
౪౮౧ రైతుల ఆత్మ హత్యల సమస్యలకి సంపూర్ణ సోషలిజమే మార్గము.
Recent suicide of Gajendra Singh, a farmer from Rajasthan, hanging himself from a treetop-branch, during an AAP rally is not the first of its kind, nor is it going to be the last of its kind.
కొద్ది రోజుల క్రితం, ఢిల్లీ జంతర్ మంతర్ సమీపంలో, ఆమ్ ఆద్మీ పార్టీ వారు నిర్వహించిన కిసాన్ రాలీ సభ జరుగుతున్న సమయంలో, రాజస్థాన్లోని దౌసా గ్రామానికి చెందిన గజేంద్ర సింగ్ కల్యాళవత్ అనే రైతు చెట్టుపైకెక్కి, కొమ్మకు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోటం గొప్ప రాజకీయ సంచలనానికి దారితీసింది. అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకోటం అదే మొదటిసారీ కాదు, చివరి సారీ కాదు. మర్నాడే ఇంకో రైతు రైలు ముందుకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోరోజు మరో రైతు ఫాన్ కి ఉరి పోసుకుని చచ్చిపోయాడు.
సంఘటన స్టేజీనుండి కనిపిస్తున్నది. ఆవింతను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి శ్రీ శిశోదియా గారితో కలిసి ఢిల్లీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు చోద్యం చూస్తున్న ఫొటో పత్రికలలో వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలలో కనీస మానవత్వం కానీ లోక జ్ఞానం గానీ ఉన్నట్లైతే వాళ్ళు సభను కొద్ది సేపయినా ఆపేసి చెట్టుదగ్గరికి వెళ్ళి గజేందర్ సింగును వైద్యశాలకు తరలించటంలో సహాయ పడి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు తమ ఉపన్యాసాలను దంచుకుంటూ వెళ్ళారు.
ఢిల్లీ పోలీసుల ప్రకారం, గజేంద్రసింగును రక్షించటానికి తాము చేసిన ప్రయత్నాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కార్యకర్తల, ఆమ్ ఆద్మీ నేతల ప్రకారమైతే, ఢిల్లీ పోలీసులు గజేంద్రసింగును రక్షించే ప్రయత్నమే చేయలేదు. వారు ప్రేక్షకులలాగా ఉండిపోయారు.
ఢిల్లీ పోలీసులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినందుకు ఆమ్ ఆద్మీ నేతలపై కేసు పెట్టే అవకాశం ఉంది. ఢిల్లీ కార్పోరేషన్ ఎన్నికలలో తమకు జరిగిన శృంగభంగానికి ఇంత తొందరగా బదులుకి బదులు తీర్చుకునే అవకాశం వస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీగారు గానీ, హోం మంత్రి శ్రీ రాజనాథ్ సింగు గారు గానీ అనుకొని ఉండకపోవచ్చు.
ఢిల్లీ పోలీసులపై తమకు ఆధిపత్యం ఉండాలని, మొదటినుండీ శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారి డిమాండుగా ఉన్నది. ఆఆధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంటే, ఇపుడు కేజ్రీవాల్ గారికి అక్కరకు వచ్చేది.
ఈ రాజకీయక్రీడలను అలా ఉంచి, రైతుల పరిస్థితి ఆలోచిస్తే, బూర్జువా పార్టీలు, బూర్జువా మీడియా, బూర్జువా రచయితలు ఆలోచించే పరిష్కారాలు చాలా తాత్కాలికమైనవి. ఒక పదిలక్షల రూపాయలు మృతరైతుకుటుంబానికి పారేస్తేనో, లేక ఋణ మాఫీ చేస్తేనో, ఒక యాభయిరూపాయలు సేకరణ ధరను పెంచితేనో ఈ సమస్యలు పరిష్కారమయ్యేవి కావు.
ఈ సమస్యకు సంపూర్ణ , ఏకైక పరిష్కారము, సంపూర్ణ సోషలిజమే. వేరొకదారిలేదు.
ప్రశ్న: మీరు ఇదివరకు మార్క్సిజమనీ, కమ్యూనిజమనీ అనే వాళ్ళు. ఇప్పుడు సంపూర్ణ సోషలిజమని ప్లేటు మార్చారేమిటి ?
