వాస్తులో నిజమెంత?
The above is the House of Mr. Mukhesh Ambani of the Reliance Empire. ऊपर छाया चित्र, श्री मुखेष अंबानी , रिलयन्स साम्राज्याधीश, के निवास गृह. పైది రెలయన్స్ సామ్రాజ్యాధీశుడు శ్రీ ముఖేష్ అంబానీ గారి ఇల్లు.
We need not write, the house might have been checked a thousand times for its vAstu. यह लिखने के जरूरत नहीं हैं, उनहोंने, अपने गृह के वास्तु को हजार बार चॆक् करवाया होगा। వ్రాయాల్సిన పనిలేదు, శ్రీ అంబానీ మహాశయులు తన గృహవాస్తును ఒక వేయిసార్లైనా చెకింగ్ చేయించి ఉంటారు.
వాస్తు రెండు రకాలు. మొదటిది, ఇళ్ళలోకి చక్కని గాలి, వెలుగు వచ్చి ఇంట్లోని వారు ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా నివసించటానికీ ఉద్దేశించిన నియమాలు సమర్ధించ తగినవే. రెండవది, బోడిగుండుకు బట్టతలకు ముడిపెట్టినట్లుగా, ఎవడో సిధ్ధాంతి చెప్పాడని, మనకేదో కలిసి రావాల్సిన లప్పం రావటం లేదని వంటిల్లు పడగొట్టి టాయ్ లెట్లు, లెట్రిన్లు పడగొట్టి వంటిల్లు కట్టించటం వల్ల ఇల్లు గుల్లవుతుంది. ఇల్లు ఛండాలంగా తయారు అవుతుంది.
గాలి వెలుతురు లేని ఇళ్ళల్లో నివసించినపుడు శారీరిక ఆరోగ్యం మాత్రమే కాక మానసిక ఆరోగ్యం కూడ పాడవచ్చు. చదువు, వృత్తి, మొ|| తమ తమ కర్తవ్యాలు నిర్వహించటానికి ఇంట్లోని వారికి కుదరక, వారు వైఫల్యాలు పొందుతూ ఉండచ్చు. వైఫల్యాలు పొందేవారు చెక్ చేసుకోవాల్సింది తమ ఇంటిలోకి సరియైన గాలీ వెలుతురు వస్తున్నాయా మరియు ఇల్లు కట్టిన తీరు వల్ల ధ్వని కాలుష్యం, వస్తువులు వాటి వాటి స్థలాలలో పెట్టుకోలేకపోటం వంటివి జరుగుతున్నాయా అనే వాటిని.
కొన్నిసార్లు వైఫల్యాలు ఇంటి వాస్తు వల్ల కాక, బయట సమాజ వాతావరణం, ప్రభుత్వ నిర్ణయాలు, వ్యాపార వాతావరణం, వంటి ఎన్నో కారణాల వల్ల చోటు చేసుకోవచ్చు. ఆబయటి అంశాలు మన అదుపులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ కష్టాలలో చాల భాగం మనకి పెట్టుబడిదారీ విధానం తెచ్చి పెట్టేవి. ఈదేశం, పెట్టుబడిదారీ విధానం, భూస్వామ్యవిధానం, మార్కెట్ అర్ధిక వ్యవస్థ నుండి బయటపడేదాకా ఈబాధలు తప్పవు.
ప్రశ్న| వాస్తు సరిగా లేనందువల్ల కలిగే బాధలను మీరు అనుభవించలేదు కాబట్టి, మీరు ఇలా వ్రాస్తున్నారు. మీరు వాస్తు సరిగా లేని ఇంట్లో ఉన్న తరువాత వ్రాయండి, మీరు వ్రాసే దాన్ని మేము పరిశీలిస్తాము.
జవాబు| నేను 1992 నుండి ఈశాన్యం తక్కువయ్యి, ఆగ్నేయం పెరిగిన ఇంట్లో ఉంటున్నాను. నేను ఉంటున్న ఇల్లును, వాస్తు సరిగా లేదని, ఈశాన్యం తక్కువైన, ఆగ్నేయం పెరిగిన ఇల్లని, దానిని కొనద్దని చాల మంది చెప్పారు. అయినా ధైర్యం చేసి కొని ఉంటున్నాను.
