261 హహ్ హహ్హహ్హ హహ్హహ్హ హహ్హహ్హ !! కాంగ్రెస్ మీదికి నేరాన్ని నెట్టేసామోచ్!!
చర్చనీయాంశాలు: రైళ్లు, బిజెపి, కాంగ్రెస్, నరేంద్రమోడీ, Rail Transport, Narendra Modi, BJP, Congress
బాదుళ్ళకి కొన్ని శాంపుల్స్:
Second Class Monthly Season Ticket (MST) fares of Suburban and Non-suburban shall be charged on the basis of 30 single journeys instead of approximately 15 single journeys.
తెలుగు సారం: రెండవ తరగతి నెలవారీ సీజన్ టికెట్ (ఎమ్ ఎస్ టీ) సబర్బన్ (లోకల్), నాన్ సబర్బన్ ఛార్జీలు ఇప్పటిలాగా 15 సింగిల్ ఛార్జీలపై కాక , 30 సింగిల్ ఛార్జీలపై లెక్కిస్తారట.
Revised fare shall also be applicable as per the existing method of computation on Quarterly Season Tickets (QST), Half Yearly Season Tickets (HST) and Yearly Season Tickets (YST), etc.
తెలుగుసారం: రివైజు చేయబడిన ఛార్జీలు మూడునెలల సీజన్ టికెట్ లపై (క్యూ ఎస్ టీ), అర్ధ సంవత్సర సీజన్ టికెట్లపై మరియు సాంవత్సరిక సీజన్ టికెట్లపై కూడ వర్తిస్తాయి.
దీనిని బట్టి సీజన్ టికెట్ ధరలు రెట్టింపు అవుతాయేమోననే అనుమానం కలుగుతున్నది.
రైల్ ఛార్జీలు పెంచటం అనివార్యం అనే విషయం భారత్ లో ఉన్న ధరల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, ప్రజలకు అర్ధమయ్యేదే. ఆ సంగతే ప్రజలకు వివరించటం రైల్వే మంత్రి, ప్రధాన మంత్రి, విధి. అంతే తప్ప గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన అమలు చేయాల్సిన ఆర్డర్ ను మేము అమలు చేస్తున్నామని గత ప్రభుత్వంపై నెట్టేయటంలో అర్ధం లేదు.
ఇంధనం, నిర్వహణ ఖర్చులు పెరిగినపుడు, ప్రైవేటు వాళ్ళైనా, ప్రభుత్వమైనా, పెట్టుబడి దారీ విధానపు పరిథిలో పనిచేసినంత కాలం ఛార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాల్సిందే. గత ప్రభుత్వం 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెంచటం అనే నిర్ణయాన్ని వాయిదా వేసి , తప్పును కొత్త ప్రభుత్వంపైకి తోసేయాలని చూడటం మోసపూరితమైన పధ్ధతే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వారికి ఒక వెబ్ సైట్ ఉంది. www.inc.in. దీనిలో ఇప్పటికే నరేంద్రమోడీ ప్రభుత్వం ఏదో నేరం చేసినట్లు ఏకేసారు. ఇది తప్పు పధ్ధతి. కత్తులు నూరి సిధ్ధం చేసింది కాంగ్రెస్. ఆకత్తులను వాడింది మోడీ ప్రభుత్వం. తప్పుచేసినా, రైట్ చేసినా ఇద్దరూబాధ్యత తీసుకోవాలి తప్ప ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకోటం దారుణం.
పీపుల్ గెట్ ది గవర్నమెంట్ దే డిజర్వ్ అని ఒక సామెత ఉంది. ప్రజలు ఎటువంటి ప్రభుత్వాలకు అర్హులో అలాంటి ప్రభుత్వాలనే పొందుతారు. భారత్ ప్రజలు ఎటువంటి ప్రభుత్వాలకు అర్హులో అలాంటి ప్రభుత్వాలనే పొందుతున్నారు. పాకీస్థానీలు, బంగ్లాదేశీలు, ఇరాకీలు కూడ అంతే. చింతించన్ పని లేదు.
ముందుంది మొసళ్ళ పండుగ
రైలు ఛార్జీలను, డీజెల్ పెట్రోల్ ధరల వలె తరచూ పెంచాల్సి రావచ్చు. 2015, 2016, 2017, 2018 సంవత్సరాలలోకూడ మరల మరల ఈపని చేయాల్సిరావచ్చు. అపుడు కూడ అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, నిర్ణయాలను వాయిదా వేసుకుంటు రైల్వేలను కుదుపులకు గురి చేయటం నీచం అవుతుంది.
పరిష్కారాలు లేవా?
