309 భారత్ స్వలింగ సంపర్క వివాహాలను అనుమతించ వచ్చా?
చర్చనీయాంశాలు: 309, స్వలింగసంపర్కం, వివాహాలు
అమెరికా, ఫ్లారిడాలోని ఒక కోర్టు, అక్కడ స్వలింగ సంపర్కాల వారు చేసుకునే వివాహాలపై నిషేధాన్ని విధిస్తూ చేసిన చట్టాన్ని కొట్టివేసింది.
భారత్ లో , ఈనాటికి అమలు లో ఉన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, స్వలింగ సంపర్కం నేరం. ఇంక, ప్రస్తుతానికి వారి వివాహాన్ని అనుమతించే ప్రసక్తి రాదు.
అయితే భారత్ లో కూడ, రహస్యంగా స్వలింగ సంపర్కానికి పాల్పడే వారి సంఖ్య మరీ తక్కువేమీ లేదు. నేరమైనా, కాకపోయినా , సమాజం నవ్వినా, ఏడ్చినా, ఎవరు కోరేవి వారు చేసుకుంటూ పోతూనే ఉంటారు.
భారత్ లో స్వలింగ సంపర్కీయులు , సంఘాలు ఏర్పాటు చేసుకుని తమ హక్కులకై పోరాడుతూ ఉండటం, దానికి కొంత అంతర్జాతీయ మద్ధతు లభించటం గమనార్హం.
భారతీయ సంప్రదాయంలో అసలు వివాహం అంటే ఏమిటి?
భారతీయ సంప్రదాయంలో సంతానాన్ని కోరుతూ స్త్రీపురుషులు సమాజం ఆమోదం పొంది సహజీవనం చేస్తూ, లైంగిక సంబంధాలను ఏర్పరుచుకొని, ధర్మార్ధ కామ మోక్షాలనే నాలుగు విధాల పురుషార్ధాలను (జీవిత లక్ష్యాలు లేక గోల్స్) సాధించటాన్ని వివాహం అనచ్చు. నిర్వచనంలో కొన్ని తేడాలు ఉన్నా, ప్రాధమికంగా సంతానాన్ని పొందటం అనే లక్ష్యం కీలకమైన అంశం.
భారతీయ వివాహాలు పవిత్రమైనవే. కానీ స్వలింగ సంపర్కాన్ని అపవిత్రము అనలేము. అసలు ఏవి పవిత్రము, ఏవి అపవిత్రము అనేవాటికి నిర్వచనాలులేవు.
స్వలింగ సంపర్క వివాహాలలో, సంతానాన్ని పొందే అవకాశం లేదు. దత్తత తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దత్తత అనే సెకండరీయే కానీ ప్రైమరీ మార్గం కాదు.
కాబట్టి, వివాహాన్నీ, స్వలింగ సంపర్కాన్నీ ఒకే గాట కట్టేయటం కుదరదు.
అందువల్ల స్వలింగ సంపర్కీయులు ఏర్పరుచుకునే లైంగిక లేక సహజీవన సంబంధాలను వివాహం అనే కన్నా, స్వలింగ సంపర్క జీవనం లేక స్వలిసజీవనం అనే పేరు పెట్తే బాగుంటుంది. వారి స్వలిసజీవనానికి కూడ వైద్యులు, సామాజిక శాస్త్రజ్ఞులు సూచించే జాగ్రత్తలకు లోబడి చట్టబధ్ధ మరియ సమాజ హితకరమైన గుర్తింపు నివ్వటం తప్పని అనలేము.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయం ఎలా ఉన్నా, స్వలింగ సంపర్కీయులు స్నేహ పూర్వక పధ్ధతులతో, పరస్పరామోదంతో, హైజీన్, మొ|| జాగ్రత్తలు తీసుకుని శాంతి భద్రతలకు, ఇతరుల హక్కులకు భంగం కలిగించని పధ్ధతులలో, భౌతికదాడులు, అశ్లీల సంభాషణలు, మొ|| నేరాలకు పాల్పడకుండా తమ స్నేహితులను గుర్తించటం, చాల కష్టమైన విషయం. అలా చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే, దానికి సమాజం అడ్డుపెట్టటం, న్యాయం కాకపోవచ్చు.
ఏది ఏమైనా, దీనిపై ఇంకా పరిశోధనలను, ఎక్కువ మంది చేపట్టాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.