చర్చనీయాంశాలు:
గతంలో శ్రీ చంద్రబాబు నాయుడుగారు పిల్లనిచ్చిన మామకే వెన్ను పోటు పొడిచిన వీరుడిగా సుప్రసిధ్ధుడు. మతతత్వ వ్యతిరేకిగా, బిజేపీని వ్యతిరేకిస్తూ ఆయన యునైటెడ్ ఫ్రంటు చక్రాన్ని తిప్పాడు. మరల అదే బిజెపితో జట్టీ కట్టి ఎన్ డీ ఎ ను నడిపాడు. 2004 ఎన్నికల్లో దెబ్బతిన్నాక, ఈసారి నరేంద్రమోడీని వ్యతిరేకించి బిజేపీకి టాటా చెప్పారు.
జనం ఆయన చెప్పింది నిజమేనేమో ననుకొని 2009 ఎన్నికల్లో ఆయన స్థానాన్ని మెరుగు పరిచారు.
తెలంగాణ విభజనకు అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ ఇచ్చిన ఘనత శ్రీవారికి ఉంది.
ఈయనను నమ్ముకున్న తెలంగాణ టీడీపీ నేతలు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ కన్నా బిజేపి ఎక్కువ ఉత్సాహంగా ఉన్నది. లోక్ సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టమని సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగు లు కేంద్ర ప్రభుత్వం వెంట పడుతున్నారు. కాంగ్రెస్ ఊరుకున్నా బిజేపీ ఊరుకునేలాగా లేదు. బిజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని స్పష్టంగానే చెప్పాడు.
సీమాంధ్రలో బిజేపి ఉనికి నామమాత్రమే నని అందరికి తెలుసు. తెలంగాణలో బిజెపి వోట్లకోణంలోనుంచి నాలుగవ స్థానంలో ఉన్నా, విభజనను సమర్ధించటంలో తెరాసకు తీసిపోటం లేదు.
పాపం, రేవంత రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రబిల్లి వంటి అమాయకులు తెలంగాణ టీడీపి పగ్గాలను చంద్రబాబు తమకు అప్పగిస్తారనే ఆశతో ఉన్నారు. లోకే ష్ ను తెలంగాణ టీడీపీ బాస్ గా చేసి, తాను సీమాంధ్ర టీడీపి బాస్ గా వెలుగొందాలని శ్రీచంద్రబాబు కలలు కంటున్నట్లు తోస్తుంది. చంద్రబాబు బినామీ ఆస్తులపై కెసీఆర్ కత్తులు నూరుతున్న నేపథ్యంలో, శ్రీచంద్రబాబు కాబోయే ప్రధానిగా పేరొందిన శ్రీనరేంద్రమోడీని రక్షణ కోసం అశ్రయించినట్లు కనిపిస్తున్నది. లేకపోతే శివరాజ సింగు పట్టాభిషేకానికి రెక్కలు గట్టుకొని వెళ్ళి అక్కడబిజేపి నేతలో చేతులు పిసుక్కోటంలో ఆంతర్యం ఏమిటి?
ఒకపత్రికలో వచ్చిన వార్త ప్రకారం జగన్ కూడ నరేంద్రమోడీకి 27లోక్ సభ స్థానాలు (సమైక్యాంధ్ర లెక్క కావచ్చు) ఇవ్వచూపినట్లు తెలిసింది. కాంగ్రెస్ 2014లో కేంద్రంలో ఓటమి పాలయి, నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే సీబీఐ జాగిలాల నుండి కోర్టు కేసులనుండి తనను రక్షించటానికి మోడీ అండ అవసరమని జగన్ అర్ధం చేసుకుని ఉంటే అతడి దూరదృష్టిని మెచ్చుకోవాలి.
ఇప్పుడు నరేంద్రమోడీ ఏపెళ్ళాంతో కాపురం చేయబోతున్నాడు? కిషన్ రెడ్డి? చంద్రబాబు? జగన్ ? అందరితోనా?
బిజెపి కాంగ్రెస్ ను కాపీ చేసిందా అన్నట్లుగా సీమాంధ్ర బిజేపి నేతల మొరవినటానికి ఒక ముగ్గురు సభ్యుల అనామక కమిటీని ఏర్పాటు చేసింది.
