242 భారతీయులలో 90% మంది పిరికి వాళ్ళా, మూర్ఖులా?
చర్చనీయాంశాలు: 242, వాస్తు, భయాలు, నమ్మకాలు, శ్రీరాముడు, రామాయణం, చంద్రబాబు
జాతీయ ప్రెస్ కమీషన్ ఛెయిర్మన్ , విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జస్టిస్ మార్కండేయ కట్జూగారు, గతంలో ఒకసారి భారతీయులలో 90% మంది మూర్ఖులే అని వ్యాఖ్యానించి, తరువాత విమర్శకుల వత్తిడికి తన వ్యాఖ్యను ఉపసంహరించుకున్న విషయం విజ్ఞులైన పాఠకులకు విదితమే. నేనెలాగో గాడిదనే కాబట్టి దానిని మరల మరల ప్రస్తావించి, భారతీయులను, తెలుగు వాళ్ళను, శేషాంధ్రులను విశ్లేషించుకోటానికి వినియోగించుకోటానికి సాహసిస్తున్నాను.
నా పోస్ట్ నంబర్ ౨౪౦ చూడండి. క్లిక్ వెళ్ళుటకు http://problemsoftelugus.blogspot.in/search/label/240 . దీనిలో నేను భారతీయులలో 90% దాకా జూదగాళ్ళున్నారని, వారంతా ధర్మరాజు, నలుడు, బలరాముడి మొ|| వారి కన్నా గొప్పవారనీ ప్రతిపాదించి ఉన్నాను. దాని నేపథ్యం స్టాక్ మార్కెట్లు, క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల బెట్టింగులు, రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్, బంగారం స్పెక్యులేషన్.
ఇప్పుడు ప్రతిపాదిస్తున్నది, భారతీయులలో 90% మంది పిరికి వాళ్ళే. ఋజువు చేయటానికి చాల తేలిక పధ్ధతి ఉంది. ముంజేతి కంకణం చూసుకోటానికి అద్దమేలా, అంటారు. ఆసేతు హిమాచలం, ఉత్తరాన శ్రీనగర్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు, తూర్పున ఇటానగర్, ఇంఫాల్, ఐజ్వాల్ నుండి, పడమర పోర్ బందర్ వరకు, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆఇంటి ముందు ఏమి తగిలించి ఉందో గమనించండి. అక్కడ కనిపించే వస్తువు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, తెగని బట్టి కొంత మారుతుందేమో కానీ, మౌలిక లక్ష్యం, సూత్రం మారదు. అది ఒక దిష్టి బొమ్మ కావచ్చు, ఒక గుమ్మడి కాయ కావచ్చు, రాగిరేకు మీద చెక్కించిన మంత్రం, తంత్రం, యంత్రం తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పారశీ, అరబ్బీ, ఏదైనా కావచ్చు. అన్నిటి లక్ష్యం , దుష్టశక్తులు తమ ఇంట్లోకి, కార్యాలయంలోకి, దుకాన్ లోకి , కార్ఖానా లోకి, హర్మ్యంలోకి ప్రవేశించకూడదు.
కెసిఆర్, చంద్రబాబు, నరేంద్రమోడీ సంగతేమిటి?
వీటి గురించి మీరు టీవీల్లో, పత్రికల్లో చదువ బోతున్నారు.
శేషాంధ్ర మనోనీత్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి హైదరాబాదు సచివాలయంలో దక్షిణ హెచ్ బ్లాక్ భయం పట్టుకుందట. స్వంత డబ్బా కొట్టుకునే వాస్తు వ్యాపారులు , ఆ హెచ్ బ్లాక్ వాస్తు ప్రకారం లేదని భయపెట్టారట. ఒక వాస్తు పండితుడి గారి ప్రకారం ఆ భవనంలో నాలుగు వాస్తు లోపాలున్నాయిట. ఆభవనంలో పనిచేస్తే మొదటినుండే న్యాయసమస్యలు చుట్టుముట్తాయిట. కేంద్ర ప్రభుత్వ బిల్డింగ్ కమీటీ వారు ఆభవనాన్ని కేటాయించినందువల్ల తామేమీ చేయలేమని ప్రధాన కార్యదర్శి గారన్నారుట. కావాలంటే, సీమాంధ్ర కొత్తముఖ్యమంత్రిగారు మార్చుకోవచ్చు అన్నారుట. భవనాన్నే మారుస్తారా, భవనంలో గోడలు పగులగొట్టి మార్పులు చేస్తారా, మనం వేచిచూడాలి.