నేను కొన్న మాఇంటిలోకి 1992లో వెళ్ళిచేరినపుడు, మామూలుగా అద్దె ఇంట్లోకి వెళ్ళిచేరినట్లే, ఇల్లు మారాను. గృహప్రవేశాలు, పురోహితులు, గుమ్మడికాయలు, లేకుండానే చాల తక్కువ ఖర్చుతో, తక్కువ ఆర్భాటంతో పని నడిపించాను.
ఈ 22 సంవత్సరాలలో నాకు ప్రత్యేకమైన పెద్ద పెద్ద కష్టాలేమీ రాలేదు. మాపిల్లలిద్దరు జీవితాల్లో సెటిల్ అయ్యారు. పిల్లాపాపలతో బాగానే ఉంటున్నారు. నాకు ఒకసారి కనుగుడ్డు మీద నాలుగు కుట్లు పడ్డాయి. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఈ సాధారణ సుఖదుఃఖాల మధ్యనే, నా పనులు చేసుకుంటూ తిరుగుతున్నాను. ఇలాంటి కష్టాలు భూమిమీద అందరికీ వస్తున్నాయి. మా లొకాలిటీలో వాస్తు బాగా ఉన్న ఇళ్ళలో ఉంటూ కూడ, కష్టాలు పడుతున్న వారిని చూసి సుఖ దుఃఖాలకూ లక్షకారణాలు ఉంటాయనీ, వాస్తుకూ సుఖ దుఃఖాలకు సంబంధం లేదనీ, ఋజువు చేసుకున్నాను.
ప్రశ్న| మాఇంటి దగ్గర ఒక గొప్ప వాస్తు సిధ్ధాంతి ఉన్నాడు. మీరు ఆయన దగ్గర మీ ఇంటికి వాస్తు చూపించుకోండి. అప్పుడు మీకు ఈగాడిద బుధ్ధులు పోయి బాగుపడతారు.
ఒకసారి నేను బస్సులో డ్రైవర్ గారే పొగతాగుతుంటే, ఆయనని దయయుంచి మానేయమని విజ్ఞప్తి చేసాను. ఆయన నన్ను మానేయమని చెప్పటానికి నీవెవరివి, నీవు నీజాబ్ లో అన్ని రూల్స్ పాటిస్తున్నావా, అని బస్సులో అందరిముందు నన్ను వాయించాడు. ప్రయాణీకులలో ఎవరూ నన్ను సమర్ధించలేదు. ఆయనకు కోపం తగ్గక, మిగిలిన ప్రయాణాన్ని విపరీతంగా బ్రేకులు కొట్తూ, జర్కులు ఇచ్చుకుంటూ తన పగతీర్చుకున్నాడు. నేను దిగిపోయాక మానేశాడేమో తెలీదు.
ఇంటికి వచ్చాక, నేను ఆర్ టీ సీ వారికి ఆ డ్రైవర్ పై బస్ నంబర్ ఇస్తూ, పొగతాగటం గూర్చి, ప్రయాణీకుల ముందు అవమాన పర్చటం గూర్చి ఫిర్యాదు చేసాను. ఏగుణాన ఉన్నారో, ఆర్ టీ సీ వారు ఆ డ్రైవర్ పై విచారణ చేపట్టారు. వెంటనే, ఏమనుకున్నాడో ఏమో ఆ డ్రైవర్ నా అడ్రస్ ఫిర్యాదు లెటర్ నుండి తీసుకుని మా ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోని కోరాడు. నేను ఒప్పుకోలేదు. అతడు మీ ఇంటికి ఈశాన్యం తక్కువై, ఆగ్నేయం పెరగటం వల్ల మీకు మానసిక ఆరోగ్యం సరిగా లేనట్లుగా ఉంది, నేను మీ ఇంటి వాస్తు బాగు కావటానికి చక్కటి సలహాలు ఇస్తాను, మీరు నాపై కంప్లెయింట్ ఉపసంహరించుకోండి అన్నాడు. నాకు కోపం వచ్చినా, తమాయించుకుని, మా ఇంటి వాస్తు గురించి మీఅభిప్రాయం ఓకే. ఆసమస్యను నేను తరువాత పరిశీలిస్తాను.
