ఈ బ్లాగు నిర్వహణలో అనివార్యమైన అవాంతరాలు రావటం వల్ల దీర్ఘ విరామాలు రావటం జరిగింది. నేను గత ఎనిమిది ఏళ్ళుగా ౯౫ సంవత్సరాల వృధ్ధుడైన మా నాన్న గారి సేవలో గడపటం జరిగింది. వారు ఈ ఏడు జనవరిలో పరమపదించటం జరిగింది. ఆతరువాత ఈ పదినెలలుగా బాగా పాతపడి కూలిపోయే స్థితికి వచ్చిన నేనుండే ఇంటి రిపేరులో నిమగ్నం కావటం వల్ల తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రగడలను గూర్చి నానేదనను వ్రాద్దామనుకున్నా కుదరలేదు. ఇపుడు నా వయసు ౭౨. నేటి జనాభాలో ౭౫ శాతము పైగ్ బాలబాలికలు , యువతీ యువకులు, మధ్యయ వయస్కులు కావటం వల్ల మా బోటి వృధ్ధులు ఆలోచనా ధోరణులకు వారి మనోభావాలకు హస్తి మశకాంతరం ఉండే అవకాశం ఉంది. వారి ఆలోచనలు, అచరణలలోని అస్పష్టతలను గూర్చి చర్చించే హక్కు నాకు ఉండదు కాబట్టి, నేను నా ఆలోచనలలోని , అచరణలలో ఉండే అస్పష్టతలను తొలగించుకోటానికి ప్రయత్నిస్తాను.
ముందుగా
------ నాకు ఆకాశవాణి వారి శాస్త్రీయ సంగీత కార్యక్రమాలను క్రమం తప్పకుండా వినే అలవాటు ఉంది. ఈ వినటంవల్ల, నేను ఎన్నో క్లిష్ట సమయాలలో మనో నిగ్రహాన్ని కోల్పోకుండా నా పనులను చేసుకునే నిబ్బరాన్ని పొందానని నమ్ముతున్నాను. కనుక, ఈ సంర్భంగా నేను శ్రీ ఆకాశవాణి గాయకులు శ్రీ మోదుమూడి సుధాకర్, వయోలినిస్టు శ్రీమతి దుర్గాభవాని, మార్దంగికులు (పేరు శ్రీ ప్రసాద్ అని గుర్తు), మరియు అనుసంధాన హైదరాబాదు, విశాఖ, కడప్ కళాకారులుకు నా కృతజ్ఙతలు తెలుపుకుండున్నాను.
మూడు రాజధానులు
ఈ బ్లాగులోని పాతపోస్టులను గమనిస్తే, నేను ఉమ్మడి తెలుగు ఆంధ్రప్రదేశ్ ను ఐదు ఆరు రాష్ట్రాలుగా విభజించాలని సూచించటం జరిగింది. దీనికి ముఖ్య కారణం, తెలుగు వాళ్ళు మరీ మాట్లాడితే భారతీయుల స్వభావం ఏదో విధంగా విడిపోయి తన్నుకోటం. ఇలా తన్నుకోటం వల్లే మనం ౩ వేల సంవత్సరాల బానిసత్వానికి గురి కావటం జరిగింది. తన్నుకోకపోతే మనం తెలుగు వాళ్ళం ఏలా అవుతాం ? భారతీయులం ఎలా అవుతాం ? దీని తరువాత పోస్టులో మూడు రాజధానులకు సంబంధించిన కొన్ని పరిష్కారాలను పరిశీలిద్దాం. ముందుగా స్పష్టీకరణ-- నేను వైఎస్ ఆర్ కుక్కను కానీ, టీడీపీ కుక్కను గానీ కాదు.
ఇంకా వ్రాయాల్సింది ఉంది . త్వరలో వ్రాస్తాను. ఈపని కొన్ని ఏళ్ళు ఒక ౨౫ సంవత్సరాలు చేయాలి. అంతకాలం కాకపోయినా ఒక పదేళ్ళు బ్రతికుంటానని ఆశిస్తున్నాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.