236 ఎన్నికల ఫలితాల గురించి అంత చెవులు రిక్కించుకొని వినాల్సింది, టీవీల్లో కళ్ళు పొడుచుకొని చూడాల్సింది ఏముంది?
చర్చనీయాంశాలు: ధరలు, బూర్జువా పార్టీలు, ఎన్నికల ఫలితాలు, టిడిపి, బిజెపి, తెరాస
ఈరోజు 16.05.14 తెల్లవారి రోడ్డు మీది నడవటం ప్రారంభించ గానే, ఒక ఇస్త్రీ బండి అబ్బాయి అడిగాడు, ఏమిటి పరిస్థితి అని. అతడి ఉద్దేశ్యం రాష్ట్ర ఎన్నికలలో పార్టీల పొజిషన్ ఏమిటి , అని.
నా మైండ్ వేరే చోట ఎంగేజ్ అయ ఉన్నది. మా నాన్న గారు 86 ఏళ్ళవాడు, యాత్రల మీద వ్యామోహం, కొంచెం ఎండతగ్గగానే మేము నీకు అన్నియాత్రలు చూపిస్తాము అనిబ్రతిమాలుతున్నా వినకుండా, ఇంట్లో చెప్పకుండా వెళ్ళి మూడురోజులయింది. రైళ్ళు ఎక్కలేడు, బస్సులు ఎక్కలేడు, ఏమయ్యాడో ఏమిటో నని, మేము రైలు బస్సు స్టేషన్ ల చుట్టూ తిరుగుతున్న సమయంలో చివరికి ఫలించి ఆయన ఇంటికి చేరాడు . ఆ ఆనందంలో మేము ఉండి, తెలిసిన వారు ఎదురైనపుడు మీనాన్నగారు వచ్చారా అని వారడగటం, అవునండీ కథ సుఖాంతం అని చెప్పటం ఇలా ''ఊయలలూగే మనసూ'' అన్నట్లయింది.
ఆ ఇస్త్రీ మాస్టర్ నావంక ఎగాదిగా చూసి కథ సుఖాంతం అంటే చంద్రబాబా జగనా అన్నాడు. ఇస్త్రీ పెట్టె మహా వేడి మీద ఉంది. అతడి మనసే, అతడి దగ్గర లేదు. బాబా, జగనా అన్నట్లు అతడి మనస్థితి ఉన్నది.
నేను సుఖాంతం అని చెప్పింది, మానాన్నగారు దొరకటం గురించి. అతడు మా నాన్నగారి గురించి అడుగుతున్నాడేమో ననుకొని ఆయన గురించి చెప్పాను. దీనినే మనం న్యాయ శాస్త్రంలో కన్ సెన్సస్ యడ్ ఇడెమ్ అంటాము. తెలుగులో మీటింగ్ ఆఫ్ దీ మైండ్స్. పరస్పర ఏకీభావం. ఇద్దరూ ఒకే వస్తువుగురించి ఆలోచించటం, వ్యవహరించటం.
బాబా , జగనా, త్వరగా చెప్పండి, ఎన్నికల్లో సుఖాంతం, దుఃఖాంతం ఏమిటి అని అతడు విసుక్కున్నాడు. మీరేదో సుఖాంతం సుఖాంతం, అంటున్నారు. (అతడు నాకు స్క్రూ లూజయిందనుకున్నాడు). ఈలోగా అతడు ఇస్త్రీ చేస్తున్న చొక్కాపై పై పెట్టెను అలాగే వదలివేయటంతో, చొక్కా కాలర్ నల్లగా కమిలింది.
''నేను, నా పొరపాటును అర్ధం చేసుకొని, ఉదయం తొమ్మిదిన్నర అయితే గానీ ట్రెండ్స్ బయటకు రావు. ఎందు కంత తొందర? మీరు వెయ్యాలనుకున్నవారికి మీ వోటు వేశారు కదా?'' అందామనుకున్నాను.
నాకు తెలిసిన ప్రకారం, అతడు తన కుటుంబ వోట్లను చక్కగా అమ్మేసుకుని , తనకు రావలసిన క్యాష్ ను రాబట్టుకొని, తన వోట్లయజ్ఞాన్ని పూర్తిచేశాడు. ఇంక ఎందుకు ఆరాటం? తాను డబ్బులు తీసుకున్న అభ్యర్ధికి వేశాడో, వేరొకరికి వేశాడో మనకి తెలియదు. తాను డబ్బు తీసుకున్న అభ్యర్ధికే వోటువేసి ఉంటే, అతడు గెలుస్తూ ఉంటే, అభ్యంతరం లేదు. తాను డబ్బుతీసుకున్న అభ్యర్ధికి వోటేయకుండా వేరొకరికి వేసి ఉంటే, తన నిర్ణయం సరియైనదా లేదా అని అతడు పరీక్షించుకోవాలనుకుంటున్నాడనుకోవాలి.
