237 కౌలు రైతులను ఎలా ఆదుకోటం?
చర్చనీయాంశాలు: వ్యవసాయం, కౌలు రైతులు, బ్యాంకు ఋణాలు, చంద్రబాబు, Chandra Babu Naidu, tenant farmers
రాత్రంతా టపాసుల మోత మార్మోగి పోయింది. పటాఖాలకే రెండు లక్షలు ఖర్చయి ఉంటాయి. ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకే ఇన్ని బాంబులు కాల్చాలా? సరే, చంద్రబాబు నాయుడిగారిని ఆనందోత్సవాలు చేసుకోనిద్దాము. ఒక నియోజక వర్గానికే రెండు లక్షలు ఖర్చయితే ఆంధ్ర ప్రదేశ్ మొత్తానికి ఎంత ఖర్చై ఉండాలి.
ఆయన వీలైనంత తొందరగా, శ్రీ నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకొని రైతులకి తాను వాగ్దానం చేసిన ఋణాల మాఫీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ చేత, కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల చేత, అమలు చేయిస్తాడని ఆశిద్దాము. ఇది స్వంత పొలాలున్న రైతులకు బాగానే ఉంటుంది. భూములను అనధికారిక కౌలుకిచ్చి, తమ పేర్లతో బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకి గాలి వాటం లాభాలు కూడ వస్తాయి. సరే, అది అట్లుండనిండు.
మరి మౌఖిక కౌలుదారీ రైతుల సంగతి ఏమిటి?
ఖరీఫ్ వానలు దగ్గర పడుతున్నాయి. విత్తనాలు కొనుక్కోవాలి. ఎరువులు సిధ్ధం చేసుకోవాలి. ట్రాక్టర్లకు కిరాయిలు ఇచ్చుకోవాలి. మౌఖిక కౌలు రైతులకు బ్యాంకు ఋణాలు ఆంధ్రప్రదేశ్ లో లభించవు అనేది అందరికీ తెలిసిన విషయమే.
తీసుకోవాల్సిన చర్యలు
ప్రభుత్వం తక్షణమే, వీఆర్ వో లను రంగంలోకి దించి ప్రతి గ్రామంలోని యాబ్ సెంటీ లాండ్ లార్డుల పట్టిక తయారు చేయించాలి. ముఖ్యంగా స్వయంగా పొలందున్నించి సాగుచేయించే అవకాశాలు లేని వారిని అంటే వేరే ప్రాంతాలలో పని చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, బిజీ డాక్టర్లను, బడా పారిశ్రామిక వేత్తలను, పెద్ద వ్యాపారులను గుర్తించి వారి భూములను నోటీఫికేషన్లు జారీ చేయించి కౌలుకు తీసుకోవాలి. వాటిని గ్రామంలో మౌఖిక కౌలు చేసుకుంటున్నవారికి లాటరీ ద్వారా న్యాయమైన కౌలుకు రెండేళ్ళ కాలానికి కేటాయించాలి.
బ్యాంకులకి, ప్రభుత్వమే హామీ ఇచ్చి వారికి రెండేళ్ళ కాలానికి ఒకే సారి వ్యవసాయ ఋణ పరిమితిని ఇప్పించాలి. పంటకోతల సమయంలో వీ ఆర్ వో ల చేత, వ్యవసాయ అధికారుల చేత , మార్కెట్ యార్డ్ అధికారుల చేత పర్యవేక్షణ చేయించి పంటను బస్తాలు, బోరాలు గా కట్టించి గోడౌన్ లలో స్టోర్ చేయించాలి.
వాటిని మంచి రేటు ఉన్న సమయంలో వేలం వేయించి, వచ్చిన డబ్బులలో తన సేవా ఛార్జీలను మినహాయించుకొని మిగిలింది బ్యాంకులోనుకు, రైతు ఖాతాకు, భూమి యజమాని ఖాతాకు, కరువు|వరదలు|తెగుళ్ళు మొ|| పరిస్థితులను బట్టి దామాషా పధ్ధతిలో జమ చేయించాలి.
రెండవ సంవత్సరాంతానికి కాంట్రాక్టును పూర్తి చేసి, కొత్త కాంట్రాక్టులకు తెర లేపాలి.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.