చర్చనీయాంశాలు: దేశ రాజకీయాలు, ఆం ఆద్మీ , కాంగ్రెస్
అరవింద్ కేజ్రీవాల్ గారు కాంగ్రెస్ తవ్వి న గుంటలో పడ్డట్లే లెక్క.


కాంగ్రెస్ , బిజెపీలు రెండు అవినీతి పార్టీలని కదా కేజ్రీవాల్ గారు చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ తన వీపుపైన ఎక్కించుకొని కేజ్రీవాల్ గారిని మోయటానికి ముందుకు వచ్చినా, కేజ్రీవాల్ గారు వ్యామోహపడకుండా ఉండ వలసింది. ఎందుకంటే, వీపు మీద ఎక్కించుకునే వారు, ఎంతోకాలం బరువులను మోయలేరు. ఏదో ఒకరోజు నేలమీదకు త్రోసి వేయక తప్పదు.
గత కాలపు కాంగ్రెస్ మద్దతు చరిత్రను పరిశీలిస్తే, మధ్యలోనే క్రిందికి నెట్టేయటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చేత నెట్టివేయబడ్డ వాళ్ళలో చరణ్ సింగ్, చంద్రశేఖర్ లు, ప్రముఖులు. చరణ్ సింగ్ , చంద్రశేఖర్ లు, కాంగ్రెస్ కు ఎన్నడూ ఛాలెజర్లు గా మారలేదు. అయినా కాంగ్రెస్ వారిని నలిపేయటానికి వెనకాడలేదు.
కెజ్రీవాల్ ఎజెండా ఏమిటి? అఖిలభారత స్థాయిలో బిజేపీ కాంగ్రెస్ లను ఛాలెంజ్ చేయటం. దీనిని కాంగ్రెస్ ఎలా సహిస్తుంది. అవకాశం చూసుకొని దొంగ దెబ్బ తీస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నర్ రామ్ లాల్, నాదెండ్ల భాస్కరరావు , కాంగ్రెస్, కలసి ఎన్ టీ ఆర్ ను దెబ్బతీసి నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీని కాంగ్రెస్ చీల్చటం, భవిష్యత్ దర్శనం. పదవీ వ్యామోహ పరులు సర్వత్రా ఉంటారు.
బిజేపీ, ఆప్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే, ఢల్లిలో రాష్ట్రపతి పాలన రావటం, తిరిగి ఎన్నికలకు ఎంతో ఖర్చు అవటం నిజమే అయినా, దానికి బాధ్యత వహించ వలసినది ప్రజలే. అది బ్రిటీష్ పార్లమెంటరీ పధ్ధతిని మనం అనుకరించటం వల్ల వచ్చిన ప్రమాదం.
ఒక పరిష్కారం: ఢిల్లీ శాసనసభ్యులు రహస్యబ్యాలెట్ ద్వారా ముఖ్యమంత్రిని, ఇతరమంత్రులను (శాఖలతో సహా) ఎన్నుకునే పధ్ధతి ప్రవేశ పెట్టటం అవసరం. అవసరం అయితే, దీని కొరకు రాజ్యాంగ సవరణలు చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఐదేళ్ల శాసన సభా పదవీకాలంలో, ఇలాంటి ఎన్నికలను రెండున్నర ఏళ్ళకొకసారి జరుపుకుంటే సరిపోతుంది. అవసరం అయితే ఇంకా ఎక్కువ సార్లు కూడ ఇలాటి ఎన్నికలను జరుపుకోవచ్చు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.