చర్చనీయాంశాలు: 260, AAP, ఆమ్ ఆద్మీ , తాడేపల్లిగూడెం, ఏలూరు, నర్సాపురం, పశ్చిమగోదావరి, మన రైల్వేలు
ఈనాటి హిందీ పదం
गुमशुदगी Missing కనపడుట లేదు
गुमशुदगी కి హిందీ భాషలో ప్రస్తుతం వాడే సందర్భం వ్యక్తులు అదృశ్యం కావటం. స్వయంగా వెళ్ళిపోటం వల్ల కానీ, కిడ్నాప్ చేయబడటం చేత కానీ, ఇతర కారణాల వల్ల గానీ ఇది జరగవచ్చు. కనపడని వ్యక్తుల కొరకు కరపత్రాలు, పోస్టర్లు అచ్చుకొట్టించినపుడు, తెలుగులో మనం ఎక్కువగా వాడే పదం ''కనబడుట లేదు''. హిందీ వారు వాడే పదం गुमशुदगी.
వోట్లు వేయించుకుని నియోజక వర్గంలో కనిపించకుండా మాయమైన కార్పోరేటర్లు, శాసన సభ్యులు, ఎంపీల, మంత్రుల, విషయంలో కూడ गुमशुदगी ని వాడచ్చేమో.
నవభారత్ టైమ్స్ దినపత్రిక ప్రచురించిన ఈవార్తను చూడండి. (లింకును క్లిక్ చేస్తే నవభారత్ టైమ్స్ కి వెళ్తారు.) http://m.nbt.in/text/details.php?storyid=36727792§ion=top-news క్లిక్ मनीष सिसोदिया गायब! गुमशुदगी के पोस्टर మనీష్ సిసోదియా గారు గాయం (మాయం)!! గుమ్ సూద్ గీ కే పోస్టర్!!
ఆం ఆద్మీ పార్టీ అగ్రనేతలలో మనీష్ సిసోదియా గారు ఒకరు. వీరి నియోజక వర్గం ఢిల్లీలోని పట్ పడ్ గంజి. వీరు గత డిసెంబర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం తరువాతనుండి కనిపించటంలేదుట.
ఈ పోస్టర్ ను తనను ఆం ఆద్మీ గా చెప్పుకున్న అజయ్ వాలియా అనే మహాశయుడు వేయించాడుట. సారం ఏమిటంటే పట్ పడ్ గంజ్ ప్రజలు తీవ్ర విద్యుత్, నీటి కొరతను ఎదుర్కుంటున్నారుట.
సిసోదియా గారి ప్రకారం, ఇది హతాశులైన కాంగ్రెస్ లేక బిజెపి వారి కుట్ర. సిసోదియా గారి మాటలలోనే:
मैं तो अपने इलाके में ही हूं, लेकिन शायद कांग्रेस और बीजेपी के लोगों को यह नहीं दिख रहा, क्योंकि मैं रोज अलग-अलग इलाकों में जाकर मोहल्ला सभाएं कर रहा हूं और लोगों से पूछ रहा हूं कि एमएलए फंड के रूप में स्वीकृत की गई राशि को किन कामों पर खर्च करना है?
తెలుగుసారం: నేనైతే నానియోజకవర్గంలోనే ఉన్నాను, కానీ బహుశా కాంగ్రెస్ మరియు బిజెపి వాళ్ళకి ఇది కనపడుతూ ఉండక పోవచ్చు. ఎందుకంటే, నేను రోజూ బస్తీల్లోకి వెళ్ళుతున్నాను. అక్కడి ప్రజలను అడుగుతున్నాను, ''ఎం ఎల్ ఎ నిధులను ఏఏ పనులకై ఏవిధంగా ఖర్చు చేయాల'' ని అడుగుతున్నాను.
'आप' के सांसदों ने लोकसभा तक में दिल्ली की बिजली कटौती का मामला उठा दिया है। हमारे विधायक और सांसद इस मामले में एलजी से भी मिले और केंद्रीय ऊर्जा मंत्री को भी चिट्ठी लिखी, लेकिन दिल्ली से बीजेपी के 7 सांसद इस मामले में क्या कर रहे हैं, इसका भी जवाब बीजेपी को देना चाहिए। उन सांसदों से पूछा जाना चाहिए कि उन्होंने संसद में इस मसले को क्यों नहीं उठाया?
తెలుగు సారం: ఆప్ యొక్క సభ్యులు లోక్ సభ వరకు దిల్లీ యొక్క విద్యుత్ సమస్యను లేవనెత్తారు. మాశాసనసభ్యులు , ఎంపీలు, ఈ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ గారిని కూడ కలసారు. కేంద్ర విద్యుత్ మంత్రి గారికి లేఖ వ్రాశారు. కానీ, బిజెపి యొక్క ఏడుగురు ఎంపీలు ఈ విషయంలో, ఏమి చేస్తున్నారో, ఆ పార్టీవారే జవాబివ్వాలి. ఈ సమస్యను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తలేదు, అనే విషయాన్ని ఆ పార్టీ సభ్యులనే అడగాలి.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారని, రాయలసీమ ఎడారిలో ఉండే మనం కంగారు పడనక్కర లేదు. బిజిలీ కిల్లత్ (విద్యుత్ కొరత), పానీ కిల్లత్ (నీటి కొరత) ఆమ్నీ ప్రజెంట్ (సర్వాంతర్యామి).
