h952g7. తనపై లైంగిక వేధింపు జరిగిందని సుప్రీం కోర్టులో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఒక జూనియర్ కోర్టు అసిస్టెంటు విషయంలో, అత్యున్నత న్యాయస్థానంలో 2వ సీనియర్ జడ్జి అయిన శ్రీ బోబ్ డే గారి నేతృత్వంలో ఇద్దరు జూనియర్ మహిళా జడ్జీలతో కూడిన ఒక త్రిసభ్య ఇన్ ఫార్మల్ విచారణా బృందం పై నమ్మక లేమి వ్యక్తం చేస్తూ ఆమహిళా బాధితురాలు విచారణకు హాజరుకావటం మానేసిన విషయం విదితమే. ఈసందర్భంగా ఆమె విడుదల చేసిన ఒక మీడియా ప్రకటన పూర్తి పాఠం, స్క్రోల్.ఇన్ వారి వెబ్ సైట్ లో లభ్యం అవుతున్నది. ఆసక్తి ఉన్నవారికి లింకు- Click here to go to: https://scroll.in/article/921865/full-text-why-woman-who-accused-cji-gogoi-of-sexual-harassment-is-withdrawing-from-inquiry
వైబీరావు ఒక గాడిద వ్యక్తిగత అభిప్రాయం, ఇతరులపై రుద్దేది కాదు. ఎవరికి వారు ఆలోచించుకోవలసినదే. 1) ఇన్ ఫార్మల్ అయినా ఫార్మల్ అయినా, బాధితురాలిని న్యాయమూర్తులు ప్రశ్నించిన సమయంలో వీడియో రికార్డింగ్ ఉంటే ఎవరు ఏమి చెప్పారో పారదర్శకమయ్యేది. పారదర్శకత వల్ల అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది. బాధితురాలిని బెదిరించలేదు అని స్పష్టమై విమర్శకుల నోళ్ళు మూతపడేవి. నెర్వస్ నెస్ వల్ల కొన్నిసారు, ఎంక్వైరీ సమయంలో జడ్జీలు బాధితురాలు దగ్గర దగ్గరగా కూర్చోకపోతే సరిగా వినపడకపోటం వల్ల కొన్నిసార్లు, ఏసీ ఎక్కువ అవటం వల్ల కొన్నిసార్లూ, భవిష్యత్ గురించిన దిగులు (ఉద్యోగం కోల్పోటం అనేది జీవన్ మరణ సమస్య కదా) వల్ల కొన్ని సార్లు బాధితురాళ్ళు సరియైన సమాధానాలు చెప్పలేక పోవచ్చు. ఆమె లా ఎగ్జామ్ వ్రాసి ఇంకా ఏడాది కూడ అవలేదు. అందుచేత ఆమెకు ఏమి చెప్తే ఏమి అవుతుంది అనేది అవగాహన లేక ఆసమయానికి ఏది తట్టితే అది చెప్పచ్చు. ఏలాగో ఇన్ ఫార్మల్ ఎంక్వైరీయే కదా, రూల్స్ ఎలా ఉన్నా, ఆమెను తన మహిళాన్యాయవాది లేక సపోర్టింగ్ వర్సన్ సహాయం పొందనిస్తే సత్యాన్వేషణ ఇంకా నిక్కచ్చిగా జరిగేది. అసలు పార్టీలు న్యాయవాదులను తామే నియమించుకున్నా, వారికి ఫీజులు తామే చెల్లించుకున్నా, న్యాయ తత్వ శాస్త్ర ప్రకారం (జురిస్ ప్రూడెన్స్), న్యాయవాదులు కోర్టుయొక్క ఉద్యోగులే. వారి ప్రాథమిక విధి సత్యాన్వేషణలో కోర్టుకు సహాయం చేయటం. ఇలా సహాయం చేసేటపుడు కొన్నిసార్లు తమ క్లయింటుకు వ్యతిరేకంగా ధర్మమే చెప్పాల్సి ఉంటుంది. అందుకే లాయర్లకి న్యాయవాదులని పేరు. ఒకవేళ న్యాయవాది సత్యాన్వేషణలో కోర్టుకి సహకరించకుండా, తన క్లయింటు తరఫునే మొండిగా వాదిస్తుంటే, కోర్టుకి ఎలాగో మందలించే అధికారం ఉంది కదా. ఇంటరాగేషన్ సమయంలో పోలీసులు నిందితులు న్యాయవాదుల సేవలను వినియోగించుకుంటామంటే భయపడతారు. ఎందుకంటే, తమవైన పధ్ధతులు (బెెదిరింపులు, చిత్రహింసలు పెట్టటం మొ.) వినియోగించటానికి నిందితుడి న్యాయవాది అడ్డుపడచ్చు. పోోలీసుల్లాగా, కోర్టులు బెదిరింపులకు పాల్పడవు, చిత్రహింసలు చేయవు అని ఇంతవరకు ప్రజలు నమ్ముతున్నారు కనుక, బాధితురాలు సపోర్టింగ్ పర్సన్ లేక న్యాయవాది సేవలను వినియోగించుకోటానికి అనుమతించటానికి అత్యున్నత న్యాయస్థానం వెనుకాడ వలసిన పని లేదు. బెదిరింపులు, చిత్రహింసలు జరగకుండా, వీడియో రికార్డింగ్ చేయించి ప్రశ్నించినపుడు, ముఖ్యంగా బాధితురాలి సమక్షంలోనే ఇది జరిగినపుడు, బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్లను ఆమె తూచ్ అనలేదు. ఆమె న్యాయవాది కూడ ఆమె స్టేట్ మెంట్లను సాక్ష్యాలు కాదనలేడు. కనీసం బాధితురాలి న్యాయవాదిని పరిశీలకురాలిగా నైనా అనుమతించి ఉండాల్సింది.
2) జడ్జీలు డిక్టేట్ చేయటం, బెంచి క్లర్కులు దానిని షార్ట్ హేండ్ లోనో లాంగ హేండ్ లోనో వ్రాసుకోటం లేక టైప్ చేసుకోటం, అనేది కొంచెం కొంచెం కాలం చెల్లాల్సిన సమయం ఆసన్నమయిందేమో అనిపిస్తుంది. వీడియో తీసాక, ఆవీడియో కాపీని, బాధితురాలికి కూడ ఇస్తే ఇంకా ఎంతో ఉదాత్తంగా ఉండేది.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. hrec195328
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. Some actual examination questions have been abridged/modified for brevity.
These questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.