మార్క్సిజము, కమ్యూనిజం అనే పేర్లు ప్రపంచం వ్యాప్తంగా నియంతృత్వ, ఏకపార్టీ పాలక ప్రభుత్వాలచేత దుర్వినియోగం చేయబడ్డాయి. ఆయా దేశాలలో నియంతృత్వ మరియు ఏకపార్టీల పాలనల పై ఉండే అసహ్యం, భారత దేశంలోని కమ్యూనిస్టు పార్టీల మీద కూడ ప్రసరించింది. అంతే కాదు, కమ్యూనిస్టు పార్టీలు బెంగాల్లో, కేరళలలో కొంతకాలం నిబధ్ధంగా పాలన చేసినా, తరువాత పెట్టుబడిదారీ వాతావరణంలో పెట్టుబడిదారీ అవసరాలకు లొంగిపోయి, కమ్యూనిస్టు పార్టీలను బూర్జువా పార్టీలతో సమానం చేసి వేశారు. ఫలితంగా అవి ముక్కలు ముక్కలయి, తీవ్రవాద గ్రూపులు పుట్టటానికి దోహదం చేశాయి. అందుచేత కమ్యూనిజం, మార్క్సిజం అనే పదాలను వాడే కన్నా, టోటల్ సోషలిజం అనేపదం వాడటం శ్రేయస్ కరం అనిపించింది.
టోటల్ అని సోషలిజం ముందు ఎందుకు తగిలిస్తున్నారు ?
భారత్ లో సోషలిజం అనే పదం, కమ్యూనిజం, మార్క్సిజం అనే పదాలకన్నా ఇంకా ఎక్కువ దుర్వినియోగానికి గురి అయ్యింది. మన రాజ్యాంగం ప్రకారం, మన దేశం సావరిన్ డెమోక్రాటిక్ సెక్యులర్ సోషలిస్టు రిపబ్లిక్. భారత్ లో సోషలిజం నేడు ఎక్కడ ఉంది, నేతి బీరకాయలో నెయ్యి ఎలా దొరకదో, అలాగే సావరిన్ డెమోక్రాటిక్ సెక్యులర్ సోషలిస్టురిపబ్లిక్ లో కూడ నిజం సోషలిజం, నిజం సెక్యులరిజం దొరకవు.
టోటల్ సోషలిజంలో రైతులకి ఎలాటి రక్షణను మనం వాగ్దానం చేయవచ్చు ?
ప్రైవేటు ఆస్తిని నిర్మూలించి భూమిని అంతా ప్రభుత్వం తీసుకుని, వ్యవసాయం తానే చేస్తుంది. రైతులు ప్రభుత్వోద్యోగులవుతారు. వారి అన్ని వ్యక్తిగత, కుటుంబ అవసరాలను ప్రభుత్వమే తీరుస్తుంది. ఎరువులు మొ|| ఇన్పుట్లను ప్రభుత్వమే భరిస్తుంది. ఉత్పత్తి అయిన అవుట్ పుట్ పంటను కూడ ప్రభుత్వమే తీసుకుంటుంది. వ్యవసాయంలో ఉండే కరువు, వరదల రిస్కు మాత్రమే కాక అన్ని రిస్కులను ప్రభుత్వమే నెత్తిన వేసుకుంటుంది. ఈ పధ్ధతిని సన్నకారు రైతులు,వ్యవసాయకూలీలు వ్యతిరేకించాల్సిన అవసరం రాదు. భూస్వాములు తమ పెత్తనానికి భంగం కలుగుతుందని, టోటల్ సోషలిజాన్ని తప్పక వ్యతిరేకిస్తారు.
ఈసమస్యలు ఫేబియన్ సోషలిజంలో పరిష్కారం కావా ?
అవవు. ఎందుకంటే ఫేబియన్ సోషలిజం రావాల్సిన తీవ్రమార్పులను దశలవారీగా చేద్దామంటుంది. శ్రీచంద్రబాబు నాయుడు గారు మద్యనిషేధాన్ని దశలవారీగా అమలుచేస్తామని తెలుగు ఆడపడుచులకు వాగ్దానం చేసి , దాన్ని గంగలో కలిపిన విషయాన్ని మనం మరువరాదు.
ఇంకొక మార్గమే లేదా ?