వాల్మీకి రామాయణంలో
శ్రీరామచంద్రుడికి కూడ దుష్టశక్తుల భయం ఉండేదా?
వాల్మీకి రామాయణం 2-56-23 లో శ్రీరామచంద్రమూర్తి గారు ఏమి చెప్పారో, ఏమి చేసారో చూడండి.
నేపథ్యం: సీతారామ లక్ష్మణులు చిత్రకూట సమీపంలో , అరణ్య వాసం లోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఒకచోట పర్ణశాల వేసుకోవాలి. శ్రీరాముడు లక్ష్ణణుడికి ఆర్డర్ వేస్తున్నాడు.
2-56-23 rAma further said.
mrigam hatvA Anaya kshipram మృగం హత్వా ఆనయ క్షిప్రం
lakshmaNEha shubhEkshaNa లక్ష్మణేహ శుభేక్షణా
kartavyaH SAstradrushTO hi కర్తవ్యః శాస్త్ర దృష్టో హి
vidhir dharmam anusmara. విధిర్ ధర్మం అనుస్మర.
తెగులుసారం: శుభమైన దృక్కులు గల ఓ లక్ష్మణా, వెంటనే జింకను చంపి తీసుకు రా, శాస్త్ర దృష్టి ప్రకారం, విధిని అనుస్మరిస్తు మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాము.
వైబీరావు గాడిద వ్యాఖ్య
లక్ష్మణుడి శుభదృక్కులేమో గానీ జింకలపాలిట మృత్యు దృక్కులై పోయాయి. ఈశాస్త్రమేమిటో, చిన్న తాటాకుల పాకను వేసినా (పర్ణశాల == ఆకులు కప్పిన ఇల్లు), విధిని స్మరించుకుంటు, కర్తవ్యనిర్వహణ అంటూ జింకలను కొట్టుకు రమ్మంటున్నది.2-56-24 ప్రకారం లక్ష్మణుడు జింకలను కొట్టుకొని తెచ్చాడు.
ఇప్పుడు 2-56-25 ప్రకారం శ్రీరామ చంద్రమూర్తి గారు ఏమంటున్నారో చూడండి.
inEyam shrapayasvai ఇనేయం శ్రపయశ్వై
tachcchAlAm yakshyamahe vayam తఛ్ఛాలా యక్ష్యామహే వయం
tvara saumya muhuurto ayam త్వర సౌమ్య ముహూర్తో అయం
dhruvashcha divasoapyayam. ధృవశ్చ దివసో అప్యయం.
తెలుగు సారం: ఓ సౌమ్యుడైన లక్ష్మణుడా!! ఈజింక మాంసాన్ని ఉడికించు. మనం ఈ పర్ణశాలను అర్చిద్దాము. ఈదినం, ఈముహూర్తం అన్ని దివ్యమైనవి, ప్రత్యేక లక్షణాలు కలిగినవి. త్వర == తొందరగా చేయి.
ఇపుడు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞ ప్రకారమే చేసాడు.
2-56-26 చూడండి.
sa lakSmaNaha kRishNa mRigam hatvaa స లక్ష్మణః కృష్ణ మృగం హత్వా
medhyam pratApavAn మేథ్యం ప్రతాపవాన్
atha cikshEpa saumitriHi అథ చిక్షేప సౌమిత్రిః
samiddhe jaata vedasi. సమిధ్ధే జాతవేదసి.
