Did Draupadi, the PanDava Queen laugh at SuyOdhana in Maya Sabha or not? 012 ద్రౌపది దుర్యోధనుడిని చూచి నవ్విందా, నవ్వలేదా?
నన్నయ భారతం. సభాపర్వం. ద్వితీయాశ్వాసం. ౧౪౦, ౧౪౧,౧౪౨.
నన్నయగారి, శ్రీమదాంధ్ర మహాభారతం ప్రకారం ద్రౌపది, మయసభలో దుర్యోధనుడు పడటాన్ని చూచి, నవ్వలేదు. కనుక ద్రౌపదీ వస్త్రాపహరణానికి దుర్యోధనాదులు పూనుకోటం సమంజసం కాదు.
౧౪౦. నిర్మల స్ఫటిక శిలా నిర్మితంబై , శశిప్రకాశంబై , వివిధ రత్న వ్రభా భాసురంబైన యా సభ విభవంబు చూచు వేడుక నందు గ్రుమ్మరు వాడ హరినీలబద్ధ స్నిగ్ధ మణి స్థలంబనందు జలబుధ్ధింజేసి పరిధానోత్కర్షణంబు సేసి విమలశిలాతల బుధ్ధి నుదకపూర్ణంబైన వాపి సొచ్చి కట్టిన పుట్టంబు తడియన్ త్రెళ్ళిన నన్నున్ జూచి వృకోదరుడు నగియె .
దానినంతయు నెఱింగి ధర్మరాజ చోదితులైన కింకరులు నాకుం బరిధానంబులు దెచ్చి యిచ్చిరి. మరియు వివృత ద్వా రంబు గవాట ఘటితంబని చొరనొల్లక, కవాట ఘటితంబు వివృతంబుగా వగచి చొరంబోయి తత్కవాట స్ఫటిక శిలా ఘట్టిత లలాటుండనై న నన్నుం జూచి యనేక సహస్ర విలాసినీ పరివృత యయి యున్న ద్రౌపది నగియె.
అంత నకుల సహదేవులు పఱతెంచి యిదె వాకిలి యిట వచ్చునది యని నన్నున్ తోడ్కొని పోయిరి. అట్టి సభా ప్రలభంబు నాకు హృదయ శల్యంబై యున్నది. "... Then Nakula and Sahadeva came. Saying 'This is the door. Pl. come through this.' and took me with them. That type of insult in an Open Place is causing me great pain like a thorn in my heart."
౧౪౧.కందం. పెద్దలు హీనతఁ బొందిరి,
తద్దయు హీనులు సమృధ్ధి తనరిరి నియమం
బెద్ది విధి యోగమున కసు,
హృద్దర్పోన్నతులు సూచి యెట్లు సహింతున్.
౧౪౨. కందం.
పరమ సుఖోపాయంబునన్
పరసంపద చేకొనంగఁ బడునేని నరే
శ్వర యంత కంటె మిక్కిలి,
పురుషార్ధంబెద్ది యొండు భూనాథులకున్.
సందర్భం.
------
మయసభ. సుయోధనుడు. అవమానం పొందాడు. ఇంటికి వెళ్ళాడు. తండ్రితో మొత్తుకుంటున్నాడు.
పరిశీలన.
------
సినిమాల్లో , టివిల్లో, ద్రౌపది మాత్రమే నవ్వినట్లు చూపిస్తూ ఉంటారు. నన్నయ్య ప్రకారం సుయోధనుడికి రెండు సార్లు అవమానం . మొదట, భీముడు నవ్వాడు. రెండోసారి, ద్రౌపది నవ్వింది.
Other observations
I am unable to trace draupadi's laughing at suyOdhana, in vyAsa mahAbhArata. According to vyAsa mahAbhArata, it was not only bhIma who laughed at suyOdhana. arjuna, nakula and sahadEva too laughed.
Verse 142 clearly shows the craving of kings to seize properties of others, easily.
For the 21st Century: We can see the greed of Tleaders, without leaving even a SUDI MONA SPACE (space of a pin's size), to wholly corner the Hyderabad City which has been developed with funds of 23 Districts of Andhra Pradesh and 700 District funds of Central Government. The investment of Central Government and combined A.P. State Government from 1956 to 2013, amounts to about Rs. 10 lakh crore. We can also see the greed of SImAndhra politicians, other State businessmen and politicians, and MNCs who are on a land-buying land-occupying spree in Hyderabad City.
to continue further.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.