Mr. Narendra Modi, the Hon. Prime Minister of India, seems to have special love for Germany and Berlin. This is, of course, a part of the hard fact that Indian Prime Ministers since 1947 have special love for European countries. They rarely visit African and South American countries. How can, Mr. Narendra Modi be an exception?
ఈనాటి ఆంగ్ల పదం: goof up & faux paus
ఆంగ్లంలో goof అనే క్రియా పదం ఉంది. ఇది గతంలో కలోక్వియల్ (వ్యవహారికమే అయినా, ఇన్ ఫార్మల్ సందర్భాలలో వాడేది. స్టాండర్డు యూసేజిలో వాడనిది).
దీనికి అర్ధం ఆంగ్ల నిఘంటువు ప్రకారం: Commit a faux pas or a fault or make a serious mistake.
faux pas (దీని ఫ్రెంచి వారి ఉచ్చారణ: ఫా పా)కి అర్ధం: a socially awkward or tactless act.
డిక్షనరీ.కామ్ ప్రకారం ఒక slip or blunder in etiquette, manners, or conduct; an embarrassing social blunder or indiscretion. అనగా సాంఘికంగా ఇబ్బంది కలిగించే, లోకజ్ఞత తో కూడిన చాతుర్యలేమి ఫలితంగా చేసే పనులు. ఇతరులతో వ్యవహరించేటపుడు పరస్పర మర్యాదల కనుగుణంగా వ్యవహరించకపోటం.
శ్రీనరేంద్రమోడీ బెర్లిన్ స్టాపేజి లో goof up ఏమి జరిగింది?
జర్మనీ అధ్యక్షురాలు శ్రీమతి ఎంజెలా మెర్కెల్ గారు, శ్రీనరేంద్రమోడీ గారిని బెర్లిన్ లో డిన్నర్ కి ఆహ్వానించారు. దానిని శ్రీ మోడీగారు అంగీకరించారు. అయితే అదే సమయంలో, జర్మనీ బ్రెజిల్ లో జరుగుతున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలో బాగా ముందుకు వెళ్ళిపోయింది. ఆమె ఫైనల్లో ఆడబోతున్న జర్మనీ జట్టుకు ఉత్తేజాన్ని కలిగించేందుకు బ్రెజిల్ వెళ్ళాల్సి వచ్చింది. ఈవిషయాన్ని జర్మనీ భారత్ కు ముందుగానే తెలియజేసింది. కానీ భారత విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యలయం వారే పట్టించుకోలేదు.
ఫలితంగా శ్రీమోడీ బెర్లిన్ లో దిగే సమయానికి, మెర్కెల్ గారు బ్రెజిల్ వెళ్ళిపోయారు. శ్రీ మోడీగారు బెర్లిన్ లో మెర్కెల్ గారితో డిన్నర్ చేయకుండానే, తాను కూడ బ్రిక్ సమావేశంకి హాజరు కావటానికి, బ్రెజిల్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేశాధినేత గారుతన రాజధానిలో లేని సమయంలో, మరొక దేశాధినేత డిన్నర్ కి వచ్చి ఉసూరుమంటూ ఇంకో దేశానికి ఎగిరిపోటం అనేది ఒక తరహా గూఫింగ్ ఫలితమే. దీనిని ఒక హిందీ పత్రిక వారు शर्मिंदा శర్మిందా (సిగ్గుచేటైన) అని వర్ణించారు గానీ, అది అంత సిగ్గుచేటు కాకపోవచ్చు.
వైబీరావు గాడిద అభిప్రాయం
ఎవరిగోల వారిది.
అంతర్జాతీయ దౌత్య మర్యాదలైనా, టిటిడీలో శేషవస్త్రం, లేక అజ్మీర్ దర్గాలో షద్దర్ వంటి ప్రార్ధనా సంస్థల మర్యాదలైనా, ప్రాధమికంగా ఎవరి గోల వారి గోలే ''ఎగో వాగో'' పధ్ధతిలోనే ఉంటాయి. వీళ్ళనుండి వాళ్ళేమి ఆశిస్తున్నారు, వారినుండి వీళ్ళేమి ఆశిస్తున్నారు-- అనే లాభనష్టాలు, మర్యాదల ఇంటెన్సిటీని నిర్ణయిస్తాయి.
జర్మనీకి ఇండియాతో పెద్ద మొహమాటాలేమీ లేవు. ఒకసారి వాళ్ళు ఆశించిన భద్రతాసంఘంలో వీటోతో కూడిన శాశ్వత సభ్యత్వం (భారత్ కూడ జర్మనీలాగానే వీటోతో కూడిన శాశ్వత సభ్యత్వం కోరుతున్నది) లభించింది అంటే, ఇంక పరస్పరం ఆశించాల్సిన, ఆధారపడాల్సిన, మద్దతిచ్చుకోవాల్సిన అంశాలేమీ ఉండవు. జర్మనీలోని ఆటో మేకర్లు మెర్సిడెజ్ బెంజి, వోక్స్ వాగన్ , వంటి ఖరీదైన కార్లను తయారుచేసినా, వారికి భారత ప్రభుత్వానికి అమ్మటానికి జర్మనీ ప్రభుత్వం, పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లండు పీఎమ్, ఫ్రాన్సు అధ్యక్షులకు భారత్ కు విమానాలు, హెలీకాప్టర్లు అమ్మే పనులు ఉంటాయి. వారు భారత్ ను గౌరవిస్తున్నట్లు నటిస్తారుకానీ, నిజానికి పట్టించుకోరు. ఇంక ఏ అవసరాలు లేని జర్మన్ అధ్యక్షురాలు గారు, భారత్ ప్రధాని బెర్లిన్ వస్తున్నాడని తెలిసి, తాను ఫుట్ బాల్ మాచ్ కోసం బ్రెజిల్ వెళ్ళటాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటుంది? నేను బెర్లిన లో ఉండటంలేదు, బ్రెజిల్ వెళ్తున్నాను, దయయుంచి మీరు రాకండి , అనిచెప్పటమే గొప్ప మర్యాద. పైగా, జర్మనీ వరల్డ్ కప్ గెలిచాక ఆమె హృదయం ఆనందోత్తుంగ తురంగ డోలాయమానం అయి ఉంటుంది. జర్మనీ ఫుట్ బాల్ విజయం తన టెలిఫోన్లను ఒబామా & కో వారు నిఘా వేసి టాపింగు చేయించటం వల్ల కలిగినహృదయ శల్యాన్ని కూడ ఆమె మర్చిపోటానికి దోహదం చేస్తుంది. ఈ బ్రహ్మానంద సమయంలో , ఆమెకు భారత్ అనే ఒక శ్వేతేతర దేశ ప్రధాని పర్సనా నాన్ గ్రేటా అనే భావం కలుగ వచ్చు.
