943016 పాఠకులకు చేస్తున్న మనవి-- నేను 10 Jan. 2012 నాడు , ఇక్కడే నా బ్లాగ్ పోస్ట్ నం. Post No. 003లో, వ్రాసాను. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ ను విభజించటం అంటూ జరిగితే కనీసం ఐదు రాష్ట్రాలుగా విభజించాలని వ్రాసాను. దానిని ఈ ఏడేళ్ళలో కేవలం ౩౩ మంది మాత్రమే చదివారు. అంత తక్కువ మంది చదవటం వల్ల నాకు వ్యక్తిగతంగా నష్టమేమీ లేదు. నష్టమేదన్నా జరిగితే అది శేషాంధ్ర మరియు తెలంగాణ ప్రజలకే. నేను ఐదు చిన్నరాష్ట్రాలుగా చేయాలని కోరటంలో ముఖ్యోద్దేశం ఏమిటంటే, ఏ రాష్ట్ర రాజధాని నుండైనా ఆరాష్ట్రంలోని అతి దూరపు జిల్లాకైనా ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎం ఎల్ ఏలు, ఎంపీలు, వెళ్ళాలంటే, ప్రత్యేక విమానాల అవసరం కలగకూడదు. అదే రోజు రాజధానినుండి బయలుదేరిన ముఖ్యమంత్రి ఆ మారుమూల ప్రదేశాన్నిచూసి అదే రోజు రాత్రి తిరిగి రైల్లో గానీ, ఆర్ టీ సీ బస్ లో గానీ, కారు లో గాని రాజధానికి చేరుకోగలగాలి. ప్రతిదానికీ ప్రత్యేక విమానాన్నో హెలీకాప్టర్ నో వాడితే ప్రజలనెత్తిన పన్నుల బాదుడు ఎక్కువవుతుంది. రాష్ట్రం అప్పుల పాలవుతుంది.
ప్రశ్న-- ఈరోజు ఆవిషయం మీకు ఎందుకు గుర్తుకు వచ్చింది?
జవాబు-- ఆంధ్రజ్యోతి దినపత్రిక నిన్న, ఈ రోజు (అంటే 29.4.2019, 30.4.2019) సంచికలో విశాఖ విజయనగరం జిల్లాల సరిహద్దులలో Click here to go to https://www.andhrajyothy.com/artical?SID=778999,
అందాల అనంతగిరి కొండలపై కన్ను
గిరిజన భూములతో ‘రియల్’ దందా
మభ్యపెట్టి, మాయ చేసి భూములు స్వాధీనం.. మన్యంలో 150 ఎకరాలకుపైగా సేకరణఒక గ్రామంలోని మొత్తం భూములు కైవసం.. ‘సూపర్ లొకేషన్’ అని ముచ్చటపడ్డ ఓ నిర్మాత అనుమతి లేకుండానే రిసార్టు నిర్మాణం.. ప్రభుత్వ నిధులతో ఎంచక్కా రహదారులు గిరిజనుల పోడు, పట్టా భూముల్లోనే రోడ్డు.. స్థానిక అధికారులకు సమాచారం నిల్ వ్యవసాయేతర భూమిగా రికార్డులో మార్పు.. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి భూమాయ రహదారుల కాంట్రాక్టు పనులు కడప సంస్థకు.. తెర వెనుక మరికొందరు వ్యక్తులు మైనింగ్ కోసం మన్యంలోని భూములపై కన్నేయడం ఎప్పటి నుంచో చూస్తున్నాం! రియల్ ఎస్టేట్, రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు, సినిమా షూటింగ్‌ల కోసం మారుమూల గిరిజన గ్రామాల్లోని భూములను దక్కించుకోవడం ఇప్పుడే వింటున్నాం! ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ఈ దందా... ఇప్పటికీ కొనసాగుతోంది! దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం!
పై కథనానికి ఆంధ్రజ్యోతి దినపత్రికకు నా అభినందనలు.
