీఎడిటింగు చేయాలని నాకు స్ఫురిస్తున్నది. విజ్ఞుల సూచనలను ఆహ్వానిస్తున్నాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.