306 అఖిల భారత పార్టీలనేలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కార్యాలయాల షెడ్లలోకి వచ్చేటపుడు, తలలు వంచుకొని లోపలికి ప్రవేశించాలి.
చర్చనీయాంశాలు: 306, రాజధాని, సింగపూర్, నారాయణ, పురపాలన, Municipal Administration
Within the nine member Committee, we will form Sub-Committees. These sub-panels visit Singapore and other world-class cities to study and suggest models to be emulated in building AP's Capital City. The Government has taken care to see that only people with a vision of building a world-class city have been made members. --Dr. P. Narayana, Municipal Administration and Urban Development Minister, A.P.
తెలుగుసారం: తొమ్మిది మంది కమీటీలో మేము సబ్-కమీటీలను ఏర్పరుచుకుంటాము. ఈ ఉప బృందాలు సింగపూర్ మరియు ప్రపంచస్థాయి నగరాలను తిరిగి , ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరాన్ని నిర్మించటానికి అను(క|స)రించటానికి నమూనాలను సూచిస్తాయి. ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించటానికి కావలసిన దార్శనికత ఉన్న వారినే సభ్యులుగా చేయటానికి ప్రభుత్వం తగిన జాగ్రత్త తీసుకుంది. --డాక్టర్ పీ. నారాయణ, పురపాలక మంత్రి.
Three national and international level experts with experience in building world class cities would also be made special invitees to the nine-member committee to suggest on action plan to develop the Capital City.
తెలుగుసారం: ముగ్గురు జాతీయ మరియు అంతర్ జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచస్థాయి నగరాల నిర్మాణంలో అనుభవం ఉన్నవారిని, ఈ తొమ్మిది మంది సభ్యుల సంఘంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండి, రాజధాని నగర నిర్మాణానికి కార్యాచరణ ప్రణాలికను సూచించేందుకు, తీసుకు రావటం జరుగుతుంది. --పై మంత్రిగారే.
వైబీరావు గాడిద అభిప్రాయం
ఆహా, ఆంధ్రజాతి (అంధక జాతి) జన్మధన్యమవుతుంది. ఇప్పటికే మీరు పోస్టు నంబరు 304లో click బిజెపి అగ్రనేత, శ్రీనరేంద్రమోడీ రామయ్యగారికి వీరహనుమాన్ సేవకుడు, శ్రీ వెంకయ్య నాయుడుగారి పేడకళ్ళ పురాణం చదివే ఉంటారు. దాని ప్రకారం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణులు తమ ఇళ్ళముందు పేడకళ్ళను ప్రభుత్వం తీయాలని కోరుకునేలాగా వాళ్ళని పాడు చేయవద్దని, చెరువులను రైతులే బాగు చేసుకోవాలని, శ్రీవెంకయ్యనాయుడు గారు హితబోధ చేసి ఉన్నారు. ఈ నీతిపాఠం సభలో, శ్రీచంద్రబాబునాయుడుగారు సహసింహాసనాశీనులు అయి ఉన్నారు. ఈసందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు గారన్న మాట ఒకటి గుర్తుకు తెచ్చుకోండి: '''న్యాయంగా రాబట్టుకోవాల్సిన ఆదాయం కూడ రాబట్టుకోకుండా ప్రతివాళ్ళూ పైనున్న వారి వద్దకు నిథుల కొరకు పరుగెత్తుతున్నారు.''
