Thursday, October 24, 2013

#021 వేట కుక్కలతో వెంటాడుతూ _ కుందేళ్ళతో పరుగెత్తుతూ.


021 Chasing with the hounds and running with the hares! We have no courage to say that we can stop the decision of Bifurcation. Centre and the Congress Party are proceeding hastily. In these circumstances, we are unable to forge courage to say that we shall keep our State united. In the current circumstances, only BJP can stop bifurcation. Unless BJP re-examines its decision to support the Telangana Bill in Parliament, there is no question of its stopping.

కేంద్రమంత్రి Ms. కిల్లి కృపారాణి 22.10.2013, బుధవారం విభజన అంశంపై మాట్లాడుతూ చెప్పినట్లుగా వచ్చిన వార్త.
విభజన నిర్ణయం ఆపుతామనే ధైర్యం లేదు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ తెలంగాణపై దూకుడుగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని చెప్పే ధైర్యం చేయలేము. ప్రస్తుత పరిస్థితుల్లో విభజనను బిజెపి మాత్రమే అడ్డుకోగలదు. బిజెపి తన నిర్ణయాన్ని పునరాలోచించుకొని పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే తప్ప ఆగే ప్రసక్తి లేదు.

పరిశీలన Examination
_____


మంత్రి గారు మంత్రి పదవిలో కొనసాగుతూ ఈ మాటలు చెప్పటం బాగా లేదు. ఆమె వేటకుక్కలతో వేటాడుతూ కుందేళ్ళతో పరుగెత్తాలను కుంటుంన్నట్లు గా కనిపిస్తున్నది. ఆమె పదవిలో నుండి వైదొలిగి ఈ మాటలు చెప్పి ఉంటే ఎంతో విలువ వచ్చి ఉండేది. It is not proper for the Central Minister to say these words, while continuing in her post. She can resign, and speak more boldly. People might have given her , and her words, great respect.

సీమాంధ్ర ప్రజలను ఆమె తప్పుగా అంచెనా వేసుకున్నట్లు కనిపిస్తున్నది. ప్రజాభిప్రాయాన్ని , ఆమె మన్నించి రాజీనామా చేసి ఉంటే తరువాత ఏమి చేయాలా కేంద్రాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలా అనేది ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు.

తమ పార్టీ చేయబోయే నిర్ణయాల్నే ముందుగా పసికట్టి తమ అయిష్టత వ్యక్తం చేయవలసిన బాధ్యతను మన కేంద్ర మంత్రులందరూ విస్మరించటం మన ముందున్న చేదునిజం. కేంద్రం, అధిష్ఠానం, ఏమన్నది. సీ మాంధ్ర నేతలు అభ్యంతరం చెప్పలేదు. సీమాంధ్ర ఉద్యమాలు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. అవి చాల బలహీనంగా ఉన్నాయిట. మనకు రాబోయే క ష్టాన్ని మనమే గుర్తించి పట్టించుకో లేకపోతే ఇతరులెందుకు పట్టించు కుంటారు ? అధికారమే పరమావధిగా గల బిజెపి ఎందుకు పట్టించుకోవాలి? కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?

28.06.2014 జోడించింది

మంత్రివర్యురాలు తన గోడమీది పిల్లివాటానికి ఫలితాన్ని అనుభవించింది కదా. ప్రజలే సోనియా గాంధీకి తగిన బుధ్ధి చెప్పారుకదా. The Minister suffered for her Cat-on-the-wall approach. People of Residual Andhra Pradesh have taught a suitable lesson to Ms. Sonia Gandhi.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.