229 కేవలం ఒక్క రాలీకి అనుమతి ఇవ్వనంత మాత్రానే, భావి భారత ప్రధాని గారు ఎన్నికలలో ఓడిపోతారా?
చర్చనీయాంశాలు: బిజెపి, అరుణ్ జైట్లీ, నరేంద్రమోడీ, వారణాసి, నరసింహ శతకం
8.5.2014 నాడు వారణాసిలో శ్రీ నరేంద్రమోడీ గారు పాల్గొన వలసిన ఒక ర్యాలీకి, గంగానది హారతికి అనుమతి ఇవ్వటంలో రిటర్నింగు అధికారి అయిన జిల్లా మేజిస్ట్రేటు ఆలస్యం చేసినట్లున్నాడు. ఈ ర్యాలీ జరగ వలసిని బేణీ బాగ్ గతంలో మతకలహాలు జరిగిన ప్రదేశం కావటం వల్ల, శ్రీ నరేంద్రమోడీగారు కొంత ఉద్రేకంతో కూడిన ప్రసంగాలు చేసే వక్త కావటం వల్ల , అనుమతి ఇవ్వటంలో ఊగిసలాడి, చివరికి ఇచ్చినట్లున్నాడు.
ఈసందర్భంగా, బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర న్యాయ శాఖా మంత్రి, శ్రీ అరుణ్ జైట్లీ, చెప్పిన విషయాలు (మీడియా ప్రకారం) గమనించ తగ్గవి.
ఈసందర్భంగా, బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర న్యాయ శాఖా మంత్రి, శ్రీ అరుణ్ జైట్లీ, చెప్పిన విషయాలు (మీడియా ప్రకారం) గమనించ తగ్గవి.
Photo courtesy BJPKarnataka.org. Thanks to them.
"India is not under British rule, it is a free country. To drive on the roads of Varanasi we don't need any damn permission from this returning officer. Just like you can drive, Mr Modi can also drive on the roads."
తెలుగు సారం: భారత్ ఆంగ్లేయుల పాలనలో లేదు. ఇది స్వతంత్ర దేశం. వారణాసి రోడ్లపై డ్రైవ్ చేయటానికి మాకు ఈ రిటర్నింగ్ అధికారి అనుమతి అవసరం లేదు. ఏవిధంగా మీరు డ్రైవ్ చేయగలరో (మీడియా), శ్రీ మోడీ గారు కూడ రోడ్లపై డ్రైవ్ చేయగలరు.
"We are not a banana republic that a prime ministerial candidate is not allowed to address a meeting in his own constituency by a pliant returning officer."
తెలుగు సారం: ఒక రిటర్నింగు అధికారి, ఒక ప్రధాన మంత్రి అభ్యర్ధిని తన స్వంత నియోజక వర్గంలో సభలో ప్రసంగించనీయక పోటానికి, మన దేశం ఒక బనానా రిపబ్లిక్ కాదు.
వైబీరావు గాడిద వ్యాఖ్యలు
శ్రీనరేంద్రమోడీకి, వారణాసి నియోజక వర్గంలో విజయం గ్యారంటీ అని బిజెపి వారే పలుసార్లు మరీ మరీ దేశమంతా హోరెత్తిస్తున్నారు. అలాంటప్పుడు కేవలం ఒక రాలీకో, లేక ఒక సభకో , ఒక హారతికో అనుమతి ఇవ్వనంత మాత్రాన ఆయన ఓడి పోడు కదా. రిటర్నింగు అధికారి ఇతరుల వత్తిడికి లోనయ్యో, లేక తనకే శాంతి భద్రతల రిస్కు తీసుకోటం ఇష్టంలేక గానీ, అనుమతులు ఆలస్యం చేసినంత మాత్రాన, అయన ఇవ్వవలసిన పర్మిషన్ ను ''డామ్న్ పర్మిషన్ '' అనచ్చా? బనానా రిపబ్లిక్ ప్రసక్తి తీసుకు రావచ్చా. కేంద్రంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి కామెంట్లు చేయటం న్యాయమా?
