240 భారతీయులలో 90% మంది మూర్ఖులా, జూదగాళ్ళా?
చర్చనీయాంశాలు: బెట్టింగులు, స్టాక్ మార్కెట్లు, నరేంద్రమోడీ, బిజెపి, విదుర నీతి, పాకిస్థాన్
విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీ మార్కండేయ కట్జూ గారు, భారతీయులలో 90% మంది మూర్ఖులని అని తరువాత ఉపసంహరించుకున్నారే కానీ, భారతీయులలో 90% మంది జూదగాళ్ళు అని అనే అవకాశాన్ని దక్కించుకోలేక పోయారు.
భారతీయులలో 90% మంది మూర్ఖులైనా కాకపోయినా, 90% పిరికి వాళ్ళే (ఈరచయితను కూడ కలిపి) అని చెప్పటానికి బలమైన సాక్ష్యాలున్నాయి. ఈ పిరికివాళ్ళు విషయాన్ని తరువాత ప్రస్తావించుకుందాము.
భారతీయులలో 90% మంది జూదగాళ్ళనటానికి కూడ సాక్ష్యాలున్నాయి. ఒక అర డజన్ రకాలు వ్రాస్తాను.
1. శ్రీనరేంద్రమోడీ అధికారంలోకి వస్తారని తెలియగానే పేట్రేగి పోతున్న స్టాక్ ఎక్సఛేంజీలు.
2. ఎన్నికల ఫలితాలపై రూ. 30000 కోట్లదాకా చెలరేగిన బెట్టింగులు.
౩. యువ వృధ్ధ భేదంలే కుండా అందరూ పాల్గొనే క్రికెట్ బెట్టింగులు.
4. ఏ సినిమా 100 కోట్లు పోగేస్తుంది, ఏసినిమా మొదటి వారం కలెక్షన్ ఎంత? వీటిపై బెట్టింగులు.
5. డైరక్టుగా ఇంటర్నెట్ ద్వారా లాస్ వేగాస్, మకాలు వంటి కేసీనో అంతర్జాతీయ బెట్టింగు సంస్థలతో పందాలు కాయటం.
6. కమోడీటీ పత్తి, మిర్చి మొ|| ధరల స్పెక్యులేషన్ జూదం, బంగారం ధరలలో స్పెక్యులేషన్ జూదం. పేకాటలు, కోడి పందాలు, గుర్రం పందాలు కల్చర్ గానూ, వినోదంగానూ, ఫ్యాషన్ గానూ చలామణీ అయే జూదాలు.
చిదంబరం గారు ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు, సెన్సెక్సు 2౦౦౦౦ దాటితే చాలని కలలు కనేవాడు. నేడు శ్రీమోడీ అధికారపీఠం ఎక్కబోతున్నట్లు తెలియగానే, సెన్సెక్సు 25౦౦౦ దీటిపోయింది. ఎక్కడినుండి వచ్చాయో కానీ, స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధులు కుప్పలుగా వచ్చి పడ్డాయి. ఫలితంగా రూపాయి బాహ్యవిలువ డాలర్ కు రూ. 6౦ నుండి రూ. 57కి పెరిగిపోయింది. ఇదంతా కరెన్సీ స్పెక్యులేషన్ ఫలితమే. సహజమైన పధ్ధతి లో రూపాయి బాహ్య విలువ పెరగాలంటే, భారత్ నుండి ఎగుమతులు రెట్టింపు కావాలి. అసహజమైన పధ్ధతులలో రూపాయి బాహ్యవిలువ పెరిగినపుడు, తగ్గినపుడు దాని ఫలితం ఎగుమతులపై ఉంటుంది. రూపాయి బాహ్య విలువ పెరిగింది అంటే ఐటీ కంపెనీలకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలకు నష్టాలు రాకూడదు అనే మిషతో మనం రూపాయి బాహ్యవిలువను కృత్రిమంగా దిగజార్చలేము.
భారతీయ ఆధునిక జూదాలను గురించ వ్రాయాలంటే వేయిపేజీలు చాలవు. ఆధునిక భారతీయ జూదగాళ్ళ ముందు నలుడు, ధర్మరాజు, రుక్మి, బలరాముడు, విరాటుడు మొ|| అందరూ దిగదుడుపే.
ఈనాటి పద్యం
ఆంధ్ర మహాభారతం, తిక్కన సోమయాజి.
వెలది జూదంబు పానంబు వేట పలుకు
ప్రల్లదంబును దండంబు పరుస దనము
సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము సేత
అనెడు సప్త వ్యసనముల జనదు తగుల.
ఈనాటి హిందీ పదం
न्योता - ఆహ్వానం.ఈ నాటి ప్రయోగం: भावी प्रधानमंत्री नरेंद्र मोदी ने, 26 मई होनेवाला शपथ ग्रहण समारोह में शामिल होने के लिए पाकिस्तान के प्रधानमंत्री नवाज शरीफ को न्योता दिया।
తెలుగు సారం: భావి ప్రధాని నరేంద్ర మోడీ, 26 మే నాడు జరిగే తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి రావలసిందిగా పాక్ ప్రధాని శ్రీ నవాజ్ షరీఫ్ కి ఆహ్వానం పంపించారు.
వైబీరావు గాడిద వ్యాఖ్య
ఈ ఆవు కట్టుతుందా, కట్టదా, ఈనుతుందా, ఈనదా, పాలు ఇస్తుందా ఇవ్వదా, అనేది మనం వేచి చూస్తే కానీ తెలియదు.
అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను,
సజ్జనుండు పల్కు చల్లగాను,
కంచు మోగునట్లు కనకంబు మ్రోగునా,
విశ్వదాభిరామ వినుర వేమ.
సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.