265 కెసీఆర్ పాకిస్థాన్ లోకి ఇతరులకి ప్రవేశం ఉండదా?
చర్చనీయాంశాలు: 265, KCR, Bifurcation, విభజన, తెలంగాణ, కెసిఆర్
ఊహించినట్లే అయింది. కెసిఆర్ కుటుంబం, తెలంగాణను కుటుంబ ఆస్తి గానే కాక పాకిస్థాన్ వంటి వికృతపు ఊహలు కలదేశంగా మార్చింది. వారు చేస్తున్న పనులు ఈ దేశం అంతా ఒకటి అనే లక్ష్యాన్ని డొక్కలో పొడుస్తుంది.
తెలంగాణ విద్యాలయాల్లో ఫీజు రీయింబర్సుమెంటుకి అర్హత పొందటానికి, పిల్లవాడే కాక తండ్రి కూడ తెలంగాణ లోనే పుట్టాలనే నిబంధన వంటి వాటిని, బహుశా తమ రాజ్యాలలో మహమ్మద్ ఘోరీ, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబులు కూడ పెట్టి ఉండరు.
కెసిఆర్ కుటుంబానికి సీమాంధ్ర ప్రజలు అంటే కుళ్ళు ఉంటే ఉండ వచ్చు. సీమాంధ్ర విద్యార్ధులకు రీయింబర్సుమెంటు ఇవ్వటం ఇష్టంలేకపోతే మానేయవచ్చు. సీమాంధ్ర విద్యార్ధులు బిచ్చగాళ్ళు కాదు.
కెసీఆర్ కుటుంబం చేస్తున్న పని జాతీయ స్ఫూర్తికి విరుధ్ధంగా ఉంది. ఎలాగంటే, ఒరిస్సానుండో, బిహార్ నుండో ఒక రాళ్ళు కొట్టుకునే కూలీయో, లేక ఒక ఇటుక బట్టీలో పని చేసే కూలీయో హైదరాబాదు వచ్చి పొట్టపోసుకుంటున్నాడనుకోండి. వాడు, వాడి కొడుకు తెలంగాణలో పుట్టలేదు కాబట్టి ఇంక రీయింబర్స్ మెంట్ లేదంటే వాడి గతి ఏమిటి? ఇంక భారత దేశాన్ని ఒకటే దేశం అనటం ఎందుకు?
అసలు కెసీఆర్ తండ్రి ఎక్కడ పుట్టాడు? కెసీఆర్ తాత ఎక్కడ పుట్టాడు? ఈతలతిక్కల ప్రశ్నలకు జవాబులు ఏమిటి?
మనకి మొహమ్మదాలీ జిన్నా, బాలా సాహెబ్ థాక్రె, నిజాం నవాబు లేని లోటుని కెసిఆర్ కుటుంబం తీరుస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరచి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, కెసీఆర్ చిన్నప్పుడు తోటకూర కాడ దొంగిలిస్తే తల్లి ప్రోత్సాహం పొందిన బుల్లి దొంగ , పెద్దయి గజదొంగగా మారినట్లు, భింద్రన్ వాలే, హిట్లర్ లను దాటిపోయి తెలంగాణ భవిష్యత్ కే ఎసరు తెస్తాడు.
కెసీఆర్ చేస్తున్న పనులు చూసి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు కెసీఆర్ తమకేదో బంగారపు గనులు త్రవ్వి ఇవ్వబోతున్నాడు అనుకుంటే, వారు దగా పడక తప్పదు. ఎలాగంటే, తెలంగాణకి ప్రథమ ముఖ్యమంత్రిగా దళితుడిని ఎన్నిక చేయిస్తానని వేయిసార్లు చెప్పి, ధోకా చేసింది గుర్తుకు తెచ్చుకోవాలి:

విలేఖరుల ప్రశ్న: Are you doing all this to become the CM of the new state? ఇదంతా మీరు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదామని చేస్తున్నారా?
కెసీఆర్ జవాబు: This is rubbish. I’ve said it not less than a thousand times that the first Telangana CM will be a Dalit. We have not zeroed in on a name right now, but there are so many leaders. When the occasion comes, we will evolve a consensus on a Dalit CM. The Telangana society is in such a mood that nobody can rule here unless they bring us statehood. It is ultimately a political decision. Let wisdom prevail on the Prime Minister and Sonia Gandhi that they deliver on the promise they made to the people of Telangana.
తెలుగు సారం: ఇది చెత్త. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ఉంటాడని నేను వేయి సార్లకు తక్కువ కాకుండా చెప్పాను. ఇప్పటికిప్పుడు మేము పేరును నిర్ణయించుకునే దశకు రాలేదు. ఆ సమయం వచ్చినపుడు దళిత ముఖ్యమంత్రిపై మేము ఏకాభిప్రాయాన్ని సాధిస్తాము. తెలంగాణ సమాజం ఈరోజు ఏస్థితిలో ఉందంటే, తెలంగాణకి రాష్ట్రాన్ని సాధించకుండా ఇక్కడ పాలన చేయలేని మూడ్ లో ఉన్నది. అది చివరికి ఒక రాజకీయ నిర్ణయము. తాము తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలనే వివేకం ప్రధానమంత్రి మరియు సోనియా గాంధీలో ఉదయించు గాక.
