312 పని నీతిని వృధ్ధి చేసే పధ్ధతి ఇది కాదు.
చర్చనీయాంశాలు,Topics for discussion: 312,work ethic,పని నీతి,పరిపాలనా శాస్త్రము, నిర్వహణా శాస్త్రము, వెంకయ్యనాయుడు
పెట్టుబడిదారీ యజమాని మైండ్ సెట్ Mindset of a Capitalist पूंजीवादी के मानसिकता
శ్రీ వెంకయ్య నాయుడు గారు నిర్మాణ్ భవన్ ను మొదటి సారిగా జూన్ 12 నాడు తనిఖీ చేశారుట. ఇపుడు జులై 28 నాడు ఉదయం 9.10 గంటలకు తిరిగి మరల తనిఖీచేశారు. కొందరు దిగువ స్థాయి ఉద్యోగులు ఆలస్యంగా వచ్చారుట. పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ లేట్ గా వచ్చే వారికి ఆరోజు జీతం కట్ చేయమనిఆజ్ఞాపించారుట. భశుం.
ఈ వార్త మీడియా విలేఖరులు స్వయంగా తమ కళ్ళతో చూసి వీడియో తీసింది కాకపోవచ్చు. కేంద్రమంత్రిగారికార్యాలయం వారు విడుదల చేసిన హ్యాండ్ అవుట్ ఆధారంగా అందరూ ఒకే వార్తను ప్రచురించనట్లు కనిపిస్తున్నది. మంత్రిగారు తాను తనిఖీకి వెళ్ళిన ప్రతిసారీ, మీడియాని తమ వెంట తీసుకెళ్ళాలని, నేను వ్రాయటం లేదు. లేదా, మీడియా నిర్మాణ్ భవన్ గేటు దగ్గరే, కింకరుల్లాగా మంత్రిగారి తనిఖీ సందర్శన పిలుపు కోసం గేట్ల దగ్గర పడిగాపులు కాయాలని నేను వ్రాయటం లేదు. కొత్త పాలనలో, హ్యాండ్ అవుట్ల ప్రాధాన్యత గురించి మాత్రమై హైలైట్ చేయ దలుచుకున్నాను.
ఈ వ్యాస లక్ష్యం రాత్రి మందు కొట్టి ఆలస్యంగా నిద్ర లేచో, లేక సకల విధాల స్వంత వ్యాపారాలను చక్కపెట్టుకొని, కార్యాలయాలకు అలవాటుగా ఆలస్యంగా వచ్చే లేజీ బాబులను డిఫెండ్ చేయటం కాదు. తనకు క్లబ్బుకి వెళ్ళే పనిలేదనో, లేక ఇతర విమానాల్లో ఎగిరే పని లేకనో, ఉన్నట్లుండి మెదడులో సునామీ వచ్చి ఆఫీసుకి 9.10, తనకు శాల్యూట్ కొట్టి , గుడ్ మార్నింగ్ చెప్పి స్వాగతం చెప్పటానికి ,అందరూ టైలు కట్టుకొని (అవసరం అయితే బొట్లు పెట్టుకొని, హారతి పళ్ళాలు, పూర్ణకుంభాలు పట్టుకొని మేళతాళాలతో) సిధ్ధంగా ఉండలేదని విరుచుకుపడే పెట్టుబడిదారీ వ్యాపారవేత్తల, పారిశ్రామికవేత్తల మైండ్ సెట్ కి సంబంధించినది. నేటి కాలంలో పెట్టుబడి దారులకీ, రాజకీయనేతలకీ, మతాధిపతులకీ, భేదాల రేఖలు చెరిగిపోయాయి.
శ్రీవెంకయ్య నాయుడుగారు కానీ,శ్రీ నరేంద్రమోడీ గారు గానీ,శ్రీరాహుల్ గాంధీ గారు గానీ, ఇంకోళ్ళు గానీ తమ ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లలో డిస్ క్లోజ్ చేసే ఆస్తులను బట్టి వారిని వాణిజ్యవేత్తలు గాగానీ, పారిశ్రామికవేత్తలుగా గానీ వర్గీకరించలేము. ఎందుకంటే , వాటిల్లో విదేశాల్లోని రహస్య ఖాతాల వివరాలు ఉండవు. స్వదేశంలోని బినామీ ఆస్తుల వివరాలు కూడ ఉండవు.