''నీకెందుకంత ఆరాటం, నీడబ్బులు నీకు వచ్చాయిగా '', అని అందామనుకున్నాను, కానీ అనకపోటమే మంచిదయింది. అనుంటే, అతడు నన్ను చెప్పు తీసుకొని కొట్టి ఉండే వాడు. ''నేను డబ్బులు తీసుకుంటే నీకెందుకు, తీసుకోకపోతే నీకెందుకు, అని వుతికేసేవాడు.''
విచిత్రమేమిటంటే, నావోటు, నాభార్యవోటు, మా అబ్బాయి వోటు కూడ అమ్ముడు పోయాయి. మా ఏరియాలో ఉండే పెద్దమనుషులు అనుకునేవారు, వారిని పెద్ద మనుషులు అనుకునే అభ్యర్ధుల దగ్గర, మాఇంట్లోని మూడు వోట్లకూ Rs. 1,500 x 3 = Rs. 4,500 చొ|| వసూలు చేసుకున్నాడు. ఆడబ్బులను తానే వాడేసుకున్నాడు. మా అబ్బాయి హైదరాబాదు వెళ్ళటం వల్ల వోటు వేయటం కుదరలేదు. నేను పోలింగు స్టేషన్ కి వెళ్ళుంటే నోటాకి వేసి ఉండే వాడిని. నోటా వల్ల నిష్ప్రయోజనం అని తెలిసింది కనుక, స్టేషన్ దూరంగా ఉండటాన , ఆటో ఖర్చులెందుకులే అని వోటు వేయలేదు. ఈవిధంగా మాఇంట్లో రెండు వోట్లు మురిగి పోయాయి. మూడో వోటు కూడ ఆ డబ్బులిచ్చిన అభ్యర్ధికి పడి ఉంటుందని నేను అనుకోను. ఏది ఏమైతేనేం, వోట్లు కొనుక్కున్న ఆఅభ్యర్ధికి మటుకు, రూ. 4,500 క్షౌరం అయ్యింది. ఈవిషయంలో నేను పోలీసురిపోర్టో, ఈసీకి ఫోన్ చేసినా పెద్ద ప్రయోజనకరమని నాకినిపించలేదు. ఎందుకంటే , మానాన్నగారి మిస్సింగు విషయంలోనే , పోలీసు స్టేషన్ కి వెళ్ళి రిపోర్టు ఇచ్చినపుడు, నేను ఆశించిన పధ్ధతిలో, నాకు వారినుండి సహాయం లభించలేదు. అలాంటప్పుడు ఎవరో , ఇంకెవరి దగ్గరో మీవోట్లకో సం డబ్బులు తీసుకున్నారంటే, మేమెట్లా నమ్మటం , సాక్ష్యాలేమన్నా ఉంటే తీసుకురా అని ఉండే వాళ్లు.
కొన్ని షాకులు మనకి తెలిసినవే అయినా విలవిల లాడిస్తాయి
తెల్లారి లేవగానే, పాలప్యాకెట్ లకి వెళ్తాం. ఇవాళ్టినుండి ప్యాకెట్ రూపాయి పెరిగింది, అని తక్షణమే అమలు లోకి వచ్చింది. పాల ప్యాకెట్ల ధరలు మూడు నెలలకో ఆరునెలలకో పెంచటం మనకి తెలిసిన విషయమే. డీజెల్ కూడ, అంతే, వీటికి షాక్ పొందాల్సిన అవసరం లేదు. ఎన్నికలయి పోయినాయి, సమీపంలో ఐదేళ్ళదాకా ఇంకే ఎన్నికలులేవు, అని తెలిసినపుడు, ఇంక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకూ, ప్రైవేటు వారికీ కూడా ఆటవిడుపే.
పెంచిన ధరలో కొంత భాగమైనా, ఉత్పత్తిదారుకి చేరినపుడు పాలధర పెంపుపై మనం నిరసన తెలుపనవసరం లేదు. ఎందుకంటే, మద్యం ధర పెరిగినంత వేగంగా పాల ధర పెరగటంలేదు. సినిమాటికెట్ల ధర పెరిగినా మద్యం ధర పెరిగినా, చికెన్ బిరియానీ ధర పెరిగినా, చెంగు చెంగునా గంతులు వేసుకుంటూ కొనే వాళ్ళే, పాలధర పెరిగినపుడు ఎందుకు ఏడుపు ముఖం పెడ్తారో అర్ధం కాదు.
