238 మోడీ భారత సమస్యలను తీర్చలేడు. కేవలం సందీప్త మార్క్సిజం మాత్రమే తీర్చ గలదు.
చర్చనీయాంశాలు: 238, నరేంద్రమోడీ, మార్క్సిజం, బిజెపి, ఎన్ డిఏ, వడోదారా
మతపిచ్చి గల భారతీయులు శ్రీనరేంద్రమోడీపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. వారి ఆశలలో కొన్నిటిని, అంటే రామాలయ నిర్మాణం వంటి వాటిని, ఆయన తీర్చే అవకాశం ఉంది.
కులం ఆధారంగా, మతం ఆధారంగా, భారతీయులు వోట్లు వేస్తారు, అని గతంలో విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయ మూర్తి శ్రీ మార్కండేయ కట్జూ గారు అన్నమాట అక్షరాల నిజమైంది. అయితే భారతీయులలో ఎంత మందికి ఏ మత పిచ్చి ఉంది అనే దానికి లెక్కలు లేవు.
కులమతాల ఆధారంగా కాక ఇతర కారణాల వల్ల కూడ శ్రీ నరేంద్ర మోడీకి , బిజెపికి, ఎన్ డి ఎకి వోట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కేవలం కాంగ్రెస్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబపాలనకి వ్యతిరేకంగా వోటు వేసిన వారికి పెద్ద ఆశలు ఉండవు కాబట్టి వారిని శ్రీ మోడీ నిరుత్సాహ పరిచేది పెద్దగా ఏమీ ఉండదు. శ్రీ మోడీ నేతృత్వంలో భారత్ ఎంతో గొప్ప ఆర్ధిక అభివృధ్ధిని సాధించి గతంలో నెహ్రూ కుటుంబ పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చివేయటం సాధ్యం అని ఆశ పెట్టుకున్నవారు మాత్రం నిరాశ పడక తప్పదు.
భగవంతుడు అనే పదానికి ఎలా అయితే నిర్వచనం లేదో అభివృధ్ది అనే పదానికి కూడ నిర్వచనం లేదు. ఒక్కొక్కరి నిర్వచనం ఒక్కో రీతిలో ఉంటుంది. నన్ను నిర్వచించమంటే, అందరికి ఉచిత గాలి-నీరు-ఆహారం, యూనిఫారం బట్టలు, యూనిఫారం నివాసాలు, వృధ్ధాప్యంలో భద్రత, ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, నిర్బంధ రోజుకి ఎనిమిది గంటల , వారంలో ఐదున్నర రోజుల పని, అన్నింటిని మించి వ్యక్తి స్వాతంత్ర్యానికి గుర్తింపు, గౌరవంతో కూడిన జీవితం (dignity of life) ఇది అభివృధ్ధి.

మహాకవి శ్రీశ్రీ చేదు పాట
ఔను నిజం, ఔను నిజం
ఔను నిజం, నీవన్నది,
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో!
బ్రదుకు వృథా, చదువు వృథా,
కవిత వృథా! వృథా, వృథా!
మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగలం!
వెనుక దగా, ముందు దగా,
కుడి యెడమల దగా, దగా!
మనదీ ఒక బతుకేనా?
కుక్కల వలె, నక్కల వలె!
మనదీ ఒక బతుకేనా?
సందులలో పందులవలె!
నిజం సుమీ, నిజం సుమీ,
నీవన్నది నిజం సుమీ!
బ్రతుకు ఛాయ, చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ!
లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం జీవఫలం!
జీవఫలం చేదువిషం,
చేదు విషం, చేదు విషం!
ఔను నిజం, ఔను సుమా,
ఔను నిజం నీవన్నది!
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!
నా దృష్టిలో మనుష్యులు చెట్ల మీద వాలి మరల ఎగిరిపోతూ ఉండే పక్షుల లాంటి వాళ్ళు. అన్ని పక్షులూ చెట్లపై ఒకే సమయం వాలి ఉండవు. కాపురాలూ అంతే. ముందు వచ్చినవి ముందు వెళ్ళాలనీ లేదు, వెనుక వచ్చినవి వెనుక వెళ్ళాలనీ లేదు. ముందు వచ్చినవి వెనుక వెళ్ళ వచ్చు, వెనుక వచ్చినవి ముందు వెళ్ళ వచ్చు. మానవులు ఉన్నంత కాలం వారి జీవితం ఆనందంగా సాగి, మరణం కూడ ఆనందం భరితంగానే ముగిస్తే ఆ సమాజంలోని వ్యక్తులు, ఆసమాజమూ ధన్యులు అవుతారు.
పెట్టుబడిదారీ విధానంలో మనకట్టి ధన్యత్వానికి ఆస్కారమే లేదు.