నా అనుమానం ఏమంటే, నిథులకొరకు ఆవురావురు మంటున్న శ్రీచంద్రబాబు నాయుడిగారిని ఉద్దేశించి, శ్రీ నరేంద్ర మోడీగారు, శ్రీఅరుణ్ జైట్లీ గారు ''నిధులకొరకు ఢీల్లీకి పరుగెత్తద్దు '' అని ప్రత్యక్షంగా చెప్పాలనుకుని, బ్రెజిల్ పర్యటనలో తీరిక చిక్కక గానీ, లేక శ్రీమోడీగారి సహజ స్వభావం వల్లకానీ, ఈవిషయాన్ని శ్రీ బాబుగారి చెవిలో వేయమని శ్రీ వెంకయ్యనాయుడు గారిని ఫరమాయించి ఉండచ్చు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రెవెన్యూలోటు పూడ్చటానికి గానీ, రాజధాని నిర్మాణానికిగానీ, కేంద్రబడ్జెట్ లో నిధులు కేటాయించకుండా, ఉండటంలో అంతరార్ధం ఏమై ఉండాలి? మన్మోహన్ సింగు గారు ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో ఇచ్చిన హామీల నన్నిటినీ నెరవేరుస్తామని అరుణ్ జైట్లీగారు అన్నా, శుష్కవచనాలూ, శూన్యహస్తాలూ అనేవి రాజకీయ పార్టీల ఎజెండాల్లో భాగం కాబట్టి, శ్రీచంద్రబాబుగారు ఆశిస్తున్న స్థాయిలో కేంద్రంనుండి రాజధానికిగానీ, రెవెన్యూలోటు పూరించకోటానికిగానీ, నిధులు రాకపోవచ్చు. బిజెపీకి లోక్ సభలో పూర్తి మెజారిటీ రాకుండా ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఇపుడు కేంద్రప్రభుత్వ మనుగడ, శ్రీచంద్రబాబు ఇచ్చే మద్ధతుపై ఆధారపడి ఉండదు కాబట్టి. కుచేలుడికి 27 మంది పిల్లలులాగా, చంద్రుడికి 27 మంది పెళ్ళాలు లాగా, మోడీ జనానాలో ఉండే 29 రాష్ట్రాలలో మనది ఒక రాష్ట్రం అవుతుంది.
కేంద్రంలో కాంగ్రెస్ , బిజేపీ కలిసి , సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనేది చారిత్రిక యదార్ధం. బిజెపితో పొత్తుచేసుకోటం ద్వారా, ఈ గొంతుకోసే పనిలో శ్రీచంద్రబాబు ఆరెండు పార్టీలకు భాగస్వామి అయినట్లయ్యింది.
ఇపుడు రోడ్డుమీద పడి ఉన్న ఈ రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అనే శిశువు సోనియా మాతాజీదా, మోడీపితాజీదా, లేక అనాధదా? ఛార్లెస్ డికెన్సు నవల ఆలివర్ ట్విస్టులో ఆలివర్ లాగా ఖాళీ బొచ్చె తీసుకొని మోడీ చుట్టూ తిరిగినా, జైట్లీ చుట్టూ తిరిగినా, వాళ్ళు ఒకటి రెండు చద్ది రొట్టెముక్కలను విదిలించినా, ఏదోసమయంలో చికాకుపడి తిట్ల పురాణం లంకించుకోకూడదనేమీ లేదు. ఎందుకు అలా మరల మరల అడుగుతావు అని కొరడా ఝళిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. శ్రీ చంద్రబాబుకి అవమానం జరిగినా, అది తెలుగుజాతికి జరిగినట్లే.
అయితే శ్రీచంద్రబాబు నాయుడిగారికి 21వశతాబ్దపు నేతగా అట్టి మానాభిమానాలు ఉండకపోవచ్చు.
విజయవాడ గుంటూరు మధ్య శ్రీ చంద్రబాబునాయుడుగారి గేమ్ ప్లాన్ ఏదో ఉంది. పదేళ్లరాజ్యంలో, శ్రీ రాజశేఖర్ రెడ్డి & సన్సు లక్ష కోట్లు సంపాదించగా, తాను పదేళ్ళు రాజ్యం చేసినా, ఆస్థాయిలో సంపాదించుకోలేకపోయానే అనే విచారం వారిలో ఏమైన అంతర్లీనమై ఉందో ఏమో, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నెలకొల్పాలని కేంద్రానికి సిఫార్సు చేయాలనే నిర్ణయాన్ని ఆయన ఏకపక్షంగా తీసుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఈనిర్ణయాన్ని తీసుకోవాల్సింది , ఆంధ్రప్రదేశ్ శాసనసభ. తీర్మానం చేయటానికి ఏర్పాటు చేయాల్సింది, శాసన సభ ప్రత్యేక సమావేశం. నిర్ణయం తీసుకోవాల్సిన పధ్ధతి, చర్చించటం, ఆతరువాత 13 జిల్లా కేంద్రాలు, రాజమండ్రి, తిరుపతి, వంటి ఇతర ముఖ్య పట్టణాలను ముద్రించిన ఒకబ్యాలెట్ పేపరును ఎమ్.ఎల్.ఎ లకు ఇచ్చి, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎంపిక చేయించటం. మెజారిటీ ఎం.ఎల్.ఎలు కోస్తా వారు ఉంటారు కాబట్టి నిర్ణయం కోస్తాకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామనే హామీని ఇచ్చి, ఇపుడు ఏర్పాటు చేయబోయే రాజధాని తాత్కాలికమే, కేంద్రంనుండి రాజధాని కొరకు వచ్చే నిధులను మూడు సమ భాగాలుగా మూడు కాబోయే రాజధానులకు కేటాయించటం జరుగుతుందని, నచ్చచెప్పి అన్ని ప్రాంతాల వారిభయాందోళనలను దూరం చేయాలి. ముఖ్యమంత్రి తన వెన్నుపోటు పధ్ధతులను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలపై ప్రయోగించటం, ఇప్పటికే ఉద్యమాలతో అతలాకుతలమై ఉన్న స్థితిలో భావ్యం కాదు.
