చర్చనీయాంశాలు| స్నేహం, ఏనుగు లక్ష్మణకవి, నీతి శతకం
Verse in Roman Script
kshIramu munnu nITi kosagen svaguNaMbunu tannu cEruTan
kshIramu taptamauTagani chichchuriken vetacE jalaMbu, du
rvAra suhrudvipatti gani vahni coraMjane dugdhamaMtalO
nIramu kUDi SAMtamagu; nilcu mahAtmula maitri yI gatin
Verse in telugu script
క్షీరము మున్ను నీటి కొసగెన్ స్వగుణంబును తన్ను చేరుటన్
క్షీరము తప్తమౌట గని చిచ్చురికెన్ వెతచే జలంబు , దు
ర్వార సుహృద్ విపత్తి గని వహ్ని జొరంజనె దుగ్ధమంతలో
నీరము కూడి శాంతమగు , నిల్చు మహాత్ముల మైత్రి ఈ గతిన్.
English Gist in Roman Script
The poet has used the example of milk and water, to depict an exemplary friendshp.
Milk gave shared its qualities with water, when water was added to it.
Water got anxious when milk started suffering (when heated). Water entered fire, unable to bear the agony of its friend milk.
Milk, finding the calamity which occurred for its friend- water (durvAra suhrud vipatti), unable to bear, it too entered the fire.
(The person boiling the milk adds some water to the milk to restore its normalcy). Milk again gets back its peace, after getting water back.
Friendship of virtuous persons endures and sustains for a long time.
telugu gist in telugu script. తెలుగు అర్ధము తెలుగు లిపిలో.
ఏనుగు లక్ష్మణ కవి ఆదర్శ మిత్రుల స్నేహాన్ని చక్కగా వర్ణించాడు.
పాలల్లో నీళ్ళను కలిపి నపుడు , పాలు నీళ్ళను ఆహ్వానించి తన సుగుణాలను నీళ్ళకు ఇచ్చింది.
పాలను కాగపెట్టి నపుడు , పాలు పడే బాధను చూసి నీళ్ళు పొంగి నిప్పు ల్లోకి ఉరుకుతాయి.
నీళ్ళకు కలిగిన ఆపదను చూసి పాలు కూడా పొయ్యి లోకి దూకుతాయి.
పాలు పొంగటం చూసి ఇంటి వాళ్ళు నీళ్ళు పోస్తారు.
నీటితో పునర్ మిలనము జరిగాక పాలు శాంతిస్తాయి.
మహాత్ముల మధ్య స్నేహము ఇలాగ చిరకాలము నిలుస్తుంది.
తెలుగు వాళ్ళు కొట్టుకొని విడి పోవటాన్ని ఏ స్నేహము అనాలి?
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.