

మన ప్రియతమ ప్రధాన మంత్రిగారు ధరించే వాచీ, కళ్ళజోడు ఫ్రేమ్, వ్రాసే కలం, కుర్తాలు, వేలం వేసిన లండన్ సూట్ ల ఖరీదు ఎంత?
ప్రశ్న : మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి కళ్ళజోడు ఫ్రేమ్ ఖరీదెంత ?
జవాబు : నెట్ లో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి, మరియు శ్రీ మోడీ గారిపై పుస్తకాలు వ్రాసిన శ్రీ నీలాంజన్ ముఖోపాధ్యాయ గారు వ్రాసిన దాన్ని బట్టి శ్రీ నరేంద్ర మోడీ గారు బివిల్ గారు Bvlgari అనే గ్రీసు దేశ కంపెనీకి చెందిన కళ్ళజోడు ఫ్రేమ్ ను ధరిస్తారు. దీని ఖరీదు సుమారు రూ. లక్ష నలుబదివేలు అనే అంచనా ఒకటి నెట్ లో ఉంది. ఎక్కువ తక్కువలు ఉండచ్చు. మొత్తంమీదఅతి ఖరీదైనవే.
ప్రశ్న : మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ధరించే వాచీ ఖరీదెంత ?
జవాబు : నెట్ లో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి, మరియు శ్రీ మోడీ గారిపై పుస్తకాలు వ్రాసిన శ్రీ నీలాంజన్ ముఖోపాధ్యాయ గారు వ్రాసిన దాన్ని బట్టి శ్రీ నరేంద్ర మోడీ గారు మోవాడో Movado అనే స్విస్ కంపెనీకి చెందిన వాచీని ధరిస్తారు. వీరు తయారు చేసి అమ్ముతున్న వాచీల కనీస ధర రూ. యాభయివేలు. శ్రీ మోడీ గారి వాచీ ఖరీదు రూ. 50,000 కన్నా ఎంతైనా ఎక్కువ ఉండవచ్చు.
ప్రశ్న : మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వ్రాసే ఇంకు పెన్ను (ఫౌంటెయిన్ పెన్) ఖరీదెంత ?
జవాబు : నెట్ లో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి, మరియు శ్రీ మోడీ గారిపై పుస్తకాలు వ్రాసిన శ్రీ నీలాంజన్ ముఖోపాధ్యాయ గారు వ్రాసిన దాన్ని బట్టి శ్రీ నరేంద్ర మోడీ గారు మాంట్ బాంక్ అనే విదేశీ కంపెనీ వారు అమ్మే ప్రత్యేక కలంతో వ్రాస్తారు. వీరు తయారు చేసి అమ్ముతున్న కలాలు రూ. ౩,౦౦౦ నుండి పైన ఎంతైనా ఉండచ్చు. గోల్డ్ నిబ్ ఉన్న ఒక మోడల్ రూ. 67,000 చేసే కలాలు, Rs. 2,00,000 చేసే కలాలు కూడ ఉన్నాయి.
ప్రశ్న : మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శించినపుడు, ఒబామా గారితో పాటు స్టేజిపై కనిపించటానికి ధరించిన సూట్ ఖరీదెంత ?
జవాబు : నెట్ లో దొరుకుతున్న సమాచారాన్ని బట్టి, ఇది రూ. పది లక్షల ఖరీదైనదని వార్తలు వచ్చాయి. విమర్శలను తిప్పి కొట్టటానికో ఏమో, ఈ సూట్ ను ఛారిటీ కోసం వేలం వేయగా ఒక కార్పోరేట్ వ్యాపారి కొనుక్కున్నాడు.
మన చాయ్ వాలా ప్రధాన మంత్రి గారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రత కోసం నిర్మించుకున్న ముఖ్యమంత్రి గారి బులెట్ ప్రూఫ్ గదికి అయిన ఖర్చు ఎంత ?
జవాబు . ఎంతో లేదు లేండి. షుమారు రూ. 150 కోట్లేట.
