267 షిర్దీ శాయి బాబాను పూజించ వచ్చా, పూజించ రాదా?
చర్చనీయాంశాలు: 267, షిర్దీ శాయిబాబా, Shirdi Saibaba, పీఠాధిపతులు, ద్వారకా పీఠం, మోహన్ బాబు, సినీహీరోలు
ద్వారకా పీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతిగారు ఒక బాంబు పేల్చారు.
''... షిర్డీ సాయిబాబు దేవుడు కాదు. మనిషిని దేవుడిగా పూజించవద్దు. ...''
''...ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదు...''
"... This is a conspiracy to divide the belief of common man. There are only 2 Gods- Lord Ram and Krishna, ..."
తెలుగుసారం: ... సామాన్యమానవుడి యొక్క నమ్మకాన్ని విభజించటానికి ఇది ఒక కుట్ర. ఇద్దరు దేవుళ్ళే ఉన్నారు: ప్రభువు రాముడు మరియు క్రిష్ణుడు. ...
''...All those people who don't want the Govt to construct Ayodhya temple are spreading these beliefs that Sai Baba was a God. Even Sai Baba trust is involved in the conspiracy. ..."
తెలుగుసారం: ... ప్రభుత్వం అయోధ్య ఆలయం నిర్మించకూడదు అనుకునే వారంతా, శాయిబాబా దేవుడు అనే నమ్మకాన్ని వ్యాపింప చేస్తున్నారు. ఈకుట్రలో సాయిబాబా ట్రస్టుకు కూడ పాత్ర ఉంది. ...
''...साईं भक्तों को गंगा में स्नान नहीं करना चाहिए और शादी की रस्म करना भी छोड़ दें...''
తెలుగు సారం: ''...శాయి భక్తులు గంగలో స్నానం చేయవలసిన అవసరం లేదు. వివాహ కార్యక్రమాలు చేయటం కూడ వదిలేయచ్చు...''
''... साईं भक्तों को राम का नाम नहीं लेना चाहिए ...''
తెలుగుసారం: ''... శాయి భక్తులకు రామ నామం తీసుకోవలసిన అవసరం లేదు...''
''... साईं पूजा हिंदू धर्म के खिलाफ है ...''
''... శాయి పూజ హిందు ధర్మానికి విరుధ్ధం... ''
''...साईं भक्तों को भगवान राम की पूजा, गंगा में स्नान और हर-हर महादेव का जाप नहीं करना चाहिए...''
''...శాయి భక్తులకు భగవాన్ రాముడి పూజ, గంగా స్నానం మరియు హర-హర మహాదేవ జపం చేయనవసరం లేదు ...''
हनुमानगढ़ी के महंत ज्ञानदास: ''...शंकराचार्य की याद्दास्त कमजोर हो गई है और सरकार को तुरंत उन्हें जेल में बंद कर देना चाहिए... शंकराचार्य की टिप्पणी धार्मिक नहीं बल्कि लोगों को जात-पात में बांटने वाली है ...अगर लोग साईं पर आस्था रखते हैं, तो किसी का क्या जाता है? ... शंकराचार्य सोने-चांदी के सिंहासन पर बैठकर खुद की आरती उतरवाते हैं... ''
తెలుగుసారం: హనుమాన్ గఢీ మహంత్ జ్ఞాన్ దాస్ గారన్నారుట: ''...శంకరాచార్యుల వారి జ్ఞాపకశక్తి క్షీణించింది. ప్రభుత్వం వారిని జైలులో బందీ చేయాలి. ... శంకరాచార్యుల వారి వ్యాఖ్య ధార్మికము కాదు. ప్రజలను జాతులవారీగా విభజించేదిగా ఉంది. ప్రజలు శాయిపై విశ్వాసాన్ని ఉంచితే, ఎవరికి ఏమి పోతుంది? ... శంకరాచార్య బంగారు-వెండి సింహాసనం పై కూర్చొని తనకు తానే హారతి ఇప్పించుకుంటారు. ...''
