239 జశోదా బెన్ గారు, నరేంద్రమోడీ గారితో కలిసి అంబాజీ దేవాలయానికి వెళ్ళటానికి ఎదురు చూస్తున్నారు
చర్చనీయాంశాలు: నరేంద్రమోడీ, జశోదాబెన్, బిజెపి, గోల్ఫ్, గుజరాత్, అంబాజీ
చూడండి సార్, ఈయనయే మన చాయ్ వాలా.
శ్రీనరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్న సందర్భంగా తన తల్లిని సందర్శించి ఆమె దీవెనలు పొందిన ఫొటో పత్రికలలో వచ్చింది.
శ్రీమోడీ గారు ఇంత వరకు, తన estranged wife ధర్మపత్ని శ్రీమతి జశోదా బెన్ గారితో సెల్ ఫోన్ లో నైనా సంభాషించారో లేదో తెలియదు. దేశ సేవ చేయటానికి ధర్మపత్ని శుభ కామనలకు గుజరాత్ లో , భారత్ లో ప్రాముఖ్యం ఉన్నదో లేదో మనకు తెలియదు.
శ్రీ మోడీగారు ప్రధాన మంత్రి అయ్యేంత వరకు, తాను బియ్యంతో చేసిన వంటకాలు తినకూడదని శ్రీమతి జశోదా బెన్ గారు వ్రతం పూనారుట.
శ్రీమతి జశోదా బెన్ గారు మటుకు తన శ్రీవారితో కలసి ఉత్తర గుజరాత్ లో ఉన్న మాతా అంబాజీ దేవాలయాన్ని దర్శించి తన వ్రతాన్ని పూర్తిచేసుకోవాలని కోరుతున్నారుట.
శ్రీ మోడీగారు ధర్మపత్ని కోరికను మన్నిస్తారా, మన్నించరా, అనేది మిలియన్ బిలియన్ ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. లేదా , అంబాజీ దేవాలయాన్ని దర్శించాలని కోరినందుకు, ఓవరాక్షన్ చేయద్దని మందలింపులు ఉంటాయా. కొరడా దెబ్బలయితే (రాముడు భీముడు సినిమాలో రాముడికి తగిలించినట్లుగా) ఉండవు.
ఎవరైనా సరే ప్రధానమంత్రి పదవిలోకి రాగానే మీడియా భజన కార్యక్రమంలో విజృంభిస్తుంది. గతంలో చంద్రశేఖర్ కి, రాజీవ్ గాంధీకి, విపీసింగుకి, దేవెగౌడకి, ఐకె గుజ్రాల్ కి , పీవీ నరసింహారావుకి, వాజ్ పేయీకి ఈ భజనలు జరిగినవే. ఉన్న సుగుణాలు, లేని సుగుణాలు కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్లుగా ప్రవర్తిస్తాయి.
కాంగ్రెస్ గెలిచి ఉంటే, ఇప్పటికల్లా రాహుల్ గాంధీని, ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడేవాళ్ళు.
ప్రధాన మంత్రి పదవిలో ఉన్నవాడు రోజుకి 18 గంటలు పనిచేయటం లో వింతేమీ లేదు. భారత్ లో ప్రతి పోలీసు కాన్ స్టేబుల్ ఏ ఏసీలు లేకుండానే మండు టెండలో, జోరువానలో 18 ఏమి కర్మ వరుసగా 72 గంటలు డ్యూటీలు చేయటం సర్వ సాధారణం. మీడియా, పదవులలో ఉన్నవాళ్ళ భజన మానేస్తేనే బాగుంటుంది.
ఇంకా సరిదిద్ది వ్రాయాల్సి ఉంది. ఎవరి మనో భావాలైనా గాయపడితే, కామెంట్సులో వ్రాస్తే సరిదిద్దుకుంటాను.
ఈనాటి పాట
చిత్రం: శారద, 1973.
రచన: మహాకవి డాక్టర్ సీ. నారాయణ రెడ్డి.
సంగీతం: చక్రవర్తి.
దర్శకత్వం: విశ్వనాథ్.
వ్రేపల్లె వేచెను వేణువు వేచెను వ్రేపల్లె||
వనమెల్ల వేచేనురా...
నీ రాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం||
ఈ రాధ వేచేనురా..
రావేలా.. రావేలా..
కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని, కోకిలమ్మ||
గున్నమావి పూయనన్నది నీవు రాలేదని
humming.
కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా.. కాటుక||
కదలాడె యమునానది
నీరాక కోసం నిలువెల్ల కనులై
ఈరాధ వేచేనురా
రావేలా.. రావేలా..
మా వాడ అంటున్నది స్వామి వస్తాడని, మావాడ||
నా నీడ తానన్నది రాడు రాడేమని
humming.
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా, రగిలెను||
రావేలా చిరుజల్లుగా
నీ రాక కోసం నిలువెల్ల కనులై , ఈ రాధ వేచేనురా.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.