తెలుగు సారం: ప్రతాప వాన్ అనే పదాన్ని చూడండి. మన లక్ష్మణుడు గారు ప్రతాపవంతుడు కదా. ఒక నల్లనిజింకని (నల్లని కృష్ణ మృగం చాల మహిమ కలదని నమ్మకం, ఉత్తర రామాయణంలో వాల్మీకి ఆశ్రమంలో కల్యాణీ కపిలకి పట్టిన గతిని గుర్తు తెచ్చుకోండి. క్లిక్ టు గో టూ http://problemsoftelugus.blogspot.in/search/label/124 ) కొట్టుకొచ్చాడు. అగ్నిలోకి విసిరేశాడు. ఇపుడు ఈ నల్ల జింక ఎఱ్ఱగా కాలాలి. కాల్చాడు. అలాగని రక్తం చాయలు కనపడకుండా కాల్చాడు.
2-56-27 చూడండి.
tam tu pakvam samaagnAya తంతు పక్వం సమాజ్ఞాయాఇంత బాగా కాల్చినందుకు, వాల్మీకి మహాముని, లక్ష్మణుడిని పురుష వ్యాఘ్రంతో పోల్చక పోతే ఎలా. పురుష వ్యాఘ్రం అంటే , పురుషులలో పులివంటి వాడు కదా. (జింకలకు కూడ పులి లాంటి వాడేనా?)
nishtaptam chinna shONitam నిష్తప్తం ఛిన్న శోణితం
lakShmaNaH puruSha vyaaghram లక్ష్మణ పురుష వ్యాఘ్రం
atha rAghavam abraviit. అథ రాఘవం అబ్రవీత్.
ఇపుడు 2-56-28 చూద్దాం. రాముడితో అంటున్నాడు.
ayam kRishNaH samApta angaH అయం కృష్ణః సమాప్త అంగః
shRitaH kRiSNa mRigo yathA ష్రితాః కృష్ణమృగో యథా
devatA deva samkASa దేవతా దేవ సంకాశా
yajasva kuSalo hi asi. యజస్వ కుశలో హి అసి.
తెలుగు సారం: దేవతలను పూజించటంలో నీవు కుశలుడవేలే. నేను ఈ నల్ల జింక సర్వాంగాలను చక్కగా మగ్గపెట్టాను. ఓ దేవ సంకాశా అంటే నీవు దేవతలకి సమానుడివి. ఇంక దేవతలను పూజించు.
ఇపుడు రాముడేమి చేశాడో, 2-56-29 లో ఉంది.
rAmaH snAtvA tu niyataH రామః స్నాత్వా తు నియతః
guNavAn japya kovidaha గుణవాన్ జప్య కోవిదాః
samgrahENa akarot sarvAn సంగ్రహేన అకరోత్ సర్వాన్
mantran SatrAvasAnikAn. మంత్రాన్ శాత్రావసానికాన్ (లేక సత్రవాసానికాన్).
తెలుగు సారం: మన రాముడు గారు గుణవంతుడు, జప కోవిదుడు. చక్కగా స్నానం చేశాడు. నియతః అంటే నియమాల ప్రకారం జీవించే వాడు. ఏమి నియమాలో ఏమిటో. చక్కగా అన్ని మంత్రాలూ చదివేశాడు. సత్రవాసానికాన్ అన్నప్పుడు గృహప్రవేశానికి అనుగుణమైన అనచ్చు. శాత్రావసానికాన్ అంటే శత్రువులు చావటానికి అనచ్చు. ఏదైతేనేం మంత్రాలు చదివి పూజ చేశాడు.
