009 వ్యాసుడు వర్ణించకుండా వదిలేసిన సత్యవతి తొడలను, నన్నయ చక్కగా వర్ణించాడు. చిత్రమే. Sage Vyasa, in his Sanskrit Epic Mahabharata omitted to describe the thighs of his mother Satyavathi. But Telugu poet, who translated Vyasa Maha Bharata into Telugu did not forget. Here is a beautiful description from Nannaya from Adi Parvam (Volume 1), TritIya ASvAsam (Chapter 3).
చర్చనీయాంశాలు| నన్నయ, వ్యాసుడు, మహాభారతం, పరాశరుడు, సత్యవతి, పద్యకవిత్వం
Verse in Roman Script Book No. 1, Chapter 003, Verse 038.
capalAkshi cUDkula cADpuna keDameccu
cikkani canugava cIra gOru
nannnuva kaudIga andambu madinilpu
jaghana cakrambu pai calupu drishTi
abhilAsha mErpaDu naTlunDa gApalku
vEDkatO marumATa vinaga tivuru
adhika lajjAnvita aina akkanyaka
paibaDi lajjayu bApa talacu
enta SAtulayyu, enta jitEndriyu
layyu kaDu viviktamaina cOTa
satula gOsHThi citta calana mondudu rendu
kAmu Sakti nOrva galare janulu.
Same verse in telugu script.
ఆది పర్వం. తృతీయాశ్వాసం. 38వ పద్యం.
చపలాక్షి చూడ్కుల చాడ్పున కెడమెచ్చు
చిక్కని చనుగవ చీర గోరు
నన్నువ కౌదీగ అందంబు మది నిల్పు
జఘన చక్రంబు పై చలుపు దృష్టి
అభిలాష మేర్పడు నట్లుండ గాపల్కు
వేడ్కతో మరుమాట వినగ తివురు
అధిక లజ్జాన్విత అయిన అక్కన్యక
పైబడి లజ్జయు బాప తలచు
ఎంత శాంతులయ్యు ఎంత జితేంద్రియు
లయ్యు కడు వివిక్తమైన చోట
సతుల గోష్ఠి చిత్త చలన మొందుదు రెందు
కాము శక్తి నోర్వ గలరె జనులు?
Context and gist in English. parASara was a great Sage. He was son of Sage Sakti and grandson of Sage vaSiShTa. parASara was crossing river yamuna. He saw the boats-woman (also fishermAn girl) matsyagandhi, also called 'satyavati'. Cupid caught him.
The verse shows the predicament of Sage parASara. Poet nannaya quite impressively depicted the mental state of parASara.
nannaya concluded: Howsoever tranquil and self-controlled, people may be, they will get erratic and erotic, once they fall in conversation with damsels.
Observation
The author of Sanskrit mahAbhArata= vyAsa, was narrating his own birth story in Book 1, Adiparva. parASara was his father. matsyagandhi (Satyavathi) was his mother. In chapter 057, verses 056 to 060 he described the beauty of his mother. But he did not describe her thighs.
But telugu mahAkavi nannaya appears to be exuberant. He not only described her, from top to bottom, but also her thighs (jaghana cakram).
పరిశీలన. Analytical obseration in telugu script.
------
Telugu language: మహాభారత కర్త వ్యాసుడికి మత్స్యగంధి (సత్యవతి) తల్లి. ఇక్కడ వ్యాసుడు తన జనన వృత్తాంతాన్ని చెప్తున్నాడు. మత్స్యగంధిని తన తల్లి అని గుర్తుంచుకున్నాడో ఏమో , ఆమె తొడలను వర్ణించలేదు. కానీ తెలుగు మహాకవి నన్నయ్యగారు ఊరుకోలేదు. ఆమె జఘన చక్రంతో సహా (తొడలతో సహా) ఆపాదమస్తకం వర్ణించితే కానీ తృప్తి కలుగలేదు.
To continue. सशेष. సశేషం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.