నాబాల్యంలో మాకు ఒకటి | రెండు గేదెలు ఉండేవి. వాటికొరకు కిలోమీటరు దూరం నుండి గడ్డిమోపులు మోసుకురావటం , పేడతీసి పిడకలు కొట్టటం , ఇళ్ళ దగ్గర పాలు పోసిరావటం, వంటి పనులను నేను చేయటం వల్ల పశుపోషణలోనాకు నరేంద్రమోడీగారు చాయ్ వాలా పనిచేయటం, లాంటి అనుభవమే ఉంది. మా గేదె(లు) ఎండాకాలంలో సరియైన నీడలేక ఎండకి ఎండుతూ ఉండేవి, వానాకాలంలో సరియైన కొష్టం లేక తడుస్తూ ఉండేవి. చలి ఎక్కువైనపుడు పాలు సరిగా ఇచ్చేవి కావు.
ఒక సుఖాంతం కథ
పెద్దయినాక, బ్యాంకులో వ్యవసాయ ఋణాల క్షేత్రాధికారిగా పనిచేస్తున్న కాలంలో, ఒక దరఖాస్తుదారు మహిళ ఒక ప్రభుత్వ పథకం క్రింద రెండుగేదెల కొనుగోలుకు అప్లికేషన్ పెట్టి నా పైవిపరీతమైన వత్తిడి తెచ్చింది. నాకు ఆగ్రామస్తులే చాటుగా సమాచారం అందించారు. ఆమెకు ఇప్పటికే రెండు గేదెలున్నాయి. మీరు గనుక లోన్ ఇస్తే ఆమె తన గేదెలనే చూపించి డబ్బు కొట్టేస్తుంది. ఆమెకు లోన్ ఇవ్వకండి, ఇస్తే మేము పై అధికారులకి ఫిర్యాదు చేస్తాము, తరువాత మమ్మల్ని అడగకండి, అని బెదిరించారు. గ్రామ రాజకీయాలలో ఈ బెదిరింపులు, ఇకిలింపులు, సకిలింపులు ఒక భాగం. అయితే, ఎన్ని రాజకీయాలున్నా, గ్రామస్తులు, తమ స్వార్ధానికి అనుకూలంగా నిజానిజాలను రోడ్డుమీదికి వదులుతూ ఉంటారు. వారు నిజాలు చెప్పినపుడు మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మేం చెప్పినా వినలేదు, అని ఫిర్యాదులు చేస్తారు. తెలియక పొరపాటు పడటం , చెప్పినా వినకపోటం రెండిటి మధ్యా, చాలాభేదం ఉన్నది.
ఒక రోజు ఆమె బ్యాంకుకు వచ్చి వారేదో చెప్పారని మీరు నాకు లోనివ్వకపోతే ఎలా? నాకు ఏ గేదెలూ లేవని, నేను ఫలానా కులానికి చెందిన దానిననీ, వీడీవో సర్టిఫికెట్ ఇచ్చాడు, ఎంపీడీవో రికమెండ్ చేశాడు. మహిళలన్నా, తక్కువకులాలకు చెందిన వాళ్ళన్నా మీకు చులకనలా ఉంది, అది మంచిది కాదు. గవర్నమెంటు ఇస్తానంటుంటే, మీరెందుకు అడ్డం పడతారు అన్నది. కళ్ళనీళ్ళు కూడ పెట్టుకున్నది.
దీన్ని పరిష్కరించటానికి నేను ఒకరోజు పెందలాడి నిద్దరలేచి, ఆమె ఉన్నగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాను. అది ఇప్పటిలాగానే మే నెల. ఎండ వేడి 45 డిగ్రీలదాకా చేరి ఉంటుంది. ఆమె ఇంటికి వెళ్ళాను. ఇల్లు తాళం వేసి ఉన్నది. ఆవరణలో రెండు బర్రెలు కట్టేసి ఉన్నాయి. మేత చాలక గింజుకుంటున్నాయి. రెండూ, ఎండకి ఎండుతున్నాయి. అవి ఆమె బర్రెలే నని అర్ధం అయ్యాయి. ఆమె ఎండు గడ్డి ఎవరో బదులిస్తానంటే, తేవటం కోసమని వెళ్ళిందని పక్కవాళ్ళు చెప్పారు.
