301 జడ భరతుడిని పోలిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
చర్చనీయాంశాలు: 301, చంద్రబాబు, రాజధాని, జడభరతుడు, రాయలసీమ, శ్రీబాగ్ఒప్పందం
తెలియని పాఠకుల కొరకు: మన భారత దేశంలో భరతుళ్ళు నలుగురు ఉన్నారు.
1. శకుంతలా దుష్యంతుల పుత్రుడు భరతుడు. ఈయన పేరుమీదనే హిందూస్థాన్ కి భారత దేశం అనే పేరు వచ్చింది అంటారు. ఈ భరతుడు గారు చిన్నతనంలో సింహాలతో ఆటలు ఆడేవాడు.
2. రాముడి తమ్ముడు భరతుడు. ఇతడు ధర్మనిరతుడు అని ప్రఖ్యాతి.
3. మూడవవాడు భరత ముని. ఈయన పేరు మీదే భరత నాట్యం వచ్చింది , అంటారు.
4. నాలుగవ వాడు జడ భరతుడు. ఈయన ఒక ముని. ఎంతో ప్రేమతో జింకను పెంచుకుంటూ, ఆజింకపై మోహం వీడలేక , సంగాన్ని వదిలించుకోలేక ప్రాణం వదిలాడు. మరు జన్మలో జింకగా పుట్టాడుట.
మన వెన్నుపోటు సార్వభౌమ, అవకాశవాద ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మొదటి ముగ్గురితో పోల్చటానికి కావలసిన ఉపమాలంకార శోభాయమాన సమాన ధర్మాలు లేవు. నాలుగవ వాడైన జడభరతుడితో పోల్చటానికి ఒక సమాన ధర్మం కనిపిస్తుంది. అయ్యదియే, వీడని మోహం, వదలని సంగం.
మోహం దేనిపైన
హైదరాబాదు నగరం పైన. ఉద్యోగులు అంతా ఆంధ్రప్రదేశ్ నుండే పనిచేయాలని కోరుకుంటున్నారని, శ్రీవారే చెప్పారు. తాను టెంట్లనుండికూడ పని చేయటానికి వెనుకాడనని తానే చెప్పుకున్నారు. షెడ్లైనా మేలేనని, గతంలో వివేకవాన్ సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ పాలడుగు వెంకటరావు గారు సలహా ఇచ్చి కూడ ఎన్నో నెలలు గడిచింది. అయినా, శ్రీచంద్రబాబు నాయుడు గారు హైదరాబాదునుండి కదలటానికి ముందుకు రావటంలేదు.
ఈమధ్య హైదరాబాదులో శ్రీ రామ దూత స్వామి అనే ఆయన చేసిన యజ్ఞానికి కూడ వెళ్ళి వచ్చారు. సికిందరాబాదు ఉజ్జయినీ మహాకాళీ దేవాలయానికి కూడ వెళ్ళి వచ్చారు.
శ్రీ చంద్రబాబు నాయుడుగారికి హైదరాబాదులో ఎన్ని వందలకోట్ల రూపాయల, ఎకరాల ఆస్తులు ఉన్నాయో కానీ, ఆయన హైదరాబాదుపై వ్యామోహం వదలలేకున్నాడు. కెసిఆర్, కెటీఆర్, హరీష్ రావుల బారినుండి, తన ఆస్తులను రక్షించుకోటానికి, ఆయన తపన పడుతున్నట్లు కనిపిస్తుంది. కెసిఆర్, కెటీఆర్, హరీష్ లు శ్రీచంద్రబాబుని గెస్టు గెస్టుగా ఉండాలని ఏడిపిస్తున్నారే తప్ప, తాము ఎన్నోరోజల నుండి బయట పెడ్తాం అంటున్న, బాబుగారి బినామీ ఆస్తుల వివరాలను బయట పెట్టటం లేదు. సాక్ష్యాలేమైనా ఉంటే బయట పెట్టి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాస్తే, కెసిఆర్ & కో వాళ్ళు తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు కదా.
లెజెండరీ జడ భరతుడిలాగా హైదరాబాదుపై వ్యామోహం వదలని శ్రీ చంద్రబాబు, వచ్చే జన్మలో పాతడేట్ ముల్కీగా పుడ్తారా లేదా అనే ప్రశ్న కన్నా, ఆయనను హైదరాబాదు నుండి కదిలించి, సీమాంధ్రకు తరలించి తెచ్చి రాష్ట్ర పాలనను సీమాంధ్రనుండి చేపట్టేలాగా చేయటం ముఖ్యం.
అవకాశ వాది యైన శ్రీచంద్రబాబు నాయుడు గారు, రాజధాని విషయంలో, 1937 శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా, రాయలసీమకు రాజధానిని ఇస్తామని కోస్తాంధ్రులు చేసిన వాగ్దానాన్నే మరచిపోయారు.
మానవ జీవితంలో అన్నింటికన్నా కష్టమైనది, చేసిన వాగ్దానాన్ని నిలుపుకోటం. కారణం ఏమైనప్పటికీ, 1937 నాటి కోస్తాంధ్ర నేతలు, రాయలసీమకు రాజధానిని ఇస్తామని వాగ్దానం చేసారు. అలా ఇచ్చినందు వల్ల కోస్తాంధ్రకు పెద్ద నష్టం కూడ ఏమీ లేదు. వాగ్దానం నిలుపకోటం వల్ల తెలుగు జాతి ప్రతిష్ఠ పెరుగుతుంది.
రాజధానిని రాయలసీమలో నెలకొల్పటం వల్ల వచ్చే ప్రధాన సమస్య, కోస్తానుండి కొత్తరాజధానికి జరగబోయే భూస్పెక్యులేటర్ల, వలసలు. ఇది కాక పొట్టకోసం లక్షలాది మంది అన్ స్కిల్ డ్, సెమీ స్కిల్ డ్, స్కిల్ డ్ వర్కర్లు, కోస్తానుండి రాయలసీమకు వలస వెళ్తారు. దీనిని ఎవరూ ఆపలేరు. ఇది వారి జన్మహక్కు. (వలస శ్రామికుల జన్మ హక్కు, మానవ హక్కు).
ఈ సమస్యకు ఏకైక పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ రాజధానిని పూర్తిగా పదేళ్ళకు పరిమితమైన తాత్కాలిక రాజధానిగా ప్రకటించి, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేయటమే. ఇది చంద్రబాబుకు, కిరణ్ కుమారుడికి, జగన్మోహన్ రెడ్డి కీ ఇష్టం ఉండదు. కాని తెలుగు ప్రజల దీర్ఘకాలిక సంక్షేమానికి ఇది అనివార్యం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.