దీనిక సంబంధించిన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త చదవటానికి క్లిక్. To read this Times of India News Report Click. टैम्स आफि इंडिया के इस न्यूस रिपोर्ट पढने के लिये क्लिक्. http://timesofindia.indiatimes.com/india/Rs-150-crore-bullet-proof-office-ready-for-Narendra-Modi/articleshow/17725777.cms
ప్రశ్న : మన చాయ్ వాలా ప్రధాన మంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, బిజెపీ జాతీయ కార్య వర్గం సమావేశం గోవాలో జరిగింది. దానికి గు.ము.మ. గారు హాజరు కావటానికి భద్రత కోసం వారి బులెట్ ప్రూఫ్ కారును విమానంలో గోవా తరలించ వలసి వచ్చింది. దాని ఖర్చెంత ?
తెలియదు.
ప్రశ్న : మీరు ఎక్కువగా శ్రీ మోడీ గారి భోగాలను తప్పు పట్టుతున్నారు గానీ, శ్రీ రాహుల్ గాంధీ గారి భోగాలను గురించి వ్రాయటం లేదు. మీరు శ్రీ రాహుల్ గాంధీ గారింటి కుక్క లా కనిపిస్తున్నారు.
జవాబు : శ్రీ రాహుల్ గాంధీగారికీ, నెహ్రూ కుటుంబానికీ, విదేశాలలో ఎన్నివేల కోట్లున్నాయో ఎవరికీ తెలియదు. వాటిని గురించి పరిశోధన చేయించి బయట పెట్టవలసిన బాధ్యత ప్రస్తుత ప్రధానమంత్రి అయిన శ్రీ మోడీ గారి పైనే ఉంటుంది. శ్రీనరేంద్ర మోడీ గారేమో, తాను చాయ్ వాలా ను అని చెప్పుకుంటున్నారు. వారు చెప్పుకున్నారో లేదో కానీ, ప్రచారంలో ఉన్నదానిని బట్టి వారు షుమారు నాలుగు దశాబ్దాల పాటు, భిక్షాన్నంతో ఇల్లాళ్ళు ఏమి పెట్తే అవి తిని జీవించారుట. మరి శ్రీవారికి ధనికుల అలవాట్లయిన మాంట్ బాంకు కలాలు, మొవాడో వాచీలు, లండన్ సూట్లు, జేడ్ బ్లూ అనే రెడీమేడ్ కంపెనీ వారి ఖరీదైన కుర్తాలు ఇవన్నీ ఎలా అంటుకున్నాయి ?
ybrao-a-donkey's humble view. वैबीराव एक गधे के विनम्र राय. వైబీరావ్ గాడిద వినమ్ర వ్యాఖ్య
శ్రీ నరేంద్రమోడీ గారి రోల్ మోడల్ అయినా శ్రీ స్వామీ వివేకానంద గారు కూడ, తాము అలంబజార్ (కోల్ కత్తా) మఠంలో ఉండగా మధుకరం ఏత్తేవారమని, ఇల్లాళ్ళు పెట్టే చద్ది చపాతీలు భయంకరంగా ఉండేవని అమెరికాలో ఒక సభలో చెప్పుకున్నారు. శ్రీ నరేంద్ర మోడీ గారు కూడ తన గురువు వివేకానంద గారి వలెనే భిక్షాటనతో నాలుగు దశాబ్దాలు గిడపారంటే, నాకు కళ్ళు చెమరుస్తున్నాయి.
మన ప్రియతమ ప్రధాన మంత్రి గారి చేత సేవ లందుకున్న శ్రీ వాజ్ పేయీ, శ్రీ అద్వానీ, శ్రీ మురళీ మనోహర్ జోషీ లే ఈ వింతలకు వివరణలు ఇవ్వగలరు. ఇందులో శ్రీ వాజ్ పేయీ అంపశయ్య పై శయనించిన భీష్మాచార్యుల వలె నున్నారు. కనుక మిగిలిన ఇద్దరే జవాబు చెప్పాలి.
ఇంకా ఉంది. TO CONTINUE, FOR CORRECTING OMISSION, COMMISSION, ERRORS IF ANY.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.