Sunday, June 29, 2014

275 (Part 1 of 10 series) A study on self-love and masturbation, part- 1


275 స్వప్రేమ, స్వసంపర్కం పై ఒక అధ్యయనం మొదటి భాగం. First part of a study of Self-love, self-union, including masturbation.
275, స్వప్రేమ, స్వసంపర్కం, narcissism, స్వలింగ సంపర్కం, భిన్న లింగ సంపర్కం, కలగూరగంప సంపర్కం
ఈ పోస్టు, నా ఈక్రింది బ్లాగ్ పోస్టులకు కొనసాగింపు.

స్వసంపర్కం యొక్క అధ్యయనం, 2వ భాగానికి లింకు: Link to part 2 of 10 series, of Self-love and Self-Union http://problemsoftelugus.blogspot.com/search/label/276 క్లిక్

స్వసంపర్కం యొక్క అధ్యయనం, 3వ భాగానికి లింకు: Link to part 3 of 10 series of Self-love and Self-Union http://problemsoftelugus.blogspot.com/search/label/277 క్లిక్

స్వసంపర్కం యొక్క అధ్యయనం, 4వ భాగానికి లింకు, Link to part 4 of 10 series of Self-love and Self-Union http://problemsoftelugus.blogspot.com/search/label/278 క్లిక్

స్వసంపర్కం యొక్క అధ్యయనం, 5వ భాగానికి లింకు; Link to part 5 of 10 series of Self-love and Self-Union http://problemsoftelugus.blogspot.com/search/label/279 క్లిక్

స్వసంపర్కం యొక్క అధ్యయనం, 6వ భాగానికి లింకు; Link to part 6 of 10 series of Self-love and Self-Unionhttp://problemsoftelugus.blogspot.com/search/label/280 క్లిక్

పోస్టు నంబర్ 190: ఇందులో స్వలింగ సంపర్కాల గురించి, గే దంపతుల వివాహాల గురించి కొంత మేరకు కవర్ చేశాను. http://problemsoftelugus.blogspot.in/search/label/190 చూడటానికి క్లిక్.

పోస్టునంబర్ 163: ఇది నిజానికి స్వలింగ సంపర్కానికి సంబంధించిన పూర్తి స్థాయి చర్చ కాదు. ఈ పోస్టులో నేను తెలుగు వాళ్ళలో హోమో సెక్స్యుయల్ వెబ్ సైట్లకి ఉన్న ఆదరణ గురించి ఒక ఉదాహరణనిచ్చాను. స్వలింగ సంపర్కాన్ని , స్వసంపర్కాన్ని లోతుగా చర్చించాలనే కోరిక ఈ బ్లాగ్ పోస్ట్ వ్రాసేటపుడే జన్మించింది.
http://problemsoftelugus.blogspot.in/search/label/163 కి వెళ్ళటానికి క్లిక్

ఆతరువాత, స్వలింగ సంపర్కం, భిన్న లింగ సంపర్కం, బహులింగ సంపర్కం, మొదలగు ఎన్నో విషయాల గురించి, ముఖ్యంగా స్వసంపర్కం గురించి వ్రాద్దామని చాలా సార్లు అనుకున్నాను, కానీ ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పడటం, నాకు ఉన్న ఫాడ్స్ వల్ల కుదరలేదు.

అయితే మనకు వీలు చిక్కేదాకా లోకం ఆగదు. ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచం అసలాగదు. ఈరోజు దక్కన్ క్రానికల్ ప్రింటు దిన పత్రికను తిరగేస్తూ ఉండగా, ఓపెడ్ 11వ పేజీలో అడుగు భాగంలో ఈక్రింది వ్యాసం నా కళ్ళలో పడింది. టైటిల్: The Age of Self-love. రచయిత: Brendan O'Neil. దీని దక్కన్ క్రానికల్ లింకు, నా కనెక్షన్ స్లో ది కావ టాన వెతికి లోడ్ చేయటం కుదరలేదు. దక్కన్ క్రానికల్ వారు దీనిని స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రిక వారితో చేసుకున్నా ఏర్పాటు ననుసరించి ప్రచురించారు. లక్కీగా, ఆలింకు దొరికింది. ఆలింకును ఈ క్రింద ఇస్తున్నాను. చదివితే, ఈ సబ్జెక్టును మనం ఇంకొంత లోతుగా చర్చించటానికి ముందుకు వెళ్ళ వచ్చు.