వేయి సార్లు చెప్పిందానికే, విలేఖరులు అడిగితే చెత్త అన్నవాడు చివరికి ఏమి చేశాడో? తన కుటుంబంలో ముగ్గురు మంత్రులు. కూతురు ఎంపీ.
''మేము భారత దేశంలో అంతర్భాగం, ఇతర రాష్ట్రాల వాళ్ళు తమ రాష్ట్రానికి వస్తున్నట్లే, మేము కూడ ఇతర రాష్ట్రాలకు పొట్టకూటి కొరకు వెళ్ళవలసి ఉంటుంది '' అని తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకోకపోతే వారు స్వదేశంలోనే విదేశీయులవుతారు. కెసీఆర్ తెలంగాణ వారెవరూ బయటకు వెళ్ళనక్కరలేదంటాడు, అన్నీ తెలంగాణలో నేనే సమకూరుస్తా నంటాడు, తన వసూళ్ళ సామ్రాజ్యంలో అదికుదరదు, కేసీఆర్ చేయగలిగే దానికి పరిమితులు ఉంటాయి, దానిని కాలం, పారిశ్రామిక వాతావరణం, వాణిజ్య వాతావరణం, నిర్ణయిస్తుంది.
ఉద్యోగాల లభ్యత అనేది ఎన్నో ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. జాగీర్ దారుల పాలనలో ఉద్యోగాలు అరణ్యంలో మోదుగ చెట్లు పుట్టుకొచ్చినట్లు పుట్టుకు రావు. కెసీఆర్ కుటుంబ జమీందారీ కేవలం తెలంగాణలోనే నడుస్తుంది. శ్రామికులు అనేవాళ్ళు, తెలంగాణ, సీమాంధ్ర, బీహారు, ఒరిస్సా, తమిళ్ నాడు, గుజరాత్ ఇలా భేదాలు లేకుండా, దొరికే అవకాశాలను అంది పుచ్చుకోవాలి. కెసీఆర్ కుటుంబ ఫ్యాక్టరీల బయట సెక్యూరిటీ గార్డులు గా తెలంగాణా లోనే గ్యారంటీడ్ జాబ్ పొందే కన్నా, రుచి కరమైన హైదరాబాద్ బిరియానీ చేయటం నేర్చుకొని విజయవాడ రైల్వే స్టేషన్ లేక విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా కాకాహోటల్ పెట్టుకొని ఆత్మ గౌరవంతో జీవించ వచ్చు. కెసిఆర్ కుటుంబ కాళ్ళ దగ్గర బాంచలం దొర, కాల్ మొక్కుతాం అనే కన్నా ఏ హంపీలోనో యాత్రికులకు శిల్పాలను చూపించుకుంటూ, నవ్వుతూ జీవించవచ్చు.
ఉద్యోగికి దూరభూమిలేదు అంటే ఈ ఆత్మ గౌరవమే. విద్వాన్ సర్వత్రా పూజ్యతే అంటే ఈ విశాల విశ్వం మనదే అనే అర్ధం.
రాజధానిని హైదరాబాదులో పెట్టారు కాబట్టి సీమాంధ్ర ప్రజలు తప్పని సరి అయ్యి హైదరాబాదు వచ్చారు కానీ, ఇపుడు రారు. ఇపుడు వారు తమ కొత్త రాజధానికి వెళ్తారు. ఇంక తెలంగాణ ప్రజలు 1957 కి ముందున్న పధ్ధతులలోనే దొరలకు, నవాబులకు, కాల్మొక్కుతూ , వాళ్ళిప్పించే కల్లు ముంతలను ఇంటికి తెచ్చుకోవచ్చు. జీతాలకుండచ్చు. పట్నాల్లో చదివే దొరల పిల్లలకి దాస్యం చేయచ్చు. ఎవరికి నచ్చిన విధంగా వారు దాస్యం చేసుకునే స్వేఛ్ఛను ఈరాజ్యాంగం మనకిచ్చింది కదా.
చివరి మాట
ప్రాంతీయవాదం కన్నా, నాస్తికత్వం, మార్క్సిజం మెరుగైన సిధ్ధాంతాలు. అవి మనుషులను పశువుల్లాగా గుంజలకు కట్టిపడేయవు. ఈవిషయాలు ఋజువు కావాలంటే, నాస్తికత్వం, మార్క్సిజం మీద విస్తృతమైన, లోతైన బహిరంగ చర్చలు జరగాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని బోధించాలి. భారత్ లోని ప్రతి పౌరుడు వీటిని అర్ధం చేసుకొని లాభపడాలి. దేశానికి దారి చూపటంలో, తెలంగాణ, శేషాంధ్ర ముందుండాలి. మననుండి బీహార్, ఒరిస్సా, తమిళ్ నాడు మొ|| సర్వ దేశీయ కూలీలు సత్యాన్ని తెలుసుకోవాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.