ఇపుడు 2-56-30 కి వద్దాము. ఈ కృష్ణ జింకను లక్ష్మణుడి చేత మంటల్లోకి విసిరేయించి ఎర్రగా కాల్పించి, రక్తం కనపడకుండా ఉడికించి, స్నానం చేసి, మంత్రాలు చదివేయటంతో శ్రీరామచంద్రమూర్తి కి గొప్ప మనోహ్లాదం కలిగింది.
iSTvA dEvagaNAn sarvAn ఇష్ట్వా దేవ గణాన్ సర్వాన్
vivesha Avasatham shucihi వివేశ ఆవసతం శుచిః
babhuUa ca manohlAdo బభూవ చ మనోహ్లాదో
rAmasyAmitatEjasaha. రామస్యామిత తేజసః.
తెలుగు సారం: అసలే శ్రీరాముడు గారు అమిత తేజసుడు. ఇంక దేవతలను పూజించి, శుచిగా ఆ వసతి లోకి ప్రవేశించగానే, ఆయనకు గొప్ప మనోహ్లాదం కలిగింది.
వైబీరావు గాడిద వ్యాఖ్య
ఇలా జింకను మంటల్లోకి విసిరేస్తే ఏమి శుచి లభిస్తుందో, ఏమి మనోహ్లాదం కలుగుతుందో అమిత తేజసుడైన ఆశ్రీరామ చంద్రుడికే తెలియాలి. గాడిదగా నాకు అర్ధం కావటలేదు.
పోనీ ఆ పర్ణశాల ముఖేష్ అంబానీగారి ఇల్లులాగా ఒక బిలియన్ డాలర్లు తగలేసి కట్టింది కాదు, దీనికి భారీగా శాంతి చేయాలి అనటానికి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి భవనమో, సియర్స్ టవర్ వంటి భవనమో, డుబాయ్ లోని బుర్జ్ అల్ అరబ్ వంటి టవరో అయితే శాంతి కావాలి అనచ్చు. కేవలం ఒక చిన్న పర్ణశాలే కదా. పైగా శ్రీరామ లక్ష్మణులు మహా పరాక్రమ వంతులాయే. దుష్టశక్తులనుండి పర్ణశాలను రక్షించుకోటం వారికి ఒక సమస్యకాదు. ఈమాత్రం దానికి ఆ నిర్భాగ్య దగాపడిన జింకను నిప్పుల్లోకి విసిరేయాలా?
బ్యాక్ టూ చంద్రబాబు, కెసీఆర్, నరేంద్రమోడీస్' గృహ ప్రవేశం, ఆఫీస్ ప్రవేశం
ప్రస్తుతం బహిరంగంగా జింకల్ని మంటల్లోకి విసిరేసి శుచి అయ్యే పరిస్థితులు లేవు. ఏమి చేసినా రహస్యంగా చేయాలి. శ్రీనరేంద్రమోడీగారికి స్వఛ్ఛమైన శాకాహారిగా పేరుంది. కెసీఆర్ గారికి , చంద్రబాబుగారికి, యాగాలు అలవాటే గాని జంతువులతో బహిరంగంగా యాగాలు చేయిస్తారని ఆశించలేము.
గుజరాత్ లో ద్వారాలకు గుమ్మడికాయలు కట్టే ఆచారం ఉందో లేదో తెలియదు. దీని గురించి మనం లోతుగా అధ్యయనం చేస్తేగాని ఏమీ వ్రాయకూడదు. వెజిటేరియన్ పూజలు ఉంటాయని ఆశించ వచ్చు. వేచిచూడాలి.
పూజలు, ప్రార్ధనలు (ఏమతానివైనా) చేయకుండా ఆఫీసులోకి ప్రవేశించిన ప్రధాన మంత్రులు గానీ, ముఖ్యమంత్రులుగానీ, మంత్రులు గానీ, ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పరిశోథిస్తేగానీ తెలియదు. సమస్యేమిటంటే , పూజలు ప్రార్ధనలు అంటే డబ్బులతో పని. లక్షలవచ్చు, కోట్లవచ్చు.
దీన్ని మనోభావాలు దెబ్బతినకుండా తిరగవ్రాయవలసి ఉన్నది. ఇంకా వ్రాయాల్సింది వంద పేజీలు ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.