నేను ఈలోగా బాకీలు వసూలు చేసుకోటానికి ఇళ్ళ వెంబడి పోయాను. నా కది అలవాటు. సాధారణంగా బ్యాంకుల క్షేత్రాధికారులు, మేనేజర్లు ఏమి చేస్తారంటే, వాళ్ళు చిన్న బకాయి దారుల ఇళ్ళచుట్టూతిరగరు. ఏ పెత్తందారింట్లోనో కూర్చొని గ్రామ కావలిదారునో, లేక పెత్తందారు జీతగాడినో ఫలానా వెంకమ్మను పిలుచుకు రమ్మని ఫరమాయిస్తారు. వారు అతడిని |ఆమెను పిలుచుకు రావటమో, లేక ఇల్లు తాళం వేసుందనో చెప్తారు. నేను ఇల్లిల్లూ తిరగటం వల్ల వారు అప్పు కట్టలేక పోటానికి కారణాలు ఇల్లు చూసినపుడు అర్ధం అవుతుంది. నేను వాళ్ళింటికి వచ్చి వెళ్ళానని తెలిసాక, బకాయిదారులు సాధారణంగా బ్యాంకుకు వచ్చి తమ సమస్యలు వివరించుకొని వెళ్ళే అలవాటును నేను ప్రోత్సహించాను.
నేను వీధులు కవర్ చేసుకుని , మొదట వెళ్ళిన గేదెల దరఖాస్తుదారు ఇంటికి వెళ్ళేసరికి గాలి దుమారం, వాన వచ్చాయి. ఆ గేదెలు ఆవానకి గింజుకున్నా ఎక్కడికీ వెళ్ళలేక అక్కడే నానుతున్నాయి. ఈసారి ఆమె ఇంటి తలుపులు తెరుచుకు ఉన్నాయి. ఆమె ఇంటిముందు ఒక ఎండు గడ్డిమోపు పడేసి ఉంది.
నన్ను చూసి ఆమె లేచి వచ్చింది. ''చూశారు కదా'', అన్నది. నీకు కావలసింది గేదెలు కాదు, నీకు కావాల్సింది షెడ్ కు లోన్. నీవు గేదెలపేరుతో లోన్ తీసుకున్నా ఆడబ్బుతో కొత్త గేదెలను కొని ఉండేదానివి కాదు. షెడ్ వేసి ఉండే దానివి. కొంత డబ్బుతో గడ్డి కొని ఉండేదానివి. నీకు షెడ్ కొరకే , దానికి అవసరమైనంత లోన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాను అని ఆమెను ఓదార్చి నేను కార్యాలయానికి వెనక్కి వచ్చాక, మా బాస్ తో ఈవిషయాన్ని ప్రస్తావించాను. ఆమెకు మనం షెడ్ నిర్మించుకోటానికి ఒక మధ్యకాలిక ఋణం ఇద్దాం, అని ప్రతిపాదించాను. బెంగుళూరు పెంకులు, ఇటుకలు , సిమెంటు స్థంభాలు తెచ్చుకొని, ఆమె షెడ్ వేసుకుంటుంది అన్నాను. ఈవిధంగా, ఆమె సత్యం చెప్పినట్లు అవుతుంది. మనం, అర్హత, అవసరం ప్రాతిపదికగా ఋణం ఇచ్చినట్లవుతుంది. గ్రామస్తులుకూడ కంప్లెయింటు చేయటానికి అవకాశం ఉండదు.
ఆయన నవ్వి , నీకు వాస్తవిక, ఆచరణాత్మక దృక్పథంలేదోయ్. ఇపుడు ఈ ఏడాది షెడ్లకు గవర్నమెంటు పథకాలుగానీ బ్యాంకు డైరక్టులోన్ పథకాలు గానీ లేవు. అవి ఎప్పుడొస్తాయో తెలీదు. ఆమె షెడ్ కట్టాలనుకుంటున్న స్థలం ఆమె కొన్నదో, ఆక్రమించుకున్నదో తెలియదు. రెండు గేదెల పథకం క్రింద, గవర్నమెంటు ఆమెకు సబ్సిడీ ఇస్తుంది. మార్జిన్ ఇస్తుంది. ఆమె మనం ఇప్పించిన గేదెలను అమ్ముకుంటే నీకెందుకూ, ఉంచుకుంటే నీకెందుకు. ఇలా అయితే నీవు ఒక్క స్కీమును కూడ గ్రౌండ్ చేయలేవు అన్నాడు.