వైబీరావు గాడిద మనోభావాలు
పాఠకుల, భక్తుల, మనోభావాలు గాయపడకుండా వ్రాయటం చాలా కష్టం. అయినా, రేపు నా శక్తికొలది ప్రయత్నిస్తాను. ఈలోగా విజ్ఞులైన పాఠకులు తమ మనోభావాలు క్రింద కామెంట్స్ లో వ్రాయటానికి ఆహ్వానం.
Added on 25.06.2014
1. దేవుడు(దేవత) అనే పదానికి సరి యైన నిర్వచనం లేదు. దేవుడు ఉన్నట్లుగా ఋజువులు లేవు.
2. దైవం == మానవాతీత శక్తి అనే అర్ధం లో అయితే ఉంది. అన్ని ప్రకృతి శక్తులు ఇంకా మనిషికి స్వాధీనం కాలేదు.
3. దైవం == మనలను ప్రార్ధనలను విని, మన పూజలను స్వీకరించి, మనలను రక్షించి, మనకు ఇంకచాలు బాబో అనేంతగా డబ్బిచ్చే శక్తి అనే అర్ధంలో అయితే , ఉన్నట్లు ఋజువులేదు.
4. ప్రకృతి, గ్రహాలు, నక్షత్రాలు మొ|| వాటిలో జరిగే రసాయనిక చర్యల వల్ల మన చుట్టూ మార్పులు జరుగుతాయి. మనిషికో, చెట్లకో, జంతువులకో మేలు చేద్దామనో, కీడు చేద్దామనో, శిక్షిద్దామనో, అవి జరగవు.
5. షిర్దీ శాయిబాబా 1918 ప్రాంతంలో మరణించిన ఒక మానవుడు. ఆయన ఉత్త మానవుడు కాక ఉత్తమోత్తమ మానవుడు అయితే అయి ఉండ వచ్చు. సాధారణంగా, గుళ్ళు కట్టించే వారు, పూజలు చేయించే వారు, ఈ ఉత్తమోత్తమత్వానికి గౌరవ సూచకంగా, పూజలు చేస్తే స్వాగతించ వచ్చు. నేటి యాత్రలు, పూజలు అలా జరగటం లేదు. శాయికి మానవాతీత శక్తులు ఉన్నాయి అని నమ్మించటానికి, కొన్ని కథలను సృష్టించి, ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తున్నారు. శాయిబాబా గుళ్ళను కట్టటం, నిర్వహించటం, అనేది ఒక వ్యాపారంగా మారింది. ఒక ఫకీరుగా షిర్దీ శాయికి బంగారంతో పనిలేదు. కానీ, ఆయన గుడిని నడిపే ట్రస్టువారికి బంగారం వ్యామోహం పట్టుకున్నది. ధనిక భక్తులెవరైనా సరే, బంగారం సమర్పించుకుంటామని వస్తే , ట్రస్టువారు అట్టి భక్తులను నిరుత్సాహ పరిస్తే ఆరోపణలకు, అవినీతికి తావుండదు. రియల్టర్లు, నల్లబజారు వర్తకులు, అవినీతి పరులైన అధికారుల దగ్గర విరాళాలు స్వీకరించటం మానేయచ్చు. కానీ మానేయరు.
6. అన్య మతస్తులు కుట్రలు చేస్తున్నారు అనేది, శ్రీ ద్వారకా పీఠాధిపతుల వారి అపోహ. శాయిబాబా గుడుల నిర్వహణ అనేది ఒక వ్యాపారమే కానీ, ఇతర మతస్తులు చేసే కుట్ర అనటానికి ఋజువులు లేవు.
ట్రాఫిక్ కి అడ్డంగా, రోడ్లను ఆక్రమించి, శాయిబాబా గుడులను నిర్మిస్తున్నారు. పెద్దగా మైకులు పెట్టి భజనలు, మొ|| శబ్ద కాలుష్యంతో వేధిస్తున్నారు. ఇతర గుడులు, మసీదులు, చర్చీల వారు కూడ ఈపని చేస్తున్నందు వల్ల, అతిక్రమించే అందరిపై , అతిగా కాకుండా, సముచితమైన చర్యలు తీసుకోవాల్సింది పోలీసు శాఖవారు.
