చర్చనీయాంశాలు: స్వామి వివేకానంద, తెలుగు సినిమాలు
స్వామీ వివేకానందగారిపై ఈనెల్లో (డిసెంబర్ 2013) ఒక సినిమా విడుదల అయ్యింది. ఈసంవత్సరం శ్రీవివేకానంద గారి 150వ జయంతి సంవత్సరం. ప్రభుత్వం సుమారు రూ. 1500కోట్ల దాకా ఖర్చు చేస్తున్నది. వివేకానందగారిపై ప్రజలకు ఉన్న వ్యామోహాన్ని నరేంద్రమోడీ గారొక్కరే వోట్లుగా మార్చుకుంటే ఎలా?
హిందూమత దురభిమానులకు ఒక (మూఢ? చెప్పలేం) నమ్మకం ఏమిటంటే, శ్రీవివేకానంద హిందూమతాన్ని ప్రపంచవ్యాప్తం చేసి, జాతి మొత్తాన్ని వెయిట్ లిఫ్టింగ్ చేసిన మహావీరుడని. విచిత్రం ఏమిటంటే ఆయన స్థాపించిన సంస్థవారే సుప్రీంకోర్టులో, తాము హిందూమతానికి చెందమని, తమకు మైనారిటీ హక్కులు కావాలని సుప్రీంకోర్టులో వాదించారు. సుప్రీంకోర్టు ఆవాదనను ఒప్పుకోలేదనుకోండి. వివేకానందగారు కూడ తాను హిందువులకు మాత్రమే చెందనని, సర్వ ప్రపంచానికీ చెందిన వాడనని ప్రకటించుకున్నారు.
సమయానుగుణంగా బయటకు కనిపించని క్రైస్తవమతాభిమానియైన సోనియా గాంధీగారి పార్టీ వారికి కూడ, వివేకానందాగారి 150వ జయంతిని వోట్లుగా మార్చుకోక పోతే జరిగే నష్టం అర్ధం అయినట్లుగా కనిపిస్తుంది. అందుకే వందల కోట్లు ఖర్చు చేయటం.
తెలుగు సినిమావారు కూడ ఈవ్యాపారావకాశాన్ని వదులుకో దలచుకోలేదు. వివేకానందాగారి కాషాయవేషాలతో జనం మీదికి ఒక సినిమాను వదిలారు. ప్రాధమికంగా, ఇది పిల్లలకోసం ఉద్దేశించిందట. పెద్దలు పిల్లలను హాళ్ళకు తీసుకెళ్ళి ఈసినిమాను చూపించాలిట. బాగానే ఉంది.
మరి హాళ్ళు నిండవని భయమో ఏమో, లక్ష రూపాయల బహుమతితో వివేకానందాగారి చికాగో ప్రసంగం పై ఒకపోటీని పెట్టారు.
ఈసినిమాలో, వివేకానందాగారి చికాగో ప్రపంచమహాసభ ప్రసంగాన్ని పెట్టారట. ఇప్పుడు ప్రేక్షకులు ఏమి చేయాలంటే, ఆసినిమాని మరలమరల చూచి , ఆప్రసంగాన్ని బట్టీ పెట్టి,అచ్చం వివేకానందాగారిలాగే ఆప్రసంగాన్ని తిరిగి చేయాలిట.
సినిమా వారి వ్యాపారాలు వారికి ఉంటాయి. వారిని మనం తప్పు పట్టలేం. పిల్లలు, యువకులు, మెదడు ఉతకబడుతున్నారనేదే విచారం.
శ్రీవివేకానంద గారి చికాగో ఉపన్యాసం విషయంలో, నేను లోతుగా పరిశోథించి గ్రహించిన అంశాలు వ్రాయటం తప్పు కాదనుకుంటాను.