ఈ మధ్యనేను తాడేపల్లి గూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) రైల్వే స్టేషన్ లో తరచుగా రైలు దిగటం, రైలు ఎక్కటం చేయవలసి వచ్చింది. ఆరైల్వే స్టేషన్ లో కోల్ కత్తా చెన్నై మెయిన్ లో పోయే దాదాపు అన్ని రైళ్ళూ ఆగుతాయి. రైలు కొరకు వేచి ఉన్న సమయంలో నాకు సహ ప్రజలను గమనించటం అలవాటు. అన్ని రైళ్ళలోని ప్యాసింజర్లు బాటిల్సు పట్టుకొని రైళ్ళలోంచి దిగటం, సీసాలను పంపు నీళ్ళతో నింపుకోటం, మరల కదిలిన తమ రైలును పట్టుకోటం సుదర్శనం. చూడలేనిది ఏమిటంటే, ఆతరువాత ఆబాటిల్ నీళ్ళను పిల్లలకు పట్టించాలని ప్రయత్నించినపుడు వాళ్ళు తుపుక్కుమని ఉమ్మేయటం. ఆనీళ్ళు కటికి అరుచి కరమైనవి. తాగటం చాల కష్టం. ప్లాట్ ఫారాలపై రెండు కూలర్లను కూడ పెట్టారు. వాటిలో కూడ ఈ నీళ్ళే.
వాటర్ బాటిల్స్ షాపు కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి బాటిల్ కు ఎం ఆర్ పీ కన్నా కనీసం ఐదు రూపాయలు పెంచేసి తమ వ్యాపారం తాము చేసుకుంటూ పోతున్నారు. ఈ ఎం ఆర్ పీ కన్నా ఎక్కువకు అమ్మే అలవాటు నీటి విషయంలోనే కాదు, ప్రతి వస్తువు విషయంలో ఉన్నది. ఉదాహరణకు, హల్దీరాం కంపెనీ వారి అటుకుల ప్యాకెట్ బయట ఐదు రూపాయలకి అమ్మేది అక్కడ ఏడు ఎనిమిది రూపాయలు. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. కంప్లెయింటు బుక్ అడగమని ఆషాపులోనే బోర్డు ఉంది. కంప్లెయింట్ బుక్ అడిగితే ఆ నిర్వాహకుడు చాల అవమానకరంగా మాట్లాడాడు. చివరికి దిగివచ్చి ముద్రిత ధర ఐదురూపాయలకే ఇచ్చాడు తప్ప కంప్లెయింటు బుక్ ని ఇవ్వలేదు. త్రాగు నీళ్ళ బాటిల్స్ విషయంలో కంప్లెయింట్ బుక్ అడగటం వంటి పప్పులేమీ ఉడకవు. సరే, దుకాణాల వాళ్ళకు, సేల్స్ బాయ్స్ కి వాళ్ళ సమస్య లేవో వాళ్ళకి ఉంటాయి.
వ్రాయాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే, తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్ గోదావరి కాలువ ప్రక్కనే ఉన్నది. థార్ ఎడారిలో లేదు. రైల్వే శాఖవారు తాడేపల్లి మునిసిపాలిటీ వారిని సంప్రదించి రోజుకి ఒకటి రెండు టాంకర్ల మంచి నీటిని స్టేషన్ లోని కూలర్లను (ప్లాట్ ఫారం పై అన్ని కుళాయిలను కాదు) నింపుకోటానికి సేకరించలేరా? ఈవిషయంలో తాడేపల్లిగూడెం శాసన సభ్యుడు, ఏలూరు, నర్సాపురం ఎంపీలు చొరవ తీసుకోలేరా?
మన ఎంపీలకు ఆదాయం, సంపదల మధ్య వ్యత్యాసాలను తొలగించే దిశలో కృషిచేయటంలో కోరిక, తీరిక, ఓపిక లేవు, సరే, కనీసం రోజుకు ఒక ట్యాంకర్ మంచినీటిని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కి ఏర్పాటు చేయలేరా?
గెలిచే నేతలు టపాకాయలు కాల్చుకుంటూ గజమాలలు వేయించుకుని ఊరేగటంలో చూపే శ్రధ్ధలో ఆరో వంతు రైల్వే స్టేషన్లను, బస్ స్టాండులను దర్శిస్తే కనీసం త్రాగేటందుకు నీళ్ళైనా దొరుకుతాయి.
गुमशुदगी నా?
ఈనాటి పాట
చిత్రం: ఆకలి రాజ్యం. తెరమీద: కమల్ హాసన్. గానం: బాలసుబ్రహ్మణ్యం. మహా కవి ఆత్రేయ. స్వరాలు: ఎం. ఎస్. విశ్వనాథన్.
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ ||సాపాటు ||
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్
||సాపాటు||
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దాన కర్ణ
మన భూమి వేద భూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ||మన తల్లి...కొండరా||
డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకుని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్
||సాపాటు ...పెళ్లి లాంటిదే బ్రదర్||
బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో
ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా ||ఈపుణ్య||
ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నదే తప్పా ||ఆవేశం||
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్
||సాపాటు ...పెళ్లి లాంటిదే బ్రదర్||
సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ
సంపాదనొకటి బరువురా ఓ...
చదవెయ్య సీటు లేదు చదివొస్తే పనీ లేదు
అన్నమో రామ చంద్ర అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
||సాపాటు ... పెళ్లి లాంటిదే బ్రదర్||
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
ఈ పాటలో వ్రాసిన విషయాలు భారత పౌరులకు, తెలుగు ప్రజలకు వర్తిస్తాయి కానీ, ఇందులో పెదవులాడించిన శ్రీ కమల్ హాసన్ కి , శ్రీమతి శ్రీదేవికి వర్తించవు. తస్మాత్ జాగ్రత్త.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.