308 అహో!! ఏమి మీడియా పతనము!!
చర్చనీయాంశాలు: 308, మీడియా,పెయిడ్ న్యూస్, తీహార్ జైల్
రెండు తెలుగు అగ్రశ్రేణి పత్రికలు ముఖ్యమంత్రిగారికి భజన చేస్తున్న సంగతి పాఠకులకు తెలుసు. వీటి యాజమాన్యంలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగారికి ఎంత మేరకు భాగస్వామ్యం ఉన్నదో మనకు తెలియదు. ఒక తెలుగు అగ్ర పత్రిక , ప్రతిపక్షనేత గారి స్వంతంది, ఆయనకే భజన చేయటం సహజం.
గ్రౌండ్ రిపోర్టు.కామ్ అనే ఆంగ్ల వెబ్ సైట్ వారు, ఇండియాలో ధగధగలాడుతున్న భారతీయ న్యూస్ పేపర్లనుండి అమెరికన్ ప్రింట్ న్యూస్ మీడియా నేర్చుకోవలసిన ఆరు పాఠాలు అనే వ్యాసాన్ని ప్రచురించింది. ఇది చదువ తగినది. ఇందులో ఒక పాఠం పెయిడ్ న్యూస్ కి సంబంధించినది. ఈ పత్రిక వారు సేకరించిన కొన్ని మన నాయకుల అభిప్రాయాలు మనం వదిలివేయకూడనివి ఉన్నాయి. వాటిని ఇక్కడ ఇస్తున్నాను. Click
A T.V. channel wanted Rs. 2.5 lakhs to cover a Rahul Gandhi visit. --Sandeep Dikshit, Former Congress M.P., East Delhi.
తెలుగు సారం: ఒక టీవీ చానెల్ వాళ్లు రాహుల్ గాంధీగారి పర్యటనను కవర్ చేసేందుకు రూ. 2.5 లక్షలు అడిగారు. __ సందీప్ దీక్షిత్, మాజీ కాంగ్రెస్ ఎంపీ, తూర్పు ఢిల్లీ.
I offered to pay for my positive coverage. --Bhupinder Singh Hooda, CM, Hariana.
తెలుగు సారం: నా సకారాత్మక కవరేజీ కోసం నేను చెల్లించటానికి ఆఫర్ చేశాను. __ భూపీందర్ సింగ్ హూడా, హరియానా ముఖ్యమంత్రి.
I was told to pay up like others had. -- Lalji Tandon, Former BJP MP, Lucknow.
తెలుగు సారం: మిగతా వాళ్లాలాగే నన్ను కూడ చెల్లించమని అడిగారు. __ లాల్జీ టాండన్, భూతపూర్వ బిజెపి ఎంపి, లక్నో.
Take an ad if you want to get the news, we were told. -- Sudhakar Reddy, CPI General Secretary.
తెలుగుసారం: వార్త రావాలంటే, ఒక ప్రకటన ను తీసుకోమని మమ్మల్ని అడిగారు. __ సుధాకర్ రెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి.
Every paper in my seat was on sale. -- Yogi Adityanath, BJP MP, Gorakhpur.
తెలుగు సారం: నా సీట్లో ప్రతి పేపర్ అమ్మకానికి ఉంది. __ యోగీ ఆదిత్యనాథ్, బిజెపి ఎమ్ పీ, గోరఖ్ పూర్.
I paid Rs. 50,000/- for three featured articles. Kodanda Rama Rao, Lok Satta Party Candidate, Warangal.
తెలుగు సారం: మూడు ఫీచర్ డ్ ఆర్టికిల్స్ కి నేను రూ. 50,000 చెల్లించాను. ___ శ్రీ కోదండ రామారావు లోక్ సత్తా పార్టీ అభ్యర్ధి, వరంగల్.
Tihar jail has a population of nearly 15,000, the size of a Major Panchayat.
తెలుగు సారం: ఢిల్లీలోని తిహార్ జైల్ జనాభా 15,000. అంటే ఒక మేజర్ పంచాయితీ అంత!!
हिन्दी संग्रह: तिहाड़ जेल में लगभग15,000 आबादी रहते हैं, एक मेजर पंचायत के सैज है.
Tihar jail has about 100 doctors for these 15,000 prisoners. Do we have 100 doctors in a Major Pachayat?
తిహార్ జైల్లోని 15,000 ఖైదీలకు 100 మంది డాక్టర్లు ఉన్నారు. అంతే జనాభా ఉన్న ఒక మేజర్ పంచాయితీలో 100 మంది డాక్టర్లు ఉంటారా?
हिन्दी संग्रह: तिहाड़ जेल में इन 15,000 कैदियों के लिए 100 डॉक्टर हैँ। हमारे एक मेजर् पंचायत में सौ वैद्य रहते क्या, नहीं.