లేకేమీ, ఉన్నాయి. కానీ అమలుకు చాలా కష్టపడాలి. పెట్టుబడి దారీ విధాన పరిథిలో ఒక పది పరిష్కారాలు:
1. రైల్వేలు ఫ్రైటేతర ఆదాయాన్ని (వస్తువుల రవాణా ఫ్రయిట్), ఛార్జీలేతర ఆదాయాన్ని పెంచుకోటానికి కృషి చేయాలి. రైల్వే స్టేషన్ల ఇన్ గేట్, అవుట్ గేట్ ల మధ్య కాంపౌండ్ వాల్స్ ప్రక్కనే ఉన్న స్థలాలలో షాపింగ్ కాంప్లెక్సులను నిర్మించి అద్దెకి ఇవ్వ వచ్చు.
2. పట్టాల వెంట ఉండే ఖాళీ స్థలాలు, పట్టాలకు హైవేలకు మధ్యఉండే వాటిని షాపింగ్ కాంప్లెక్సుల, చిన్న వ్యాపారాల నిర్వహణకు స్వల్పకాలిక లీజులకు ఇవ్వవచ్చు.
3. వాణిజ్య లీజులకు ఇవ్వటానికి వీలు కాని ఇరుకు వాటిని, జానస్ టైప్ లో రోడ్ ముఖం, పట్టాల ముఖం భారీ హోర్డింగులు నెలకొల్పుకోటానికి లీజు కివ్వచ్చు.
4. సోలార్ ప్యానెల్స్ నెలకొల్పుకోటానికి లీజులకివ్వ వచ్చు.
5. పై వేటికీ పనికిరాని వాటిని సోషల్ ఫారెస్ట్రీ (సుబాబుల్), పండ్ల, పూల తోటల పెంపకానికి లీజులకివ్వవచ్చు.
6. పైకప్పు ఉన్న గూడ్సు వ్యాగెన్ లపై సోలార్ ప్యానెల్స్ నెలకొల్పి, వాటినుండి వచ్చే విద్యుత్ ను రైళ్ళను నడుపుకోటానికి సపోర్టుగా వాడచ్చు.
7. రైల్వే ప్లాట్ ఫారాలను విస్తరించి అదనపు షాపులకు, బ్యాంకు ఎటీఎమ్ లకు, అదనపు హోటళ్లకు స్వల్ప కాలిక కిరాయి కివ్వవచ్చు. స్థలాలు ఉంటే ప్లాట్ ఫారాల మీదే కల్యాణ మంటపాలను నిర్మించి గంటల లెక్కన కిరాయికి ఇవ్వవచ్చు.
8. లాంగ్ డిస్టెన్స్ రైళ్లలోపల బ్యూటీ క్లినిక్కులు, ఇంటర్నెట్ కేఫ్ లు, శిక్షణా సంస్థలు, బుక్ ఎగ్జిబిషన్ లు, వస్త్రాలు, పాదరక్షల ప్రదర్శనలు, మొబైల్స్ ప్రదర్శనలు నెలకొల్పుకోటానికి రోజుల లెక్కన, నెలల లెక్కన, కిరాయికి ఇవ్వవచ్చు.
9. రైళ్లలోనే కల్యాణ మంటపాలను నిర్మించి ప్రయాణ సమయంలోనే వివాహా కార్యక్రమాలను నిర్వహించుకోటానికి కిరాయికి ఇవ్వ వచ్చు.
10. అఖిల భారత సేల్స్ కాంపెయిన్స్ నిర్వహించుకోటానికి ప్రత్యేక ఎగ్జిబిషన్ రైళ్ళను నిర్మించి కార్ల తయారీదారులకి, వాషింగ్ మెషిన్ లు, టీవీలు, చవక నగల , అమ్మకందారులకు కిరాయికి ఇవ్వ వచ్చు. మొ|| ఇలా ఎన్నైనా సాధ్యమే.
వీటిని చేయక పోతే రైలు ప్లాట్ ఫారాలు, పట్టాల పక్క స్థలాలు మురికి కూపాలుగా మారటమే కాకుండా, ఆక్రమణల పాలయ్యే అవకాశం ఉంది.
కోరిక ఉంటే మార్గం ఉంటుంది.
మీరు మార్క్సిజం అంటున్నారు. ఈసమస్యను మీరు మార్క్సిజం లో ఎలా పరిష్కరిస్తారు?
నేను ప్రతిపాదించే మార్క్సిజంలో రైళ్లకు ఛార్జీలు ఉండవు. అన్నీ ఫ్రీ. వీలైనంతవరకు పని స్థలానికి, నివాసానికి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు కాబట్టి, అనవసర ప్రయాణాల అవసరమే ఉండదు. ఉన్నా ఛార్జీలు ఉండవు.
వీలైనంత వరకు దిగుమతి ఇంధనంపై ఆధారపడటం తగ్గించుకొని, సూర్యశక్తి, కెరటాలశక్తి, వాయుశక్తి, బహుశా హైడ్రోజన్ ఇంధనం వంటి సాంప్రదాయేతర ఇంధనాలపై దృష్టి పెట్తేకానీ, వీదేశీ పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుండి బయట పడలేము.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.