గుంటకల్ బళ్ళారి మధ్యలో ఉన్న హంపీ విజయనగర శిథిలాలను చూస్తే, వారు తమ సాదా సీదా రాజధానితోనే దక్షిణ భారత దేశం మొత్తాన్ని పరిపాలించినట్లు కనిపిస్తుంది. కొత్తాంధ్ర ప్రదేశ్ రాజధానిని సాదాసీదాగా షెడ్లలోనో, గడ్డిపాకలలోనో, డాబా బ్యారక్సుల వరుసలలోనో నిర్వహించుకోటంలో తప్పులేదు. అలా నిర్వహిస్తే, సీమాంధ్రకు అఖిలభారత పార్టీలైన కాంగ్రెస్ బీజెపీ లుచేసిన ఘోరఘాతుక అన్యాయానికి మంచి స్మారక చిహ్నాలను నిర్మంచినట్లుంటుంది. ఆషెడ్లలో విఐపీ కేంద్రనేతలు ప్రవేశించే ద్వారానికికు ఎత్తు తక్కువగా పెట్టాలి. వాళ్లకు మెడ వంచటానికి అభ్యంతరం లేకపోతేనే, ఆషెడ్లలోకి ప్రవేశించే విధంగా స్వాగత సత్కారాలు ఉండాలి.
నీచోపమ వాడుతున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఉగాండాలో దివంగత నియంత ఈదీ అమీన్ అనే వాడుండేవాడు. ఎంతటి పెద్దనేత వచ్చినా, ఆయన గుడిసెలోకి వచ్చెటపుడు తలవంచి లోపలకు వచ్చేలా ద్వారాన్ని ఆయన ఏర్పాటు చేసాడుట. మనకి కూడ సోనియా గాంధీ, నరేంద్రమోడీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ , రాజ్ నాథ్ సింగ్, అమీత్ షా, నితీన్ గడ్కారీ, వెంకయ్య ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజధానికి వచ్చినా (దొనకొండ, నాగార్జునసాగర్ దక్షిణ విజయపురి, కర్నూలు, శ్రీకాళహస్తి ఏవూరైనా స్వాగతమే) తలదించుకుని లోపలికి వచ్చేలా మనం మన షెడ్ల ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఐటీ రంగాన్ని అతిగా అభివృధ్ధిచేయటం, ఘరానా భవనాలు, ఫ్లైవోవర్లు నిర్మించటం, ఆఫ్రో ఏసియన్ క్రీడోత్సవాలు, నేషనల్ గేమ్స్ వంటి జాతరలను నిర్వహించటం, మెట్రోలను వేలకోట్లు తగలేసి నిర్మించటం వల్ల ప్రదర్సన వస్తువులు మనకు సమకూరతాయేమో కాని, ప్రజలకు నిజమైన మేలు చేయాలంటే, మార్క్సిజమే మేలనే విషయాన్ని వచ్చే పోస్టులో ఋజువు చేస్తాను. ఊబకాయానికి నిజమైన శరీరధార్ఢ్యానికి తేడా మనం తెలుసుకోవాలి.
ముంబాయిలో ఇప్పటికే ఎన్నో ౩౦ అంతస్తుల భవానాలున్నాయి. కొన్ని ప్రాంతాలనుండి చూస్తే, అది మన్ హట్టన్ లాగా కనిపిస్తుంది. కానీ దరిద్రం అత్యంత హృదయవిదారకంగా ఉన్నది. అంటే వరల్డ్ క్లాస్ నిర్మాణాలకూ, ప్రజల సుఖ సౌఖ్యాలకూ సంబంధం లేదు. వడోదారాలో శ్రీమోడీగారు నిర్మించిన ప్రైవేట్ సెక్టార్ బస్ స్టాండును చూసి మనం, గుజరాత్ అంతా సంపదలతో తులతూగుతుందనుకుంటే, అంతకన్నా భ్రమ వేరొకటి ఉండదు.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.