పెట్టుబడిదారీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, పెట్టుబడిదారు దృష్టిలో కార్మికుడు|నౌకరు|ఉద్యోగి|మేనేజరు (సీనియర్, జూనియర్, ఛీఫ్, అసిస్టెంట్, డెప్యూటీ, అసిస్టెంట్ జనరల్, డెప్యూటీ జనరల్,ఛీఫ్ జనరల్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంటు, సీఈవో, సీఎఫ్ వో, మొ|| సర్వవిధ ప్రిఫిక్సులు, తోకలతో కలిపి) అనే వాడు|ఆమె ఒక కూలీ. వాళ్ళు పనిగంటల్లో గొలుసుతో కట్టేసిన గేదెలాగా, కుక్కలాగా పడి తాము ఎప్పుడు వెళ్ళినా గుంజ దగ్గర కనిపించాల్సిందే.
జంతువులైనా, మనుష్యులైనా, మనం వారికి అప్పగించిన పనులను హృదయపూర్వకంగా చేసినపుడే సరియైన పరిమాణంలో, సరియైన నాణ్యతతో quantity + quality मात्रा और गुणवत्ता ఫలితాలు వస్తాయి. వివాహ జనిత ధర్మ శృంగారానికి , డబ్బులిచ్చి కొనుక్కునే వ్యభిచార శృంగారానికీ ఎలాటి తేడా ఉంటుందో, శ్రామికులు స్వఛ్ఛందంగా చేసే పనికీ, కొరడాతో కొట్టపడి చేసే పనికీ, తేడా ఉంటుంది. కొరడా అనేది ప్రత్యేక పరిస్థితులలో, ఉరిశిక్షలాగా rarest of the rarest సంఘటనల్లో వినియోగించాల్సిందే కానీ, తరచుగా వాడాల్సినది కాదు. ఉద్యోగిని స్వేఛ్ఛగా వదిలేస్తే, అతడామె పని ఎగ్గొట్టటానికి చూస్తారు అనేది పెట్టుబడిదారీ మైండ్ సెట్ ముఖ్య లక్షణం. నిర్వహణాశాస్త్రంలో Management Science प्रबंध विञान దీనిని థీరీ ఎక్స్ थीरी ऎक्स theory X అనచ్చు. దీనికి విరుధ్ధమైనది థీరీ వై थीरी वै theory Y . ఈసిధ్ధాంతాన్ని మనం కేవలం పుస్తకాల్లో ఉండే విషయంగా కొట్టెయ్యరాదు. ఎందరో పరిశోథకులు దీనిని పరిశ్రమల్లో , కార్యాలయాల్లో అధ్యయనాలు చేశాకే ఈ సిధ్ధాంతాలు వచ్చాయి.

కేంద్ర మంత్రిగారు 28.07.2014 నాడు నిర్మాణ్ భవన్ కి ఉదయం 9.10 కి వెళ్ళారు, బాగానే ఉంది. మరి రోజూ వెళ్ళి గేటు దగ్గర కాపలా కాస్తారా? ఆలస్యంగా వచ్చిన వారికి జీతాలు కట్ చేయమని ఆదేశాలిచ్చారు. బాగానే ఉంది, ఎన్నాళ్ళని కట్ చేస్తారు? ఒకమనిషి ఆలస్యంగా రావటానికి, అతడామె చేతిలో లేని కారణాలు కూడ ఉంటాయి. బస్సులు, రైళ్ళు సరిగా నడవకపోవచ్చు. ట్రాఫిక్ ను క్లియర్ చేసుకుంటూ లాఠీకర్రలతో కొట్టుకుంటూ ముందుకు వెళ్ళటానికి, అందరికీ పోలీసు కన్వాయిలు, పైలెట్ కార్లూ ఉండవు. ఇంటి దగ్గర ఎంత ముందుగా బయలు దేరినా, ఎక్కడో అక్కడ బ్రేకులు పడుతూ ఉంటాయి. దీనర్ధం ఉద్యోగులు రోజూ లేటుగా రావచ్చని కాదు, లేదా వారు లేటుగా రావటాన్ని ప్రోత్సహించమనీ కాదు. ఒకవేళ ఆలస్యంగా వచ్చే ఉద్యోగిని తీసేసి ఇంకొకరిని నియమించినా, ఆకొత్తవాడు కూడ ఆలస్యంగా రావచ్చు. మన నగరాల్లో ఎవడు ఎపుడు జులుస్ తీస్తాడో, రాస్తారోకో చేస్తాడో తెలియదు. కర్మ కాలి, మంత్రిగారు లేఖ ఉన్నతాధికారి తనిఖీకి వచ్చిన రోజే , ఉద్యోగి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కు పోవచ్చు. రోజు చక్కగా కార్యాలయానికి వస్తూ, తనకు కేటాయించిన పనిని సరియైన పరిమాణంలో నాణ్యతతో పూర్తిచేసే ఒక ఉద్యోగి ఆతనిఖీలో చిక్కి ఒకరోజు జీతాన్న్ని కోల్పోతే ఆతడి మనస్థితి ఎలా ఉంటుంది? భవిష్యత్ లో అతడు టైమ్ డిసిప్లెయిన్, డ్రెస్ డిసిప్లెయిన్ గల యాంత్రికమైన పనివాడుగా మారితే మారవచ్చు గానీ, అతడినుండి మనం ఉత్సాహం, నిజాయితీ తోకూడిన పనిని మనం ఆశించలేం.