మనిషిని దేవుడు అనటం , దేవుడి కొడుకు అనటం, ప్రవక్త అనటం, ఇవన్నీ అన్ని మతాలలోనూ ఉన్నది.
భారత దేశాన్ని పాలించిన కొందరు రాజులు, తమ వంశానికి చెందిన మూలపురుషులను, పూర్వీకులను, దేవుడిగానూ, దేవుడి అవతారాలుగానూ చిత్రిస్తూ, కథాగానాలను చేయించటం, పురాణాలను, కావ్యాలను వ్రాయించటం జరిగినపుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి మానవులను కూడ అవతార పురుషులుగా చిత్రించి స్థిరీకరించటం జరిగింది. మనుష్యులను, వారెంతటి వారైనా, దైవీ సంపత్తి గలవారైనా, పూజించకూడదు అనుకుంటే, బహుశా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడి స్థానంలో కేవలం శ్రీ మహావిష్ణువును మాత్రమే పూజించ వలసి వస్తుంది. ఇది తప్పా , అది తప్పా అని మనం నిర్ధారించలేము. అన్ని కూడ సాధ్యమే.
పీఠాధిపతులు మానవులను దేవుళ్ళుగా పూజించకూడదు, అని చిత్త శుధ్ధితో నమ్ముతున్నట్లైతే, ముందుగా వారు, తమ పీఠాలలో జరుగుతున్న వ్యక్తి పూజలను నిరుత్సాహ పరచాలి. వారు తమ పాద పూజ చేయటానికి ఎవరినీ అనుమతించకూడదు. వాటికి ఛార్జీలు పెట్టకూడదు. తాము సింహాసనం పైకూర్చుండి, హారతులు ఇప్పించుకోకూడదు.
తమకు ఏవిధమైన అధికారాలూ లేవని పీఠాధిపతులు గుర్తించటం వల్ల వారి సన్యాసం శోభిస్తుంది. కేవలం కాషాయ గుడ్డలు, బొట్లు, పీఠాలే కాదు, సన్యాసమంటే. రాగద్వేషాలను విసర్జించాలి. అలా విసర్జించిన వాళ్ళకి స్వమతం, అన్యమతం తేడాలు కనిపించవు. స్వమతస్తులపై కానీ, ఇతర మతస్తులపై కానీ పెత్తనం చలాయించాలనే కోరిక అసలు జనించదు.
ఎవరైనా తనను దేవుడు అన్నప్పుడు, అలా అన్న వ్యక్తి నేను మనిషినే, అన్నవిషయాన్ని మరల మరల స్పష్టంగా చెప్తూ తనకు గొడుగులను పట్టే వాళ్ళని గెంటి వేయాలి. పై ఫొటో చూడండి, షిర్దీ శాయిబాబా గారు తనకు గొడుగు పట్టేవాళ్ళతో ఎలా సేవ చేయించుకుంటున్నాడో. అంటే, సాయిబాబా ప్రోత్సాహంతోనే , ఆయనను దేవుడిగా చేసిన తంతు నడిచింది.
మహాత్మా గాంధీగారికీ ఈ సమస్య ఎదురైంది. నేను మహాత్ముడను కాను,నేను మామూలు మనిషినే, నన్ను మహాత్ముడు అనటం ద్వారా, మీరు మానవ జాతిని అవమానిస్తున్నారు, అని ఆయన స్పష్టంగా చెప్పి, తనను మహాత్ముడు అని ప్రచారం చేస్తున్న వారినుండి దూరంగా జరగ వలసి ఉన్నది. కానీ ఆయన అలా చేయలేదు. అయితే ఆయన కాలానికి ఆయన ప్రధాన సమస్య, స్వాతంత్ర్య పోరాటం. సత్యాగ్రహానికి, సహాయనిరాకరణానికి, జనాన్ని మోటివేట్ చేయటం. తను మహాత్ముడు అని జనంలో ఉండే నమ్మకాన్ని ఆయన స్వాతంత్ర్యోద్యమాన్ని బలోపేతం చేయటానికి వాడుకున్నాడు, అనే భావం నాకు ఉన్నది.