శ్రీమాన్ మోడీ గారు కొంత జాగ్రత్త తీసుకొని, మెర్కెల్ గారు ఎక్కడ ఉన్నారో చెక్ చేసుకుని, తన విమానాల తండాను బెర్లిన్ దిక్కులో కాకుండా, బ్రెజిల్ రియో డి జెనిరో దిశలోకి ఎగరేసుకుని పోయి ఉంటే, బోలెడు ఇంధనం మిగిలేది. ఈ ఫా పా లు తప్పేవి.
వాల్మీకి రామాయణం గుర్తుకు వస్తున్నది
ఆంగ్లంలో కమ్యూనికేషన్ గ్యాప్ లు అంటూ ఉంటూ ఉంటాము. తెలుగులో సమాచార అగడ్త (సమాచార గండి అంటే బాగుండదేమో) అనచ్చు. వాల్మీకి రామాయణం బాలకాండ 66 సర్గలో, శివ ధనుర్భంగం జరిగాక సీతారాముల కల్యాణం జరగాలి. బాలకాండ 67 వసర్గలో , జనకుడు దశరధుడికి వర్తమానం పంపాడు. దశరధుడు, వశిష్ఠ వామదేవ జాబాలి మార్కండేయాది మునులతో, చతురంగ బలాలతో, మిథిలకు వెళ్ళాడు. 69వ సర్గలో, పనిలో పనిగా , జనకుడి సోదరుల పుత్రికలు, లక్ష్మణుడికి ఊర్మిళను, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తిని ఇచ్చి వివాహం చేయాలని విశ్వామిత్ర, వశిష్ఠ, జనక, కుశధ్వజ, శతానీకాదులు నిర్ణయించారు.
మిథిలలో ఉన్న దశరధ, వశిష్ఠ వామదేవ జాబాలి మార్కండేయాది మునులు భరతుడి వివాహ విషయాన్ని, దశరధుడిమామ, భరతుడి తాత, కేకేయి తండ్రి అయిన అశ్వపతి మహారాజుకి, ఆయనకొడుకు భరతుడికి మేనమామ అయిన యుధాజిత్తుకి తెలియచేసి, ''భరతుడి వివాహానికి మిథిలకు తరలి రమ్మని '' శుభలేఖలు పంపాల్సిన ధర్మం దశరధుడికి ఉన్నదో లేదో , ఆలోచించారో లేదో తెలియదు.
మిథిలలో ఉన్న దశరధ, వశిష్ఠ వామదేవ జాబాలి మార్కండేయాది మునులు లక్ష్మణ శత్రుఘ్నుల వివాహ విషయాన్ని, దశరధుడిమామ, లక్ష్మణ శత్రుఘ్నుల మాతామహుడు, మేనమామ లకు తెలియచేసి, ''భరతుడి వివాహానికి మిథిలకు తరలి రమ్మని '' శుభలేఖలు పంపాల్సిన ధర్మం దశరధుడికి ఉన్నదో లేదో , ఆలోచించారో లేదో తెలియదు. అసలు సుమిత్ర తండ్రి, సోదరులు బ్రతికి ఉన్నారో లేదో, రామాయణంనుండి మనం గ్రహించలేము.
బాలకాండ 73 వ సర్గలో భరత శత్రుఘ్నుల మేనమామ యుధాజిత్తు మిథిలలో ప్రత్యక్షమయ్యాడు. ఆహ్వాన రహితమే అనుకోండి. ఉభయకుశలోపరి చెప్పుకున్నాడు. తరువాత, తన తండ్రిగారు (కేకయరాజు), భరత శత్రుఘ్నుల క్షేమసమాచారాలు తెలుసుకురమ్మని నన్ను అయోధ్య పంపించగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడవారు మీరు సపరివారంగా మిథిలకు వెళ్ళారని చెప్పటంతో, నా చెల్లెలి కొడుకు (మేనల్లుడి) భరతుడిని చూడాలని, నేను మిథిలకు వచ్చాను అని చెప్పాడు. తరువాత దశరధుడు, యుధాజిత్తు, ఇరువురు ఒకరి నొకరు సమాదరించుకున్నారు.
ఇలాగా ఎవరి అవసరాల కొద్ది వాళ్ళు ఆహ్వానాలు పంపినా, పంపకపోయినా, ఇచ్చిన ఆహ్వానాలు కాన్సిల్ చేసినా, దేశయాత్రలు చేస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణ కాలమైనా అంతే, నరేంద్రాయణ కాలమైనా అంతే.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.