సీమాంధ్ర బిజేపి నేతలకు హైదరాబాద్ కు కేంద్రపాలిత ప్రాంతం హోదాను సాధించుకోవటంపై కానీ , అక్కడకు వెళ్ళి తమ బ్రతుకుతెరువును వెతుక్కునే సీమాంధ్ర శ్రామికుల , నిరుద్యోగుల మానవ హక్కును గానీ, రాజ్యాంగ హక్కును గానీ రక్షించుకునే కనీస ప్రయత్నం కూడా చేసే లక్షణాలు లేవు. సీమాంధ్ర అంటే కేవలం గోదావరి జిల్లాలు మాత్రమే అని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. సీమాంధ్ర బిజేపి నేతల అభ్యంతరాలు వినటానికి కమీటీ అనేదే ఒక హాస్య నాటకంగా నడిపిస్తున్నారా?
చంద్రబాబు, జగన్ ల మద్దతు కోసం బిజెపి లోక్ సభలో టీ బిల్లుకు బలమైన సవరణలను ప్రతిపాదిస్తే కిష న్ రెడ్డి &కో మోడీపై ఎదురు తిరుగుతుంది. అలా కాక బిజెపి తెలంగాణ బిల్లును సుష్మా స్వరాజ్ గారి కోరిక ప్రకారం తేలికగా గట్టెక్కనిస్తే, సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు, జగన్ లకు దక్కుతుంది.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే అధికారంలోకి వచ్చాక తాము అందరినీ మెప్పించి తెలంగాణ ఇస్తామని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఆ మెప్పించే మంత్రమేదో తమ దగ్గర ఉంటే, ఇప్పుడే తమ విభజన ప్రణాలికను రాజ్ నాథ్ సింగ్ బయట పెట్తే బాగుంటుంది. సీమాంధ్ర ప్రజలు, బిజేపీని, టీడీపీని, వైఎస్ఆర్ పీని ఏమి చేయాలో నిర్ణయించుకుంటారు.
గుజరాత్ ప్రభుత్వం ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ లోని పత్రికలకు, టీవీ ఛానెళ్లకు ప్రకటనలు ఇచ్చిమీడియా చేత పెయిడ్ న్యూస్ వ్రాయించుకోవాలని నరేంద్రమోడీ ప్రయత్నించటం , ఆయన కపట స్వభావాన్ని సూచిస్తుంది.
వైబీరావు గాడిద అభిప్రాయాలు
1. సీమాంధ్రకు కనీసం 3 రాష్ట్రాలు అవసరం. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ. రాజధాని ప్రక్రియ పై సీరియస్ చర్చలు మొదలయితే, పుట్టలోని పాములు బయటకు వస్తాయి.2.హైదరాబాదుకు (లేదా 20 లక్షలు జనాభా దాటిన లేక దాటబోయే ప్రతినగరానికి) కేంద్ర పాలిత హోదా అవసరం.
3. నదీజలాల పంపిణీ, ప్రాజెక్టుల వద్ద నీటి విడుదలను కేంద్ర సంస్థలు , అథారిటీలు,శాఖలు స్వయంగా నిర్ణయించటం, అమలు చేయటం.
ఈ మూడిటిని సరిగా అమలు చేస్తేనే అందరినీ కొంతమేరకైనా మెప్పించి, భవిష్యత్తులో రాబోయే ఉద్యమాలను, శాంతి భద్రతల సమస్యలను నివారించినట్లు అవుతుంది.
కాంగ్రెస్, తెరాస, టీడీపీ, జగన్, బిజేపి ల క్రీడలలో సీమాంధ్ర ప్రజలు కుక్కలు చింపిన విస్తరి లాగా అయిపోకూడదు.
నేనేం సోనియా, రాహుల్ ల మద్దతుదారుని కాదు. నరేంద్రమోడీ- రాజ్ నాథ్ సింగు - అద్వానీ -సుష్మాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏవిధంగా ఉధ్ధరించ బోతున్నారు అనేదే అర్ధం కావటం లేదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.