మొదటిది, విశ్వమత మహాసభవారి అధికారిక వెబ్ సైట్లో ఉన్న డాక్యుమెంట్లలో వివేకానంద గారి ప్రసంగం లేదు. కారణం ఏదైనప్పటికి, వారి ఆర్చైవ్స్ లో స్వామీజీ ప్రసంగాన్ని పెట్టలేదు. ప్రసంగ పాఠాన్ని ఈ మెయిల్ చేయమని ఆవిశ్వమత మహాసభవారిని ఈమెయిల్ ద్వారా కోరి, జ్ఞాపకంచేసినా కూడ వారి నుండి జవాబు లేదు. ప్రసంగం పాఠాన్నే దాచని వారు, గ్రామఫోన్ రికార్డులను భద్రపరిచి అడిగిన వారికి ఇచ్చేంత శ్రధ్ధచూపుతారా? మన వెర్రిగానీ.
ఆసభలోప్రసంగించిన వారు డజన్లకొద్ది ఉన్నారు.
ఆకాలంలో టేప్ రికార్డర్లు లేవు. ఫోనోగ్రాఫ్ లు (గ్రామఫోన్ రికార్డులు) అమెరికాలో కొత్తగా వచ్చాయి. కొత్తల్లో సహజంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. కనుక విశ్వమత మహాసభల్లో ప్రతి ఒక్కరి ప్రసంగాన్ని గ్రామఫోన్ రికార్డుగా మలచటం ఆచరణలో కుదరని పని. ఇప్పుడు మనం మొబైల్ ని క్లిక్ చేయగానే వాయిస్ రికార్డర్ పనిచేసినట్లుగా ఆకాలంలో గ్రామఫోన్ రికార్డింగ్ అంత తేలిక కాదు. బహుశ ఆ మహాసభ అధ్యక్షుడి ప్రసంగాన్ని, ముఖ్య అతిథుల ప్రసంగాలను, మహాసభ నిర్వాహకులు గ్రామఫోన్ రికార్డింగ్ చేసి ఉంటారు. అంతే తప్ప భారతీయులపై ప్రత్యేక ప్రేమతో వివేకానందగారి ప్రసంగాన్ని గ్రామఫోన్ రికార్డ్ చేయటం అసాధ్యం.
వివేకానందగారి చికాగోప్రసంగం ఆడియో ఫేకా?
కాకపోవచ్చు. ఎందుకంటే, స్వామీ వివేకానందా గారి సంపూర్ణ రచనలను పరిశీలించినట్లయితే, స్వామీజీ 1893 లో మహాసభ అయిపోయాక, నాలుగేళ్ళు అమెరికాలో తిరిగి డాలర్లు సంపాదించటానికి ప్రయత్నించారు.ఆకాలంలోనే అమెరికాలో ఉపన్యాసాలను ప్రమోట్ చేసే వ్యాపారాలు చేసే కంపెనీలు ఉండేవి. (ఆనాటికి ఇంకా సినిమాలు రాలేదు). స్వామీజీ అలాంటి కంపెనీ ఒకదానిని సంప్రదించి తన ప్రసంగాలను ఏర్పాటుచేయటం, హాళ్ళను అద్దెకి తీసుకోటం, టిక్కెట్లను అమ్మటం, ప్రకటనలను పత్రికల్లోకి వదిలిప్రచారం చేయటం, లాభాలను పంచుకునే ప్రాతిపదికపై వ్యాపార ఒప్పందం చేసుకున్నారు.
ఆసమయంలోనే తన చికాగో ప్రసంగాన్ని ఎందుకు గ్రామఫోన్ రికార్డింగ్ చేయించకూడదు , అనే ఐడియా స్వామీజీకి రావటం, గ్రామఫోన్ రికార్డులు తయారు చేయించటం జరిగింది. వాటి నకళ్ళను స్వామీజీ, భారత్ లోని తన సహ శిష్యులకు, ఆర్ధిక సహాయం చేసిన మహారాజాలకు, ఇతర హిందూమతాభిమానులకు పంపించి ఉండవచ్చు. స్వామీజీ భారత్ కు వెనక్కు వచ్చినప్పుడు, ఇక్కడికి తెచ్చుకొని, తరువాత కాపీలు మార్కెటింగ్ చేసుకొని ఉండవచ్చు. కొన్ని కాపీలను భద్రపరచి ఉండవచ్చు.
విశ్వమత మహాసభలో స్వామీజీ తన ప్రసంగాన్ని వ్రాసుకుని చదవలేదు. అప్పటికప్పుడు చెప్పిందే. అప్పటికప్పుడు చేసే ప్రసంగాలు ఎంతటి మహనీయులు చేసినవైనా, ఒకరకంగా అసంపూర్ణంగానే ఉంటాయి. అయితే కృత్రిమత్వం ఉండదు.