నేను కూడ ఆలోచించుకున్నాను. మనం షుగర్ ఫ్యాక్టరీకి లోన్ ఇస్తాము. వాడు కొన్ని కోట్లు తీసుకెళ్తాడు. అందులో వాడు కొన్ని కోట్లను ఏ డిస్టిలరీకో (సారా తయారీ యూనిట్) మళ్ళిస్తాడు. లేకపోతే బియ్యం స్పెక్యులేషన్ చేస్తాడు. వాడి లీలలన్నీ మనకి తెలిసినా, వాడిని మనం నిలదీయట్లేదు కదా. ఈమె తన లోన్ తో షెడ్ వేసుకోటం పాపమా? వస్తుందో రాదో తెలియని ఆ షెడ్ స్కీముపై ఆమెకు ఆశలు పెంచే కన్నా, ఇదే మేలేమో, అని సర్దుకున్నాను.
చివరికి ఆమెకు, మేనేజరు గారి ఆజ్ఞ ప్రకారం, ప్రభుత్వ పథకం క్రింద గేదెలనిప్పించటం, జరిగింది. ఆమె తన రెండు పాత గేదెలలో ఒకదానిని, రెండు కొత్త గేదెలలో ఒకదానిని అమ్ముకున్నది. డబ్బులు మిగిలినట్లున్నాయి. ఒక చిన్న కొష్టాన్ని కూడ నిర్మించు కున్నది. ఒక పాత ఒక కొత్త రెండు గేదెలు సమకూరాయి. లోన్ కొంత కట్టింది. కొంత కట్టలేదు. మిగిలింది రాని బాకీల క్రింద మాఫీ చేయబడింది. మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది.
బ్యాక్ టూ ఎన్నికల ఫలితాలు
తెలంగాణలో తెరాస, శేషాంధ్రలో టిడిపి, వైయస్ ఆర్ పీ, అఖిల భారత స్థాయిలో బిజెపి ఎన్ డి ఎ ముందంజలో ఉంటాయనేది బాలీవుడ్ క్లైమాక్సులా మనకు ముందే తెలిసిందే. ఈమాత్రం దానికి ఇస్త్రీ పెట్టెను షర్ట్ మీద వదిలేసి దానిని మాడకొట్టాలా?
కథ సుఖాంతమవుతుందా, దుఃఖాంతమవుతుందా?
బూర్జువా పార్టీల్లో ఎవరు గెలిస్తే ఏమి లాభం? వ్యభిచార గృహాల్లో బంధితులైన స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందో, భారత పౌరుల పరిస్థితి కూడ అంతే. వాడైతేనేం, వీడైతేనేం, ప్యాసింజరనే వాడు, అంగచూషణం చేయమని డబ్బులాశ చూపేవాడే కదా. ఇష్టపూర్తిగా పాల్గొంటే, రేప్ అయినా మధురమే కదా. కొంత అసభ్యంగా వ్రాయవలసి వచ్చినందుకు క్షమాపణ కోరుతున్నాను. ఈదుఃఖ సమయంలో ఇంతకన్నా వ్రాయలేను.
ఏది ఏమైనా, శ్రీ నరేంద్రమోడీ, శ్రీ చంద్రబాబు, శ్రీ కెసిఆర్ లకు మన అభినందనలు.
శ్రీచంద్రబాబు నాయుడు గారు, మద్యనిషేధం విషయంలో రాష్ట్ర ప్రజలను మోసగించారు. మద్యనిషేధ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన, మల్లాది సుబ్బమ్మగారు కీర్తిశేషురాలు కావటం ఖేదకరం. శ్రీచంద్రబాబు నాయుడుగారిని , మద్య నిషేధాన్ని శేషాంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రవేశ పెట్టి, రాష్ట్రమహిళామణులను రక్షించవలసిందిగా ప్రార్ధిద్దాము.
శ్రీ కెసీఆర్, ఆయన కుటుంబం, ఇంక విజృంభించే అవకాశం ఉంది. వారు కుటుంబ నియంతృత్వ దిశగా పయనించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి శ్రీ ఎన్ డీ తివారి గారు చివరికి ఉజ్వలా శర్మగారిని 89 ఏళ్ళ వయసులో సాంప్రదాయ బధ్ధంగా వివాహంచేసుకొని, ఆమెకు సముచిత స్థానాన్ని కల్పించటం ముదావహం. (ఈ సందర్భంగా శ్రీ ఎన్ డీ తివారీ పై -ఆయన +ఉజ్వల శర్మల- పుత్రుడు చేసిన న్యాయ పోరాటాన్ని గుర్తు తెచ్చుకోండి. శ్రీ నరేంద్రమోడీ గారు కూడ తన ధర్మపత్ని జశోదాబెన్ గారికి సముచిత స్థానాన్ని కల్పిస్తారని ఆశిద్దాము.
(దీనిని ఇంకా కొంత మధురంగా ఉండేలా తిరగవ్రాస్తాను).
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.