280 స్వసంపర్కం యొక్క అధ్యయనం, 5వ భాగం (ఆఖరి భాగం).
చర్చనీయాంశాలు: 280, స్వసంపర్కం, స్వప్రణయం, బ్రెండన్ ఓనిలీ, బెట్టీ డాడ్సన్, masturbation, స్వయంతృప్తి
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 1వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/275 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 2వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/276 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 3వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/277 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 4వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/278 క్లిక్
స్వసంపర్కం యొక్క అధ్యయనం, 5వ భాగానికి లింకు: http://problemsoftelugus.blogspot.com/search/label/279 క్లిక్
ముందుగా పాఠకులకు క్షమాపణలు, స్పష్టీకరణలు
ఈ వ్యాసంలో సెక్సును ఉత్తేజ పరిచే (sexitement) కలిగించే అంశాలు ఏమీ ఉండవు. వాటికి వేరే వెబ్ సైట్లు, బ్లాగులు ఉంటాయి. ఇది కేవలం పరిశోథనాత్మక, సత్య శోథక పరిశీలన మాత్రమే. కనుక అట్టివి ఆశించి ఈ బ్లాగును చదువుతున్న పాఠకులకు నా క్షమాపణలు. వారు విండో పైన ఉండే X ను క్లిక్ చేసుకొని వేరొకబ్లాగ్ కు వెళ్ళవచ్చును.
ఎవరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశ్యం లేదు. అభ్యంతరాలుంటే కామెంట్లలోతెలియచేయ వచ్చు. వీలైనంతవరకు మనోభావాలను సంరక్షించటానికి ప్రయత్నిస్తాను.
స్వసంపర్కాన్ని సమర్ధించటం కానీ, వ్యతిరేకించటంగానీ, తదనుగుణంగా ఉద్యమాలను చేపట్టటం, నా లక్ష్యం కాదు. నా ప్రాథమిక లక్ష్యాలయిన నాస్తికత్వం, మార్క్సిజం, హేతువాద సైంటిఫిక్ అప్రోచ్ లకు అనుగుణంగానే ఈ పరిశీలన ఉంటుంది.
మొత్తం వ్యాసం చదువదలచిన వారికి లింకు; http://www.spectator.co.uk/features/9247341/the-age-of-self-love/ స్పెక్టేటర్ ఆంగ్ల పత్రిక కి వెళ్ళటానికి క్లిక్
పైవ్యాస సమీక్ష దాదాపు పూర్తి అయ్యింది. సారాంశం వ్యాసం స్థూలంగా స్వప్రణయాన్ని సమర్ధించినా పిల్లలకు, యువతీయువకులకు, ద్విప్రణయానికన్నా గొప్పదైన ప్రత్యామ్నాయంగా మాత్రం సూచించలేదు. టాబూ ఇంకా కొనసాగాలనే చెప్పింది.
ఇంక భారతీయ మరియు తెలుగు వాళ్ళ అంశాలు పరిశీలించాలి. భారత్ లో స్వసంపర్కం సంఘ బహిష్కృతం; తాము అప్పుడప్పుడుకానీ, తరచుగాకానీ చేసే పని అయినా, ఎవరూ బయటకు చెప్పుకోరు. పోర్నో సైట్స్ సందర్శనం వలెనే ఇది కూడ రహస్యమే. పోర్నోసైట్స్ సందర్శించే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆసంగతి తెలియకూడదని, రహస్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, స్మార్ట్ ఫోన్ లు, జిపిఆర్ ఎస్ ఎనేబుల్డ్ ఫోన్లు , యాండ్రాయిడ్ యాప్సు ఉన్న ఫోన్ లు వచ్చాక, అతిరహస్యం బట్ట బయలు లాగా అయ్యింది. పిల్లలు, పెద్దలు, అందరూ, యథేఛ్ఛగా పోర్నో సైట్లను సందర్శిస్తున్నారు. డౌన్ లోడ్ చేసుకొని రహస్యంగా దాచుకునే అవకాశం గలవాళ్ళు ఆపని చేసుకుని కూడ చేస్తున్నారు. మొబైల్స్ లోకి పోర్న్ వీడియోలు డౌన్ లోడ్ చేసిపెట్టటానికి షాపులు వెలిసాయి.
