241 చక్కటి కార్టూనిస్టు స్వర్గీయ కంబాల శేఖర్ అకాల మృతికి నా ప్రగాడ సంతాపం
చర్చనీయాంశాలు: 241, నరేంద్రమోడీ, కార్టూనిస్టులు, జశోదాబెన్
ఫొటో, శేఖర్ ఫొటోస్.బ్లాగ్ స్పాట్.కామ్ వారి దయతో.
ప్రజాశక్తి, న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రజ్యోతి మొ|| పత్రికలలో పనిచేసిన శ్రీకంబాల శేఖర్ మరణం నన్ను క్రుంగతీసింది. కార్టూనిస్టుల జీవితాల గురించి, ఆయన కొద్దినెలల క్రితం ఒక తెలుగు పత్రికలో వ్రాసిన స్వీయానుభవాలను చదివే భాగ్యం నాకు కలిగింది.
ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్
ప్రస్తుతం రాష్ట్రంలో కార్టూనిస్టులకు సరియైన ప్రోత్సాహం లేదు. ఒకే ఒక మినహాయింపు, ఈనాడు కార్టూనిస్టు, శ్రీధర్. నేను విన్న ప్రకారం, ఈనాడు దిన పత్రిక వారు, శ్రీధర్ కు ఒక స్టాఫ్ కారును కూడ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. నిజమైతే, ఇది చాలా ముదావహం. ఆయన గీసిన ఎన్నో కార్టూన్ లు నా మస్తిష్కంలో గింగరాలు కొట్తూ ఉంటాయి. ఇది ఈనాటి సంగతి కాదు. స్వర్గీయ పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా, మన్మోహన్ సింగు ఆర్ధికమంత్రిగా ఉన్నకాలంలో, శ్రీధర్ ఒక చక్కటి కార్టూను గీసాడు. పివి డోలక్ వాయిస్తూ ఉంటాడు. మన్మోహన్ ఒక కొరడాతో తనను తాను కొట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా, ప్రపంచ బ్యాంకును సంతోష పెట్టటానికి. లక్ష మాటలలో మనం ఇవ్వలేని ఒక సందేశాన్ని శ్రీధర్ నాలుగు గీతలలో ఇచ్చేశాడు అన్న మాట.
నాకు కార్టూన్ లు గీయటం రాదు. అందుకంటే శ్రీధర్ అంటే నాకు అసూయ.
శ్రీధర్ కొద్దిరోజుల క్రితం ఈనాడులో ఒక కార్టూన్ గీశాడు. ప్రధానిగా ఎన్నికైన శ్రీనరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి సార్కు దేశాధీశులనందరినీ ఆహ్వానించాడు. దీనికి శ్రీధర్ గీసిన కార్టూన్, నరేంద్రమోడీ బొట్టుపెట్టి పొరుగింటమ్మలను పేరంటాలకి పిరవటం. చాలా అద్భుతంగా గీశాడు. కానీ, గడ్డం లేకుండా ఉంటే బాగుండేదేమో నని నాకనిపించింది. కాపీరైట్ కారణాల వల్ల ఆకార్టూన్ ని ఇక్కడ పెట్టలేక పోతున్నాను.
వైబీరావుగాడిద వ్యాఖ్య
సురేంద్ర మూఢుడు తన పదవీ గ్రహణోత్సవానికి సకల దిక్పాలకులను ఆహ్వానించాడు. కానీ శచీదేవిని ఆహ్వానించాడో లేదో తెలియదు. పాపం, శచీదేవి, పతి పిలిస్తే వెళ్దామని ఆశ పడుతున్నది.
ఈనాటి హిందీ నేర్చుకుందాం
మనోనీత్ ప్రధాన మంత్రి (मनोनीत प्रधानमंत्री): Prime Minister designate.
ప్రయోగం: हमारे मनोनीत प्रधानमंत्री दिनांक 26 मई, एक बडे समारोह में प्रधान मंत्री का शपथ ग्रहण लेंगे।
తెలుగు సారం: మన మనోనీత్ ప్రధాన మంత్రి గారు (ప్రధానిగా గుర్తింపబడిన వారు, ఇంకా ప్రధాని పదవిని చేపట్టలేదు), మే 26 నాడు ఒక పెద్ద సభలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈనాటి పాట
గోరంత దీపం చిత్రంలోది.
వ్రాసింది ఆరుద్ర. సంగీతం : కె.వి.మహదేవన్. పాడింది సుశీల.
తెరమీద : వాణిశ్రీ అని నాకు గుర్తు.
రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా
బోయనైనా కాకపోతిని పుణ్యచరితము పాడగా రాయినైనా ||రెండవ సారి||
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతినిభక్తి రాజ్యమునేలగా
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా
అందువలన రామచంద్రుని అమిత కరుణను నోచనా అడవి లోపల ||రెండవ సారి||
కడలి గ ట్టున ఉడతనైతే బుడత సాయము చేయనా
కాలమెల్ల రామభ ద్రుని వేలిగురుతులు మోయనా , రాయినైనా ||
కాకినైనా కాకపోతిని ఘాతుకమ్మును చేయుచు
గడ్డిపోచను శరముచేసే ఘనత రాముడు చూపగా కాకినైనా ||రెండవ సారి||
మహిని అల్పజీవులే ఈ మహిమలన్నీ నోచగా
మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా మద మత్సరమ్ములు రేపగా
పడవనైనా కాకపోతిని స్వామికార్యము తీర్చగా
పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యమునేలగా .
రాయినైనా ||
వైబీరావు గాడిద వ్యాఖ్య
జశోదా బెన్ గారి ఆవేదన ఫలించేనా?
సురేంద్రమూఢుడి హృదయం ద్రవించేనా?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.