స్పెక్టేటర్ పత్రికలో , ఈనాటికి, ఈ వ్యాసంపై 45 కామెంట్స్ వచ్చాయి. అయితే పాశ్చాత్యుల కామెంట్లకు, భారతీయుల వ్యాఖ్యలకు, తెలుగు వాళ్ల వ్యాఖ్యలకు మధ్యలో హస్తిమశకాంతరం ఉంటుంది. పాశ్చాత్యులలో పలువురు ప్రతిదాన్నీ బైబిల్ కోణంలోంచి చూస్తారు. ఉత్తర భారతీయులలో కొందరు ప్రతిదాన్నీ హిందూత్వ కోణంలోంచి చూస్తారు. తెలుగు వాళ్ళే, అప్పుడప్పుడు కొంత తెగులు వాళ్ళలాగా ప్రవర్తించినప్పటికి కొంత మేరకు మెరుగనిపిస్తుంది. కొంత ఆబ్జెక్టివిటిని (లక్ష్యశుధ్ధిని) చూపిస్తారు. http://www.spectator.co.uk/features/9247341/the-age-of-self-love/ కి వెళ్లటానికి క్లిక్

ఈ లింకులో ఒక చక్కని చిత్రాన్ని కూడ చేర్చారు. దీనిని ఎందుకో దక్కన్ క్రానికల్ వారు ప్రచురించలేదు. చిత్రం సందర్భోచితంగా ఉంది.

ముందుగా తెలుగు వాళ్ళకోణంలోంచి కొన్ని పరిచయ వాక్యాలు, పదాలు:-- ఇపుడు పెద్దగా వాడబడటంలేదు గానీ, 20-30 ఏళ్ళ క్రితం పత్రికల్లో సెక్స్ డాక్టర్ల ప్రకటనలు పాణి మైధునము, హస్త మైధునము, హస్తస్ఖలనము వంటి పదగుఛ్ఛాలను వాడి యువకుల మైండ్లలో గుబుళ్ళను రేకెత్తించేవి. తమకు హస్తస్ఖలనము అలవాటు ఉంది కాబట్టి, తమ అంగము చిన్నదవుతున్నదనో, లేక తాను వివాహం చేసుకుంటే విఫలమవుతాననో, రకరకాల భయాలతో కుమిలిపోయే యువతనుండి డబ్బు పిండుకోటానికి అర్హతలేని సెక్స్ డాక్టర్లు ఈపదాలు వాడుతుండే వాళ్ళు.

ఒక విధంగా చెప్పాలంటే, సెక్స్ సైన్స్ ను, తెలుగు వాళ్ళలోకి వ్యాప్తిలోకి తెచ్చిన ఖ్యాతి డాక్టర్ సమరం మరియు ఈనాడు దిన పత్రిక వారికే చెందాలి. తరువాత పలువురు వారిననుసరించి సెక్సు సందేహాలను తీర్చే శీర్షికలను ప్రారంభించినా, పయనియర్ గా డాక్టర్ సమరంని, నేను వ్యక్తిగతంగా సంభావిస్తాను.

స్వసంపర్కం గురించి కొంత వివరణపైనవ్రాసిన హస్తస్ఖలనము, హస్త మైధునము మొ|| పదాలు ఎక్కువగా పురుషుల స్వయం తృప్తికి సంబంధించినవి అనే భావన కలిగిస్తాయి. అయితే ఈ స్వయం ప్రేరణ, స్వయం సంతృప్తి అనే అలవాట్లు స్త్రీలలో కూడ ఉండచ్చు. వైబ్రేషన్స్ కలిగించే , విదేశాల్లో వాడే సెక్స్ టాయ్స్ భారత్ లోకి ప్రవేశించటం మొదలయ్యాక, ఈవిషయంలో స్త్రీపురుష సమానత్వం కొంత మెరుగయ్యింది.