ఉదాహరణకి, శ్రీనరేంద్రమోడీ మహోదయ్ గుజరాత్ లోని వడోదారాలో పిపిపి (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించబడిన బరోడా నగర బస్ స్టాండునే తీసుకోండి. ఈ అభివృధ్ధికే వడోదారా ప్రజలు ఉబ్బి తబ్బిబ్బయి పోయి శ్రీమోడీకి 5,70,128 వోట్ల మెజారిటీ ఇచ్చి కట్టబెట్టారా, లేక ఆయన మత తత్వానికి మెచ్చుకొని కట్టబెట్టారో గానీ, నేను పైన వ్రాసిన నిర్వచనం పరిథిలోకి మటుకు ఈ అభివృధ్ధి రాదు.
NARENDRA MODI Bharatiya Janata Party 845464
MISTRI MADHUSUDAN DEVRAM Indian National Congress 275336
SUNIL DIGAMBAR KULKARNI Aam Aadmi Party 10101
ROHIT MADHUSUDAN MOHANBHAI Bahujan Samaj Party 5782
TAPAN DASGUPTA SOCIALIST UNITY CENTRE OF INDIA (COMMUNIST) 2249
PATHAN SAHEBKHAN ASIFKHAN Samajwadi Party 2101
JADAV AMBALAL KANABHAI Janata Dal (United) 1382
PATHAN MAHEMUDKHAN RAZAKKHAN Apna Desh Party 1109
None of the Above None of the Above 18053
చూశారు కదా, బొమ్మలను. మీడియా, ముఖ్యంగా పెయిడ్ న్యూస్ కి, భారీ ప్రకటనలకు అలవాటు పడ్డ మీడియా, వడోదారా బస్ స్టేషన్ ను ఎయిర్ పోర్టుతో పోల్చాయి. మనకి తెలుగులో ఒక సామెత ఉంది. ''టంగుటూరు మిరియాలు తాటికాయలంత '' అని. మొదటి చూపులో ఇవి అన్నీ మయసభలాగా కనిపించేలా అలంకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజయవాడ, గుంటూరు, విశాఖ మొ|| బస్ స్టేషన్ లను ప్రజా ఆస్తులుగా, తమ స్వంత ఆస్తులుగానే భావిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ , జంక్షన్ లోనూ చక్కటి బస్ స్టేషన్ లు ఉన్నాయి. ఇవి అన్నీ ప్రజలవే. తమ స్వంత ఆస్తులుగా భావించటం వల్ల అక్కడక్కడ గుట్కా మరకలు, సిగరెట్ పీకలు కనిపిస్తూ ఉండవచ్చు. ఇవి ఏవీ ప్రభుత్వ డబ్బుతో కానీ, ప్రైవేటు వాళ్ళ డబ్బుతో నిర్మించబడినవి కావు. ప్రజలు స్వేఛ్ఛగా రాత్రిళ్ళు ఈ బస్ స్టేషన్లలో పైసా ఖర్చులేకుండా, నిద్రిస్తూ ఉంటారు. తెల్లారి లేవగానే, తమతమ ఊర్లకు బస్ ను పట్టుకొని హాయిగా వెళ్తారు. కొద్దిగా డబ్బులున్నవాళ్ళు చవక డార్మిటరీలలో ఉంటారు. లేదా, బయట లాడ్జీలలో మడత మంచాలు అద్దెకి తీసుకుని ఉంటారు. మొత్తం మీద , వాళ్ళ డిగ్నిటీ కి లోపం ఏమాత్రం కలుగదు. వాళ్ళని ఇదేమిటి అని వాయించి మెడ పెట్టి గెంటి వేసే వాళ్ళు ఉండరు. బస్ స్టేషన్ల నిర్వహణలో కొన్ని లోపాలు ఉంటే ఉండ వచ్చు. కొన్ని చోట్ల ఆస్తులు అశ్రధ్ధకు గురి అవుతు ఉండవచ్చు. మొత్తంమీద ఇవన్నీ పబ్లిక్ ఆస్తులన్న స్పృహ ఉంది.
మోడీ గారు నిర్మించిన బస్ స్టేషన్ ను తీసుకోండి. దీని పేరు పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్. దోపిడీ చేసుకోమని ప్రైవేటు సంస్థలకు, ప్రజలు తిరిగే స్థలాన్ని అప్పగించేశారు. ప్రజలు డబ్బులు కట్టకుండా, ఫ్రీగా తిరుగ కలిగే స్థలాన్ని తగ్గించేశారు. ఎప్పుడో ముఫ్ఫయి యేళ్ళకో యాభయి ఏళ్ళకో, ఆ భాగస్వామ్యాన్ని తీసుకున్న సంస్థవారు, తిరిగి దీన్ని ప్రభుత్వానికి హోల్ గా ఇచ్చేస్తారు అనేది ఒక పగటి కల. ఆటైముకి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఏదో ఒక కారణం చెప్పి ఖాళీ చేయించకుండా ఇంజన్ క్షన్లు తెచ్చుకొని మరల కొన్ని దశాబ్దాలు లాభాలు పోగేసుకుంటారు. మౌలికం గానే ఈపధ్ధతిలో లోపం ఉందని శ్రీ నరేంద్ర మోడీ గారు గుర్తించలేక పోటం దురదృష్టకరం.
దీనిని చాల లోతుగా చర్చించ వలసి ఉన్నది. ఇంకా వ్రాయాలి. త్వరలో.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.