ఏసును దేవుని కుమారుడిగా నమ్మి ప్రార్ధించటం అనేది క్రీ.శ. 2వ శతాబ్దపు పరిణామం కాగా, శాయిని దేవుడిగా పూజించటం 20వ శతాబ్దపు పరిణామం. హిస్టరీ రిపీట్స్ అంటే చరిత్ర పునరావృత్తం అవటం ప్రతి శతాబ్దంలోను జరిగింది. అయితే 36 కోట్ల భారత జనాభా 120 కోట్లకు విస్తరించినపుడు, శాయి పూజ కూడ మూడు దేవాలయాలూ ఆరు గోపురాలుగా విలసిల్లటం ప్రారంభమయ్యింది. ఇతర మతాలలో లాగానే, శాయి భక్తులలోనూ అసహనం బయలు దేరింది. ద్వారకా పీఠాధి పతి ఇలా ఒకమాట అన్నాడో లేదో, వెంటనే ఆయన దిష్టిబొమ్మను తగలేశారు. ఒక మనిషిని తాము దేవుడిగా భావించి, పూజలు చేసి, తమ కోరికలు తీర్చుకోవాలనుకోటం సబబా, కాదా, అనే విషయాన్ని వారు ఒకసారి కూడ పరిశీలించుకోకుండా, వెంటనే స్వరూపానంద దిష్టిబొమ్మను తయారు చేసుకున్నారు. కోర్టులో ఒక దావా పారేశారు.
మన పట్టణాలలో కొన్నలక్షలమంది తమ పుట్టుక మతానికి చెందిన దేవుళ్లనే కాక, పొరుగు వాళ్ళ దేవుళ్ళను, పొరుగువారి సమీపంలో తిరిగే మతబోధకులయొక్క దేవుళ్ళని కూడ పూజిస్తున్నారు. ఇక్కడ వారు ఆశించేది: తమ రోగాలు తగ్గటం, పిల్లలకు ఉద్యోగాలు రావటం, పెళ్ళిళ్ళు కావటం, సంతానం కలగటం, కోర్టు తగాదాల్లో నెగ్గి ఆస్తి కొట్టుకురావటం, నేరం చేసినా జైలుకు పోకుండా దేవుడి చేత రక్షించబడటం, వ్యాపారాల్లో తమ వాటా, దేవుడి వాటా, మొత్తం కలిపి మొక్కుకున్నంత లాభం రావటం ఇలా ఎన్నో.
అనుకున్నది నెరవేరితే, వారు కాంగ్రెస్ లోంచి బిజెపీ లోకి దూకిన నేత, సోనియాను వదిలి మోడీని కీర్తించినట్లుగా, లేక వైయస్ ఆర్ పీ లోంచి టిడిపి లోకి దూకిన నేత జగన్ ను తిట్టినట్లుగా, కొత్తమతానికి తగ్గట్లు తమ శరీరాలపై వాతలు పెట్టుకోటం, గతంలో తమ రొమ్ములమీద పొడిపించుకున్న పాత నేతల (పాత దేవుళ్ళ) పచ్చబొట్లను చెరిపించుకోటం, కొత్తమత ప్రచారంలో విజృంభించటం జరుగుతుంది. ఇంక వాహనాలూ, క్యాష్, లభ్యమైతే, ఆహా సొగసు చూడ తరమా.
తెలుగు నటుడుమోహన్ బాబు
''...షిరిడిసాయి దేవుడు కాదంటే బాధగా ఉంది. ...''
''...ఓ హిందువుగా ఆవేదన చెందాను. ...''
''...కొంతమంది మతిచలించి మాట్లాడుతున్నారు..''
''...ఈశ్వరుడి అంశ సాయిబాబా...''