మీకు నా ఫిర్యాదు వల్ల సమస్య వచ్చినట్లు ఉంది. నేను మీరు డ్రైవ్ చేస్తున్న బస్సులో మీ పొగత్రాగుడు గురించి మీ ఆర్ టీ సీ కి చేసిన ఫిర్యాదును, ఇంక ఫాలో అప్ చేయను. మీరు మీ పై అధికారులకు నచ్చచెప్పుకొని మీపై విచారణను రద్దు చేయించుకోండి అని నచ్చ చెప్పాను. ఆయన వెళ్ళిపోయాడు.
ప్రశ్న| వాస్తు సరిగాలేని ఇంట్లో ఉండకూడదని సిధ్ధాంతులు బల్లగుద్ది చెప్తున్నారు కదా?
జవాబు| వాళ్ళు అలాగే చెప్తారు. అది వాళ్ళ బ్రతుకుతెరువు కొరకు వాళ్ళు అలవర్చుకున్న చాతుర్యం. కూటి కొరకు కోటి విద్యలు లాగా, జ్యోతిష్కులు, వాస్తు సిధ్ధాంతులు, క్షుద్రపూజలు చేయించేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు మన బుధ్ధి సరిగా పనిచేయకుండా, అభూత కల్పనలు చేసి భయపెట్టటం మన సమాజానికి ఒక సమస్యగా మారింది. అలా భయపెట్టకపోతే, వాళ్ళు చేసే రాగియంత్రాలను కొని ఎవరు ద్వారాలకు కొట్టించుకుంటారు ?
ప్రశ్న| కొన్ని విదేశాలలో కూడ వాస్తును పాటిస్తున్నారు కదా ?
జవాబు| అన్ని దేశాలలో ఒకే రకమైన వాస్తు నియమాలు లేవు. మన దేశంలో చెడు చేస్తాయి అనుకుంటున్న వాటిని విదేశీయులు పట్టించుకోకుండా ఇళ్ళు కట్టుకుంటుంటే, వాళ్ళకి ఏ అపకారం జరగటం లేదు కదా. వాళ్ళు చెడు అనుకునే వాటిని మనం పట్టించుకోకుండా, మన ఇళ్ళు కట్టుకుంటున్నా, మనకేమీ అపకారమూ జరగటం లేదుకదా. అంతేకాక, ప్రపంచంలోని అన్నిదేశాల వాస్తులను ఒకచోట జమచేసి పుస్తకం వ్రాస్తే, అది వెబ్ స్టర్ డిక్షనరీ కన్నా పెద్దదవుతుంది. దానిని పాటిస్తూ ఇల్లును మయుడు కూడ కట్టలేదు.
విచిత్రమేమిటంటే, మయుడు వాస్తు ప్రకారం కట్టిన మయసభలో రాజ్యం ప్రారంభించిన కొద్దిరోజులకే పాండవులు అడవుల పాలయ్యారు. (ధర్మరాజు జూదంలో ఓడిపోయింది, కౌరవుల అసెంబ్లీ హాల్లో). ఎంతో గొప్ప వాస్తు నియమాలు, ఆగమాలను పాటిస్తూ కట్టించినా సోమనాధ దేవాలయంలో శివలింగం 17 సార్లు ఘజినీ మహమ్మద్ చేత పెకలించి వేయబడింది. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడ వాస్తు ప్రకారమే కట్టినా, ఉగ్రవాదులు దానిని నేలమట్టం చేశారు.
ప్రశ్న| వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తికి వాస్తుపై నమ్మకం ఉండేదా ?