గ్రామఫోన్ రికార్డింగ్ లు చేసేటప్పుడు రిహార్సల్స్ ఉంటాయి. ప్రసంగాన్ని వ్యాకరణదోషాలు, ఉచ్చారణదోషాలు లోకుండా, నెర్వస్ నెస్ ప్రతిబింబించకుండా, తాపీగా , నీట్ గా తయారు చేసుకోవచ్చు. సభలో చెప్పని ఉదాత్తమైన విషయాలను చొప్పించవచ్చు. సభలో చెప్పిన ఒకమాదిరి విషయాలను, చెత్తవిషయాలను, తొలగించవచ్చు. కృత్రిమత్వం చొరబడుతుంది. కాబట్టి గ్రామఫోన్ రికార్డులను మనం విశ్వమత మహాసభలో చేసిన అసలు సిసలు ప్రసంగం గా భావించటం, అసంబధ్దం అవుతుంది. అయితే గొంతు మటుకు స్వామీజీది గా మనం అంగీకరించ వచ్చు.
స్వామీజీ ప్రపంచమహాసభలో అమెరికా సోదర సోదరీ మణులారా అనగానే , హాలంతా చప్పట్లు మార్మోగాయి అనేది స్వామీజీ చేసిన సుందరమైన కల్పన. స్వామీజీ , మద్రాసులోని తన శిష్యుడు అలసింగకు 2-11-1893 నాడు వ్రాసిన లేఖ చూడండి. స్వామీజీ స్వంత డబ్బా అర్ధం అవుతుంది.
కొంత ప్రసంగం విన్నాక ఏదైనా ఎంతోగొప్పవిషయాన్నో లేక ఛలోక్తినో ఉపన్యాసకుడు విసిరితే చప్పట్లు మారుమోగి పోతాయి తప్ప సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే చప్పట్లతో హాలు దద్దరిల్లదు.
...And I, who never spoke in public in my life, to address this august assemblage!! It was opened in great form with music and ceremony and speeches; then the delegates were introduced one by one, and they stepped up and spoke. Of course my heart was fluttering, and my tongue nearly dried up; I was so nervous and could not venture to speak in the morning. Mazoomdar made a nice speech, Chakravarti a nicer one, and they were much applauded. They were all prepared and came with ready-made speeches. I was a fool and had none, but bowed down to Devi Sarasvati and stepped up, and Dr. Barrows introduced me. I made a short speech. I addressed the assembly as "Sisters and Brothers of America", a deafening applause of two minutes followed, and then I proceeded; and when it was finished, I sat down, almost exhausted with emotion. The next day all the papers announced that my speech was the hit of the day, and I became known to the whole of America. Truly has it been said by the great commentator Shridhara— "मूकं करोति वाचालं —Who maketh the dumb a fluent speaker." His name be praised! From that day I became a celebrity, and the day I read my paper on Hinduism, the hall was packed as it had never been before. I quote to you from one of the papers: "Ladies, ladies, ladies packing every place — filling every corner, they patiently waited and waited while the papers that separated them from Vivekananda were read", etc. You would be astonished if I sent over to you the newspaper cuttings, but you already know that I am a hater of celebrity. Suffice it to say, that whenever I went on the platform, a deafening applause would be raised for me. Nearly all the papers paid high tributes to me, and even the most bigoted had to admit that "This man with his handsome face and magnetic presence and wonderful oratory is the most prominent figure in the Parliament", etc., etc. Sufficient for you to know that never before did an Oriental make such an impression on American society. ...
సెలబ్రిటీని తాను ద్వేషిస్తానని వివేకానంద అలసింగకు వ్రాశాడు గానీ వివేకానంద గారికి ప్రచార మోహం కొంత జాస్తిఅనటానికి ఆయన సంపూర్ణ రచనల్లోనే సాక్ష్యాలు ఉన్నాయి. వాటిని ఇంకోసారి , బ్రతికుంటే, పాఠకులు అతిగా తిట్టకుండా ఉంటే, ప్రస్తావిస్తాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.