ఇప్పుడిక నెక్స్ట్ ఏమిటి? తల్లిదండ్రులకు తమ లైంగిక ఫాంటసీలను తీర్చుకునే అవకాశాలుంటాయి. పెళ్ళికాని, ఉద్యోగాలు లేని, టీన్స్ సంగతి ఏమిటి? వాళ్ళ కోరికలు ఎలా తీరాలి? తీరని కోరికలతో రాత్రంతా ప్రక్కపై దొర్లాలా? ప్రేమికులు దొరికిన వాళ్ళు తమ డేటింగులు తాము చేసుకుంటున్నారు. తరువాత పెళ్ళిచేసుకుంటున్నారు. అది కుదరక మోసపోయినవాళ్ళు కొందరు గుట్టుచప్పుడుగా ఏడుస్తున్నారు. ఈలోగా గర్భం దాల్చిన వారు, మోసగించిన వాళ్ళ ఇళ్ళముందర ధర్నాలు చేస్తున్నారు.
వివిధకారణాల వల్ల ప్రేమికులు దొరకక, ద్విప్రణయం కుదరని వాళ్ళలో పలువురు స్వసంపర్కం, స్వప్రణయాలకు పాల్పడుతున్నారు.
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ గారి వ్యాఖ్యలు
కండోమ్స్ గురించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ హర్షవర్ధన్ గారు కండోమ్స్ కన్నా ఆత్మనిగ్రహం మేలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడ ఒక సమస్య ఏమిటంటే, దేశంలోని కోట్లాదిమంది ప్రజల ఆత్మ నిగ్రహ స్థాయి ఒక్క లాగే లేదు. కొందరు అధికనిగ్రహ పరులు, కొందరు సాధారణ నిగ్రహ పరులు, కొందరు మోహాన్ని తట్టుకోలేని వాళ్ళూ ఉంటారు. అధిక నిగ్రహ పరులకు కండోమ్స్ గాని, స్వసంపర్కాలు గానీ అవసరం లేదు. సాధారణ నిగ్రహ పరులు అప్పుడపుడు కాలు జారుతూ ఉంటారు. దేశంలో అధిక సంఖ్యాకులు వీళ్ళే. మోహాన్ని తట్టుకోలేని వాళ్ళకీ ఏదో ఒకదారి కావాలి. ఆకలికి అన్నమెంత అవసరమో, మోహేంద్రియాలకు తృప్తి పరచటం కూడ అంతే అవసరం. జైళ్ళలో ఉండే ఖైదీలకు కూడ రోజూ కాక పోయినా అప్పుడప్పుడు ఈసమస్య వస్తూఉంటుంది.
భారత్ లో కొన్ని ప్రాంతాల బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులలో యువకులకు ఉపనయనం చేసే ఆచారం ఉంది. ఉప= సబ్. నయనం= కన్ను. ఈ సబ్-కన్ను ఏమిటంటే, జ్ఞాన నేత్రం. ఉపనయనంలో జంధ్యాన్ని మెడకు తగిలించి రోడ్డు బ్రహ్మచారిని రోడ్డుమీదికి తోలటం కాదు. ఈకాలంలో ఈ ఉత్సవం పెళ్ళికి కొద్దిరోజుల ముందు చేస్తున్నారు. పాత కాలంలో ఇది ఎనిమిది సంవత్సరాల వయసులో చేసే వాళ్ళు. ఈ జ్ఞాన నేత్రం తెరుచుకోటంలో (గురువు తెరిపించటంలో) ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇంద్రియ నిగ్రహాన్ని నేర్పటం. శరీరం గుర్రం లాంటిది. బ్రహ్మచారి ఆ గుర్రానికి రౌతు లాంటి వాడు. రౌతు చెప్పినట్లు గుర్రం వినాలా? గుర్రం చెప్పినట్లు రౌతు వినాలా?
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.