వివాహానంతరం, శ్రీరాముడు అయోధ్యా రాజభవనాలలో 17 ఏళ్ళు ఉన్నా, వాస్తును పాటించాడని కానీ, పాటించలేదని కానీ స్పష్టంగా చెప్పలేము. శ్రీరాముడు భవన నిర్మాణాలు చేపట్టినట్లు అయోధ్యాకాండలో లేదు. అడవిలో మటుకు లక్ష్మణుడు వెళ్ళిన ప్రతిచోటా చెట్లను, నరికి పర్ణశాలను నిర్మించేవాడు (తాటాకుల పాకల వంటివి). వాల్మీకి రామాయణ 2.56.23 మొ|| శ్లోకాల ప్రకారం శ్రీరాముడికి ఇళ్ళను శక్తులు (దుష్ట కావచ్చు, శిష్ట కావచ్చు) ఆవరించి ఉంటాయని, వాటిని తృప్తి పరచటానికి జింకలను, అడవిపందులను ఎర్రగా కాల్చి బలి ఇవ్వాలని తెలుసు. రాముడి ఆజ్ఞ ప్రకారం, లక్ష్మణుడు జంతువులను కాలిస్తే, రాముడు వాటిని శక్తులకు నివేదన చేశాడు. ఇంతచేసినా, ఆపర్ణశాల వాస్తు సరిగా లేదో, లేదా ఆదుష్టశక్తులకు నివేదించిన జింక పంది మాంసాలు నచ్చలేదో, రావణుడు సీతను ఆ పర్ణశాలనుండే ఎత్తుకు వెళ్ళాడు.
ప్రశ్న| ఇళ్ళముందు గుమ్మడికాయల సంగతి ఏమిటి.
బౌధ్ధం వచ్చాక, గృహ ప్రవేశాలకు జంతు బలులు తగ్గి గుమ్మడికాయలను కట్టటం వంటివి మొదలయినట్లు కనిపిస్తుంది. ఈరోజు మనం ఏ ఇంటిముందుకు, అపార్ట్ మెంటు ఫ్లాట్ ముందుకు వెళ్ళినా గుమ్మడికాయ వేలాడకట్టి కనిపిస్తుంది. ఇలాటివిషయాలు చూశాక నాకు, భారతీయులలో 90% శాతందాకా మూర్ఖులని విశ్రాంత సుకోన్యామూ శ్రీ మార్కండేయ కట్జూగారన్న మాట తరచుగా గుర్తుకు వస్తుంది. అయితే మూర్ఖులు అనేమాట సబబు కాదు. అందుకే కాబోలు, వారు కూడ తరువాత ఆవ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు. అయితే ఒకటి నిజం. భారతీయులకు తమ భవిష్యత్ ను గురించిన భయం ఎక్కువ అని చెప్పచ్చు.
ప్రశ్న| భారతీయులకు ఈరిస్కులు తగ్గించటానికి ఏమిచేయాలంటారు.
జవాబు| రిస్కులను మనం పలురకాలుగా విభజించ వచ్చు. భూకంపాలు వంటి వాటిని స్పష్టంగా ముందుగా చెప్పేస్థితికి మన సైన్సు రాలేదు. వీటిని మన పూర్వీకులు దైవిక కష్టాలు అన్నారు. పాశ్చాత్యులు కూడ యాక్షన్స్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇవికాక పేథలాజికల్ రిస్కులు (రోగాలూ, రొప్పులు), కమర్షియల్ రిస్కులు (వ్యాపారాల్లో వచ్చే ఒడుదుడుకులు), పొలిటికల్ రిస్కులు (రాజకీయమార్పుల వల్ల వచ్చే కష్టనష్టాలు), సిస్టమిక్ రిస్కులు అంటే వ్యవస్థాత్మకమైనవి మొ|| ఉంటాయి. దైవికమైన రిస్కులను తప్ప మిగిలిన వాటిని చాలవరకు మార్క్సిజం సహాయంతో మనం పరిష్కరించుకోవచ్చు. ఈరిస్కులకు బీమాలు వంటివి అతుకుల బొంతల పరిష్కారాలు సరిపోవు. రిస్క్ మేనేజ్ మెంట్ అనే సైన్స్ కొంతవరకు మనకు సహాయం చేసినా, ఇంకా మనం చాలాదూరం వెళ్లాల్సి ఉంది.
ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.