లేకేమి. జనాభాను 30 కోట్లకి కుదించుకో గలిగితే, టోటల్ సోషలిజం అక్కరలేదు. ప్రస్తుతం వ్యవసాయాన్ని ఒక వ్యాపారంలాగా చేయాల్సి వస్తున్నది. పొలం దున్నటానికి, గొర్రుకి, ట్రాక్టర్లను వాడటం వల్ల రైతు సినిమా నిర్మాతలాగ డబ్బు సంచి తెరుచుకు కూర్చోవాల్సి వస్తున్నది. అంతే కాక యాబ్సెంటీ లాండ్ లార్డుకీ, కౌలు రైతుకీ ఇద్దరి కుటుంబాల నిర్వహణకూ ఆదాయాన్ని సమకూర్చే శక్తి మన వ్యవసాయానికి లేదు. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో 91శాతం రైతులు ఋణ గ్రస్తులు అయి ఉన్నారని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఆలెక్కలు, భూయజమానులకి సంబంధించినవి. మన యాబ్సెంటీ లాండ్ లార్డ్ లు, తమ పట్టాదారు పాసుపుస్తకాలపై లోన్లను తామే తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాలను, మాఫీలను వాళ్ళే బొక్కుతున్నారు. కౌలు రైతులు అందరూ నోటిమాట కౌలు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఏవీ అందవు. పొలం యజమాని తాను బ్యాంకునుండి తీసుకున్న అప్పును తాను బ్యాంకులనుండి తెచ్చిన దానికన్నా ఎక్కువ రేట్లకి కౌలు రైతుకే అప్పిస్తున్నాడు. లేదా ఇతరులకు ఇస్తున్నాడు. అంటే అనధికారికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. టెన్ వన్ అడంగల్ వంటి భూమి రికార్డులలో సాగుదారు (కాస్తుదారు) కాలంలో కౌలురైతు పేరు నమోదు చేయటానికి కావలసిన సాక్ష్యాధారాలు ఎక్కడ ?
బ్యాంకు అప్పులు చెల్లించ లేకపోటం వల్ల మన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది ఒక అపవాదు మాత్రమే. కౌలు రైతులకి అప్ఫిచ్చిన వడ్డీ వ్యాపారులు ,ధనిక రైతులు, కౌలురైతులపై విపరీతంగా వత్తిడి తెస్తున్నారు. వాళ్ళ వేధింపులకి తట్టుకోలేకనే రైతులు ఆత్మ హత్యలు చేసుకోవలసి వస్సున్నది.
NEPAL EARTHQUAKE, MAY BE A GREAT RELIEF TO MR. ARVIND KEJRIWAL AND MR. NARENDRA MODI, AT LEAST AS FAR AS FARMER'S PROBLEMS ARE CONCERNED
नेपाल भूकंप, माननीय आप नियंता अरविंद कॆज्रीवाल, और भारत नरेश नरेंद मोदी को, किसानों को समस्याओं को सावधानी देने से, कुछ उपशमन दिया होगा।
నేపాల దేశ భూకంపం, ఆప్ శాసకుడు శ్రీఅరవింద్ కేజ్రీవాల్ గారికి, భారత్ నరేశుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి , రైతుల సమస్యలను శ్రధ్ధగా పరిశీలించాల్సిన బాధనుండి తాత్కాలిక లేక బహుశా శాశ్వత ఉపశమనం కలిగించి ఉంటుంది.
Who knows, again Mr. Modi can go for foreign tours. Or the people may forget.
किस को मालूम ? मोदी सार फिर विदेश यात्रा पर जा सकते। नहीं तो, लोग भूल जा सकते।
ఎవరికి తెలుసు . శ్రీ మోడీ గారు మరల విదేశ పర్యటనకు వెళ్ళచ్చు. అక్కడ ఎన్ ఆర్ ఐ లు రైతుల సంగతి అడగరు కదా. జనం కూడ మర్చి పోవచ్చు.
ఇంకా ఉంది.
Quiz on Mahabharata. आपके महाभारत इतिहास ज्ञान सुगंध फिर से सूँघीये। మీ మహాభారత ఇతిహాస జ్ఞాన గంధం పునరాఘ్రాణించండి
Who was the last commander anointed by Duryodhana? a) Salya b) Sakuni c) Aswaththama d) Karna. दुर्योधन के आखरी महा सेनानी कौन था ? अ)शल्य आ)शकुनी इ)अश्वथ्थाम ई)कर्ण దుర్యోధనుడి ఆఖరు సేనాధిపతి ఎవరు ? అ)శల్యుడు ఆ)శకుని ఇ)అశ్వథ్థామ ఈ)కర్ణుడు Bring your mouse here to see the answer
రామాయణం క్విజ్
మహాకవి వాల్మీకి జన్మించినట్లుగా చెప్పబడే ప్రాంతం, వాల్మీకినగర్ జిల్లాగా చెప్పబడే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది ? ఏ) ఉత్తర ప్రదేశ్. బీ) ఛత్తీస్ గఢ్ సీ) బీహార్ డీ) ఝార్ ఖండ్ Bring your mouse here to see the answer
హనుమంతుడి మాత అంజనా దేవి జన్మస్థానం , ఆంజనేయుడి జన్మ స్థానం ఏరాష్ట్రంలో ఉంది ? ఏ) ఉత్తర ప్రదేశ్. బీ) ఛత్తీస్ గఢ్ సీ) బీహార్ డీ) ఝార్ ఖండ్ Bring your mouse here to see the answer
(To continue. सशेष. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.