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీ మోహన్ బాబు గారు ఒక వృధ్ధ సర్వసంగ పరిత్యాగి యైన సన్యాసిని పట్టుకొని ''..కొంతమంది మతి చలించి మాట్లాడుతున్నారు ..'' అనటం సరికాదు. నేను 1983 సంవత్సర ప్రాంతంలో, తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా, అచ్చంపేట సమీపంలోని ఒక కుగ్రామంలో నివసించే సమయంలో, అచ్చంపేట పట్టణంలోని ఒక సినిమా హాల్ లో, శ్రీ మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాను చూసే భాగ్యం కలిగింది. ద్వంద్వార్ధాలతో నిండి ఉండి, అసహ్యకరమైన సంభాషణలు, పిచ్చి డాన్సులతో ఆసినిమా బాగా విసిగించింది. ఎంతో కొంత విద్యా గంధం ఉన్న నా బోటి వాళ్ళకు వికృతంగా కనిపించిన ఆసినిమా నిరక్షరాస్యులు, లేక అల్పాక్షరాస్యులు అయిన ఆ గ్రామీణ లేక గిరిజన యువతీ యువకులను ఎంత ఉద్రేక పరచి ఉంటుందో ఊహించటానికి ప్రయత్నించినా, నాకు అంతు చిక్కలేదు.
ఆతరువాత హీరోగా శ్రీ మోహన్ బాబు ఎంతో ఖ్యాతి సంపాదించటం, ఎన్నో చచ్చు పుచ్చు అసభ్య సినిమాలు, హింసాత్మక సినిమాలలో నటించి, అలాంటి సినిమాలను తీసి, కోట్లు గడించటం గమనార్హం. తాను సంపాదించిన సంపద లో అధిక భాగం చెడు పధ్ధతులతో రాజీ పడటం వల్ల వచ్చింది అనే విషయాన్ని మరచి, అంతా శాయి కృప అనుకోటం దురదృష్టకరం. ఈవిషయంలో శ్రీ మోహన్ బాబు ఒక్కరినే తప్పు పట్టవలసిన అవసరం లేదు. అన్ని రంగాలూ అలానే ఉన్నాయి- గొంగట్లో తింటు వెంట్రుకలు లెక్క పెట్టటం లాగా ఉంది.
రెండు ఒక దానితో మరొక దానికి సంబంధం లేని విషయాలకు కార్య కారణ సంబంధాలను ఆపాదించి, తమకు వచ్చిన లప్పం అంతా షిర్దీ శాయి దయతోనో, పుట్టపర్తి శాయి దయతోనో, ఇంకో ఇంకో ఏదో ఒక మతం దేవుడి దయతోనో లభించింది అనుకోటం చాలమంది నేతలకు, అధికారులకు, ప్రముఖులకు, అలవాటుగా మారింది.
అలాంటి వారు ఆత్మ పరీక్ష చేసుకునేందుకు వారికి తీరిక లేదు (డబ్బు సంపాదనలో బిజీ బిజీ), కోరికలేదు (అలాటి ఆత్మ పరీక్షలో డబ్బులు రావు), ఓపిక లేదు (ఆత్మ పరీక్ష చేసుకోవాలంటే చాల అధ్యయనం చేసుకోవాలి, మధన పడాలి. మనకు పిచ్చి గంతులు వేస్తూ వాటిని డాన్సులు గా ప్రచారంచేసుకునే ఓపికే గాని, ఆత్మ పరీక్షకు శ్రమపడే శక్తి ఉండదు.) అలాంటి ఓపికే ఉంటే ఇంకో రుద్రాక్ష తోటను పెంచి రుద్రాక్షలతో వ్యాపారం చేసుకోవచ్చు.
ఇంకా ఉంది. వ్రాసిందాన్ని పునః సమీక్షించి మనోభావాలు గాయపడే విషయాలను తొలగించాల్సి ఉంది.
Excellent blog.
ReplyDeleteSai Satcharitra Hindi pdf
Sai Satcharitra Malayalam pdf