శ్రీ నరేంద్రమోడీ వడోదారానుండి కూడ పోటీ చేస్తున్నారు. ఒకవేళ వారణాసిలో ఓడిపోయినా, వడోదారాలో గెలువ వచ్చు. అదిగాక, గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి శ్రీ మోడీ రాజీనామా ఇవ్వలేదు కాబట్టి ఆరాష్ట్ర ప్రజలకి సేవ చేసే అవకాశం ఎలాగో ఉంది. తనను నమ్ముకున్న రాష్ట్ర ప్రజలను వదిలేసి ఢిల్లీ పీఠం పై అతివేగంగా ఎక్కేయాలన్న ఆరాటం వల్ల ఓర్పులేకుండా వ్యవహరించటం సబబా?
నేటి నేత శ్రీ అరుణ్ జైట్లీ సంపద వివరాలు
అమృత్ సర్ లోక్ సభ 2014 ఎన్నికలకు నామినేషన్ లో ఇవ్వబడిన అఫిడవిట్ ఆధారంగా
తనవి, తన భార్యవి కలిపి.
స్థిరాస్తులు: రూ.75.7 కోట్లు. చరాస్తులు: రూ. 37.32 కోట్లు.
కార్లు
పోర్ష్ కారు రూ. 1.02 crore.
మెర్సిడెజ్ బెంజి కారు రూ. 78.89 లక్షలు.
బిఎమ్ డబ్ల్యూ కారు రూ.85.57 లక్షలు.
హోండా ఎకార్డు కారు రూ.20.44 లక్షలు.
టొయోటా ఫార్ట్యూనర్ కారు రూ.23.28 లక్షలు.
మొత్తం కార్లు రూ. 3.10 కోట్లు.
నగదు
తనవద్ద రూ. 1.35 కోట్లు.
భార్య వద్ద రూ. 7.5 లక్షలు.
బ్యాంకు బ్యాలెన్స్: రూ.18.01 కోట్లు.
పిపిఎఫ్: రూ. 2 కోట్లు.
భార్యతో సహా ఇతరుల కిచ్చిన అప్పులు రూ. 10.37 కోట్లు.
బంగారం, వెండి
తన వద్ద బంగారం: రూ. 1.88 కోట్లు. 5.630 కిలోల బంగారం. 15 కిలోల వెండి, వజ్రాలు.
భార్య వద్ద: రూ. 23.44 లక్షలు.
స్థిరాస్తులు
రూ. 75.70 కోట్లు. ఫరీదాబాదులో (హరియానా,ఢిల్లీ సరిహద్దు) ప్లాట్. గుర్ గావ్ సైబర్ పార్కులో వాణిజ్య ఆస్తి. ఢిల్లీ, గుర్ గావ్, గాంధీనగర్(గుజరాత్), లో ఐదిళ్ళు.
2012-13 సంవత్సరానికి ఆదాయం రూ. 2.16 కోట్లు.
అప్పులు: లేవు.
వ్యాఖ్య: అప్పులు లేనివాడు నిజంగా ధన్యుడే కదా. అహో.
ఈనాటి పద్యం
గ్రంధం: నరసింహ శతకం.
మహాకవి: తూము నరసింహదాసు.
సీస పద్యం.
తల్లిగర్భమునుండి - ధనము తే డెవ్వడు
వెళ్లిపోయెడినాడు - వెంటరాదు
లక్షాధికారైన - లవణ మన్నమె కాని
మెఱుగు బంగారంబు - మ్రింగబోడు
విత్త మార్జనజేసి - విఱ్ఱవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము - తోడరాదు
పొందుగా మఱుగైన - భూమిలోపల బెట్టి
దానధర్మము లేక - దాచి దాచి
తేటగీతి.
తుదకు దొంగల కిత్తురో - దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా - తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ - పురనివాస!
దుష్టసంహార! నరసింహ - దురితదూర!
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.