Photo : courtesy Wikipedia.org.
http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A8
४७२ क्या महाभारत संग्राम में, जब माद्रीश शल्य महा सेनाधिपति बना, अठारहवा दिन, तीन करोड कौरव सैनिक, एक करोड पांडव सैनिक बछे?
౪౭౨ మహాభారత యుధ్ధంలో , ౧౮వ రోజున, శల్యుడు సేనాధిపతి అయ్యేనాటికి కౌరవ సేనలో ౩ కోట్లమంది సైనికులు, పాండవ సేనలో ఒక కోటి మిగిలి ఉన్నారా ?
Telugu Mahabharatam, (Andhra Mahabharatam) translated by Tikkana . Salya Parvam. dvitIyASvAsam (Chapter 2). Verse No. 113 (prose portion called vacanam). Last seven lines.
Context: In the Mahabharata war, Bhishma, Drona and Karna were slain. Duryodhana, then, on the advice of AswaththAma made King of Madra-- Salya as the Commander of Kaurava Forces. This battle was on the last day, i.e. 18th day.
Sanjaya was narrating the events that took place on the battled to the blind king Dhritarashtra. After the death of Bhishma, Drona and Karna who were Generalissmos in the battles of the previous seventeen days, Duryodhana made Salya the Commander. Salya was assisted by Karna's son Satyasena. On his left side, there was Kripacharya, supported by SAKAs and YAVANAs.
తిక్కన మహాకవీంద్రుడి భారతం, శల్య పర్వం నుండి, ద్వితీయాశ్వాసం,, ౧౧౩ వ వచనం నుండి చూద్దాం.
"ఇట్లుసమరోత్సాహ సమగ్రుండయిన మద్రపతి సర్వతో భద్ర వ్యూహంబు వన్నించె, నందు ముఖంబున మద్రపతి కర్ణపుత్ర ప్రముఖ పరివృతుండై తాను నిలిచె. వలపట శక యవన సమేతుండై కృపాచార్యుండును, దాఁపట త్రిగర్త సహితుండై కృతవర్మయు, వెనుక కాంభోజ సహాయుండై అశ్వథ్థామయు, నడుమ కురువీర పరిరక్షితుండయి కౌరవేశ్వరుండును , అతని ముందట కరి ఘటాగ్ర భాగ వర్తియై బహుచతురంగంబులతోడ శకునియు నిలుచునట్లుగా నొనర్చి పేర్చి యురవణించె. ... "
"...సంజయుడా జనపతి కిట్లను: మనకు పదునొకండువేలు రథంబులును, పదివేలు నేడు నూరు గజంబులును, రెండు లక్షలు హయంబులును, మూడు కోట్లు పదాతులను , వారికి నారువేలు రథంబులును, మూడు వేల ఏనుంగులును, లక్ష గుర్రంబులును, కోటి కాల్బలంబులును, గలిగియుండె. ..."
(ఇక్కడ వారికి అంటే పాండవులకి. పాండవులకి కోటి కాల్బలం ఉంటే, కౌరవులకి మూడుకోట్ల కాల్బలం ఉందిట.)
ybrao-a-donkey's views:--
Many historians view that Yavanas were Greeks.
వ్యాస భారతం గుప్తుల కాలంలో రూపు దాల్చింది అని ఒక అభిప్రాయం ఉంది. అప్పటికి, శక, కుషాణ, గ్రీకు (యవన), దండ యాత్రలు అయిపోయాయి. హూణ దండ యాత్రలు జరుగుతున్నాయి. మ్లేఛ్ఛ (ముస్లిం దండయాత్రలు అరబ్బుల నుండి ఇంకా మొదలు కాలేదు. అది ఎనిమిదవ శతాబ్దం). ఈ శకులు, యవనులు కౌరవుల తరఫునా పోరాడారనటం, బహుశా గుప్తుల కాలపు ప్రభావం కావచ్చు.
తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరించింది ౧౩ వశతాబ్దంలో. ఘజినీ , ఘోరీ దండయాత్రలు పూర్తి అయ్యాయి. అల్లాయుద్దీన్ ఖిల్జీ దేవగిరి సైడు వెళ్ళి ఉంటాడు కానీ కాకతీయుల వంకకు రాలేదు. తుగ్లక్ కాలంలో కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడిపై దండయాత్ర జరిగి అతడిని బందీగా తీసుకెళ్ళారు. తిక్కన గణపతిదేవుడి సమకాలికుడిగా విఖ్యాతుడు. తిక్కన భారతంలో ఎక్కడైనా కాకతి దేవత ప్రసక్తిగానీ, మ్లేఛ్ఛుల ప్రసక్తి గానీ ఉందేమో చూడాలి.
వాల్మీకి రామాయణంతో పోలిస్తే , వ్యాస భారతంలో, మహాదేవుడికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం కనిపిస్తుంది. మన పురాణాల వారు చెప్పే శ్రీరాముడు శివభక్తుడు, ఈశ్వరుడు రామభక్తుడు వంటి విషయాలు వాల్మీకి రామాయణంలో కనిపించవు.
కౌరవ సైన్యం మూడు కోట్లు, పాండవ సైన్యం ఒక కోటి, అది కూడ యుధ్ధం ఆఖరు రోజుకు మిగిలి ఉండటం, వ్యాసుడు, తిక్కన వ్రాశారా, లేక పురాణాలు చెప్పే వారు, లేఖకులు, తమ తాటాకు ప్రతులలో పెంచుకుంటూ పోయారా అనేది తెలియదు. ఈ సంఖ్యల విషయంలో, తిక్కనే కాదు, సహజ పాండిత్య బమ్మెర పోతన మహాకవి కూడ పట్టించుకున్నట్లు కనపడదు.
ఆనాటి అఖండ భారతదేశం జనాభా ఎంత? ఎక్కడ చూసినా అడవులు. నాలుగు కోట్లు ఉంటే గొప్పే.
రామాయణ భారతాలకు చరిత్ర విలువ రావాలంటే, నాలుగు కోట్ల సైనికులు మిగిలారు వంటి అతిశయోక్తులను తీసేయనవసరం లేదు, కానీ ప్రక్కనే ఒక నోట్ వ్రాసుకుంటే సరిపోతుంది.
పురాణం పండితులు చేశారని అనుమానించటానికి అవకాశం ఉన్న అతిశయోక్తులను సాధారణ స్థాయికి తెచ్చుకోక పోతే, పురాణాల కనీస విశ్వసనీయత కూడ ప్రశ్నార్ధకమవుతుంది.
ఇంకా ఉంది. To continue. सशेष्.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.