పైన చెప్పిన బ్రెండాన్ ఓ నిల్ గారి వ్యాసంలో ఒకటిరెండు చోట్ల వాడ బడిన narcissism నార్సిసిజం అనే పదం స్వయంతృప్తి , అనే పదం కన్నా కొంత విస్తృతమైనది. స్వయంతృప్తి, స్వయంప్రేరణ, హస్తమైథునం వంటి పదాలలో మనం లైంగిక కోణాన్ని మాత్రాన్నే చూడటం జరుగుతుంది. నార్సిసిజం అనే పదానికి మనం స్వప్రేమ అనే పదాన్ని వాడటం మేలేమో. ఎందుకంటే, నార్సిసిజంలో లైంగికేతర అంశాలు కూడ ఉంటాయి. నార్సిసిజం అంటే తనను తాను ప్రేమించుకోటం. ఇది లేని వాళ్ళు, చేయని వాళ్ళుండరు. ఈ నార్సిసిజం లోంచే కొన్ని ఉపశాఖలు జన్మిస్తాయనచ్చు. మొదటిది ఇగోటిజం, అంటే తనను గురించి తానే అతిగా మాట్లాడటం. రెండోది, ఇగోయిజం, తన గురించి తాను అతిగా ఆలోచించుకోటం. అయితే ఇవి రెండు మన బ్రెండాన్ ఓనిల్ గారి వ్యాస పరిథిలోకి వస్తాయని కానీ, మన పోస్టు పరిథిలోకి వస్తాయని నేను అనుకోను.

ఈ వ్యాసాన్ని నేను చర్చించటంలో నా లక్ష్యంఈ వ్యాసాన్ని నేను చర్చించటంలో నా లక్ష్యం ఏమిటంటే, యువతకు, అన్ని వయసుల పురుషులకు, భిన్న లింగ కాంక్షలు, బహులింగ కాంక్షలు తీరనపుడు రేపులకు, ఎసాల్ట్ లకు, మొలెస్టేషన్లకు, యాసిడ్ దాడులకు పాల్పడే కన్నా స్వసంపర్కాన్ని ఆశ్రయించటం మేలా, లేక అది ఆత్మ గ్లాని కారకం అవుతుందా? ఈ స్వసంపర్కం అనే పదం ఎక్కడైనా నెట్ లో గానీ, ప్రింటు పుస్తకాలలో గానీ దొరుకుతుందేమో నని నేను వెతికాను. కానీ ఎక్కడా దొరకలేదు. కనుక ఈ స్వసంపర్కం అనే పదాన్ని ఆత్మ లైంగిక ప్రేరణ, తృప్తి అనే అర్ధంలో, కాయిన్ చేసి వాడటానికి సాహసిస్తున్నాను. స్వప్రేమ అనే పదాన్ని, self-love, narcissism అనే విస్తృత అర్ధంలో (లైంగికం, లైంగికేతరం కలిపిన సెల్ఫ్ లవ్) వాడగలను.

స్వలింగ సంపర్కం అనే పదం కొంత యాంబిగ్విటీని కలిగి ఉంది. ఆంగ్లంలో గే అనే పదాన్ని పురుషుల మధ్య స్వలింగ సంపర్కానికి, లెస్బియన్ అనే పదాన్ని స్త్రీల మధ్య స్వలింగ సంపర్కానికి వాడి స్త్రీ పురుషుల మధ్య తేడాను చూపటానికి వీలుంది. మనం కూడ స్వపుంలింగ సంపర్కం, స్వస్త్రీలింగ సంపర్కం అనే పదగుఛ్ఛాలను వాడితే ఈతేడాను చూపించ వచ్చు.

అదే విధంగా పురుషుడు హస్తమైధునాదుల ద్వారా స్వయం తృప్తిని పొందితే స్వపు సంపర్కం, స్త్రీలు స్వంత క్లిటోరిస్ ను ప్రేరేపించుకునో వేరే విధంగానో స్వయం తృప్తిని పొందితే స్వ స్త్రీ సంపర్కం, అనచ్చేమో.

బ్రెండాన్ ఓనిల్ గారు ప్రస్తావించిన ''ది ఏజ్ ఆఫ్ సెల్ఫ్ లవ్'' (''స్వప్రేమ యుగం'') మన 21వ శతాబ్దాన్ని ఉద్దేశించినదే. పాశ్చాత్యలోకంలో మనకన్నా ఏకాకి తనం ఎక్కువగా ఉండటాన, విడాకులు మొ|| ఎక్కువయ్యి, పార్టనర్లు విభిన్న రాష్ట్రాల్లోనో, దేశాల్లోనే, ఖండాల్లోనే నివసించటాన ఒంటరి జీవితాలు పెరిగిపోయినపుడు స్వప్రేమ, స్వసంపర్కం, స్వపుసంపర్కం, స్వస్త్రీ సంపర్కం, అనివార్యం కావచ్చు.

ఇంకా ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.