రెండు రోజుల ఈ ప్రత్యేక కథనాన్ని చదివాక నాకు కండ్లు తిరిగిపోయాయి. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానని చెప్తూ, 34000 ఎకరాల భూమిని రైతులనుండి వారు స్వఛ్ఛందంగా ఇచ్చారో, లేక సారే గుంజుకున్నారో కానీ, కాంక్రీటు అడవిగా మారుస్తుంటే, అక్కడ విశాఖ విజయనగర సరిహద్దులలో గిరిజనులకు మాయ మాటలు చెప్పి వారికి తలా ఐదు వేలు చేతిలో పెట్టి, వారి పట్టాలను లాక్కుని, ప్రభుత్వ రూ. నాలుగు కోట్ల ఖర్చుతో రోడ్లు వేయించి గిరిజన గ్రామాలను భక్షించటం హృదయవిదారకంగా ఉంది. బహుశా అల్లావుద్దీన్ ఖిల్జీ టైములోనో ఔరంగజేబు టైములోనో ఇలాగే జరిగి ఉండచ్చు. సర్వసత్తాక ప్రజాస్వామ్య సోషలిస్టు రాజ్యంలో ఇలా జరగటం దారుణం.
ఇపుడు నేను గుర్తు చేయదలుచుకుండేది ఏమిటంటే, ఎక్కడో విజయనగరంలోనో విశాఖలోనో అనంతగిరి లోనో జరిగింది షుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతికి ముఖ్యమంత్రిగారి దృష్టికి ఇన్నాళ్ళలో ఎందుకు రాలేదు? ఇది 2015లో జరిగితే నిత్యం ప్రత్యేక విమానాల్లో , హెలీకాప్టర్ లలో తిరిగే చంద్రబాబు ఎందుకు తన ఇంటెలిజెన్స్ డీజీపీ సహాయంతో ఎందుకు కనుక్కోలేక పోయారు? అదే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలు ఒక చిన్నరాష్ట్రంలో ఉండి ఉంటే అసెంబ్లీ , సచివాలయం, హైకోర్టు అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి, ఏదో ఒక దశలో అది ఉన్నతాధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్ళి ఉండేది. (వాళ్ళు దొంగనిద్రపోయి ఇక్కడ జరిగిందా, మాకు తెలియదు అంటే వేరే విషయం).
ఈ భూభాగవతం తసమదీయ పార్టీకి చెందిన వారు కాక అసమదీయ పార్టీకి చెందిన వారయి ఉంటే, అసమదీయ పత్రిక వారు ఈ వార్తను ఇంత ప్రముఖ స్థానంలే రెండు రోజులు ప్రచురించేవారా లేదా చెప్పలేము. ఏది ఏమైనా, సత్యం అనేది ఏనాటికైనా బయటకు రావాలి కాబట్టి ఆంధ్రజ్యోతి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
ఆ సముద్రా రెడ్డి, సాగర్ రెడ్డి ఈ రోజు తసమదీయ పార్టీలో ఉన్నా రాబోయే రోజులలో అసమదీయ పార్టీలో చేరకూడదని ఏమీ లేదు. నందో రాజా భవిష్యతి కాబట్టి తసమదీయ పార్టీ వారే అధికారంలోకి వస్తే, ఈ కబ్జా చేసిన వారికి ప్రత్యేక కారిడారో సెజ్ నో నెలకొల్పమని చెప్పి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ చేత కొన్ని వదంల కోట్లు సమర్పింప చేయచ్చు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేస్ ఇలాగే కదా జన్మించింది.
నోట్-- నాకే రాజకీయ పార్టీతో, నాయకులతో సంబంధం లేదు. నాకెవరూ ఈ బ్లాగ్ వ్రాసినందుకు జీతంగానీ నాతాలు గానీ ఇవ్వటం లేదు. కనుక, సహృదయంతో అర్ధంచేసుకోవలసినదిగా పాఠకులకు ప్రార్దన.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. lqu943042
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.