నేను ఒకసారి ఒక మిత్రుడు జెంషెడ్ పూర్ (ఝార్ ఖండ్) లో సీరియస్ గా ఉండి వైద్యశాల ఐసీయులో ఉండగా వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై కోల్ కత్తా మార్గంలో బెంగాల్లోని భద్రక్ అనే స్టేషన్ వద్ద రోజంతా రైలును ఆపేశారు. ఏంటయ్యా అంటే కారణం, అక్కడి అధికార పార్టీ, ప్రతిపక్షపార్టీ ఇరువురు పోటాపోటీగా ఇచ్చిన బంద్. (ఆంధ్రప్రదేశ్ లో బంద్ లు ఎక్కువగా ఒంటి పూట బంద్ లు. సాయంత్రానికి ప్రదర్శకులు అందరూ మందు కొట్టి సినిమాలకు వెళ్తారు.) ఫలితంగా జెంషెడ్ పూర్ కి 18 గంటలు ఆలస్యంగా వెళ్ళాను. అదృష్ట వశాత్తు, ఆమిత్రుడి ఆరోగ్యం కుదుట పడింది.
ఉద్యోగులనుండి పనితీసుకునే సరియైన పధ్ధతి
quantity + quality मात्रा और गुणवत्ता పరిమాణం మరియు నాణ్యతపై దృష్టి పెట్టాలి. కనీస పరిమాణం & నాణ్యత మరియు గరిష్ఠ పరిమాణం & నాణ్యత ల మధ్య సగటు ఉత్పత్తిని మనం సగటు ఉద్యోగి నుండి ఆశించ వచ్చు. అది కనుక రాకపోతే, కారణాలను అన్వేషించాలి. నైపుణ్యాలు లేక పోతే, శిక్షణ ఇప్పించాల్సి వస్తుంది. పనిస్థలం, పని సాధనాలు సరియైనవి లేకపోతే, సరియైన వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఉద్యోగులు స్వయం చోదితులు కావాలే తప్ప ఎద్దులను ములుగర్రతో పొడిచినట్లుగా , వారు ఇతరుల చేత పొడువబడే పరిస్థితులు రాకూడదు. ఎవరైనా ఒక ఉద్యోగి మానసిక స్థితి సరిగా లేకపోతే,అతడిక మానసిక చికిత్స చేయించ వచ్చు. ఇతరులను చూచి సోమరులయ్యే వారు ఒక పది శాతం మంది, స్వతహాగా సోమరులైనా వారు ఒక పది శాతం మంది ఉండ వచ్చు. వీరిపైన ప్రత్యేక దృష్టి పెట్టి పనిని రాబట్టుకోవటం జాతి క్షేమం దృష్ట్యా అవసరమే, కానీ దానికి మనం శాస్త్రీయ పరిస్థితులను ఉపయోగించాలి. బెదిరింపులకు గురియైనపుడు ఉద్యోగులు, కార్మికులు, తాము శిక్షనుండి తప్పించుకోవటానికి ఏరకమైన ప్రవర్తనను చూపించాలో, ఆప్రవర్తనను చూపిస్తారే కానీ, పని చేయరు. అలా ప్రవర్తించినవారు పనిష్ మెంటును తప్పించు కోటమే కాక, రివార్డులు కూడ పొందుతారు. కానీ పరిమాణం, నాణ్యత మెరుగు పడవు. బయోమెట్రిక్ అటెండెన్సు సిస్టం పెట్టినా మొదట్లో కొంత అభివృధ్ధి కనిపించినా, తరువాత మెషిన్ల దృష్టిలో పడకుండా, పని ఎగవేత జరగదనా?
The sequel for this, you can see at blog post No. 373. దీని కొనసాగింపును మీరు బ్లాగ్ పోస్ట్ ౩౭౩ వద్ద చూడవచ్చు. इसके सीक्वॆल को आप, हमारे ब्लाग पोस्ट नंबर ३७३ में देख सकते है। http://problemsoftelugus.blogspot.in/search/label/373.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.